Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 039 (Man without Christ always Fails before Sin)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

5. దేవుడు లేకుండా మనిషి పాపములో ఎప్పుడు ఓడిపోవును (రోమీయులకు 7:14-25)


రోమీయులకు 7:14-25
14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. 15 ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 16 ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 17 కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. 18 నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. 19 నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 20 నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. 21 కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 22 అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని 23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. 24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? 25 మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.

పౌలు అన్నట్లు సామాన్యమైన మనిషి క్రీస్తు లేకుండా ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించునని. అతను జ్ఞానుల ఊహల ప్రకారముగా దీనిని చదివి కనుగొనలేదు, అయితే ఆ సామాన్యమైన మనిషి తన పచ్చాత్తాపముచేత వ్యక్తిగతముగా మార్చబడును. మరియు పరిశుద్దాత్మ తన మనసులోకి వచ్చి ప్రతి చిన్న కార్యము ఏదైతే దేవునికి బ్యతిరేకముగా ఉన్నదో వాటిని ఒక మరణకరమైన కార్యముగా ఎంచెను.

నేను ఎప్పుడు నా గురించి ఆలోచనకలిగినట్లైతే "నేను ఐహిక సంబంధమైనవాడిని" అని పౌలు చెప్పెను. అవును ప్రతి మనిషి అదేవిధముగా ఉన్నాడు ఎందుకంటె దేవుని రూపమును అతని జీవితములో పోగొట్టుకున్నాడు కనుక. ఏ బేధము లేదు అందరు పాపము చేసి దేవుని అనుగ్రహము పొందలేక ఉన్నారు. వారు చెడి మరియు వారి మనసునందు శిక్షించబడి వారిని వారు ఘనపరచుకొన్నారు. పరిశుద్ధులు దేవుని అంశములను వింటారు కనుక దేవుని యొక్క నిరీక్షణకు వారు కోల్పోతారు: "నేను పరిశుద్ధుడను, కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉంటారు", లేదా వారు యేసు ఆజ్ఞను బట్టి పగిలిన వారుగా ఉంటారు. "నీ పరలోకమందున్న తండ్రి సంపూర్ణమైనట్లు నీవు కూడా సంపూర్ణమై ఉంటావు" అయితే సామాన్య మనిషి వాని సొంత శక్తి చేత దేవుని చిత్తమును నెరవేర్చలేదు.

దానికి బదులుగా ప్రతి మనిషి మంచి చేయుటకు ఇష్టపడుతుంటారు, మరియు పరిశుద్ధముగా జీవించాలని అనుకుంటాడు. చిన్న రకములో ఉన్నవారు కూడా ఈ విధముగా ఉండాలని కోరుకుంటారు. కనుక మనము పాపముల కొరకు మాట్లాడక, దాని శక్తిని బట్టి ఇతరులను బట్టి మాట్లాడకూడదు, అయితే దేవుని ధర్మశాస్త్రములు జ్ఞాపకముచేసుకోవాలి, ఎందుకంటె ఏ మనిషి కూడా మంచిగా ఉండక చేదుగా ఉండాలని అనుకోడు. ఎవరైతే విఫలములను బట్టి ఎదురుచూస్తున్నట్లైతే అతను మంచి చేయునట్లు ఖచ్చితముగా తప్పును బట్టి ఒప్పుకోవాలి. ఇదే మనిషి యొక్క భావము. తనకు తానే శత్రువు. అతను మంచిని ఖండించి అతని స్వరమును అధిగమించును.

మనము పరిశుద్ధముగా జీవించి దేవుని ప్రేమలో ఎందుకు నిత్యమూ ఉండలేము? ఎందుకంటె దేవుడు లేకుండా మనిషి పాపములో ఉండును. ఎవరైతే పాపము చేస్తారో వారు పాపమునకు దాసుడు. క్రీస్తు శిష్యులలో కూడా చేదు చేసియువారు ఉండిరి. మన శరీరములో దేవుని చిత్తమును తీసుకొని వెళ్ళుటకు శక్తి లేదు. పౌలు కూడా " నాలో ఏ మంచి తనము లేదు, మంచిది నేను చేయవలసినది చేయలేదు; అయితే చేదు నేను చేయకూడదు, దానిని నేను నేర్చుకున్నాను." నీవు కూడా పౌలుతో ఈ సత్యమును ఒప్పుకొంటావా? నీ స్వలాభం స్వభావమును నిత్య న్యాయమైన కృపకు సమర్పించుకుంటావా?

పౌలు ఎవరైతే పాపపు ధర్మశాస్త్ర ప్రకారముగా ఉన్నారో వారిని పాపమునకు దాసుడని పిలిచాడు. మనము ధర్మశాస్త్రములో బంధించబడినాము కనుక అది మనకు నొప్పిని కలుగు చేసినది. ఎందుకంటె మన మనసులలో మనము చేసే ఉద్యోగములు తెలుసు అయితే మనము వాటిని చేయము. మనమందరము మన స్వలాభములో బందీలమే. అయితే క్రీస్తు మనలను దేవునితో సంపూర్ణమైనవారినిగా చేసి ఉన్నాడు. నీవు ప్రతి మనిషిలో మనోవైకల్యమును ఒప్పుకొంటావా? అతను మంచి కార్యము చేయాలనుకుంటాడు అయితే తనకు తానుగా చేయలేకపోతున్నాడు.

నీకు సహాయము లేదా? పౌలు మనలను చివరి లోతువరకు నడిపిస్తున్నాడు, అనగా రక్షణ అనునది నీ నీతిని బట్టి, నీ సామర్థ్యమును బట్టి లేదా ధర్మశాస్త్రమును బట్టి వచ్చినది కాదు. అపొస్తలుల సాక్ష్యము నిన్ను సర్వ విశ్వాసములోనికి నడిపించినదా, మరియు నిన్ను అందరివలె అపనమ్మకములోనికి నడిపించినదా? ఒకవేళ చదివినవారికి పరిశుద్దాత్మ అవసరమై ఉన్నదంటే వారు అబద్ధికులు మరియు తెలివిలేని వారని అర్థము. ఎందుకంటె వారు వారి హద్దులు తెలియవు.

ఇతరుల వాలే మేము మా జీవితములో ఓటమి చెందకుండా ఉండుటకు నీ కుమారుడైన యేసును మా కొరకు పంపి మాకు విజయమును చేకూర్చినందుకు నీకు కృతజ్ఞతలు. అతను మాకు సత్యమును మరియు నూతన శక్తికి యిచ్చియున్నాడు. అతని పరిశుద్దాత్మ మాకు జీవితమునిచ్చి మమ్ములను ఓదార్చినది, మరియు పరిశుద్ధ రక్షకుని మీద ఒక నిరీక్షణకు మాకు దయచేసి ఉన్నది.

ప్రార్థన: పరిశుద్దుడైన తండ్రి మేము నిన్ను మా హృదయములతో మహిమ పరచి ఆరాధించెదము, ఎందుకంటే నీవు మమ్ములను విడువక, నీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపి, అతను మమ్ములను రక్షించింది అందరు జ్ఞాపకము చేసుకొనులాగున మరియు అతని నీతిని మాకు దయచేసి ఉన్నావు. మా పాపములను మేము తెరచినట్లు నీవు మా మనసులను తెరువుము, మరియు ఈ లోకములో ఉండు విశ్వాసులలో మమ్ములను కూడా ఉంచుము.

ప్రశ్నలు:

  1. పౌలు తనకు తాను ఏవిధముగా ఒప్పుకున్నాడు, మరియు దాని అర్థం ఏమిటి?

నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును.
మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. 
 నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
(రోమా 7:18-19)

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 11:05 AM | powered by PmWiki (pmwiki-2.3.3)