Previous Lesson -- Next Lesson
g) అబ్రాహాము కంటే ముందే క్రీస్తు ఉన్నాడు (యోహాను8:48-59)
యోహాను 8:48-50
48 అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా 49 యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. 50 నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.
యేసు యూదుల కుట్రలను మరియు వారి సాతాను ఆత్మలను చింపి వారు సత్యమును మరచుట వారికి చూపెను.
వీటిని వెంబడించుటలో సాతాను ఆత్మ వారిని వెంబడించుట తెరువబడెను. వారి పాపములను ఒప్పుకొనుటలో మరియు అంగలార్చుట మాని సాతానుతో బంధము కలిగి ఉన్నారు. మరియు యేసు పరిశుద్దాత్మ ద్వారా జన్మించాడని వివరించామని చెప్పుకొనిరి. మరియు వారు అతనిని సమారాయుడు అని పిలిచిరి, ఎందుకంటె సమరయుల వార్త యెరూషలేములోని ప్రవేశించెను కనుక.
మరియు ఒక గుంపు యేసును యూదులకు సంబంధించినవాడు అని ఒప్పుకొనిరి. అయితే వేరే వాళ్ళు అతను సాతాను సహాయంచేత అద్భుతములు చేసాడని చెప్పిరి. అయితే దెయ్యపు ఆత్మలచేత నింపబడినవారు పరిశుద్ధుడిని దెయ్యపు సహాయములచేత కార్యములు చేసాడని చెప్పిరి. ఎందుకంటె అబద్ధమునకు జనకుడు వారిని చీకటి నంచి వెలుగునకు మరియు వెలుగు నుంచి చీకటికి మారుస్తున్నాడు కనుక.
యేసు నిశ్శబ్దముగా వారి ప్రశ్నలకు ఆత్మీయముగా సమాధానము చెప్పెను, " నాలో ఏ సాతాను లేదు, నేను సంపూర్ణముగా పరిశుద్ధాత్మచేత నింపబడ్డాను. ఈ లోక ఆశలను కలిగిఉండుటకు నాలో ఏ చెడు కూడా లేదు. నేను సత్యమును మరియు ప్రేమను వెల్లడిచేస్తున్నాను; మరియు నేను నా కొరకు జీవించువాడను కాను; నన్ను నేను తిరస్కరించి నా తండ్రిని ఘనపరచుచున్నాను; ఇదే నా ఆరాధనకు కారణము. కనుక నేను నా తండ్రిని గూర్చి ప్రకటించి నా ద్వారా నా తండ్రిని మీ మధ్యన ఉంచుతున్నాను. అవును నేను దేవుని సత్యమును బయలుపరచాను, అయితే దేవుడు నా తండ్రి అని చెప్పినందుకు మీరు నన్ను ద్వేషించారు . మీలో ఉన్న సాతాను ఆత్మ నన్ను మీరు అంగీకరించుటకు మిమ్ములను వదిలి వెళ్ళుటలేదు. మీరు పరిశుద్ధ దేవునికి పిల్లలుగా ఉండటానికి ఒప్పుకొనలేదు కనుకనే మీరు నన్ను దూషించి నా మరణమును కోరుకున్నారు. నేను నా ఘనతను ఎన్నడూ కోరుకొనలేదు ఎందుకంటె నేను నా తండ్రి దగ్గరనే ఉన్నాను కనుక. కనుక నా తండ్రి నన్ను ఘనపరచును, మహిమపరచును మరియు నన్ను సంరక్షించును. కనుక మీరు నన్ను తిరస్కరించారు కనుక అతను మిమ్ములను తీర్పు తీర్చును. ఎవరైతే క్రీస్తును తిరస్కరిస్తారో వారు దేవుని తీర్పులోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటె ఎవరైతే క్రీస్తును తిరస్కరిస్తారో వారి పైన దురాత్మా ఉంటుంది, అది వారిని క్రీస్తును పొందుటలో వ్యతిరేకిస్తుంది.
యోహాను 8:51-53
51 ఒకడు నా మాట గైకొనిన యెడలవాడెన్నడును మరణము పొందడని3 మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 52 అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడ 53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
యేసు తన సువార్తను బట్టి ఈ విధముగా చెప్పెను, " ఎవరైతే క్రీస్తు మాటలు విని వాటిని అంగీకరించి వాటిని తమ హృదయములో ఉంచుకుంటారో, అవి వారి జీవితములో శక్తిని కలిగించును. వారు నిత్యా జీవమును పండుకొని ఎప్పటికీ నశించరు. మరణము వారికి దేవుని దగ్గరకు ఒక తలుపుగా ఉంటుంది, అది వారి మంచి కార్యములను బట్టి కాదు అయితే వారు క్రీస్తు వాక్యంలో ఉంటారు కనుక. " నీవు ఈ విధమైన దేవుని రాజ్య ప్రాముఖ్యతను పట్టుకున్నావా ? ఎవరైతే క్రీస్తు మాటలను వారి హృదయములో ఉంచుకొన్నారో వారు పాపములో మరియు సాతాను ఉచ్చులో పడతారు. అయితే ఎవరైతే వాక్యమును ఉంచుకొంటారో వారు ఎప్పటికీ నిలిచెదరు.
యూదులు కోపముతో ఉండి, " నీవు సాతానుడివి, నీవు అబద్ధికుడివి, విశ్వాసమునకు మూలపురుషుడు చనిపోయెను. కనుక నీ మాటలు వింటే నిత్యజీవము వస్తున్నదని నీవు ఏ విధముగా చెప్తున్నావు ? నీవు ఈ సృష్టికర్త కంటే గొప్పవాడివా , ఎందుకంటె నీవు మరణము కాక జీవమును ఇస్తున్నావు కనుక ? నీబు అబ్రాహాము కంటే గొప్పవాడా, మోషే కంటే మరియు దావీదు కంటే గొప్పవాడా ?
యోహాను 8:54-55
54 అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 55 మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
నిశ్శబ్దముగా యేసు వారికి తనను గురించిన సమాచారమును చెప్పెను. క్రీస్తు తన కొరకు మహిమను వెతకాదు. అయితే అతను సహజముగానే ఎప్పటికీ మహిమగలవాడే. ఎందుకంటే దేవుడే తన కుమారునికి బట్టి ఖచ్చితత్వమును యిచ్చియున్నాడు, తండ్రి తన కుమారుని యందు ఉన్నట్లుగా, అతని ద్వారానే దేవుని ప్రణాళిక నెరవేర్చబడినది. అవును యూదులు అన్నట్లుగా శక్తి కలిగిన వేడి దేవుడు, అయితే వారికి నిజముగా అతను ఎవరో తెలియకపోయెను. వారి తండ్రి సాతాను "దేవుని నామములోనే ఉండెను", ఆ నామమును వ్యర్థముగా వాడుకొనెను. ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకుంటారో వారిని దేవుడు ప్రేమించును. అందుకే ఏ మతమైనా దేవుని నామమును పట్టుకోవాలి. తండ్రి అయినా దేవుడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ కూడా ఒకటిగానే ఉన్నవి. దేవుని సత్యము త్రిత్వములో దాగి ఉన్నవి. అయితే యూదులు చెప్పినది యేసు తిరస్కరించెను, " మీకు అతను ఎవరో తెలియదు , మీ జీవితములు అతని ఆలోచనలమీద ఆధారపడి ఉన్నాయి. కనుక మీరు సత్యమునకు గ్రుడ్డివారుగా ఉన్నారు. మరియు అదేసమయములో యేసు తనకు నిత్యమైన దేవుడు తెలుసనీ బలవంతము చేసెను . ఒక వేళా ఇది జరగకపోతే అతని సాక్ష్యము తన తండ్రి యందు అబద్ధముగా ఉందును. అయితే యేసు దేవుని రూపమును యూదులకు క్లుప్తముగా ప్రకటించెను.
యోహాను 8:56-59
56 మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెనుఅనెను. 57 అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అనిఆయనతోచెప్పగా, 58 యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
క్రీస్తు యూదులకు నిజమైన దేవుడిని గురించి చెప్పిన తరువాత, వారు సాతాను ద్వారా బలవంతము చేయబయినప్పుడు నిత్యజీవమును పొందుకొనుటను వ్యతిరేకిస్తారా లేదా అని గమనించెను. , మరియు తనను గూర్చి విశ్వాసమునకు తండ్రి అయినా అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకొని వారికి తనను గూర్చి బయలుపరచెను. దీని ద్వారా యేసు వారికి అబ్రాహాము దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉండి ఎలా సంతోషముగా ఉన్నాడో వారికి చెప్పెను. కనుకనే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినట్లు తన సంతానమును దేవుడు అధికముగా ఆశీర్వదించెను.
అప్పుడు యూదులు యేసును గూర్చి, " నీవు యవ్వనస్తుడవు మరి నీవు కొన్ని వేళా సంవత్సరముల వెనుక జీవించిన అబ్రాహామును గూర్చి ఎలా చెప్పగలవు ? నీ మనసు ఖచ్చితముగా చెడిపోయినది ."
అందుకు యేసు స్పందించి, " అబ్రాహాము కంటే ముందే నేను ఉన్నాను. " " ఎవరైతే అతను నిత్యా మైన దేవుడని నమ్ముతారో తన తండ్రి లాగ, యోహాను కూడా క్రీస్తు నిత్యమును గూర్చి చెప్పియున్నాడు. అయితే అక్కడున్న వారు ఈ నిజమును స్వీకరించలేదు, మరియు ఒక మనిషి నిత్యజీవము గల దేవుడై ఉంటాడని నమ్మలేదు.
వారు క్రీస్తు సాక్ష్యమును తిరస్కరించి దూషించిరి, ఎందుకంటె ఈయన అసాధ్యమైనవాటిని గూర్చి మాట్లాడుతున్నాడని. కనుక అతని మీదకు వేయుటకు రాళ్లు తీసుకొనిరి. ఎప్పుడైతే వారు తమ చేతులలో ఉన్న రాళ్లను అతని మీదకు వేయబోవుచున్నప్పుడు వారి మనసులను అతను మార్చేను. ఇది ఏవిధముగానో మనకు తెలియదు. అతని సమయము రాలేదు కనుక దేవాలయపు ద్వారము నంచి వెళ్లిపోయెను.
ప్రార్థన: దేవా నిన్ను మేము ఆరాధిస్తాము ఎందుకంటె నీవు నిత్యమైన దేవుడవు, నమ్మకమైన రక్షకుడవు మరియు నీకు నీవు యెన్నడునూ ఘనత కోరుకొనువాడవు కాదు. అయితే తండ్రిని మాత్రమే మహిమపరచగల వాడవు. కనుక మమ్ములను నీవు సాతాను నుంచి విడిపించుము. పరలోకమందు మా తండ్రిని మేము ఎల్లప్పుడూ ఘనపరచులాగున నీవు మామూలు నడిపించుము. మీ నిత్యజీవమును పూనుకొనులాగును మా విశ్వాస జీవితములను బలపరచుము.
ప్రశ్న:
- యూదులు ఎందుకు క్రీస్తును రాళ్లతో కొట్టాలని అనుకొన్నారు ?