Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 017 (The first six disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

3. మొదటి ఆరు శిష్యులు (యోహాను 1:35-51)


యోహాను 1:40-42
40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్కసహోదరుడైనఅంద్రెయ. 41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి 42 యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

ఆండ్రూ మరియు పేతురు బియాత్ సైదా దగ్గర చేపలు పెట్టె జాలరులుగా ఉండిరి. వారు యోహాను దగ్గరకు వారి పాపముల ప్రయ్సచ్చిత్తము కొరకు వచ్చినప్పుడు, మెస్సయ్య కొరకు ఎదురుచూసారు. అయితే ఆండ్రూ యోహాను సఖ్యమును విని అంగీకరించి యేస్ను వెంబడించాడు. అప్పుడు తన హృదయము ఆనందముతో ఉప్పొంగి, తన సహోదరునికి కూడా మొదటగా ఈ భాగ్యమును చూపాలని అనుకొన్నాడు. కనుక ఆండ్రూ తన సహోదరునితో ఈ విధముగా ఆనుతున్నాడు, " మేము వాగ్దాన క్రీస్తును మరియు రక్షకుడైన దేవుని గొర్రెపిల్లను కనుగొన్నము" . పేతురును ఒకవేళ అనుమానము ఉండవచ్చు అయితే ఆండ్రూ వాటిని పట్టించుకోలేదు. అయితే పేతురు కూడా క్రీస్తును వంబడించాడు. అందుకే క్రీస్తు పేతురును "బాండ" అని వేరె పేరు పెట్టియున్నాడు. ఎందుకంటె క్రీస్తుకు పేతురు యొక్క భూత, వర్తమాన మరియు భవిష్యత్ గురించి తెలుసు. క్రీస్తుకు తన కొరకు తెరచిన హృదయములు తెలుసు. అందుకే పేతురు క్రీస్తు సన్నిధిలో ఉన్నాడు. కనుకనే ఒక చేపలు పట్టు జాలారిని మనుష్యులను పట్టు వానిగా చేసియున్నాడు. అందుకే పేతురు క్రీస్తు సంఘమునకు ఒక పునాదిగా మారిపోయాడు. ఈ విశ్వాసులు సెల్ఫీష్గా లేక వారి సహోదరులను కూడా నడిపించియున్నారు.

మనకు శుభవార్త అయిన కృపను ఏవిధముగా తెలియపరచాలో తెలుసు, క్రీస్తు కొరకు ఆనందముతో ఈ కార్యమును చేయగలము. పురాతన శిష్యులు బైబిల్ పాఠశాలలకు వెళ్ళలేదు ఎందుకంటె వారికి ఇలాంటివి లేవు కాబట్టి, అయితే క్రీస్తు సువార్తను వారి నోటినుంచి వివరించియున్నారు. ఎలాగంటే దేవుడు వారిని తాకినట్లు మరియు వారి స్వరములను వినినట్లు ఆయన మీద నమ్మకముంచియున్నారు. ఇది వారి విశ్వాస అధికారమును తెలియపరుస్తున్నది. నీవు యేసును ఆయన సువార్త వాక్యంలో కలుసుకున్నావా? నీ స్నేహితులను అతని దగ్గరకు నడిపించావా?

ప్రార్థన: మా హృదయమందు ఉన్న ఆనందముకొరకై నీకు కృతఙ్ఞతలు. నీ తీపికరమైన సహవాసములోనికి మమ్ములను పంపు, మరియు వేరే ఇతరులను కూడా నడిపించునట్లు కూడా ప్రేరేపించు. మాకు ఉన్న సిగ్గును బిడియమును తీసి వేరే వారికి నిన్ను గూర్చి చెప్పే ధైర్యము ఇమ్ము.

ప్రశ్న:

  1. మొదటి క్రీస్తు శిష్యులు ఏ విధముగా క్రీస్తును పరిచయము చేశారు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:25 AM | powered by PmWiki (pmwiki-2.3.3)