Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 079 (The Continuation of Paul’s List of the Saints)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

5. రోమా సంఘములో పౌలు పరిశుద్దులను బట్టి చెప్పుట (రోమీయులకు 16:10-16)


రోమీయులకు 16:10-16
10 క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు. 11 నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. 12 ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను. 13 ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వంద నములు; ఆమె నాకును తల్లి. 14 అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు. 15 పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు. 16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. 

పౌలు తనకు తెలిసిన పేర్లను రోమా సంఘములో ఉన్నవారికి అనగా అతని బోధనలను మరియు అతని అనుభవమును తెలిసినవారికి తెలియపరచెను. అక్కడున్న సంఘ పెద్దలకు ఈ పత్రికద్వారా అతను వేరే వాడు కాదని చెప్పెను, అయితే రోమా సంఘములో పనిచేయువారు అతనిని అంగీకరించిరి.

అపెల్లెస్ గ్రీకు లో ఉన్న గొప్ప చిత్రకారుడిని, అతను రోమా సంఘములో చాల అనుభవము కలిగిన సభ్యుడు, అతను శ్రమలయందును మరియు సమస్యలయందును కూడా క్రీస్తుకు చాల నమ్మకమైనవాడు. అరిస్టొబుల్స్ యొక్క ఇంటివారు బానిసత్వమునుంచి విడుదలపొందారు, అయితే పౌలు వారిని సహోదరులు అని పిలిచాడు, ఎందుకంటె క్రీస్తులో విశ్వాసమును బట్టి దేవుని కుమారుడు మరియు సర్వశక్తుడైన వారు వారిని దత్తత తీసుకొని వారిని పునరుద్ధరించారు.

హీరోడిన్ అనువాడు నిజమునకు యూదా క్రైస్తవుడు, అతను మోషే ధర్మశాస్త్రమును అనుసరించి అదేసమయములో క్రీస్తును కూడా వెంబడించాడు. గోత్రము ప్రకారముగా అతను పౌలుకు బంధువు.

ణర్చిస్సుస్ ఇంటిని బట్టి, వారి పేర్లు పౌలుకు తెలియదు, అయితే వారు నమ్మకమైన క్రైస్తవులైనారు, వారు క్రీస్తు ఆస్తిగా ఉంది ఆత్మీయ అనుభవములను ఒప్పుకొనిరి. టైపేనా మరియు టైఫాసో అను ఇద్దరు సహోదరులు ప్రభువుకు మంచి సేవకులై ఉండిరి. పెర్సిస్ ప్రభువుకు మూడవ సేవకుడై ఉండెను, అతనిని పౌలు ప్రియమైనవాడుగా పిలిచెను, ఎందుకంటె ఆమె విశ్వసించడము మాత్రమే కాదు అయితే దాని ప్రకారముగా జీవించెను క్రీస్తు కొరకు.

"క్రీస్తులో ఏర్పాటు" అని పౌలు ఈ పేరును ప్రసాదించాడు, దాని అర్థము అతను సీమోను కుమారుడని, అతను యేసు సిలువను భరించాడు (మార్క్). అతని భార్య మరియు తల్లి కూడా పౌలుకు పరిచర్య చేశారు. పౌలు కూడా ఈ తల్లి తన కుమారునికి మంచి తల్లి అని పౌలు కూడా చెప్పియున్నాడు.

పౌలు రెండు గుంపులు కలిగిన విశ్వాసులకు కూడా శుభములు చెప్పి యున్నాడు, మరియు వారిరువురికి కూడా పేరుపెట్టి పిలిచాడు, ఎందుకంటె వారి జ్ఞానము కూడా సంఘములో అవసరము అని పౌలు అనుకొన్నాడు. మరియు అసైన్క్రిట్స్, ఫ్లేగొం, హెర్మన్, పాట్రోబ్స్, హీర్మేస్ వీరినందరినీ పౌలు యేసు ప్రభువులో సహోదరులని పిలిచియున్నాడు. రెండవ గుంపు: ఫిలొలొగుస్ మరియు జూలియా, నేర్స్ మరియు అతని సహోదరి, మరియు ఒలింపస్, మరియు అతనితో ఉన్న పరిశుద్ధులందరు; వారందరు కూడా గృహ సంఘములో సభ్యులుగా ఉన్నారు. వారందరు కూడా పరిశుద్దాత్మ కాపుదలలో ఉండిరి, కనుక పరిశుద్దాత్మ ఫలములు వారిలో కనపడెను,కనుకనే వారిని పరిశుద్దులని పిలిచిరి. సిలువవేయబడిన వానిని వారు అనుభవించి, అతని ద్వారా పరిశుద్దాత్మ వరములను పొందుకుంటున్నారు.

పౌలు రోమా లో ఉండు పరిశుద్ధుల గురించి చెప్పడము ముగించి, వారిని ఒకరికొకరు పరిశుద్ధ ముద్దు పెట్టుకొమ్మని, అనగా క్రీస్తులో సహోదర సంబంధము కలిగి ఉన్నట్లుగా, పరిశుద్ధము కలిగి అంతీయముగా ఉండుమని చెప్పెను. అయితే పౌలు రోమా లో ఉండు ప్రతి సంఘమునకు కూడా శుభములు అని చెప్పెను.

ఎవరైతే ఈ జాబితాను 25 పేర్లు గల వాటిని శ్రద్దగా చూసినట్లయితే, ఆ దినాలలో పెద్ద సంఘములు లేవని అర్థము చేసుకొనవచ్చు, అయితే గృహాలలో కూడుకొను సంఘ సభ్యులు గల వారిని పౌలు పరిశుద్దాత్మ మందిరాలని చెప్పేను. వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చు సార్వత్రిక సంఘముగా ఏర్పడి రకరకాల భాషలలో ఆరాధన చేసిరి. అయితే వారందరూ కూడా ఒకే భాషతో క్రీస్తును మరియు అతని రక్తమును అందరికి వివరించిరి. అయితే వారిలో కొంతమంది నీరో చక్రవర్తి సమయములో చంపబడిఉన్నారు. అతను క్రైస్తవులను పట్టుకొని మరియు వారిని ఉరివేసి ఉన్నాడు, మరియు వారి శరీరములను మండే స్థితిలోకి వేసాడు.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, రోమా లో ఉన్న సంఘములను నీవు ఐక్యపరచినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు పరిశుద్దాత్మ సహాయముతో రకరకాల భాషలు మాట్లాడుతున్నారు; మరియు సంఘము ఎప్పుడైతే వారిలో నూతన జీవితముగా స్థాపించబడినదో అప్పుడు అది నూతన సృష్టిగా మార్చబడినది. అయితే ఎవరైతే తండ్రిని కుమారుడిని మరియు పరిశుద్ధాత్మను అంగీకరించారో వారిని దేవుడు బలపరచి ఉన్నాడు.

ప్రశ్నలు:

  1. జాబితాలో వ్రాయబడిన పరిశుద్దాల నుంచి మనము ఏమి నేర్చుకోగలము?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:45 AM | powered by PmWiki (pmwiki-2.3.3)