Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 090 (Abiding in Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

1. క్రీస్తులు ఉంటె ఎక్కుమ ఫలములు పొందగలము (యోహాను 15:1-8)


యోహాను 15:1-2
1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును.

యేసు భోజనము అయినా తరువారు ఆ పరిశుద్ధ పర్వతము నుంచి దిగివచ్చి కిద్రోను నది వరకు వచ్చి ఒక ద్రాక్షతోటలో నుంచి ఒలీవ అను పర్వతమునకు వెళ్లెదను. వారు ఆ విధముగా ప్రయాణమై పోతూ ఉన్నప్పుడు యేసు వారి విశ్వాసములను బట్టి మరియు ప్రేమను బట్టి వారికి వాటి అర్థమును చెప్పెను, ఒక ద్రాక్ష తీగను ఉపమానముగా తీసుకొని వారికి వివరించెను.

యేసు దేవుడిని ఈ లోకమంతా ద్రాక్ష చేతులను నాటువాదని వివరించెను . మనము కీర్తన 80:8 -16 మరియు యెషయా 5:1-7 వరకు చదివినట్లయితే మనము పాత నిబంధన గ్రంధములో ద్రాక్ష తోటను బట్టి అర్థము చేసుకోవచ్చు. ఈ చెట్టు సరిఅయిన ఫలములను ఇవ్వకున్నప్పుడు దేవుడు దీనిని చూసి సంతోషించలేదు. కనుక దేవుడు ఈ నేలపైన తన కుమారుడిని మరియు ఆత్మను నాటి అతనే ఒక మంచి ద్రాక్ష చెట్టు అయి, క్రొత్త వంశమునకు ఒక ఆత్మీయమైన విత్తనమును వేసి ఉన్నాడు. యేసు మనుషుల జీవితాలలో పరిశుద్దాత్మ అను విత్తనమును నాటి ఉన్నాడు, అది ఒక విలువైనది అయి ఉన్నది. ఎందుకంటె మనుషులు బోధనలు మోసము చేసే విధముగా ఉంటాయని యేసుకు ముందే తెలుసు. యేసు తన ప్రారంభపు బోధనలలో , అతను మాత్రమే ఫలములను ఇచ్చును అని చెప్పెను, అది కూడా ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారా వారికే, మరియు అతను సమాధానమును ఇచ్చువాడు మరియు సంఘమును కట్టువాడు.

యేసు మొదట వారికి వ్యతిరేకమైన విషయమును గూర్చి చెప్పెను, అనగా ఎవరైతే దేవుని ప్రేమను పొందుకొనక, లేకా ఆత్మీయ ఫలములను కలిగి ఉండక, మరియు ఈ ద్రాక్ష రసమును తీసుకొనక ఉందురో వారిని దేవుడు పనికి రాని తీగెలుగా పరిగణించి వాటిని నరికివేయును. కనుక ఒకవేళ దేవుడు నీలో సువార్త ఫలములను చూడక లేదా క్రీస్తు మృతి ద్వారా నీలో ఏవిధమైన మార్పును చూడక ఉన్నట్లయితే అప్పుడు నీవు కుమారుడైన క్రీస్తు తీగ నుంచి నరికి వేయబడెదవు.

ఎప్పుడైతే అతను పరిశుద్దాత్మును రసమును చూసినప్పుడు, అతను నీలో ఎదుగుదలను నియమించును, తీగలు ఏవిధముగా చెట్టుకు కలిగి ఉంటాయో అదేవిధముగా చేయును. అప్పుడు ఆ ఆకులు సఫలీకృతములవుతాయి. కనుక ఆ తోటమాలి ఏదైతే అవసరములేవో వాటిని ఆయన నరికి వేయును. ఈ ఫలము నీది కాదు అయితే క్రీస్తులో నీది. మనము ఏవిధమైన నష్టములేను పనివారము అయితే క్రీస్తు అన్నిటిలో ఉన్నాడు. తీగ ప్రతి సారి మంచి ఫలములను ఇచ్చుటకు కోయబడుతున్నదని మీకు తెలుసా ? అదేవిధముగా దేవుడు కూడా నీ రాతి లాంటి హృదయమును మార్చుటకు నీజీవితములో ఉండు ప్రతి విఫలములన్నిటినీ నరికివేయును. కనుక క్రీస్తును కలిగిన జీవితములో నీవు అన్ని విషయాలను బట్టి నేర్చుకొనెదవు. దేవునికి నిన్ను రక్షించుటకు చాల మార్గాలు ఉన్నాయి. కార్యాలు మరియు విఫలములు నిన్ను క్రుంగ దీయుటకు సిద్ధముగా ఉంటాయి. కనుక నీవు నీ గురించి జీవించవద్దు అయితే క్రీస్తు గురించి జీవించు; అప్పుడు తన శక్తి చేత ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావు.

యోహాను 15:3-4
3 నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీ రిప్పుడు పవిత్రులై యున్నారు. 4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలిం పరు.

క్రీస్తు నీపైన తన ఆదరణను ఉంచును. దేవుడు మన సహజమైన చెడిన వాటిని పాపములో ఉండకుండా నరికివేయును . యేసు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మసిద్ధమైన పరిశుద్దతను యిచ్చియున్నాడు, ఇది మనము ఎప్పుడైతే అతని యందు నమ్మకము కలిగి ఉంటారో అప్పుడు ఇచ్చును. కనుక , " మా ప్రార్తన ద్వారా మా అధికారము ద్వారా మేము కడగబడెదము " అని చెప్పకూడదు. అతను మన ప్రతి కార్యమును బట్టి క్షమించి వాటిని తన సిలువ మరణము ద్వారా కడిగిన వాడు. కనుక సువార్త వీటిని బట్టి శక్తిని ఇచ్చును. కనుక దేవుని వాక్యమే మనలను సంపూర్ణముగా కడుగును. సృష్టికర్త ఏవిధముగా అయితే తన నోటి మాట ద్వారా ఈ సృష్టినంతటిని సృష్టించాడో అదేవిధముగా క్రీస్తు తన వాక్యముచేత మనలను మార్చును. అయితే మనము తీసుకున్న బాప్తీస్మము లేదా ప్రభు భోజనము కాదు మనలను మార్చునది అయితే మనకు క్రీస్తు పైన కలిగిన విశ్వాసమే దీనికి కారణము. కనుక బైబిల్ లోని కొన్ని వచనములను ప్రతి దినమూ చదువు , ఎందుకంటె నీకు ఆత్మీయ మెళకువలు అవసరము లేనిచో నీవు ఆత్మీయముగా పడిపోతావు.

యేసు మన ఫలములను బట్టి మరియు మన ఎదుగుదలను బట్టి ఎప్పుడు ఎదురుచూస్తుంటారు. దానినే ఆయనలో ఉండుట అనేది. ఈ పదము 10 సార్లు ఈ 15 వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. ఈ మాటను బట్టి అనేక పర్యాయపదములు మనము చెప్పవచ్చు-మనము అతనిలో ఉండునట్లు అతను మనలో ఉన్నాడు; కనుక మనము అతనిలో ఉంది పరిశుద్ధులముగా చేయబడ్డాము. ప్రతి విశ్వాసి యొక్క ప్రార్థన పరిశుద్ధముగా ఉండునట్లు చేయాలి, అప్పుడు క్రీస్తు మనలో ఉంది మన ఎదుగుదలకు సహకరించువాడుగా ఉంటాడు. ఆయనలో ఉండుట అనునది మనము చేసుకొనునది కాదు, అయితే ఇది పరిశుద్ధాత్మచేత వచ్చునదే. ఎందుకంటె యెవ్వరుకూడా తమకు తాముగా క్రీస్తులో ఉండలేరు, అయితే మనము అతని బహుమానమును బట్టి కృతజ్ఞత కలిగి అతనిలో నిత్యమూ ఉండాలి.

ప్రార్థన: ప్రభువైన యేసు మీరు ఈ భూమి మీద దేవుని పరిశుద్ధమైన తీగ అయి ఉన్నారు. నీ నుంచే మేము అన్ని మంచి వాటిని పొంది ఉన్నాము. మా హృదయములు చెడుతలంపులతో నిండియున్నవి. నీ సువార్తచేత మమ్ములను కడిగినందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను నీ నామములో ఉంచుము, అప్పుడు పరిశుద్ధాత్మచేత ప్రేమ కలిగిన ఫలములను మేము కలిగి ఉండెదము. నీవు లేకుండా మేము ఏమి చేయలేము. కనుక మా సహోదరులను నీలో ఉండునట్లు వారిని బలపరచుము.

ప్రశ్న:

  1. యేసు ఏవిధముగా నిజమైన ద్రాక్షావల్లి అయినాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:00 PM | powered by PmWiki (pmwiki-2.3.3)