Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 022 (People lean towards Jesus; Need for a new birth)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
2. యేసు నీకొదేముతో మాట్లాడుట (యోహాను 2:23 - 3:21)

a) యేసు మీద ప్రజలు అనుకొనుట (యోహాను 2:23-25)


యోహాను 2:23-25
23 ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూష లేములో ఉండగా,ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. 24 అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు 25 గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.

పస్కా పండుగ పూత ప్రజలు యెరూషలేమునకు ఆరాధనకు వచ్చినప్పుడు. వారు గొర్రెపిల్ల దేవుని తీర్పునుంచి వారిని,ఏవిధముగా నైతే వారు ఇగుప్త దేశము నుంచి దేవుడు విడిపించి యున్నాడో అదేవిధముగా గొర్రెపిల్ల కూడా వారిని విడిపించుటకు వచ్చినది అని అనుకొంటున్నారు,అందుకే వారు శరీర త్యాగములను వారి భోజనముగా అనుకున్నారు.

యేసు దేవుడు నియమించిన గొర్రెపిల్లగా యెరూషలేమునకు వచ్చి పాపములపై పనిచేసి తన ప్రేమను మరియు శక్తిని చూపించింది. అప్పుడు అక్కడున్నవారికి ఆటను ఎవరో తెలియవచ్చి తమ పెదవులతో ఆయన పేరును ఉచ్చరించారు.; అప్పుడు వారు, "ఆటను ప్రవక్త, లేక ప్రవచించు ఎలియానా లేక మెస్సయ్య?" అని ఎంతో మంది నమ్మి దేవుడినుంచి వచ్చాడని ఎరిగిరి.

క్రీస్తు వారి హృదయములను చూచి,ఎవరిని కూడా తన శిష్యులుగా చేసికొనలేదు. వారు కూడా లోకానుసారముగా అలోచించి ఉన్నారు. ఎందుకంటె వారి మనసులు రోమా సామ్రాజ్యము యొక్క స్వాతంత్ర్యము కలిగి, వారి భవిష్యత్తుకు సరిఅయిన సుఖముగా ఉన్నారు. క్రీస్తుకు అందరు తెలుసు; ఎందుకంటె ఏ హృదయము కూడా అతనికి మరుగై ఉండలేదు. ఒక వేళా వారు యొర్దాను దగ్గర నిజముగా వారి పాపములను బట్టి అరచిన వారుగా ఉన్నట్లయితే వారు అప్పుడే రక్షింపబడిన వారుగా ఉండిరి.

క్రీస్తుకు నీ హృదయము తెలుసు, నీ ఊహలు, నీ ప్రార్థనలు మరియు నీ పాపములు కూడా ఆయనకు తెలుసు. నీ ఆలోచనలు మరియు దాని క్రియలు కూడా తెలుసు. నీవు నీతికలిగిన జీవితమును ఆశిస్తున్నావని ఆయనకు తెలుసు. అయితే ఎప్పుడు నీ గర్వము వెళుతుంది ? మరియి ఎప్పుడు నీవు పరిశుద్ధాత్మచేత నింపబడునట్లు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావు ?


b) నూతన జన్మ యొక్క అవసరత (యోహాను 3:1-13)


యోహాను 3:1-3
1 యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను. 2 అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రి¸ 3 అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

అంట మంది గుంపులో ఒక నీకొదేమను ఒక ఉన్నతమైన భక్తుడు పిలిచియున్నాడు, ఆటను సంహేద్రిన్ లలో ఒకడుగా ఉన్నాడు. ఆటను దేవుని శక్తి క్రీస్తులో ఉన్నాడని అర్థము చేసుకొని, యూదులకు మరియు ప్రవక్తలకు ఒక వంతెన అనునది కట్టాలని అనుకొన్నాడు. అదేవిధముగా ఆటను యాజకునికి మరియు మహుష్యులకు భయపడినాడు. కనుకనే క్రీస్తును పరీక్షించాలని చీకటి సమయములో వచ్చి తన గుంపులో కలవాలని అనుకొన్నాడు.

"చెప్పేవాడు" అను మాటకు, నీకొదేమను క్రీస్తులో దేవుని వాక్యమును తనను వెంబడించువార్కి చెప్పగలడు అని అనుకొన్నాడు. క్రీస్తు పాపముల కొరకు దేవుని ద్వారా పంపబడ్డాడని నమ్మినాఁడు. అందుకే, " దేవుడు మీతో ఉన్నాడని మేము నమ్ముతున్నాము. మీరు మెస్సయ్య కావచ్చు" అని చెప్పియున్నాడు.

యేసు అతని ప్రశ్నకు సమాధానము చెప్పి, నీకొదేమను హృదయము చూచి, అతని హృదయము మరియు అతని పాపములు నీటిని కోరుకుంటున్నామని చెప్పెను. ఎప్పుడైతే నీకొదేమను తన గ్రుడ్డితనము ఉన్న హృదయమును క్రీస్తు కొరకు తెరచి ఉన్నదో అప్పుడే క్రీస్తు అతనికి సహాయము చేసాడు. అయితే నీకొదేమను క్రీస్తును సంపూర్ణముగా తెలుసుకోలేదు. అయితే క్రీస్తు, " ఖచ్చితముగా ఎవడును దేవుడిని తెలుసుకోలేదు అయితే కేవలము ఆ మనిషి తిరిగి జన్మిస్తేనే".

ఈ మాటలు దైవికమైనవిగా ఉన్నవి. దేవుని జ్ఞానము మనకు ఒకరు బోధిస్తే రాదు అయితే కేవలము క్రీస్తులో తిరిగి జన్మిస్తేనే. రేడియోను లేదా టివి ని నీ ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు అయితే రూపమును చేసుకోలేవు. ఎందుకంటె బొమ్మలు రేడియోలలో రావు కనుక. కనుక ఆత్మీయమైన రూపము కేవలము పరలోక నూతన జీవితమూ ద్వారా మాత్రమే వచ్చును.

యోహాను 3:4-5
4 అందుకు నీకొదేముముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బ éమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా 5 యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

క్రీస్తు నీకొదేమను కు ఇచ్చిన సమాధానము ఆయనకు గందరగోళ పెట్టెను. ఎందుకంటె ఆటను మునుపెన్నడూ రెండవ పుట్టుకను బట్టి వినలేదు. అయితే ఆటను ఒక ముసలి వ్యక్తి తిరిగి సమాధిలోకి వెళ్లి తిరిగి జన్మిస్తాడో అని అనుకొనెను. అయితే దేవుని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మలో తిరిగి నూతన జన్మను ఇవ్వగలదని తెలియలేదు.

యేసు నీకొదేమను దేవుని రాజ్యమునకు నడిపించిన తరువాత, యేసు నీకొదేమను ప్రేమించెను; అతనే ఒక సత్యము అని చెప్పెను. కనుక మనము కూడా దేవుని రాజ్యమునకు ప్రవేశించాలంటే కేవలము రెండవ సారి జన్మించాలి.

రెండవ జన్మము అనగా ఏమి ?ఈ పుట్టుక అనునది మనిషి యొక్క జ్ఞానముచేత లేక శక్తి చేత కలుగునది కాదు అయితే దేవుడే తనకు తానూ మనకు తండ్రి అయి మనకు జీవితమును ఇచ్చుట. ఈ ఆత్మీయ జీవితము అనునది కేవలము కృప చేత వచ్చునది అయితే గుణము చేత లేదా క్రమశిక్షణ చేత వచ్చునది కాదు. ఎందుకంటె మనుషులందరూ పాపములో జన్మించి నిరీక్షణ లేక ఉన్నారు.

ఇది ఏ విధముగా వచ్చును ? యేసు నీకొదేమునకు ఇది నీళ్లద్వారా మరియు ఆత్మ ద్వారా జరుగును అని చెప్పియున్నాడు. నీళ్లు బాప్తీస్మమిచ్చు యోహానును చూపుతుంది. పాత నిబంధన వారికి నీళ్లు పాపములను కడుగుటకు అవసరమని ఎరిగిఉన్నారు. అందుకే యేసు, " ఎందుకు మీరు యోహాను దగ్గరకు వెళ్లి మీ పాపములను ఒప్పుకోలేదు?" అని. " ఎవరైనా నన్ను బెంబేదించాలని అనుకుంటే, వాడు తనను తానూ విడిచి, నా సిలువను తీసుకొని నన్ను వెంబడించాలని". కనుక సహోదరుడా నీ పాపమును ఒప్పుకొని దేవుని తీర్పు దినమునుండి తప్పించుకో.

యేసు మనుషుల పాపములను బట్టి క్షమాపణ కొరకు కేవలము నీటి బాప్తీస్మము మాత్రమే చెప్పక పరిశుద్దాత్మ ద్వారా బాప్తీస్మము తీసుకోవాలని చెప్పియున్నాడు, ఎందుకంటె పగిలిన హృదయము ఈ విధమైన జీవితమును కలిగి ఉండాలి కాబట్టి. క్రీస్తు సిలువ మరణము తరువాత మన పాపములు కేవలము క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కడగా బడుతాయి అని తెలుసుకోవాలి. ఈ కడుగుట అనునది కేవలము ఎవరైతే ఒప్పుకుంటారా వారిలోనే జరుగును. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలము మనిషి దేవునికి సమర్పణ కలిగి ఉంటాడో అప్పుడే. అప్పుడు ఆటను నిత్యజీవముతో నింపబడి, క్రీస్తు సహాయముచేత మంచివాడై దేవుని నడిపింపులో ఉంటాడు. అయితే ఈ మార్పు అప్పటికప్పుడు జరుగదు , కొద్దీ సమయము కావచ్చు. కనుక ఈ విధముగా మనిషికి రెండవ జీవితము అనునది జరిగి నిజముగా దేవుని కుమారుడుగా ఉండుటకు ధన్యత కలుగుతుంది.

క్రీస్తు దీనిని ఒక గురిగా పెట్టుకొని దేవుని రాజ్యమునకు అందరిని తీసుకురావాలని ఆశించాడు. కనుక రాజ్యము అనగా ఏమి? అయితే ఇది ఒక రాజకీయ వేదిక కాదు లేదా ధనమునకు సంబంధించినది కాదు అయితే , క్రీస్తులో నూతనముగా జన్మించి తండ్రి అయినా దేవునితో, కుమారుడైన క్రీస్తుతో మరియు పరిశుద్దాత్మునితో సహవాసము కలిగి ఉండుట. ఈ విధమైన ఆశీర్వాదము వారిపై వచ్చును, అప్పుడు క్రీస్తు జ్ఞానమును కలిగి ఉంది ప్రభువైన రాజుకు లోబడి ఉండెదరు.

ప్రార్థన: ప్రభువా నీ కృపను బట్టి నాకు ఇచ్చిన రెండవ జన్మను బట్టి నీకు కృతఙ్ఞతలు. నీవు నా ఆత్మీయ కన్నులను తెరచియున్నావు కనుక నీ ప్రేమలో ఉండగలను. ఎవరైతే నిన్ను వెతుకుతున్నారా వారి దృష్టిని కూడా తెరచి, వారు పాపులని తెలుసుకొని నీ పుండరా ఒప్పుకొని నీ ఆత్మ చేత నిమ్బాబడి నీ శాంతిని బట్టి నీ రక్తమును బట్టి నీరు సహవాసములో ఉండునట్లు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. నీకొదేమను యొక్క భక్తికి మరియు క్రీస్తు గురికి ఉన్న తేడా ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)