Previous Lesson -- Next Lesson
3. ఇశ్రాయేలీయులలో ఎక్కువమంది దేవునికి వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు నీతిమంతులను కాపాడును (రోమీయులకు 9:6-29)
పౌలు క్రీస్తు పరిచర్యలో ఎంతో సంతోషముకలిగిన అపొస్తలుడా ఉండెను, మరియు అదేసమయములో అతను లోతైన ఎన్నో బాధలచేత మరియు శ్రమలచేత నింపబడెను. కొన్ని వందలమంది అన్యులు దేవుని రాజ్యములో నడుచుట చూసేను, మరియు ఆదేశమయములో వెళ్ళమంది యూదులు క్రీస్తు రాజ్యమును వ్యతిరేకించిరి. అతని మాటలు వినుటకు, అతనిని వెంబడించుటకు వారు ఇష్టపడలేదు.
a) దేవుని వాగ్దానము అబ్రాహాము సంతానమును నిమిత్తమును బట్టి ఇవ్వలేదు (రోమీయులకు 9:6-13)
రోమీయులకు 9:6-13
6 అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు కారు. 7 అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గానిఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, 8 అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు. 9 వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. 10 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, 11 ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, 12 పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. 13 ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
పౌలు రోమా లో ఉండు యూదులను బట్టి మరియు క్రైస్తవులను బట్టి ఈ సత్యమును వారికి క్లుప్తముగా చెప్పుటకు పూనుకొనెను. రహస్యములను బట్టి కేవలము దేవుని యొక్క వాక్యమే సత్యమును క్లుప్తముగా వివరించునని వారికి వ్రాసెను. ఈ సమాధానమునకు రెండు అర్థాలు ఉన్నవి:
మొదటిది: అబ్రాహాము యొక్క పిల్లలందరూ వాగ్దాన పిల్లలు కాదు. దేవుడు ఇష్మాయేలును క్రీస్తు యొక్క పితరులుగా ఎన్నుకొనలేదు. ఇష్మాయేలు మరియు అతని సంతతి మొత్తము వేరే మతముగా పిలువబడిరి, మరియు వారు యాకోబు పిల్లలకు వేరుగా ఉండిరి. మనము ఇక్కడ గమనించినట్లతే సహజమైన విత్తనము ద్వారా ఆత్మీయ భవిష్యత్తును నిర్ణయించదు. ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన ప్రకారము వారు నిజమైన క్రైస్తువులు కారు, అయితే వారికి దేవునితో వ్యక్తిగత సంబంధము అవసరము. దేవునికి పిల్లలు మాత్రమే ఉన్నారు కానీ మనవాళ్ళు మనవరాళ్లు లేరు.
ఈ సత్యాన్ని బట్టి మనము ఆలోచన చేస్తే ప్రతి యూదుడు దేవుని కుమారుడు కాదు, అయితే ఎవరైతే ఇష్టపూర్వకంగా క్రీస్తు సువార్తకు వారి హృదయములను తెరవగలరో వారు మాత్రమే దేవుని కుమారులు. అబ్రాహాము యొక్క దత్తత ఒక అధికముగా ఉండెను కానీ అది ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైన నిర్ణయమును బట్టి మాత్రమే ఆధారపడెను.
రెండవది: మనము పరిశుద్ధ గ్రంధమును చదివినట్లయితే, దేవుడు రిబ్కా డాగారా నీ పెద్ద వాడు చిన్నవానికి పరిచర్య చేయునని ఆమె ఇంకా జన్మ ఇవ్వకమునుపే దేవుడు చెప్పెను ( ఆది 25:23 ). వారిద్దరూ ఒకే తండ్రి కుమారులు. అయితే వారిలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక దానికి ఒకటి వ్యత్యాసముగా పెరుగునని దేవునికి ముందుగానే తెలుసును.
ఏదేమైనా దేవుడు చిన్నవాడైన యాకోబును ఎన్నుకొని, పెద్దవాడైన ఏశావును తిరస్కరించెను. యాకోబు ఏశావు కంటే మంచివాడు కాదు, అయితే అతను ఏశావు కంటే ఎక్కువగా నమ్మకము కలిగి ఉంది, నీతిగా ఒప్పుకొనువాడుగా ఉండెను. అయితే బైబిల్ లో ఏశావుకు ఈ విధమైన గుణము ఉన్నాడని వ్రాయలేదు. కనుక దీని ద్వారా మనిషి యొక్క భవిష్యత్తు కేవలము దేవుని చిట్టాను సారముగా మాత్రమే జరుగును అని మనము తెలుసుకొనగలము.
మనము ఎవ్వరమూ కూడా దేవునిని నిందించకూడదు, ఎందుకంటె రహస్యములు కానీ లేదా మన యొక్క సామర్థ్యము కానీ మనకు తెలియదు అయితే అది కేవలము పరిశుద్దుడైన దేవునికి మాత్రమే తెలుసు కనుక మనము నిండకలిగిన నిర్ణయములు తీసుకొనకూడదు.
కొంతమంది దేవుని యొక్క ఎన్నుకొనుట మనిషిని బట్టి ఉండదని చెప్పుకొంటారు, అయితే ఇది కేవలము సృష్టికర్త మీదే ఆధారపడి ఉన్నది; మరియు మనిషి దేవుని యొక్క ప్రణాళికలను మరియు సూచనలను తెలుసుకొనలేదు. కనుక ఈ సత్యమును బట్టి ఎవ్వరు ఒప్పుకొనరు, అయితే మన దేవుడు గొప్ప వారు, పరిశుద్ధుడు, మరియు ప్రేమకలిగి జాలికలిగి ఉన్నవాడు.
యేసు తన పరిచర్యలో తీరుపైనా మాటలు చెప్పెను: "నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి తెలుసు, మరియు అవి నన్ను వెంబడించును. మరియు నేను వాటికి నిత్యజీవమును ఇచ్చెదను" (యోహాను). ప్రతి ఒక్కరు అతని స్వరము వినరు, అతని స్వరము విను ప్రతి ఒక్కరు స్పందించరు, లేదా అతని మాటల ప్రకారముగా చేయరు, మనము ఒక దేశమును మరియు ఒక పరిశుద్దులను కనుగొంటాము, మన కుటుంబాలలో కూడా సువార్తను విని అర్థము చేసుకోలేని వారిని మనము చూస్తారు, అయితే అదే సమయములో ఇతరులు దానిని ఆనందముతో స్వీకరించి సమాధానము కలిగి ఉంటారు.
ప్రార్థన: ఓ ప్రభువా నీవు ఇస్సాకును మరియు యాకోబును క్రీస్తు యొక్క ముత్తాతలుగా ఎన్నుకోనిన్నందుకు నీకు కృతజ్ఞతలు, వారు ఒకవేళ పరిశుద్ధులు కాకపోయినప్పటికీ. నీ నామములో మేము మా విశ్వాసముతో బలపరచుకొనుటకు సహాయము చేయుము, మరియు ఇతరుల కంటే మంచి వారీగా ఉండుటకు మాకు నీ సాత్వికమును మరియు నీ గుణములను దయచేయుము.
ప్రశ్నలు:
- ఇస్సాకు యొక్క విత్తనములు ఎన్నుకొనుట మరియు యాకోబు కుమారుల ఎన్నుకొనుట అను వాటికి అర్థము ఏమిటి?
- దేవుని యొక్క రహస్య ఏర్పాటు ఏమిటి?