Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 006 (Paul’s Desire to Visit Rome)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

b) రోమను దర్శించుటకు పౌలుకు ఉన్న ఆశ (రోమీయులకు 1:8-15)


రోమీయులకు 1:8-12
8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.  9 ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,  10 మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.  11 మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని  12 ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 

పౌలు తన ప్రయాణములో రోమా సంఘమును బట్టి మరియు సంఘపు సభ్యులను బట్టి మరియు వారి నిజమైన విశ్వాసములను బట్టి ఎంతగానో వినెను. కనుక ఆ సంఘమును బట్టి మరియు సభ్యులను బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పెను. ఏ గుంపు అయితే దేవునిని, పరిశుద్దుడైన క్రీస్తును నిజమైన విశ్వాసము చేత ఆరాధిస్తారో అక్కడ మనము కూడా వారితో పాటు దేవుడికి ఆరాధన చెయ్యాలి.

పౌలు దేవుడిని " నా దేవా" అని పిలిచెను, అనగా అతను అతని సొంతము అనునట్లు. ఎందుకంటె అతని ప్రాణము అతనిని ఎంతగానో ప్రేమించెను. అయితే పౌలుకు దేవునితో మంచి బంధము కలిగి ఉన్నప్పటికీ అతని నామములో ప్రార్థన చేయలేదు అయితే యేసు నామములో మాత్రమే ప్రార్థన చేసే ఉండెను, ఎందుకంటె కేవలము క్రీస్తు ద్వారానే మన ప్రతి ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది కనుక. కనుక మనందరి హృదయాలలో కూడా పరిశుద్ధమైన రక్తము ఉండాలి. ఎందుకంటే అతని పరిశుద్ధమైన రక్తము చిందించిన క్రీస్తు నామములో మాత్రమే మనము ఆనందముగా ప్రార్థన చేయగలము. కనుక ప్రతి సేవకుడు కూడా అతని పరిశుద్ధతకు లోబడి సమర్పించబడి ఉండాలి.

వారి ముఖ్యమైన పరిచర్య కేవలము సువార్తీకరణే. పౌలు తన మొదటి పత్రికలో మొదటి వచనములోనే, " దేవుని సువార్త" అనే పదమును గుర్తుచేశాడు. మరియు ౯ వ వచనంలో " అతని కుమారుని సువార్త" అని చెప్పెను. దీని ద్వారా మన సంపూర్ణ రక్షణ అతని కుమారుని మీద ఆధారపడి ఉంటున్నాడని అర్థము చేసుకోవచ్చు. పౌలు యొక్క ప్రతి మాటలో కూడా కుమారుని గురించి తండ్రి అయినా దేవుని గురించిన ప్రాముఖ్యతను చెప్పెను. కనుక ఎవరైతే ఈ సువార్తను తిరస్కరించి దీనికి వ్యతిరేకముగా ఉన్నట్లయితే వారు శపించబడుదురు.

పౌలు తన జీవితములో తండ్రితో, కుమారునితో మరియు పరిశుద్దాత్మునితో దగ్గర సహవాసము కలిగి ఉండెను. అతను రోమా సంఘమును బలపరచుటకు త్రిత్వమును పరిశుద్ధ త్రిత్వమును అని పిలిచెను. పౌలు తన పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినాను ఈ సంఘము కొరకు ప్రార్థించుట మరచిపోలేదు. ఏ ఒకారు కూడా పరిశుద్దాత్మ శక్తి లేకుండా దేవునికి ప్రార్థన చేయలేరు. ఎప్పుడైతే ఒకరు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటె వారిలో ఇతరుల కొరకు ప్రేమ, వారికొరకు ప్రార్థన కలిగి ఉంటారు.

పౌలు ఈ రోమా సంఘమును కొన్ని సంవత్సరాల క్రితమే దర్శించాలని ఉద్దేశించెను. అతను అనటోలియా, మేసిడోనియా మరియు గ్రీసు లో ఉన్నప్పుడు ఇటాలియన్ కాలిజోడు వేసుకొనుటకు ఇదే సమయము అనుకొనెను.

అయితే పౌలు తన ప్రయాణములను తన సొంత నిర్ణయాలుగా చేసుకొనలేదు. అయితే దేవుని చిత్తమునకు సమర్పించుకొని తన ప్రణాళికలను అతనికి అప్పగించాలని అనుకొనెను, ఎందుకంటె దేవుని నడిపింపు లేనిదే చేయు ప్రతి కార్యము సఫలము కాదని యెరిగి ఉండెను. పౌలు తన సొంత ఆలోచనలచేత బందీగా ఉండలేదు అయితే పరలోక తండ్రి చిత్తప్రకారముగా బందీగా ఉండెను.

అయితే రోమా సంఘమును దర్శించుటలో అతని ఆశ కొంచెమైనను తగ్గలేదు,ఎందుకంటె ఇంతకూ మునుపు అక్కడికి వెళ్ళలేదు కనుక. అతను పరిశుద్దాత్మ చేత నింపబడినానని జాగ్రత్త కలిగి ఉండెను. అతను దేవుని శక్తిని పంచె ఒక పరికరంగా ఉండెను; కనుక అతను రోమా సంఘము క్రీస్తు అధికారంలో భాగము కలిగి సంఘము ప్రేమచేత, నిరీక్షణ చేత నింపబడుటకు ఉద్దేశించెను. ఇది కూడా పౌలుకు ఒక విధమైన గురి అయి ఉండెను; అప్పుడు విశ్వాసులు కూడా దేవుని శక్తి చేత బలపరచబడుదురు అని.

పౌలు రోమా సంఘమునకు ఒక గొప్ప వ్యక్తిగా వెళ్ళలేదు, అయితే తనను తాను తగ్గించుకొని ఇచ్చుటకు మాత్రమే కాక అయితే చూచుట ద్వారా వినుట ద్వారా తీసుకొనుటకు వెళ్లెను. అతను దీని ద్వారా దేవుడు అతనిని ఎందుకు పంపాడో అని చెప్పుటకు, మరియు వారిని వారి విశ్వాస జీవితములో బలపరచుటకు మరియు వారిని ఆదరించుటకు వెళ్లెను.

పౌలు వారికి, నేను వేరే విశ్వాసము చేత రాలేదు, అయితే మీకు ఉన్న విశ్వాసము చేతనే వచ్చి మనలో క్రీస్తు ఎంటీయా జ్ఞానము, శక్తి మరియు నిజమైన క్రైస్తవులము అని పిలువబడుటకు మనమందరము ఒకే క్రీస్తు శరీరములో భాగమైనాము. కనుక ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ సంఘములు ఉన్నాయి అని అంటే అతను అబద్ధికుడు, ఎందుకంటె తండ్రి ఒక్కడే, కుమ్మాడు ఒక్కడే, మరియు పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కడే. ఎక్కడైతే నిజమైన విశ్వాసులు కలుసుకుంటారో వారు అందరు కూడా ఒక్కటై ఉంటారు, ఒకవేళ వారికి ఒకరికి ఒకరు తెలియకున్నప్పటికీ. అనగా వారందరు ఒకే ఆత్మలో ఒకే కుటుంబములో ఉన్నవారు కనుక వారందరు గొప్పగా ఆనందించేందరు.

ప్రార్థన: ప్రభువా ఈ లోకములో ఉన్న సంఘములన్నిటినీ కూడా ఒకటిగా చేసి వాటికి నీ ఆత్మచేత స్థిరపరచి నీ ప్రవర్ధనలో నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. మా సహోదరుల కొరకు ప్రార్థించునట్లు మాకు నేర్పుము. పరిశుద్దాత్మ చేత జన్మించబడిన నీ ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు. వారి పట్ల మేము ప్రేమకలిగి ఉండునట్లు మా కన్నులను తెరువుము. మేము ఇతరులను క్షమించుటకు నీ జ్ఞానమును ఇచ్చి మా సహవాసము నుంచి మేము వేరు పరచక మంచి సహవాసముకలిగి నీ పరిశుద్దమను పొందుకొనునట్లు చేయుము.

ప్రశ్నలు:

  1. ఎందుకు పౌలు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండెను?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:02 AM | powered by PmWiki (pmwiki-2.3.3)