Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 052 (God Selects whom He has Mercy on)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
3. ఇశ్రాయేలీయులలో ఎక్కువమంది దేవునికి వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు నీతిమంతులను కాపాడును (రోమీయులకు 9:6-29)

b) ఎవరిని బట్టి కనికరము ఉండునో వారినే దేవుడు ఎన్నుకొనును, మరియు ఎవరిని కహ్ఠినపరచాలని అనుకొనునో వారిని ఖఠినపరచును (రోమీయులకు 9:14-18)


రోమీయులకు 9:14-18
14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. 15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడుఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. 16 కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును. 17 మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. 18 కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును. 

ఆది 33:19 లో మోషేకు దేవుని వాక్యము బయలు పరచినట్లు, దేవునికి ఒక మనిషి మీద కనికరము కలిగి ఉండుటకు అధికారము ఉన్నాడని మనము గమనించవచ్చు, ఆ మనిషి పాపముచేసాడా లేదా అని కాదు. కనుక మనిషి కార్యములను బట్టి దేవుని ఎన్నిక ఉండదు, అయితే అది కేవలము అతని కనికరము చొప్పునే ఉండును; మరియు మనిషి రక్షణ అనునది కేవలము సమాధానము చేతనే కలుగును, ఎందుకంటె దేవుని కృపకు ఏవిధమైన లిమిట్ లేదు కాబట్టి.

మనము అదే సందర్భమును నిర్గమ 9:16 లో పరిశుద్ధమైన దేవుడు ఆత్మ చేత నింపబడిన ఫరో తో ఈ విధముగా చెప్పెను: "దీని నిమిత్తమౌ నేను నిన్ను లేపి ఉన్నాను, ఎందుకనగా నా శక్తిని వారికి చూపుటకు, అప్పుడు నా పేరు ఈ భూమి అంతటను విస్తరించుటకు". ఇదే పౌలు వ్రాయుటకు సహకరించెను: "అతనికి ఎవరి మీద ఇష్టంఉండెనో వారి మీద కనికరము కలిగి ఉండెను, మరియు అతనే ఖఠినపరచును" (రోమా 9:18)

దేవుని పరిశుద్దతను బట్టి ఇది నిజమే. ఏదేమైనా దేవునికి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ఆశకలిగెను కనుక అతని జ్ఞానమైన సత్యములో అందరూ ప్రేవేశించాలి (రోమా 11:32;1 తిమోతి 2:4; పేతురు 3:9). ఒకవేళ ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన దురాత్మలకు వారి హృదయములను తెరచినట్లైతే, మరియు క్రీస్తుకు వ్యతిరేకమైన ఆలోచన కలవారు ఒక కుటుంబములో ఉన్నట్లయితే వారిని దేవుడు నాశనమునకు నడుపు వారికి వారిని అప్పగించును, అయితే దేవుడు కూడా నిత్యమైన శక్తిని ఆ లాంటి మనిషికి చూపగలడు.

పైన కనపరచిన అంశమును బట్టి కొందరు ఇస్లామును దేవుడు చేదు మార్గములోనికి నడిపించెను అనగా అతనికి ఇష్టము వచ్చునట్లు నడిపించెను అని చెప్పిరి, మరియు అతని పరిశుద్దతను బట్టి కొందరిని పరిశుద్ధతలోనికి నడిపించును అని కూడా చెప్పిరి, అయితే అన్ని విషయాలను బట్టి క్రీస్తుకు సమస్తమైన అధికారము కలదు. అయితే ఆ మతము వారు చెప్పినట్లు దేవుడు ఈ విధముగా చేదు మార్గములోనికి ఎవ్వరిని కూడా నడిపించడు, ఎందుకంటె అతను కనికరము గల వాడు గనుక ఎవరైతే అతనిని అంగీకరించి ఒప్పుకొంటారో వారిని ఆయన తన రక్తములో కడిగి పాప రహితునిగా చేయును.

ఒకవేళ ఎవరైనా గ్రుడ్డితనము కలిగి సాతాను బంధకాలలో ఉండి, అబద్ధమునకు జనుకుడైన తండ్రితో ఉండి మరియు ధనమును ప్రేమించువారిగా ఉన్నట్లైతే వారిని దేవుడు పూర్తిగా తన వాక్యములను అర్థము చేసుకొనుటకు వీలు కలిగించడు (యోహాను 8:43-45). దేవుడు తన నిర్ణయమును బట్టి చాల ఖచ్చితముగా ఉన్నాడు, అయితే మనిషి తన పచ్చాత్తాపములో నిజమైన వాడిగా ఉన్నదా లేదా అని చూసుకోవాలి.

ఈ అంశమును బట్టి అర్థము చేసుకొనుటకు పౌలు దీనిని అన్యులకు కాకుండా రోమా లో ఉండు యూదులకు దీనిని పంపెను, వారి యొక్క కఠినమైన హృదయములు నుంచి బయటకు వచ్చుటకు. ఒకవేళ వారు క్రీస్తు సువార్త కొరకు వారి హృదయములను తెరువక ఉండినట్లైతే దేవుడు వారి హృదయములను ఖఠినపరచును అని మనము సువార్తలలో చూసుకొనవచ్చు. ఈ పౌలు యొక్క పత్రిక జ్ఞానమును ఇవ్వడము లేదు, అయితే కఠినమైన యూదుల హృదయములను మనము ఏవిధముగా నడుచుకోవాలో నేర్పును.

ప్రార్థన: ప్రభువా మేము పాపులమైనప్పటికీ మీరు మమ్ములను క్రీస్తు యేసు లో ఎన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతలు, నీ ఏర్పాటుకు మేము అర్హులము కాకున్నప్పటికీ మమ్ములను నీ పిల్లలుగా చేసుకొనుటకు నీ అధికారమును మాకు దయచేసి ఉన్నావు. నీ నిత్యమైన మహిమను బట్టి మేము నిన్ను మహిమపరచుచున్నాము, మీరు మమ్ములను ఖఠినపరచకుండా చేసినందుకు నీకు కృతజ్ఞతలు, కనుక మమ్ములను నీ పరిశుద్ధ ప్రేమచేత దగ్గరకు చేసుకో.

ప్రశ్నలు:

  1. ఎందుకు మనుషులు దేవుని దేవుని ద్వారా ఎన్నుకొనబడరు? మన ఏర్పాటును బట్టి తగిన కారణాలు ఏమిటి?
  2. ఫరో హృదయమును ఎందుకు దేవుడు ఖఠినపరచెను? ఏవిధముగా ఒకరిని కఠినముగా చేయును?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:18 AM | powered by PmWiki (pmwiki-2.3.3)