Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 110 (Pilate awed by Christ; Pilate's unjust sentence)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
3. రోమా అధికారి ఎదుట మర్యాద కరమైన విచారణ (యోహాను 18:28 – 19:16)

d) క్రీస్తు దైవత్వమును బట్టి పిలాతు భయపడుట (యోహాను 19:6-11)


యోహాను 19:8-11
8 పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి 9 నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు 10 గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. 11 అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

పిలాతు యేసు వ్యక్తిత్వమును బట్టి సంసిద్ధముగా ఉన్నాడు. అతని పరిశుద్ధత, నీతి, ప్రేమ ఆ పిలాతు ఎదురుగా మార్చబడలేదు. కనుకనే ఎప్పుడైతే క్రీస్తు యూదుల రాజు మాత్రమే కాక దేవుని కుమారుడని వినినప్పుడు పిలాతు అతనిని బట్టి భయపడ్డాడు. రోమా వారు మరియు గ్రీకు వారు , ఎవరైతే ఆ పరలోకము నుంచి వచ్చారో వారో సంపూర్ణ ఆత్మ చేత మరియు దైవత్వము చేత నింపబడతారని అనుకొనిరి. కనుకనే వారు ," ఇతను నిజముగా దేవుని కుమారునిగా ఉన్నదా ?" అని , " నీవు ఎక్కడినుంచి వచ్చావు?" అని అడిగిరి .

యేసు ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని చూడలేదు అయితే మౌనముగా ఉండెను. ఈ మౌనము సరసమైనదిగా ఉండెను. క్రీస్తు వారి ప్రశ్నలకు తగిన సమాధానము ఇవ్వలేదు, ఎందుకంటె వారు అతని నుంచి మోసకరమైన సమాధానము కొరకు ఎదురు చూచిరి, అయితే యేసు తనను గూర్చి నిజమైన విశ్వాసులకు మాత్రమే వివరించెను. అతని వాలే ఆ రోమా సామ్రాజ్యములో ఎవ్వరు కూడా లేకపోయిరి. కనుక క్రీస్తు మౌనమును బట్టి పిలాతు కోపముగా, " నీవు నాతో మాటలాడుటకు ఇష్టపడవా? నాకు నిన్ను చంపుటకు మరియు విడిపించుటకు అధికారము కలదు, కనుక నీవు నా అధికారంలో ఉన్నావు. నీ శత్రువులు నిన్ను సిలువవేయమని ఆజ్ఞాపిస్తున్నారు, అయితే నేను నిన్ను రక్షించగలను లేదా శిక్షించగలను."

యేసు ఈ విధముగా సమాధానము ఇవ్వవచ్చు, " నిజముయిగా నీకు అధికారము లేదు. నా తండ్రి నీకు అధికారమౌ ఇచ్చెను. నీకు నీవే ప్రాముఖ్యము కాదు. నీ అధికారము కోల్పోవుదురు. పరలోకమందుండు నా తండ్రి సర్వశక్తి కలిగిన వాడు, మరియు నేను కూడా . కనుక అతని చిత్తములేనిదే ఈ లోకములో ఏ అధికారము కూడా లేదు. " పిలాతుకు కూడా ఇవ్వబడిన అధికారము కూడా ఒకరోజు తీయబడును. ఈ లోక చరిత్ర మీద దేవునికే అధికారము కలదు అయితే ప్రతి ఒక్కరు వారికి ఇవ్వబడిన అధికారమును జాగ్రత్తగా చేయాలి. కనుక నీవు ఇతరులతో ఏవిధముగా అధికారము చేస్తావో దానిని బట్టి నీవు లెక్క చెప్పాలి.

అప్పుడు యేసు పిలాతుతో, " నీవు కూడా పాపముచేసినావు, అయితే నీవు మాత్రమే కాదు. అందరు పాపము చేసినవారు. నీవు నన్ను సిలువవేయాలని అనుకొనలేదు, అయితే నీవు కైపస్సుకు భయపడి నన్ను నిందారహితుడుగా చేసి ఉన్నావు". కనుక ఆ ప్రధాన యాజకుడు కూడా ఏ దోషము లేని యేసును సిలువ దండన చేయుచున్నాడు కనుక అతను కూడా పాపముచేసి వాడే. అయితే అతను ఒక అధికారము కలిగి ఉన్నాడు కనుక ఈ విధమైన నిర్ణయములు తీసుకొన్నాడు. అయితే అతను కూడా అపవిత్రమా చేత బందించబడినాడు కనుక అతను కూడా యేసును హత్యచేసిన వాడుగా ఉండెను.


e) క్రీస్తును బట్టి పిలాతు అన్యాయము చేయుట (యోహాను 19:12-16)


యోహాను 19:12
12 ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

పిలాతు యేసును వదిలిపెట్టాలని ఇస్తబడెను , ఎందుకంటె ఆ బందిఖానాలో ఉన్న వాడు తన తప్పును ఒప్పుకున్నాడు కనుక. క్రీస్తు ఘనత మరియు అతని జాలి మరియు అతని శక్తిని అన్నియు కట్టబడినప్పటికీ. యేసు పిలాతును బెదిరించలేదు, అయితే అతడిని బట్టి చివాట్లు పెట్టాడు. అతను కైపస్సు యొక్క పొరపాటును మరియు పిలాతు పాపమును మధ్య వ్యత్యాసమును చూపెను. ఎవరైతే నిజమైన జీవితము కలిగిఉంటారో వారికి యేసు ఒక న్యాయాధిపతిగా ఉందును.

పిలాతు యొక్క హృదయము మార్చబడుట చూసి యూదులు రాజకీయము చేయుట ప్రారంభించిరి. రోమా ప్రభుత్వము ప్రకారముగా యేసు దైవత్వముగా ఉన్నదనుటకు వ్యతిరేకం అని చెప్పిరి. కనుక ఒకవేళ పిలాతు క్రీస్తును మరణ శిక్ష వేయక పోతే కైపస్సుకు అతని విషయములో చెప్పాలని మాట్లాడుకొనిరి.

" కైపస్సు యొక్క స్నేహితుడు" అనగా చక్రవర్తికి అనుకూలుడు అని అర్థము. పిలాతు భార్య ఈ కుటుంభానికి సంబంధించినది. కైసరుకు అందరి పట్ల అనుమానము ఉన్నది కనుకనే అతని యొద్ద పనిచేస్తున్నవారినందరిని అనుమానించెను. కనుకనే వారిలో ఖచ్చితముగా వ్యతిరేకస్తులు ఉంటారని అనుకొనెను. కనుక ఎవరైతే కైసరు స్నేహితుడిని కూడా తక్కువగా చూసినయెడల వారికి కూడ శిక్ష పడునని వారికి తెలిసెను.

" యూదుల రాజు" ను పిలాతు వదిలివేశాడని యూదుల పెద్దలు రోమా ప్రభుత్వమునకు పిర్యాదు చేసిరి, వారి తప్పులను కూడా వారు లెక్కచేయకుండా కైసర్ కు పిర్యాదు చేసిరి. కనుక దానికి పిలాతు అధికారము మార్చబడెను. యేసు వైపే సత్యము ఉన్నప్పటికీ , తన అధికారమును ఇచ్చుటకు పిలాతు ఇష్టపడకపోయెను. కనుక ఈ స్థితిలో అతను యేసును ఖండించెను. అయితే అతని హృదయములో క్రీస్తు ఏ దోషము చేయబడలేదని తెలుసుకొని నప్పటికీ పారిస్తుతులను బట్టి యేసును వారికి అప్పగించెను.

యోహాను 19:13-16
13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి,రాళ్లు పర చిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా 15 అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మా 16 అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

రోమా ప్రభుత్వమును బట్టి పిలాతు తిరస్కారము చేయబడ్డాడు, " రాజు అని చెప్పిన క్రీస్తును మీరు నిందమోపుతున్నారు! కనుక బలము లేని మీ రాజ్యమును సీకరించుడి! మీకు కూడా ఇతని వాలే ఏ లక్ష్యము పెట్టడము లేదు!"

కనుక యూదులు యేసును బట్టి చెప్పబడిన ఈ మాటలను అర్థము చేసుకొన్నారు. అందుకు వారు కేకలు వేస్తూ, " యేసును సిలువ వేయుడి, ఇతను దోషము చేసాడు కనుక అతడిని సిలువకు తీసుకొని వేళ్ళు" అని కేకలు వేసిరి!"

కనుక సహోదరుడా ఎవరైతే ఈ సంఘటనను బట్టి ఏడిచారో వారు వారి ధర్మశాస్త్రము బట్టి భక్తిగలవారు, అయితే దేవుని చిత్తము క్రీస్తులో ఉన్నాడని మరియు అతని దేవుని దైవత్వము అయి ఉన్నాడని వారు తెలిసికొనక గ్రుడ్డివారైరి. కనుకనే వారు అతడిని ద్వేషించి అతనికి దూరముగా ఉండుటకు ఇష్టపడిరి. కనుక ఎవరైతే దేవుని దగ్గరకు రావాలనుకుంటే వారు క్రీస్తు యేసు ద్వారా వారి గ్రుడ్డితనమును తెరవాలి.

పిలాతు మరి ఒక సారి యేసును " రాజు" అని పిలిచెను, క్రీస్తును చంపుటకు గల కారణములు లేవని వారందరి ముందు చెప్పెను. పిలాతు యేసులో ఏవిధమైన దోషము లేదని చెప్పినప్పటికీ ,వారందరు యేసును సిలువ వేయమని గట్టిగా చెప్పిరి. అనగా వారందరి స్వరము దేవుని నుంచి వచ్చినది కాదు అయితే సాతాను నుంచి వచ్చినదిగా ఉండెను.

యాజకుడు పిలాతు మాటలను బట్టీ ఆగ్రహము కలిగి ఉండెను. అందుకు వారు ఆశ్చర్యముగా , " మాకు కైసరు తప్ప రాజు లేదు." ఈ మనిషి ఒక కపటము కలవాడని చెప్పిరి. కనుక ఆ యాజక కుటుంబము కూడా హేరోదును బట్టీ అతని రాజసత్వమును బట్టీ భయపడిరి. కనుక వారు కైసరును ఒప్పుకొనిరి. కనుకనే వారు పాత నిబంధన ప్రవచనంజులను కూడా తిరస్కరించిరి. వారికి అబద్ధమునకు జనకుడైనవాడు ఏలెను. అయితే క్రీస్తు ఆ సమయములో దేవుని స్వరమును విని మొనముగా తన మంచితనమును చప్పెను.

కావలసినప్పుడు, పిలాతు వారి మోసమును ముందుకు తెచ్చెను. అయితే దేవుని కుమారుడు మౌనముగా ఉంది తన తండ్రి నడిపింపు ప్రకారమౌ ఉండెను, అయితే అధికారి అతని కుమారుడిని సిలువ మరణమునకు నడిపించెను. అయితే ఈ అన్యాయమైన తీర్పు నుంచి యేసు మనిషికి మరియు దేవునికి మధ్యన పునర్విమర్శచేసెను. అయితే సాతాను ఆత్మ విజయము చెందేనని అనుకొనెను, అయితే ఇది దేవుని ప్రణాళిక నెరవేర్చబడి, నిత్యా నరకము యొక్క మోసము మీద విజయము పండుకొనెను.

ప్రార్థన: ప్రభువా నీవు దేవుని గొర్రెపిల్ల కనుక మేము మీ ముందురా మోకరిల్లుతున్నాము, మా పాపములను క్షమించువాడవు నీవే. మాకు నిజమైన కృప కలిగిన హృదయమును ఇమ్ము. ఇతరులకు మేము సహాయపడువారుగా చేసి, చెడును విడిచి నీ మంచి మార్గములో నడుచునట్లు చేయుము.

ప్రశ్న:

  1. యేసు మీద పిలాతు ఎందుకు తీర్పు తెచ్చెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:30 PM | powered by PmWiki (pmwiki-2.3.3)