Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 109 (The choice; The flogging of Jesus; Pilate awed by Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
3. రోమా అధికారి ఎదుట మర్యాద కరమైన విచారణ (యోహాను 18:28 – 19:16)

b) యేసుకు మరియు బరబ్బకు మధ్యలో ఉన్న ఉత్తమమైనది (యోహాను 18:39-40)


యోహాను 18:39-40
39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను. 40 అయితే వారువీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

యేసు సత్యమైన వాడని మరియు అపాయము కలిగిన వాడు కాదని నమ్మెను. కనుక అతను యూదుల ఉన్న స్థలములోనికి వెళ్లి నిందమోపిన యేసును బట్టి వారితో పంచుకొనుటకు వెళ్లెను. మనము చదివినట్లయితే నాలుగు సువార్తలు కూడా యేసు పాపము లేనివాడిని చెప్తున్నవి. కనుక అతనిలా ఏదోషము చూడలేదు కనుక అతను నిందారహితుడని చెప్పెను.

పిలాతు యేసును బట్టి తీర్పు చెప్పుటలో జాగ్రత్త కలిగి ఉండి, మరియు యూదులను బట్టి కూడా వారిని సంతోషపెట్టుటకు ఇష్టపడెను. కనుక పండుగ సమయములో వారి ధర్మశాస్త్రము చెప్పినట్లు ఒక దొంగను విడిపించు అని చెప్పెను. కనుక పిలాతు ఆ సందర్భములో యేసును విడిపించాలని చూసేను .

ఏదేమైనా యాజకులు మరియు ప్రజలు క్రీస్తుకు ఉన్న, " యూదుల రాజు" అనే నామమును బట్టి పిచ్చిపట్టినవారుగా ఉండిరి. కనుక వారు దొంగా అయినా బరబ్బను విడిపించుమని కేకలు వేసిరి.

అందుకు వారు మాత్రమే కాదు అయితే అక్కడున్న యూదుల పెద్దలు కూడా యేసును సిలువ వేయమని చెప్పి, మోసము చేసి, మరియు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైన వాడిని విడుచుమని కోరిరి. అందుకు ఇతనే కావాలా ? అని అడిగెను .


c) పిర్యాదు చేసిన వారి ఎదుట యేసును కొట్టడము (యోహాను 19:1-5)


యోహాను 19:1-3
1 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 2 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి 3 ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చియూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.

పిలాతుకు యేసును వదిలి తన మీద పిర్యాదు చేసేవారియెడల ఇది ఒక అనుభవంగా ఉన్నది. అయితే పిలాతు ఈ విధముగా చేయక ఒక పరిస్కారమును చేయాలనీ అనుకొనెను; కనుకనే యేసును కొట్టమని ఆజ్ఞాపించెను. ఈ విధమైన శిక్షా చాల హీనంగా ఉండెను. ఎప్పుడైతే ఆ సానికులు క్రీస్తును పట్టుకొని ఒక దగ్గర కట్టివేసి అతని శరీరమును కొట్టిరి. అతని శరీరము చినిగినట్లాయెను కనుక ఎంతో నొప్పికలిగి ఉండెను. ఎంతో మంది ఈ విధమైన దెబ్బలకే చనిపోయినారు . అయితే మన ప్రభువు ఆ నొప్పిని భరించెను.

అప్పుడు అక్కడున్న సైనికులు మరియు యేసును ఎగతాళి చేస్తున్నవారు అతని శరీరమును గీచిరి. ఈ సైనికులు ఆ యూదుల ఉగ్రవాదమును బట్టి ఆ రాత్రి సమయములో భయము కలిగి ఉండిరి. కనుకనే వారికి యూదుల రాజు అని పిలువబడుతున్నవాడిని కసిగా హింసించాలని ఉద్దేశించిరి. కనుకనే వారికి యూదుల మీద ఉన్న కోపము పాగా ఈ క్రీస్తు పైన వేసిరి. కనుకనే వారిలో ఒకడు ఒక పొదలో నుంచి ముండ్ల తీగను తీసుకొని వచ్చి దానిని ఒక కిరీటముగా అల్లి క్రీస్తు తలపై పెట్టెను . ఈ ముండ్ల కిరీటము పెద్దగా అదిమినందుకు అతని రక్తము కారును. వేరే వారు గుడ్డలతో వచ్చి అతినికి చుట్టిరి. కనుక ఆ రక్తము ఆ గుడ్డలకు కూడా ప్రాకెను. మరియు అతడిని వారు ఎంతో క్రోధముగా హింసించిరి. కొంతమంది అతని ముందు వంగి అతనిని పట్టాభిషేకము చేయునట్లు ఉండిరి. కనుక ఐరోపా ఖండములో ఈ విధమైన నిండా గొర్రెపిల్లకు వేస్తారనుటకు ఇది ఒక ఉదాహరణగా ఉండెను.

యోహాను 19:4-5
4 పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. 5 ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతుఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

పిలాతు యేసును గూర్చి వినినప్పుడు అతనిలో ఏ దోషము చూడలేదు. కనుక మూడుసార్లు అతడు యూదుల దగ్గరకు అతనిని గూర్చి విచారించుటకు వెళ్లెను. " ఇతనిలో నాకు ఏ దోషము కనపడలేదు" . అతను వారినందరిని ఒకరికి ఒకరు ముఖ ముఖిగా చూసి నిజమును చెప్పాలని ఎంతో ప్రయత్నమూ చేసెను.

అతను యేసును వారి ఎదుటకు అతని తల నుంచు కారుచున్న రక్తముచేత మరియు ముడ్లకిరీటము చేత వారి ఎదుటకు తీసికొనివచ్చెను. అతని భుజము మీద ఉన్న గుడ్డ కూడా రక్తముతో తడిసినదిగా ఉండెను.

మీరు దేవుని గొర్రెపిల్ల ఈ లోక పాపము కొరకు చనిపోవుట భావించెదరా? అతని అవమానము ఒక ఔన్నత్యముగా ఉంది, అతని ప్రేమ ఓదార్పును ఇచ్చెను. అతనికి తూర్పు మరియు పడమర వైపు కూర్చున్న వారివైపు నిలపడి అతడిని ఎగతాళి చేసి, అతడిని అవమానపరచి అతని తల మీద ముండ్ల కిరీటము పెట్టిరి. ఈ లోకములో ఉన్న ఏవిధమైన కిరీటము కూడా ఈ రక్తముతో నింపబడిన కిరీటము కంటే గొప్పది కాదు, ఎందుకంటె ఈ కిరీటము నుంచి కార్చబడిన రక్తము చేత ఈ లోక పాపమునకు విముక్తి కలిగినది.

పిలాతు ఒక భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ యేసు యొక్క రూపమును బట్టి చాల విచారము కలిగెను. ఎందుకంటె అతని మొఖం మీద ఏవిధమైన ద్వేషము లేదు మరియు అతని పెదవులమీద ఏ విధమైన శాపము కూడా లేదు. అతను మౌనంగానే అతని తండ్రికి ప్రార్ధనచేసి ఎవరైతే తనను హింసిస్తున్నారో వారి క్షమాపణను బట్టి విజ్ఞాపన చేసెను. " ఈ మనిషిని గూర్చి జాగ్రత్త" అని ఆ అధికారి చెప్పేను. అనగా " ఇతను దేవుని స్వరూపమును ధరించిన మనిషి" అని చెప్పుటకు ఆ పేరును ఉపయోగించెను. ఎందుకంటె అతని శ్రమలోకూడా థాని జాలి కనపడి; అతని బలహీనతతో కూడా పరిశుద్ధముగా కనపడెను. అతను అతని సొంత దోషమును బట్టి పాపమును బట్టి తన రక్తమును కార్చలేదు , అయితే నీ నా పాపమును బట్టి సమస్త మానవాళి పాపమును బట్టి తన రక్తమును కార్చి ఉన్నాడు.


d) క్రీస్తు దైవత్వమును బట్టి పిలాతు భయపడుట (యోహాను 19:6-11)


యోహాను 19:6-7
6 ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచిసిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతుఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. 7 అందుకు యూదులుమాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

ఆ సమయములో అక్కడున్న వారందరు కూడా ఆ హింసను బట్టి అధికారి ద్వారపు దగ్గర ఉంది చూసిరి. అయితే ఆ యూదులు అధికారులు కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా యేసును సిలువు వేయమని చెప్పి కేకలు వేసినట్లుగా యేసుకు సిలువ శిక్షా వేసిరి. అక్కడున్న కొంతమంది దేవుడు నిజముగా యేసును విడిచిపెట్టాడని అనుకొనిరి. మరియు యేసు కూడా తనను తాను రక్షించుకొనుటకు ఏ అద్భుతము కూడా చేయలేదు , మరియు పిలాతు కూడా ఈ శిక్షను బట్టి అందరి మీదికి వచ్చునట్లుగా చెప్పెను. కనుకనే వారందరును అతనికి సిగ్గువచ్చునట్లు కేకలు వేసిరి.

కనుకనే పిలాతు ఏ దోషము లేకుండా యేసును శిక్షించాలని అతని మనసు ఒప్పుకోలేదు కనుకనే వారికి ," అతనిని తీసుకొని సిలువ వేయుడి, అతని యందు నాకు ఏదోషము కనపడలేదు అని చెప్పెను". మూడవ సారి అతని దగ్గరకు వచ్చినప్పుడుకూడా అతనిలో ఏవిధమైన దోషము కనపడలేదు. కనుకనే ఆ పాపము పిలాతు మీద రాకూడదని అతడిని వారికి అప్పగించేను.

ఎందుకంటె ఆ సమయాలలో రోమా ప్రభుత్వమునకు సంబంధించి ఒకరిని చంపాలంటే అతను దోషిగా తీర్చబడాలీ అయితే క్రీస్తు విషంయములో అతను ఏ విధముగా కూడా దోషిగా కనపడలేదు కనుకనే పిలాతు యేసును వారికే అప్పగించెను. అయితే యూదుల ధర్మ శాస్త్ర ప్రకారముగా సిలువ వేయాలనే నిర్ణయము వారికి లేదు అయితే రాళ్లతో కొట్టడమే యూదుల శాస్త్రములో ఉన్నది కనుకనే వారు రోమా ప్రభుత్వపరంగా క్రీస్తును సిలువ వేయుమని కేకలు వేసిరి.

ఎందుకంటె యూదులకు ఒక విషయము తెలుసు అదేదనగా , ఒకవేళ క్రీస్తు దేవుని కుమారుడని రుజువు వస్తే వారు అతని ముందర సాగిలా పడాలి అని. అయితే సిలువ " రుజువు" చేసినదేమనగా అతను నిజముగా దైవత్వము కలిగినవాడు కాదు కనుక అతను హింసలు అనుభవిస్తున్నాడు అని. అయితే వారు అతని మరణము గూర్చి సమాధాన పరచబడెదరు కానీ అతని మరణము ద్వారా కాదు , అయితే దేవుని ఉద్దేశము నెరవేర్చబడులాగున సిలువ మరణము అనునది జరిగినది.

ప్రార్థన: ప్రభువా మా గురించి మీరు అనుభవించిన హింసను బట్టి శ్రమను బట్టి మీకు కృతజ్ఞతలు. మీ ఓర్పును బట్టి ప్రేమను బట్టి మిమ్ములను ఘనపరచుదము. మా శత్రువులను ప్రేమించునట్లు మరియు వారి యెడల ప్రేమ కలిగి ఉండునట్లు మాకు నీ సహాయమును ఇమ్ము. నీ రక్తము చేత మా పాపములను కడిగివేసినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా మేము మీ కుమారులము కనుక మీ పరిశుద్దతను ఇచ్చి మమ్ములను కనికరము కలిగిన నీ మార్గములో నడుచునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. క్రీస్తుకు వేయబడిన మూళ్ళ కిరీటమును బట్టి, చుట్టబడిన ఊదారంగు గుడ్డలను బట్టి మరియు అతని దెబ్బలను బట్టి మనము ఏమి నేర్చుకోవచ్చు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:29 PM | powered by PmWiki (pmwiki-2.3.3)