Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 031 (Jesus leads his disciples to see the ready harvest; Evangelism in Samaria)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
4. సమారియాలో క్రీస్తు (యోహాను 4:1-42)

b) సిద్ధముగా ఉన్న పంటను చూచుటకు క్రీస్తు తన శిష్యులను నడిపించుట (యోహాను 4:27-38)


యోహాను 4:31-38
31 ఆ లోగా శిష్యులుబోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. 32 అందుకాయనభుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా 33 శిష్యులుఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. 34 యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది. 35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి;అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను. 36 విత్తువాడును కోయువాడును కూడ సంతో షించునట్లు,కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 37 విత్తువా డొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. 38 మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

క్రీస్తు ఆ స్త్రీ యొక్క దోషములను క్షమించి ఆమెకు నిత్యజీవమును ఇచ్చిన తరువాత ఆటను తన శిష్యుల వాపి తిరిగి ఇదే విధమైన సేవ చేయాలని వారికి తెలిపెను. ఎందుకంటె వారి హృదయములు మరియు వారి ఆలోచనలు ఈ లోక సంబంధమై ఉన్నవి కనుక. ఆ స్త్రీ హృదయములో జరిగిన మార్పును బట్టి వారికి ఆనందము కలగజేయలేదు. ఎందుకంటె ఆహారముకంటె మరియు నీటికంటే ఇంకా ఎక్కువైనది క్రీస్తు దగ్గర వారికి దొరుకుతుంది. ఇది వారికి ఇంకను అర్థము అవ్వాలి. వారు ఆమెకంటే ఉన్నతమైనవారు కారు.కనుక ఎవరైతే పరలోకముంచి తిరిగి జన్మించాక ఉన్నయెడల వారు దేవుని రాజ్యమును చూడరు.

క్రీస్తు వారికి పరలోక ఆహారమును బట్టి మరియు ఆత్మీయ ఆహారమును బట్టి వివరించెను. క్రీస్తు తన తండ్రి ఆజ్ఞాపించిన పనులన్నీ చేసి సంతృప్తిగా ఉన్నాడు.

యేసు దేవుని అపొస్తలుడు. ఆటను తండ్రికి కుమారుడైనప్పటికీ ఎంతో తగ్గింపు కలిగి ఆనందముగా ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రేమలో ఉంటారో వారు దేవునిలో కూడా ఉండగలరు. క్రీస్తు తన తండ్రికి తగ్గింపు గలవాడని అనుటకు అతను తన తండ్రి యెడల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే క్రీస్తు అంటున్నాడు రక్షణ అనునది తన తండ్రి చిత్తము అని. తండ్రి ఏవిధముగా అయితే సమస్తమును తన కుమారునికి ఇచ్చాడో అదేవిధముగా క్రీస్తు కూడా తన తండ్రికి మహిమ కారముగా ఉన్నాడు. త్నద్రి తన కుమారుడిని తన కుడి పార్శ్యమున కూర్చుండుటకు ఏ స్థానము ఇచ్చాడో అదేవిధముగా పరలోకమందును భూమియందును అధికారమును ఇచ్చెను.

ఆ బావి దగ్గర దేవుని ఉద్దేశము ఒక్కటే ఆమెను రక్షించడమే. యూదులు మాత్రమే పశ్చాత్తాపమునకు పిలువబడలేదు అయితే లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందుకు పిలువబడినారు. ఎందుకంటె అందరు చెడిపోయి దేవుని కొరకు ఆకలిగొని యున్నారు కాబట్టి. ఎప్పుడైతే క్రీస్తు ఆమెను కలిసికొన్నాడో అప్పుడు ఆమెలో మార్పును చూసాడు, మరియు ఆమె అంతరంగములో తన పాపమునకు ప్రయాసచ్చిత్తము కోరారకు ఎదురుచూచుట ఎరిగియున్నాడు.

ఏదేమైనా శిష్యులు పంటను కోయుటకు స్థలమును చూడలేదు. యేసు సమారియాను చలికాలములో దర్శించియున్నాడు అప్పటికి ఇంకా కొన్ని మాసములు పంటకు సమయము ఉన్నది. " నీవు పనికి రానివాటిని చూచుచున్నావు, అయితే సత్యమైన వాటిని చూచి మనిషిలో ఆత్మను నింపి, మరియి సమృద్ధి కలిగిన జీవితముతో నింపి దేవుడిని వెదుకు. ఇదే కొత్త సమయము. రక్షణ సువార్త జ్ఞానముతో లేదా ప్రేమతో ప్రకటించబడినట్లైతే అనేకమంది దేవుని కుమారుడైన రక్షకుడిని అంగీకరించుటకు ఇష్టపడుతున్నారు.

నీవు ఒక వేళా అనుకొనవచ్చు; నా చుట్టూ ఉన్నవారు గట్టివారని, గ్రుడ్డివారని. ఆలాగుననే శిష్యులు కూడా అనుకొన్నారు; వారు వారికి తగినట్లు తీర్పు తీర్చారు. అయితే యేసు హృదయమును చూసాడు. తన దగ్గరకు వచ్చిన స్త్రీ ఆయనను అన్యుడని ఎంచలేదు. ఆమెకు ఆత్మీయ మాటలను అర్థము కాకపోయినను ఆయన సహనము కలిగి ఆమెకు తన మాటలను తెలియపరచియున్నాడు. అయితే ఆమెకు ఆత్మీయ సహాయముచేత నడిపించాడు, మరియు ఆరాధన క్రమమును నేర్పించి ఆమె సువార్తీకురాలై మారువరకు ఆమెకు సహాయము చేయుచువచ్చెను. ఈమె భక్తిగల నీకొదేమను కంటే ఆత్మీయముగా క్రీస్తును దగ్గర అయిఉన్నది. ఎవరైతే ఈ విధమైన మార్పుకలిగి ఉంటారో వారు వారి స్థలములో ఈ విధమైన కార్యాలు చేయగలరు. దేవుడు వారిని పిలిచి వారిని ప్రేమించెను. వారి మనసులు దేవుని కృప ద్వారా మార్చబడుతుంది. నిశ్శబ్దముగా ఉండే ఈ లోకములో ఎంతమంది మీలో దేవుని కొరకు ఎదురుచొస్తారు ?

ఎప్పుడైతే ఒక మనిషి యేసు వైపు తిరుగుతాడో, అÜberschriftenప్పుడే నిత్యజీవము తనకు చెందినది; ఆనందము అతని హృదయములో ఉండును. అదేవిధముగా ఒకరు ఈ లోకములో పాపము అప్పుడలా చేసినపుడు పరలోకములో ఉన్న దూతలు ఎంతో ఆనందముగా ఉంటారు. ఎవరైతే దేవుని చిత్తమునకు సమర్పించుకొని క్రీస్తు వాక్యమును మోసుకొని వెళ్తారో వారు వారి ప్రాణములను తృప్తిపరచుకొనెదరు. " నా ఆహారము దేవుని చిత్తమును చేసు నన్ను పంపిన వాని కార్యమును జరిగించుటయే" అని యేసు చెప్పెను.

యేసు తన ప్రసంగమును శిష్యులతో ఈ విధముగా ముగింపు పలికినాడు, " నేను మిమ్ములను కోట సమయములోనికి పంపియున్నాను." యోహాను అప్పటికే పాప ఒప్పుదలను బట్టి ముందుగానే ప్రకటించి యున్నాడు,మనము ఈ దినమున క్రీస్తు సువార్త అనబడిన విత్తనము యొక్క పంటను కోయుచున్నాము. ఆ కార్యము క్రీస్తుడి. క్రీస్తు శక్తి ద్వారా ఆత్మ ఫలములు కలిగినవి. మనమందరము తృణీకరించబడినవారము అయితే క్రీస్తు మనలను ఎన్నుకొని, కొన్నిసార్లు విత్తనము వేయుటకు, కొన్ని సార్లు నీతూ పెట్టుటకు మరి కొన్ని సార్లు పంటను కోయుటకు నడిపించుచున్నాడు. మనము దేవుడు చేసిన మొదటి సృష్టి కాదని మనము ఎప్పుడు గుర్తెరగాలా చాల మంది ప్రార్థనలు పరలోకములోనికి ప్రవేశించార్యో,ఎందుకంటె వారి ప్రార్థన కన్నీటితో చేయబడినది. నీవు ఇతర దేవుని శిష్యులకంటే ఉత్తముడైన వాడు కాదు. నీవు నీ ప్రతి సమయమందు క్రీస్తు క్షమాపణ ద్వారానే జీవిస్తున్నావు. కనుక నీవు నీలో ఉన్న ఆత్మకు లోబడి ఉండుట నేర్చుకో. కోత సమయమందు ఆయనను ఘనపరచి ఆయనకు కృతజ్ఞతకలిగి ఉండు. మరియు నీతో పాటు వేరేవారితో కలిసి అయన శక్తిని బట్టి ఆయన ఉన్నతమును బట్టి ఆయనకు ఘనత చెల్లించు. ఆమెన్.


c) సమారియా లో సువార్తీకరణ (యోహాను 4:39-42)


యోహాను 4:39-42
39 నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమర యులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. 40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి,తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. 41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమి్మ ఆ స్త్రీని చూచిఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక 42 మామట్టుకు మేము విని,యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

ఆ స్త్రీ చెప్పిన ప్రకారము యేసును చూడాలని గుంపులు గుంపులుగా ప్రజలందరూ పట్టణములను వదిలి క్రీస్తును కలుసుకొనుటకు పరిగెత్తి వెళ్లిరి. వారిలో యేసు కోత సమయము వచ్చినది అని తెలుసుకొన్నాడు. వారితో రెండు దినములు గడిపి, విశ్వాసమును గూర్చి మరియు నిత్యా జీవమును గూర్చి వారికి వివరించియున్నాడు. అతని శిష్యులు అనేకులా ఇండ్లకు ఒక కోత వారు మాదిరి దర్శించిరి.. ఆ గుంపుకి యేసు మాటలు ఆయన నడవడిక వారి హృదయములను మార్చునట్లు ఉండెను. దేవుడే తన కుమారుడైన క్రీస్తులో ఈ లోకమునకు వచ్చి మన పాపములను కడుగుటకు వచ్చియున్నారని తెలుసుకొనిరి. అందుకే సమరయ స్త్రీ యేసుకు ఈ పేరు పెట్టినది, " లోక రక్షకుడు" అని. దాని అర్థము ఏమనగా వారి కొరకు ఆయన మాత్రమే రక ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరి కొరకు వచ్చియున్నది. ఈ నాటికి కూడా అతను ఈ లోక పాపములను కడిగివేయునని అర్థము చేసుకొనిరి. మరియి ప్రతి ఒక్కరిని సాతాను కబందాలలోనుంచి విడిపించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చేనని ఒప్పుకొనిరి. అందుకే సీసారు " రక్షకుడు మరియు కాపాడువాడని" చెప్పెను. ఎందుకంటె అతను ఆయన ప్రజలకొరకు తన జీవితమును అంకితము చేసి వారికి నిత్యమైన సమాధానమును ఇచ్చెను కనుక.

ప్రార్థన: ప్రభువా ఆ స్త్రీ యొక్క జీవితమును నీవు మరల కట్టినందుకు నీకు కృతఙ్ఞతలు. మరియు ఆత్మకు లోబడుట అనునది ఆరాధనకంటే గొప్పదని చెప్పియున్నావు. మీ నిత్యజీవమును పొందుకుంట్లు మమ్ములను నీ సన్నిధిచేత నింపుము.

ప్రశ్న:

  1. క్రీస్తు కొరకు మనము నిజమైన కోత పనివారముగా ఎలా ఉందుము?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:38 AM | powered by PmWiki (pmwiki-2.3.3)