Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 089 (Christ's farewell peace)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)

3. క్రీస్తు సమాధాన చివరి ఘడియలు (యోహాను14:26-31)


యోహాను 14:26
26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

క్రీస్తు మాటలన్నిటిని నేను పట్టుకొన్నానని ఎవరు చెప్పగలరు ? మరియు అతని మాటలను మరియు చెప్పినది ఎవరు ఖంఠస్థము చేయగలరు ? ఇబ్బంది కలిగిన శిష్యులు క్రీస్తు భోజనమును మరియు అతనిని పట్టుకొనుటకు ఏ కార్యము చేయాలను కున్నాడు. యోహాను తప్పితే అందరు కూడా యేసు చెప్పినవి తిరిగి చివఫై ఘడియలలో మాటలాడుటకు ఇబ్బందిపడిరి.

శిష్యులకు ఉన్న మతి మెరుపును బట్టి క్రీస్తు ఓదార్చెను, పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చి అతను వారికి ఏమి చెప్పెను వాటిని వివరించునండి విస్వసించెను. పరిశుద్ధాత్ముడు యేసు ఏ కార్యమైతే చేసాడో అదే కార్యములను తప్పక చేసెను. యేసు తన కొరకు జ్ఞానులను బలవంతులను ఎన్నుకొనలేదు; అయితే చేపలు పట్టు జాలరులు, రుసుము కట్టించుకొనువాళ్ళను ఎన్నుకొని వారికి సిగ్గుకరముగా చేసెను. తండ్రి కనికరము కలిగి ఆత్మ ద్వారా వారిని దేవుని పిల్లలగుటకు సహాయము చేసెను. అప్పుడు వారు జ్ఞానముతో, నీతితో నింపబడినవారైరి.

యేసు ఏ పుస్తకమును కూడా కవితాత్మక పద్దతిలో ప్రచురించలేదు, లేదా అతని సువార్తలను ఏ ఒకారికి మరిచిపోవుటనట్లు ఇవ్వలేదు. అయితే ఆత్మీయ సత్యము శిష్యులకు నేర్పిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. సువార్త అనునది నేటికీ ఒక గొప్ప క్రియ గానే ఉన్నది. అతను రక్షణను మనుషుల భాషలోనే తెలియపరచి ఉన్నాడు, ఇది శిష్యులకు ఒక జ్ఞాపకంగా ఉండునట్లు;అయితే ఆత్మ వాటిని జ్ఞాపకము చేసి వారిని ఆలోచించింపచేసెను, అదే ఆత్మ కుమారుడైన యేసును మహిమపరచుచు అపొస్తలులకు ఒక సాక్షిగా ఉందును. మనకు ఏ ఇతర మనుషులను రక్షణ కలిగించు పుస్తకాలు లేవు, ఇది లోబడి విశ్వాసమునకు సంబంధించిన జ్ఞానమును వారు పొందుకున్నారు. యేసు నోటిలో ఏ ఇతర మాటలు కూడా చేర్చబడలేదు. ఈ వార్త వారికి చలి మాదిరి లేదు అయితే సమయమునకు వారికి వచ్చెను. అయితే ఆత్మ వారిని ఈ దినమువరకు మర్చి ఉన్నది. ఎప్పుడైతే మనము ఈ సువార్తను చదువుతామో, ఇవి మనకు ఈ దినాలలో జరుగు సంఘటనలు అని అనుకొనవచ్చు. ఒకవేళ మనము క్రీస్తు మాటలు వినినట్లైతే ఇది మనకు తాకునట్లుగా ఉన్నది. ఎవరైతే క్రీస్తు శిషులు సువార్తలను నాశనము చేస్తారని చెప్తారో వారికి ఈ సత్యము నుంచి దూరమవుతారు. ఎందుకంటె పరిశుద్దాత్మ ద్వారా ఏవిధమైన మోసము లేదు; అతను ప్రేమ కలిగి మరియు సత్యమైన ప్రేమ కలిగి ఉన్నాడు.

యోహాను 14:27
7 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

యేసు తన శిష్యులకు సమాధానమును దయచేసి ఉన్నాడు, అతని చివరి ఘడియలలో ఈవిషయమును తెలియపరచెను, సమాధానము అనునది మనుషులందరికి ఎంతో అవసరము. అతను విడిచి వెళ్తున్నాడు అయితే ఆ సమాధానమును అతని శిష్యులకు ఇచ్చెను. ఈ దినాలలో ఉన్నటువంటి అబద్దపు సమాధానమును బట్టి జరగరత్త కలిగి ఉండాలి. దేవుని నుంచి వేరుగా ఉండు ప్రతి ఒక్కరికి శ్రమలు మరియు దేవుని ఉగ్రత వస్తుంది. అందుకే యేసు తన సమాధానమును గూర్చి చెప్పియున్నాడు. కనుక ఈ సమాధానము ప్రతి సంఘములో కలిగి ఉండాలి. ఎందుకంటె క్రీస్తు సమాధానము పరిశుద్ధము కలిగినది మరియు నిత్యమైన శక్తిని ఇచ్చునది.

అబద్ధము, ద్వేషము, గొడవ, హత్యలు, పరిశుద్ధతలేనివి ఇవన్నీకూడా ఈ లోకములోనుంచి వచ్చునవి. అయితే క్రీస్తు ఈ సాతానుకు సంబంధించిన చేదు వ్యసనాలకు దూరముగా ఉండాలని ఆజ్ఞాపించెను. ఎందుకంటె చెడ్డ వాడు ఈ లోకమునకు రాజుగా ఉన్నాడు కనుక, అయితే క్రీస్తులో మనకు నిత్యమైన సమాధానము కలుగుతున్నది. ఇది మనలను శ్రమనుంచి మరియు హృదయ భయము నుంచి కాపాడును. క్రీస్తులో ఉండు విశ్వాసి దేవునిలో ఉండును మరియు దేవుడు ఆయనలో ఉండును. కనుక ఇది నీ జీవితములో ఉన్నదా ? యేసు ఆ సముద్రపు అలలలో పడుకొని ఉన్నాడు. ఆ సమయములో కూడా నిండా నీరు ఉన్నది. అప్పుడు యేసు లేచి ఆ అలలను గద్దించినప్పుడు అది నిశబ్దమాయెను. అప్పుడు అతను తన శిష్యులతో, " అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు ?"

యోహాను 14:28-31
28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననిమీరుసంతోషింతురు. 29 ఈ సంగతి సంభ వించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతోచెప్పుచున్నాను. 30 ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు. 31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయు చున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.

శిష్యులు తమ నాయకుడు వారిని వదిలి వెళ్తాడని తెలుసుకొని శ్రమపడిరి. ఆ సమయము దగ్గరకు వచ్చింది. తరువాత, అతను వెళ్లి తిరిగి వస్తానని చెప్పెను. అందుకే, " నేను వెళ్తున్నాను కనుక ఆనందించుడి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నేను నా సొంత భావనమునకు వెళ్తున్నాను కనుక ఆనందించుడి . సిలువ మరణము మీద నేను పడిన వేదనను మీకు ఇవ్వను.సమాధి విషయములో మీకు కలిగిన భయమును తీసివేస్తాను. మీరు మీ తండ్రితో ఐక్యత కలిగి ఉండుమని నేను మీకు తెలియజేస్తున్నాను. నీవు ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నట్లైతే నేను తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళుటకు బట్టి ఆనందించుడి. నేను నా కంటే నా తండ్రే గొప్పవాడని ఎంచి ఉన్నాను. నేను అతనిని ప్రేమించుచున్నాను, మరియు నీకు నా ప్రేమను ఎన్నడూ తెలియపరచెదను. నేను నీ యొద్దకు పరిశుద్ధాత్మతో వచ్చెదను.

యేసు తన తండ్రిని బట్టి ఒక గొప్ప రూపమును వారికి బయలుపరచెను ఎందుకంటె వారు అతని ఘనతను తెలుసుకొంటారని, మరియు వారి కొరకు మరణించు కుమారునికి కూడా వారికి తెలియపరచెను. యేసు తన మరణము కూడా తన తండ్రికి ఒక మధ్యవర్తిగా ఉంటాడని వారికి జ్ఞాపకము చేసెను. తండ్రికి మరియు కుమారునికి మధ్యన ఉన్న సమాధానమును కూడా ఆ మరణము కంటే గొప్పది.

ముందు మాట్లాడినది అనవసరమైనది; యేసు పునరుత్తనము ద్వారా తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చినదే, అది ఈ లోకమునకు సిలువ ద్వారా క్రీస్తు ఇచ్చినది . అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిపైకి వచ్చును. కనుక ఈ విమోచన అందరికి కలుగును. ప్రతి ఒక్కరు దేవుని ప్రేమను బట్టి మెళకువకలిగి ఉండుమని చెప్పెను.

అప్పడు యేసు మరియు అతనిని వెంబడించువారు పై అంతస్తునకు వెళ్లి నూతన నిబంధనను చేసిరి, మరియు ఆ రాత్రిలో బయటకు వెళ్లిరి, కిద్రోను నదిని దాటుకొని వెళ్లిరి. వారు ఒలీవ పర్వతమును గూర్చి మాట్లాడిరి.

ప్రార్థన: నీ సమాధానమును బట్టి నీకు కృతఙ్ఞతలు. మా హృదయములను కడిగి మాకు విశ్రాంతిని దయచేసినావు. మా దోషములను బట్టి తప్పిదములను బట్టి క్షమించు.నీ సమాధానపరచు ఆత్మను బట్టి కృతఙ్ఞతలు. అతను మా శ్రమలలో కూడా ఉండి మేము పాపములో పడకుండా మమ్ములను కాపాడుము. మమ్ములను తండ్రి దగ్గరకు నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. మా కొరకు నీవు పరలోకములో భావనములను ఏర్పాటుచేసినందుకు నీకు కృతఙ్ఞతలు.

ప్రశ్న:

  1. దేవుని సమాధానము అంటే ఏమిటి ?

క్విజ్ - 5

ప్రియా చదువరి, 12 మరియు 14 వ ప్రశ్నలకు సమాధానములను పంపినట్లైతే మేము మీకు ఈ పత్రికలను పంపెదము.

  1. మరియా అభిషేకమును యేసు ఎందుకు అంగీకరించెను ?
  2. యెరూషలేముకు యేసు ప్రవేశించుట దేనికి సూచన ?
  3. క్రీస్తు మరణము సత్యమునకు ఎందుకు గురుతుగా ఉన్నది ?
  4. వెలుగు కుమారులు అను మాటకు అర్థము ఏమిటి ?
  5. క్రీస్తులో దేవుని ఆజ్ఞ ఏమిటి ?
  6. యేసు శిష్యుల పాదములు కడుగుతా అనగా ఏమి ?
  7. క్రీస్తు మాదిరి నుంచి మనము ఏమి నేర్చుకోగలము ?
  8. యూదా క్రీస్తును విడిచి వెళ్ళినప్పుడు యేసు చెప్పిన మహిమ అను మాటకు అర్థము ఏమిటి ?
  9. క్రైస్తవులకు ప్రేమ ఒక సాదృశ్యముగా ఎందుకు ఉన్నది ?
  10. తండ్రి అయినా దేవునికి మరియు క్రీస్తుకు మధ్య గల సంబంధమేమిటి ?
  11. ప్రార్థన సమాధానములను వ్రాయుము !
  12. పరిశుద్ధాత్మకు యేసు చెప్పిన ధర్మమూ ఏమిటి ?
  13. క్రీస్తు మీద మన ప్రేమ ఏవిధముగా ఎదుగుతుంది , మరియు త్రిత్వము ఏవిధముగా మనపై వస్తుంది ?
  14. దేవుని సమాధానము అనగా ఏమిటి ?

నీ పూర్తి పేరు మరియు చిరునామా వ్రాయుట మరచిపోవద్దు. కవరు పైన మాత్రమే కాదు అయితే పేపరు మీద కూడా వ్రాయుము

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:00 PM | powered by PmWiki (pmwiki-2.3.3)