Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 040 (Feeding the five thousand)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

1. ఐదు వేళా మందిని పోషించుట (యోహాను 6:1-13)


యేసు యెరూషలేములో తన అవతారమును, స్వస్థతల ద్వారా మరియు రక రకాల అద్బుతములా ద్వారా దేవుని ప్రేమను కనపరచిన యున్నాడు. అయితే వారు అతని కార్యములను ద్వేషించి ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ఉత్తర దిక్కున గాలీలయాలోనికి తీసుకొనివెళ్లినది అక్కడ అతని వ్యతిరేకస్తులు చాలా మంది ఉండిరి . అక్కడున్న ఉత్తర దిక్కునుంచి వచ్చిన వారు యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి అతనిని వెంబడించిరి .

యోహాను 6:1-4
1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను. 2 రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. 3 యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను. 4 అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. 5 కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని 6 యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

యేసు యెరూషలేము యొక్క న్యాయబద్దీకరణకు వ్యతిరేకమైనందున . వారు అతనికి వ్యతిరేకముగా unnaru. అయితే అతని సమయము ఇంకను రాలేదు గనుక అక్కడినుంచి తిరిగి గాలీలయాకు వెళ్లెను. మనము ఒకవేళ ముందున్న మూడు సువార్తలను గమనించినట్లయితే అక్కడ మనము అయన చేసిన ఎన్నో అద్భుతములను చూడగలము. అయితే యేసు వచ్చునప్పుడు అక్కడ గొప్ప కేకలు వినపడియుండెను, మరియు చుట్టూ ఉన్న గ్రామాలలో కూడా యేసును వ్యతిరేకించేవారు ఉన్నారని యేసు ముందుగానే కనిపెట్టెను. అందుకే అతను అక్కడినుంచి గొలను అనే ఉత్తర దిక్కున ఉన్న యొర్దానుకు తన శిష్యులతో ఒంటరిగా ఉండుటకు వెళ్లెను. అయితే అక్కడున్న ప్రజలు అతని నోటినుంచి వచ్చు మాటలకూ వేచియుండి అతని అద్భుతములను చూచుటకు ఎదురుచూసిరి . ఐటితే ఆ సంవత్సరము యేసు పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళలేదు . అయితే అక్కడున్న వారందరి ఎదుట తనకు థానే ఒక జంతువుకు బదులుగా ఉంది అందరితో కలిసి పస్కా పండుగను వారందరితో జరుపుకొనెను; అక్కడే పరలోకము నుంచి యేసు తన సన్నిధిని ఉంచి మరియు తన గొప్ప ఆనందమును తన పరిశుద్ధులకు ఇచ్చెను .

యోహాను 6:5-13
5 కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని 6 యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. 7 అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. 8 ఆయన శిష్యులలో ఒకడు,అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ 9 ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని,యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10 యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. 11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; 12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. 13 కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

అక్కడున్న ప్రజలందరూ యేసు దగ్గరకు రావడం మొదలు పెట్టినప్పుడు, యేసు తన కన్నులను ఆకాశము వైపునకు ఎత్తి తన తండ్రి అయినా దేవునికి మహిమ కలుగునట్లు తనను తాను అతనికి అప్పగించుకొనెను . తండ్రి కూడా కుమారునికి తన ఉద్దేశమును ఇచ్చెను కనుక వారి హృదయములు తెరువబడెను .

ముందుగా యేసు వారి విశ్వాసములను పరీక్షించెను ఎందుకంటె వారు ఇంకను ఈ లోక సంబంధమైన నమ్మకము కలిగి ఉన్నారా లేదా అని చూచెను , ఆలాగుననే ఫిలిప్పును క్రీస్తు ఐదు వేళా మందికి ఆహారమును పంచుమని చెప్పియున్నాడు . మనము చాల సందర్భాలలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచనచేస్తాము అయితే క్రీస్తు శాశ్వత సహాయము కొరకు ఆలోచన కలిగి ఉండెను . ఎవరైతే ఆర్థిక వనరులను బట్టి ఆలోచన చేస్తారో వారు దేవుని కృపాకలిగిన కార్యములను చూడరు . ఆ సందర్భములో శిష్యుల లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి: ఎందుకంటె అక్కడ కొనడానికి బేకరీలు కానీ లేదా పిండి దొరకు అంగడి కానీ లేవు . అయితే క్రీస్తు బోధను చాల సేపు విని ఆకలి గొనిరి .

అప్పుడు అనుకోకుండా అంద్రెయ ఒక చిన్నారి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉండటం చూసియున్నాడు . " దయచేసి నీ దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలు ఇమ్మని " అంద్రెయ ఆ పిల్లవానిని అడిగెను . ఎందుకంటె ఆ పిల్లవానితో ఉన్నది అందరికి సరిపోదని అంద్రెయకు తెలుసు . అందుకే అక్కడున్న శిష్యులందరు ఆ పరిస్థితులలో ఏమి చేయాలో teliyaledu, మరియు దేవుని చిత్తము క్రీస్తు నందు ఏమై ఉన్నదో అని కూడా వారికి తెలియక పోయెను .

అప్పడు యేసు అక్కడున్న వారినందరిని క్రమముగా క్రింద కూర్చోమని ఆజ్ఞాపించెను . వారు కూర్చున్న ప్రదేశమంతా పచ్చని గడ్డి ఉండెను అది వారు విశ్వాసమునకు సాదృశ్యముగా ఉన్నది . అక్కడ దాదాపు ఐదు వేళా మంది స్త్రీ పురుషులు మరియు పిల్లలు మరి ఎక్కువగా ఉండిరి .

అప్పుడు క్రీస్తు ఆ ఐదు రొట్టెలను తీసు కొని తన తండ్రి అయినా దేవునికి ఆ ఐదు రొట్టెలను పైకి ఎత్తి ఖచ్చితముగా దేవుడు కార్యము చేసి ఇక్కడున్న వారందరికీ వీటి ద్వారా తృప్తికరంగా చేయును అని విశ్వసించి వాటిని పైకి ఎట్టి ప్రార్థన చేసెను .ఆ ఐదు రొట్టెలను బట్టి యేసు తన తండ్రికి కృతజ్ఞత చెప్పునది మనకు దేవుని ద్వారా వచ్చు అద్బుతమునకు ఒక సూచనగా ఉన్నది . నీవు దేవుడు ఇచ్చు ప్రతి దానిని బట్టి సంతోషముగా స్వీకరిస్తావా లేక వాటిని బట్టి పిర్యాదు చేస్తావా ? నీకు కలిగిన కొంచెములో నీ స్నేహితులదగ్గర పంచుకుంటావా ? క్రీస్తు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచన చేయక దేవుని ద్వారా అతనికి వచ్చిన ప్రతి ఆశీర్వాదమును ఇతరులతో పంచుకొనెను .

ఈ అద్భుతము నాలుగు సువార్తలలో క్లుప్తముగా vrayabadi ఉన్నది . అయితే వీటిని గురించి ఆ సమయములో ముందు వరుసలో కూర్చున్న వారు ఎప్పుడైతే క్రీస్తు ఆ రొట్టెలను విరిచాడో అప్పుడు అవి చాల ముక్కలుగా కనిపడినట్లుగా వారు గమనించిరి . మరియు అందరికి తృప్తికరంగా ఉన్నవి అని మనము గమనించియున్నాము . ఎప్పుడైతే ఆ ఆహారము ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఎంత అవసరమో అంత మట్టుకు తీసుకున్నారు . ఇది నిజముగా వారికి దేవుని కృప అయి ఉన్నది . దేవుడు మన పాపములను క్షమించి కావలసిన క్షమాపణను మనకు ఇచ్చును .కనుక నీకు ఏది అవసరమై తీసుకొని నీ నమ్మకమును క్రీస్తు మీద ఉంచుము .నిన్ను దేవుడు ఏవిధముగా ఆశీర్వదించి యున్నాడో అదేవిధముగా నీ తో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించునట్లు ఉండుము .

కనానులో క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మర్చి గొలను లో ఐదు రొట్టెల ద్వారా కొన్ని వేలమందినికి పంచియున్నాడు. గమనించినట్లటీ ముందు ఉన్నవాటికంటే చివరలో ఎక్కువ గంపలకు ఆహారము మిగిలి ఉన్నట్లు మనము గమనించగలము. మిగిలిన పన్నెండు గంపలను బట్టి వాటిని పాడు చేయవద్దని వారికి క్రీస్తు సూచించెను . అయితే ఈ దినాలలో ఎంతో మంది ఆహారమును పారవేయుట మనము చూస్తున్నాము , సగటున కొన్నివేల మంది ఒక ఘంటకు ఆహారము లేక ఇబ్బంది పడుతుంటే మనము ఆహారమును పారవేస్తున్నాము ఇది నిజముగా మనకు సిగ్గుచేటు .నీకు ఇయ్య బడిన ఆశీర్వాదమును నీవు పారవేయవద్దు అయితే వాటిని కృప ద్వారా పొందవలసినవారికి ఇవ్వు . అప్పుడు నీకు రావలసిన దానికంటే ఎక్కువగా దేవుని ఆశీర్వాదములు నీకు వచ్చును .

మనము గమనించినట్లయితే ఆ china వాడు తనతో ఉన్న ఐదు రొట్టెలను ఇచ్చినప్పుడు అవి మరి ఎన్నో ఆగుతాను చూచి ఎంతో సంతోషిస్తున్నాడు .అప్పుడు అతని కళ్ళు నిజముగా ఆశ్చర్యముగా తెరచి ఉంటాడు . ఈ అద్బుతమును తన జీవితములో మరచిపోకుండా ఉంటాడు .

ప్రార్థన: ప్రభువా నీ సహనమును బట్టి నీకు మేము కృతజ్ఞతా స్తుతులు చేస్తున్నాము . మా బలహీనమైన విశ్వాసమును బట్టి మమ్ములను క్షమించు . మా సమర్థయమును బట్టి మేము అతిశయించక మీవైపు తిరుగునట్లు మాకు నీ నడిపింపు దయచేయుము . మాకు మీరు ఇచ్చిన ఆత్మీయ మేలులను బట్టి మరియు ఇచ్చిన కొన్ని వస్తువులను బట్టి నీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము . మీరు మాకు దయచేసి ఏ విధమైన ఆశీర్వాదమును మేము పారవేయక వాటిని నీ మహిమ కొరకు ఉపయోగించునట్లు మమ్మును నడిపించు .

ప్రశ్న:

  1. ఐదు వేళా మందిని పోషించుటలో ఉన్న మర్మమేమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:46 AM | powered by PmWiki (pmwiki-2.3.3)