Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 007 (The Baptist prepares the way of Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

2. బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరచుట (యోహాను 1:6-13)


యోహాను 1:11-13
11 ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచువారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13 వారు దేవుని వలన పుట్టినవారే గానీ, రక్తమువలననైనను శరీరేచ్చవలననానినను మానుషేచ్ఛవలనైనను పుట్టినవారు కారు.

పాత నిబంధన కాలపు ప్రజలు దేవునికి సంబందించినవారుగా ఉన్నారు ఎందుకంటె వారు నీమందన ద్వారా వారి పాపములు తీసివేయబడ్డాయి కనుక. కొన్ని వందల సంవత్సరములనుండి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారి హృదయములను దేవుని ధర్మశాస్త్రమునకు లోబడునట్లుగా సువార్తలకు కూడా లోబడిఉన్నట్లు గా చేసియున్నాడు. ఈ విధముగా అబ్రాహాము యొక్క సంతానము క్రీస్తు రాకడ కొరకు నడిపించబడినారు. కనుక క్రీస్తు తనను తానూ కనపరచుకొనుట పాత నిబంధన గ్రంధము యొక్క గురి అయి ఉన్నది.

కనుక ఎవరైతే క్రీస్తును స్వాగతించాలి వారే ఆయనను తిరస్కరించి తన వెలుగును పొందలేకపోయారు. చీకటిలోనే ఉండి దేవుని తీర్పునకు దగ్గరగా ఉన్నవారుగా ఉండిరి. కనుక వారు కృపను పూర్తిగా పోగొట్టుకొని వారి సొంత పనులను దేవుని రక్షణకంటే ఎక్కువగా ప్రేమించిరి. వారు పచ్చాత్తాపం పడక వారి హృదయములను కఠినపరచుకున్నారు.

కేవలము పాతనిబంధన గ్రంథమందు వారుమాత్రమే దేవుని హక్కుదారులు కాదు అయితే దేవుడు సృష్టించిన ప్రతి విధమైన సృష్టికూడా ఆయన హక్కు దారులుగా ఉన్నారు కనుక సమస్త మానవులు కూడా ఆయన హక్కుదారులుగా ఉన్నారు. కనుక మన హృదయ యజమానుడు మన హృదయములోనికి రావాలని ఇష్టపడుతున్నాడు కనుక ఎవరు ఆయనను ఆహ్వానిస్తారు ? నీవు దేవునికికి చెందిన వాడవు మరి నీవు ఆయన వాడుకొనునట్లుగా ఉన్నావా ? ఈ దినాలలో చాలా మంది క్రీస్తు వెలుగు కొరకు వారి హృదయములను తెరచక ఉన్నారు. కనుకనే వారు చీకటిని జయించక ఉన్నారు.

ఎవరైతే అబ్రాహాము కుమారులు గా పిలువబడతారో వారు తమ హృదయములను క్రీస్తు కొరకు తెరచి క్రీస్తు యొక్క గొప్ప అద్భుతములను అనుభవించుదురు. కనుక ఎవరైతే ఆయన హృదయమందు హత్తుకుంటారో వారు చీకటిని జయించి పరలోక వెలుగు చేత వెలిగింపబడెదరు. అలాగే దేవుని శక్తిచేత వారి హృదయాలను నింపును. క్రీస్తు నీ బానిస పాపమునుంచి విముక్తిని కలిగించి నిన్ను తన కుమారునిగా స్వతంత్రపరచును. నీవు క్రీస్తును ప్రేమిస్తున్నట్లైతే పరిశుద్దాత్మ నీలో ఉండి నీకు రక్షణ జీవితమును ఇచ్చును.

అందుకే యోహాను మనలను క్రీస్తు పిల్లలం అవుతాము అనక మనం క్రీస్తు పిల్లలమే అని తెలియపరచెను. ఎందుకంటె మనం ఆత్మీయతలో కూడా వృద్ధి పొందినవారిగా ఉన్నాము కనుక. కనుక ఎవరైతే క్రీస్తు ఆత్మీయతలో ఉంటారో వారు ఆత్మీయముగా వృద్ధి పొందువారుగా ఉంటారు, దేవుని శక్తి మనలను నూతన సృష్టిగా చేసి తన శక్తిచేత నింపి మనలను బలపరచెను.

దేవుడు మనలను తన పిల్లలుగా దత్తతకు తీసుకోలేదు కానీ ఆత్మీయమైన పుట్టుకలో తన పిల్లలుగా చేసికొనియున్నాడు. ఆత్మీయతలో అనగా క్రీస్తు మన హృదయములను తన అధికారముతో నింపెను అని అర్థము. ఎందుకంటె క్రీస్తు మాత్రమే విశ్వాసమునకు కారకుడు మరియు అధిపతిగా ఉన్నాడు కనుక. అయితే ఈ లోక పిల్లలతో దేవుని పిల్లలకు పోలిక అనునది ఉండదు. ఎందుకంటె మనము ఇద్దరు తల్లితండ్రుల చేత జన్మించబడియున్నాము, ఎందుకంటె వారు దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్యమునకు లోబడి ఉన్నారు కాబట్టి. అయితే మనకు కలిగిన ఆత్మీయ జన్మమునకు మనకు ఏ విధమైన లోక తల్లి కానీ తండ్రి కానీ లేరు. అయితే ఆత్మీయత అనునది పరిశుద్దాత్మునిచేత పొందినదిగా ఉండి ప్రతి క్రైస్తవుడు దేవుని నడిపింపుతో ఉన్నాడు ఎందుకంటె ఆయనే మన సత్యమైన నిజమైన ఆత్మీయ తండ్రి కాబట్టి.

ఏ శిశువు కూడా తనకు తాను జన్మను ఇవాలేదు. ఎందుకంటె అది జన్మించడము కాబట్టి అదేవిధముగా ఆత్మీయ జన్మము కూడా కృపచేత కలిగినదే. కనుక ఎవరైతే ఈ విత్తనములు ప్రేమించి ఒప్పుకుంటారా వారు వాటిని దాచిపెట్టుకుంటారు. అప్పుడు దేవుని నిత్యజీవము అతనిలో ఉండి, అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.

మనము ఒకవేళ క్రైస్తవ కుటుంబములో జన్మించి ఉండి లేక క్రైస్తవ సహోదరులతో సహవాసము కలిగి ఉన్నట్లయితే మనము దేవుని పిల్లలం అనుకుంటే పొరపాటే అయితే క్రీస్తు యేసు నామములో విశ్వాసముచేతనే మనము దేవుని పిల్లలగుటకు అవకాశము ఉన్నది. విశ్వాసము అనగా క్రీస్తుకు డాగారగా ఉండి, ఆయనలో ఉండి, ఆయన విలువలు కలిగివుండి, ఆయననను అర్థము చేసుకొని ఆయన మీద ఆధారపడి ఉండి, ఆయనలో అభివృద్ధి చెందడమే. ఇది కేవలము మనలను మనము ఆయనకు సమర్పించుకొని ఆయన హస్తాలలో ఉండి, ఆయన మాత్రమే మనలను కాపాడువాడు అని మరియు ఆయన పోలికలోనికి మార్చబడగలము అని అనుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. విశ్వాసము అనునది మనకు మరియు క్రీస్తుకు మధ్యన ఉన్న ఒక నిబంధన లాంటిది.ఆత్మీయ జన్మము అనునది కేవలము విశ్వాసముతో మాత్రమే కలిగినదిగా మరియు క్రొత్త జన్మ అనునది విశ్వాసము కంటే గొప్పది కాదు. యోహాను యేసు క్రీస్తు పేరును తన సువార్తలో ప్రారంభములో జ్ఞాపకము చేసుకోలేదు, అయితే తనకు తానూ తన విశ్వాసులకు కనపరచుకొన్నాడు. నీవు క్రీస్తుకు సంబంధించిన ఆరు గుణములను సంఘము కొరకు పెట్టియున్నాడని అరథము చేసికొన్నావా ? నీ హృదయమును వీటికొరకు తెరచియుంచావా ? అయితే నీవు ఖచ్చితముగా దేవుని బిడ్డవు అవుతావు !

ప్రార్థన: ఓ క్రీస్తు యేసు ప్రభువా, నేను నా పూర్ణమనస్సుతో నీముందర నా శిరస్సు వంచి, నీవు నా ప్రతి పాపమును మరియు నా దోషమును కడిగి నీ పరిశుద్ధాత్మచేత నా హృదయమును నింపుము. ఓ ప్రభువా నీ కొరకు నా హృదయము తెరచియున్నాను.

ప్రశ్న:

  1. క్రీస్తును అంగీకరించినవారికి ఏమి జరుగుతుంది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:13 AM | powered by PmWiki (pmwiki-2.3.3)