Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 005 (Identification and apostolic benediction)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

a) ఆశీర్వాదమునకు ఆనవాలు (రోమీయులకు 1:1-7)


రోమీయులకు 1:7
7 మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. 

పౌలు తన పత్రికలలో ముగింపు చేస్తున్నప్పుడు ఎక్కువగా దైవత్వమును గూర్చి మరియు జ్ఞానమును గూర్చి దేవుని శక్తికలిగిన ఆశీర్వాదమును గూర్చి చదువు వారికి అర్థమగునట్లు వ్రాసెను. కనుక నీవు ఈ మాటలలో దేవుని కృపచేత నీ సామర్థ్యమును ఉంచి, వాటిని నీ హృదయములో ఉంచుకొనినట్లైతే అప్పుడు నీవు దేవునిలో ధనవంతునిగా ఉండెదవు. కనుక అపొస్తలుడైన పౌలు చివరిలో వ్రాసినట్లు ఆ వాక్యానుసారముగా జీవించి వాటిని గైకొనుము.

అపొస్తలుడు తన పత్రికలలో మొదటిగా చెప్పినది సంపూర్ణ కృపను బట్టి, ఎందుకంటె నీవు నశించిపోతున్నావు కనుక దేవుడు నిన్ను ప్రేమించి నీవు నాశనము కలిగి ఉండకూడదని తన కృపను దయచేసి ఉన్నాడు. దేవుడు నీకు తీర్పు చేయాలి అయితే తన ఏకైక కుమారుని మరణమును బట్టి నీకు తన నీతిని ఇచ్చి ఉన్నాడు. కృప అనునది దేవుని ద్వారా నీకు ఇవ్వబడినది. నీవు నీతిగా పిలువబడుటకు అర్హుడు కాకపోయినను నీకొరకు అతను త్యాగము చేసెను కనుక నిన్ను నీతిమంతునిగా మార్చెను. నీకు జాగ్రత్త తప్ప ఏమి కూడా రాకూడదు, అయితే తన కృపచేత దేవుడు నీకు ఎన్నో ఆత్మీయ బహుమానములు ఇచ్చి నీ ప్రార్థనలు సమాధానములు ఇచ్చి ఉన్నాడు.

ఏదేమైనప్పటికీ క్రీస్తు మరణము చేత అతని పైన మనకు ఉన్న ఉద్దేశము మార్చబడెను;ఎందుకంటె మనుషులకు మరియు దేవునికి మధ్యన ఒక ఖాళీ అనునది ఉండెను, అయితే క్రీస్తు మనకు మరియు దేవునికి మధ్యన ఉన్నాడు కనుక మనకు సమాధానము అనునది వచ్చి ఉన్నది. కనుక నిత్యుడగు పరిశుద్ధుడు మనలను నాశనము చేయడు. క్రీస్తు పునరుత్థానమైన తరువాత అతను చెప్పిన మొదటి మాట:" సమాధానము కలుగునా గాక" అని. అనగా ధర్మశాస్త్రమునకు సంబంధించిన ఏ కార్యములు కూడా ఇక పెండింగ్లో లేవు, మరియు ఏవిధమైన పిర్యాదులు కూడా లేవు అయితే క్రీస్తు రక్తములో మనమందరము కడగబడినాము. కనుక ప్రతి హృదయము దేవుని సమాధానముచేత నింపబడి ఒక క్రొత్త ఒరవడిక మొదలైనది.

కనుక ఎవరైతే క్రీస్తును అంగీకరించి అతని సమాధానంలో నివసించి అతని అద్భుతములను కనుగొని అతనిని ఆరాదించినట్లైతే అప్పుడు అతను వారి యెడల కనికరము కలిగి వుండును. అతను మనలను విడువక చివరివరకు మంత్తో ఉన్నవాడు. " దేవుడు మా తండ్రి" అనే పదము కంటే మరియు గొప్పదైన పదము క్రొత్త నిబంధన గ్రంధములో లేదు. ఈ విధమైన దైవత్వము కలిగిన మాట మనకు క్రీస్తు ద్వారా వచ్చినది. క్రైస్తవులలో ఈ దైవత్వము అనునది ఒక క్రొత్త వరవడిక అయి ఉన్నది. సిలువ మరణము చేత మనము అతని పిల్లలగుటకు మరియు రెండవ పుట్టుకను కలిగి ఉండుటకు, మరియు అతని నిత్యా జీవమును పొందుటకు మాత్రమే జరిగినది. అనగా దీని అర్థము మనము నిజముగా దేవునికి చెందిన వారము మరియు అతని పిల్లలము.

నీకు యేసు క్రీస్తు తెలుసా? అతని గొప్పతనమును మరియు అతని సాత్వికమును గుర్తు చేసుకొన్నావా? అతను మనిషిగా మరియు దేవునిగా ఉన్నాడు. మనలను విమోచించుటకు అతను తన మహిమను విడిచిపెట్టాడు. మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తము చేసినతరువాత తన తండ్రి దగ్గరకు వెళ్లి అతని కుడి పార్శ్యమున కూర్చొని, గొప్పగా సన్మానించబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు. ఈ విధముగా క్రీస్తు తన తండ్రి అయినా దేవుని అధికారమును కలిగి ఉన్నాడు. అతను ప్రభువు. అతను నీకు కూడా ప్రభువా? ఎందుకంటె నీ జీవితము మీద కూడా అతను అధికారము కలిగి ఉండాలను కోరుకుంటున్నాడు; ఎందుకంటె అతని స్థలమునకు నిన్ను పంపుటకు నిన్ను కడిగి పరిశుద్ధపరచాలని ఉద్దేశించుచున్నాడు.

ప్రార్థన: పరలోకమందునా తండ్రి నీవు క్రీస్తు ద్వారా మాకు కూడా తండ్రివి. నన్ను నీవు కనుగొని నీ బిడ్డగా చేసి ఉన్నావు. నేను నా సమయమును, నా ధనమును, నా బలమును, నా ప్రేమను నీ కుమారునికొరకు ఇచ్చెదను. నేను నీ కుమారునిగా ఉండి నిన్ను ఘనపరచులాగున నేను ఉండునట్లు నన్ను మార్చుము. పాపులందరిని రక్షించుటకు నీ కుమారుడిని పంపి నిన్ను నిత్యమూ ఆరాధించుటకు పంపినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్నలు:

  1. నీ జీవితములో అపొస్తలుడు తన పత్రికలో వ్రాసిన చివరి మాటలలో దేనిని నీవు ఎక్కువగా తీసుకుంటావు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:02 AM | powered by PmWiki (pmwiki-2.3.3)