Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 002 (The word before incarnation)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

1. శరీరధారి కాకమునుపు దేవుని వాక్యము యొక్క పని (యోహాను 1:1-5)


యోహాను 1:1
1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను.

మనుషులు ఏమి చెప్పాలని ఆలోచనచేస్తారో వాటిని మాటల ద్వారా తెలియపరుస్తాడు. మరియు నీ మాటలు నీ వ్యక్తిత్వాన్ని నీ ఆత్మీయతను ప్రతిబింబిస్తాయి.

దేవుని వాక్యము ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి తెలియపరచి మరియు వాక్యము అనునది ఒక శక్తితో కూడైనదిగా మార్చబడినది. ఎందుకంటె దేవుడు ఆదియందు భూమిని ఆకాశమును తన శక్తికలిగిన మాట చేతనే సృష్టించాడు. ఎప్పుడైతే "కలుగును గాక " అనగానే అవి కలిగివున్నాయి. ఈ దినము వరకు దేవుని మాట శక్తికలిగినదిగానే ఉన్నది. నీ చేతిలో ఉన్న ఈ దేవుని సువార్త చాలా శక్తికలిగినది అని నీకు తెలుసా? ఈ పుస్తకము హైడ్రోజన్ బాంబు కంటే ఎంతో శక్తికలిగి నిన్ను శక్తివంతునిగా చేసి నిన్ను మంచివానిగా చేయును. "వాక్యము" అనునది గ్రీకు భాషలో ఉండి లోతైన రహస్యములను కనుగొనుటకు రెండు అరహాలు కలిగియున్నది. మొదటిది: నోటినుంచి వచ్చు ఊపిరి ద్వారా శబ్దము బయటకు వచ్చుట. రెండవది : . అరబిక్ భాషలో వాక్యమును వెంబడించి రెండు అర్థములను ఇచ్చు మాటగా ఉన్నది. ఆంగ్లములో కూడా రెండు విధములైన మాటలను ఇచ్చునట్లుగా ఉన్నది. అందుకే యోహాను చెప్పినట్లు "ఆదియందు వాక్యముండెను" మరియు రెండవ మాట చదివినట్లయితే "ఆయన ఆదియందు ఉండెను" కనుక ఇది యేసు యొక్క వ్యక్తిత్వమును రహస్యముగా ఉన్నాడని తెలుసుకొనెదము. తండ్రి అయినా దేవునినుంచి ఈ మాట వచ్చినట్లుగా చెప్పియున్నాడు. కనుకనే యేసు దేవుని చిత్తమైన వాడుగా ఉన్నాడు. అందుకే వేరే గ్రంధములో కూడా మనము చూసినట్లయితే క్రీస్తు దేవుని వాక్యము మరియు ఆత్మయై ఉన్నాడని తెలుసుకొనగలము. కనుక ఈ లోకములో ఉన్న ఏ ఇతర మనుస్యులు ఈ విధముగా చేయజాలరు కేవులము కన్యక అయినా మరియా గర్భమందు జన్మించిన పుత్రుడు తప్ప.

క్రీస్తు యొక్క అవతారము బేత్లెహేములో కంటే ముందు తన వ్యక్తిత్వము ఈ విధముగా లేదు, ఎందుకంటె ఈ లోకము పుట్టుకమునుపే క్రీస్తు ఉన్నాడు కనుక. క్రీస్తు నిత్యజీవమై ఉన్నాడు యనెడుకంటే తన తండ్రి అయినా దేవుడు కూడా నిత్యుడై ఉన్నాడు కనుక. కాబట్టి దేవుడు మారానివాడు కాదు కాబట్టి తన వాక్యము కూడా మారానిదిగా ఉన్నది.

యోహాను మనకు దేవునికి మరియు క్రీస్తుకు మధ్యన ఉన్న బంధాన్ని చూపిస్తున్నాడు. క్రీస్తు ప్రత్యేకించబడినవాడుగా లేక దేవునితో కూడా ఉన్నవాడుగా ఉన్నాడు. "దేవునితో" అనే గ్రీకు భాషకు అర్థము యేదనగా వాక్యము దేవునితో కదులుట అని అర్థము మనకు సూచిస్తుంది. కనుక క్రీస్తు ఎల్లప్పుడూ దేవునితో కదులువాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే తిరిగి జన్మించి యున్నారో వారు పరిశుద్దాత్మ ప్రేమ చేత కదిలింపబడువారుగా ఉన్నారు. అయితే ఈ ప్రేమ మనలను స్వతంత్రులునుగా చేయక మనలో ఉండి మనలను నడిపించినదిగా ఉండును.

దేవుడు క్రీస్తును సృష్టిలో చేసినట్లు గా అతనిని చేయలేదు, అయితే కుమారుడు తండ్రితో ఉంది తన వాక్యమును ఒక అధికారముచేత తండ్రిని చూపించాడు. అయితే ఈ వాక్యము యొక్క చివరిలో మనము చూసినట్లయితే వాక్యము దేవుడే అయి ఉన్నాడని తెలుసుకున్నాము. అనుదుకే యోహాను తన సువార్తలో క్రీస్తు దేవుని ద్వారా మరియు వెలుగు వెలుగు ద్వారా, సత్యమైన దేవుడు సత్యము ద్వారా మరియు సృష్టించక జన్మించి తండ్రి యొక్క శక్తిని నిత్యజీవమును మరియు పరిశుద్ధ దయను బయలుపరచువాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడని అంగీకరిస్తే తన వ్యక్తిత్వమును కూడా అంగీకరించినట్లే.

ప్రార్థన: ప్రభువైన యేసు క్రీస్తు మేము మీ ముందర మా శిరస్సు వంచి మీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము, ఎందుకంటె మీరు అన్ని వంశముల కంటే ముందుగా ఉన్నవాడు. మేము స్వతంత్రులుగా ఉండకుండా ఎప్పుడు మీకు సమర్పించి మీ ప్రేమలో నిలిచియున్నట్లు మమ్మును నడిపించు. మీ వాక్యము ద్వారా మీరు మాతో వచ్చినందుకు మరియు మీ అధికారమును మీ వాక్యముద్వారా తెలుసుకొనుటకు సహాయము చేసినందుకు మీకు వందనాలు.

ప్రశ్న:

  1. యోహాను మొదటి అధ్యాయములో మొదటివచనములో వ్రాయబడిన వాక్యమేమిటి మరియు దాని అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:07 AM | powered by PmWiki (pmwiki-2.3.3)