Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 016 (The first six disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

3. మొదటి ఆరు శిష్యులు (యోహాను 1:35-51)


యోహాను 1:35-39
35 మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా 36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచిఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను. 37 అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 38 యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబ డించుట చూచిమీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము. 39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.

క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు, మరియు జీవమును వెలుగై ఉన్నాడు. ఈ విధముగానే యోహాను క్రీస్తు గురించి వివరించియున్నాడు. అదేవిధముగా క్రీస్తు సేవను గూర్చి ఆయన కార్యములను గూర్చి వివరించియున్నాడు. అతను సృష్టికర్త మరియు అన్నిటిని కాపాడు దేవుడై ఉన్నాడు. మనకు తండ్రియైన దేవుని జ్ఞానమును యిచ్చియున్నాడు. అందుకే, " ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అని అందరికి వివరించియున్నాడు. 14 వ వచనంలో క్రీస్తు పోషకుడని వివరించియున్నాడు. అదేవిధముగా 29 , 33 లో క్రీస్తు యొక్క సేవ ఉద్దేశమును వివరించియున్నాడు.

క్రీస్తు మన పాపముల కొరకు మనకు ప్రతిగా శిక్షను మోసుకొనుటకు మరియు మనలను తీర్పునుంచి విముక్తిని చేయుటకు దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన మధ్యకు పంపియున్నాడు. దీనిని క్రీస్తు తనను అంగీకరించువారికి ఒక ఆశీర్వాదముగా చేసియున్నాడు.

"దేవుని గొర్రెపిల్ల" అని అర్థము చేసుకొనుటకు ఈ వంశమునకు చాలా కష్టము, ఎందుకంటె మన పాపముల కొరకు మను ఏ విధమైన జంతు బాలి అర్పించలేదు కనుక. ఎందుకంటె పాత నిబంధన గ్రంథ ప్రకారము ఒకని పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలంటే అతడు తన పాపమును బట్టి జంతు బలి ద్వారా వచ్చు రక్తము చేత పాపమునకు పరిహారార్థము చేసుకొనెను. అయితే దేవుడు మన పాపములను బట్టి మన రక్తము చిందించబడాలని ఉద్దేశించలేదు అయితే తన కుమారుడిని దానికి బదులుగా పంపియున్నాడు. కనుక ఆ పరిశుద్ధుడు మనకొరకు మృతిపొందెను. దేవుని కుమారుడు మన పాపముల కొరకు చంపబడ్డాడు ఎందుకంటె మనము పరలోక తండ్రికి కుమారులుగా చేయబడడానికి. కనుక మనము కుమారునితో పరిశుద్దాత్మునితో కలసి మనలను విమోచించిన దేవునికి కృతఙ్ఞత కలిగి ఉందాము.

" దేవుని గొర్రెపిల్ల" అను మాటకు ఇద్దరు శిష్యులకు అర్థము కాలేదు. అయితే యోహాను ఈ దేవుని గొర్రెపిల్లను బట్టి వివరించినప్పుడు వారు కూడా యేసు గురించి తెలుసుకొనుటకు, మరియు ఏవిధముగా అతను ఈ లోకమును తీర్పు తీర్చి తన ప్రజలకొరకు యాగమును చేస్తాడో అని చూచుటకు వేగిరపడిరి. ఈ విధమైన ఆలోచనలు క్రీస్తు కొరకు వినుటకు ఎదురుచూచిరి. యోహాను శిష్యులను తన నుంచి దూరపరచలేదు మరియు యోహాను తన శిష్యులను క్రీస్తు దగ్గరకు నడిపించలేదు, అయితే శిష్యులు ఈ క్రొత్త కార్యములను చూచిరి.

యేసు వారి ఉద్దేశములను వారి కోరికలను అర్థము చేసుకొనెను. ఎందుకంటె క్రీస్తులో వారు కృపను, ఆయన మొదటి మాట అయిన " మీరు దేనిని వెదుకుచున్నారు"? అని చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనిరి. ప్రభువు వారి మీద బరువైన మాటలను పెట్టలేదు అయితే వారి మనసులతో మాటలాడుటకు అవకాశమును ఇచ్చెను. కనుక సహోదరా నీవు దేనిని వెదుకుచున్నావు? నీ జీవిత ఆశయము ఏమిటి? నీకు క్రీస్తు కావాలా? నీవు గొర్రెపిల్లను వెంబడిస్తావా? కనుక స్కూల్ పరీక్షలకంటే గొప్ప సత్యమును తెలుసుకో .

ఇద్దరు శిష్యులు తనను వెంబడించుటకు అవకాశమును ఇమ్మని క్రీస్తును అడిగిరి. వారి హృదయములలో అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు దారిమధ్యలో వాటిని అడుగుచుండిరి. అప్పుడు యేసు, " వచ్చి చూడుము" అని చెప్పాడు కానీ " వచ్చి నాతో పాటు చదువుకో" అని చెప్పలేదు, అయితే " మీ కళ్ళను తెరచినట్లైతే నేను ఎవరో చూస్తారు, నా కార్యములు మరియు నా శక్తిని, దేవుని రూపమును " అని. ఎవరైతే క్రీస్తుకు దగ్గరగా వస్తారో వాసరికి క్రీస్తు ఈ లోక దృష్టినీ మార్చును, కనుక దేవుడు ఎవరో అని చూడగలరు. అప్పుడు అతను మన ఆలోచనగా మారి మనకు నీరీక్షణను ఇచ్చువాడుగా ఉందును. కనుక ఇద్దరు శిష్యులు వచ్చినట్లు నీవు కూడా వచ్చి క్రీస్తు ఎలాంటి వాడో తెలుసుకో, " మేము దేవుని ఏకైక కుమారుని మహిమను, కృపను, సత్యమును చూసియున్నాము".

ఈ ఇద్దరు శిష్యులు క్రీస్తుతో దినమంతా ఉండిరి. కృప యొక్క ఘడియలు ఎంతో శ్రేష్టము! ఎవరైతే తమ ఘడియలను క్రీస్తు సన్నిధిలో ఉంచుకుంటారో వారు ఆశీర్వదించబడినవారు. అప్పుడు యోహాను పరిశుద్దుడైన క్రీస్తు సత్యమును ఒక ఉదాహరణగా చేసుకొని, ప్రభువు ఎవరైతే అతని దగ్గరకు వస్తారో వారిని అంగీకరించి వారికి నీటిని మరియు వాగ్దాన మిస్సయ్యాను దయచేసియున్నాడు. క్రీస్తు యేసు యొక్క వెలుగు నీ చీకటి జీవితములో వెలిగినదా? నీవు అతనిని ఎల్లప్పుడూ వంబడిస్తావా?

ప్రార్థన: దేవుని గొర్రెపిల్ల అయిన యేసయ్య నిన్ను మేము ఘనపరచి నిన్ను కీర్తించెదము. ఈ లోక పాపములను తీసివేసి మమ్ములను దేవునితో సమాధానపరచినందుకు కృతఙ్ఞతలు. మమ్ములను తిరస్కరించక మిమ్ములను వంబడించు భాగ్యము దయచేయుము. మా ప్రతి దోషములను క్షమించుము అప్పుడు నీ మహిమ సేవను చేయుటకు నడిపించుము.

ప్రశ్న:

  1. ఇద్దరు శిష్యులు క్రీస్తును ఎందుకు వెంబడించియున్నారు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:23 AM | powered by PmWiki (pmwiki-2.3.3)