Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 055 (Jesus the light of the world)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

d) యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు (యోహాను 8:12-29)


యోహాను 8:12
12 మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

యేసు నిత్యా వెలుగై ఉన్నాడు. ఎవరిఅతే అతని దగ్గరకు వస్తారో వారు ప్రకాశించబడెదరు, కనుక యేసు క్రీస్తులో వెలిగించబడెదరు. వేరే ఇతర ఏ వెలుగు కూడా మనలను వెలిగించాడు మరియు స్వస్థపరచదు. ఎందుకంటె అనేక మంది పరదేశు విషయములో అనేక భావాలుగా ఊహించుకుంటారు అయితే యేసు మాత్రమే మనకు స్పష్టమైన పరదేశు గురించి చెప్పగలడు. అందుకే అక్కడ చెడ్డ వారందరు కూడా నడిపించబడినారు. అతని వెలుగు మన ప్రాణములకు ఒక ప్రకాశించే వెలుగుగా ఉన్నది. అయితే ఈ ప్రాణమునకు ఒక నిబంధన ఉన్నది అదేదనగా , ఒకరు ఆతని దగ్గరకు రావాలంటే వారు కేవలము విశ్వాసముచేతనే వచ్చి తనను తాను సంపూర్ణముగా క్రీస్తుకు సమర్పించుకోవాలి. ఈ విధముగా మనము వచ్చినట్లైతే అప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చి చీకటి నుంచి వెలుగులోనికి ప్రవేశించెదము. మన గమ్యమును చేరుటకు మనకు అతని వెలుగులోనే దారి కనబడును, అదే మహిమకలిగిన తండ్రి మరియు కుమారుని యొక్క ప్రకాశించు వెలుగై ఉన్నది.

యోహాను 8:13-16
13 కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 14 యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. 15 మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను. 16 నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.

అక్కడున్న యూదులకు యేసు మాటలు అసహ్యము పుట్టించెను, "నేనే," అతను గర్వము కలిగి ఉన్నాడని వారు అనుకొనిరి, ఎందుకంటె తనను తాను ఈ లోకమునకు ఒక వెలుగుగా చెప్పుకుంటున్నాడు కనుక . వారు యేసును ఒక అబద్ధికునిగా మరియు ప్రాణములను మోసపరచువాడుగా అనుకొనిరి.

అందుకు యేసు, " నా సాక్ష్యము నన్ను బట్టి నిజమైనదై ఉన్నది, నేను నా గురించి నేను ఆలోచన చేయను, అయితే దేవునితో ఎవరైతే సహవాసము కలిగి ఉంటారో వారితో నేను ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉంటాను. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చానని మరియు తిరిగి అతని దగ్గరకు వెళ్తానని మీకు తెలియదు. నేను నా మాటలు మాట్లాడాను అయితే దేవుని సత్యమైన మాటలే మాట్లాడగలను. నా మాటలు సంపూర్ణమైన శక్తి కలిగి ఆశీర్వాదముచేత నింపబడినాయి.

" మీ స్వంత మాటలు పై మాటలే మరియు గుచ్చులాగా ఉన్నాయి. నీవు నీ స్వంత సామర్థ్యమును ఆధారము చేసుకొని తీర్పుతీరుస్తున్నావు. అయితే నీవు ప్రపాటు చేస్తున్నావు . ఎందుకంటె నీకు నా గురించి తెలియదు కాబట్టి. నీవు నన్ను మానవసంబందిగా తీర్పు తీరుస్తున్నావు, అయితే నేను దేవుని యందు ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉన్నాను. నీవు ఈ సత్యమును తెలుసుకున్నట్లైతే అప్పుడు నీవు ఈ లోకమును గురించిన సత్యమును తెలుసుకుంటావు."

క్రీస్తు ఈ లోక న్యాయాధిపతి, మరియు అతను సర్వసత్యమైన వాడు. అతను మనలను శిక్షించుటకు రాలేదు, అయితే మనలను రక్షించుటకు వచ్చియున్నాడు. వ్యభిచారులు , మరియు అబద్ధికులను, మరియు దొంగలను ద్వేషించలేదు అయితే అందరిని తన ప్రేమద్వారా రక్షించుటకు వచ్చియున్నాడు.కనుక ఎవరిని బట్టి నీవు చిన్నచూపు చేయవద్దు, అయితే క్రీస్తు ప్రేమ కలిగి ఉండు.

యోహాను 8:17-18
17 మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 18 నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను;నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.

మన బలహీనతలను బట్టి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమానముగా చేసి ఉన్నాడు. అయితే ఇది నీ దఃర్మశాస్త్రముగా చేసియున్నాడు, ఎందుకంటె నీవు పాపివి కనుక నీకు ఇది అవసరమై ఉన్నది కాబట్టి. ఎందుకంటె ఎప్పుడైతే ఒక మనిషి పాపముచేసెనో అప్పుడు తన పూర్తి సమాచారముచేత యేసు దగ్గరకు వచ్చి తన పాపమును బట్టి ఒప్పుకోవాలి. అప్పుడు తీర్పు దానిని బట్టి చేయబడుతుంది (ద్వితీ 17:6; 19:15 ). యేసు ఈ విషయాలను బట్టి వ్యతిరేకించలేదు. తన ఒప్పుదలను మొదటి సాక్ష్యముగా చేసియున్నాడు, మరియు అతని తండ్రి అతని కొరకు ఒక సాక్ష్యమై ఉన్నాడు, కనుక అతనితో ఒక మంచి సంబంధము కలిగి ఉన్నాడు. ఎందుకంటె తండ్రితో సంబంధము లేకుండా కుమారుడు ఏమి చేయలేడు. ఇది త్రిత్వమును బత్తిన రహస్యము. దేవుడు యేసును పరీక్షించును మరియు యేసు దేవుడిని పరీక్షించును.

యోహాను 8:19-20
19 వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను. 20 ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

యూదులు యేసును అపార్థము చేసుకొని, అతనిని అర్థము చేసుకొనుటకు ఇష్టపడలేదు, దానికి బదులుగా యేసును దూషించి అతని గురించి తప్పుగా మాట్లాడిరి, " ఎవరిని నీవు తండ్రి అని పిలుస్తున్నావు? " యేసేపు మృతి పొంది ఎంతో కాలమైనది, అందుకే యేసుకు వారి మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలుసుకున్నారు అందుకే " నా తండ్రి" అని సంబోధించారు. అయితే వారు యేసును బట్టి నేరుగా దేవునితో సంబంధము కలిగి ఉండాలని ఉద్దేశించిరి.

యేసు వారికి నేరుగా స్పందించలేదు, ఎందుకంటె దేవుని జ్ఞానము యేసులో ఉన్నది కనుక. ఎందుకంటె కుమారుడు దేవునిలో ఉండులాగున దేవునిలో కూడా కుమారుడు ఉన్నాడు. ఎవరిఅతే కుమారునికి తిరస్కరించారో వాలారు దేవుని సత్యమును ఏవిధముగా అర్థము చేసుకుంటారు ? అయితే ఎవరైతే కుమారుని యందు విశ్వాసముంచి అతని ప్రేమను పొందుకుంటారో వారికి దేవుడు తనను తాను విశదీకరించుకుంటాడు; కనుక ఎవరైతే కుమారునికి చూస్తారో వారు తండ్రిని చూచెదరు.

ఈ మాటలు యేసు దేవాలయము మూలాన అక్కడికి వచ్చిన వారితో పలికెను. అక్కడ కావలి వారు కూడా ఉన్నారు. కనుక ఆ సమయములో క్రీస్తును ఎవ్వరు కూడా బంధించుటయు రాలేకపోయిరి. ఎందుకంటె దేవుని హస్తము అతనిని కాపాడుతున్నది కనుక. ఎందుకంటె అతనిని పెట్టుకోవడము కూడా దేవుని ప్రణాళిక అయి ఉన్నది కాబట్టి. కనుక నీ పరలోకపు తండ్రి మాత్రమే నీ గమ్యమును నిర్దేశించగలడు.

ప్రార్థన: యేసు మేము నిన్ను ఘనపరచి నిన్ను ప్రేమించెదము. మేము అనుకున్నట్టు మమ్ములను నీవు తీర్పుతీర్చవు అయితే నీవు మమ్ములను రక్షించెదవు. నీ దగ్గరకు వచ్చువారిని నీవు వెలిగింపచేసెదవు ఎందుకంటె నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు కనుక. మమ్ములను మార్చి మా హృదయములయందు నిన్ను తెలుసుకొనునట్లు చేయుము.

ప్రశ్న:

  1. పరలోక తండ్రికి బంధము కలిగినట్లు క్రీస్తు ఈ లోకమునకు ఎలా వెలుగై ఉన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:11 AM | powered by PmWiki (pmwiki-2.3.3)