Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 019 (Peter’s Sermon in the Temple)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

10. దేవాలయములో పేతురు ఉపన్యాసం (అపొస్తలుల 3:11-26)


అపొస్తలుల 3:11-26
11 వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. 12 పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెనుఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? 13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చే¸ 14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి. 15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. 16 ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను. 

ఎప్పుడైతే అక్కడున్న గుంపు ఆ నాయకునితో శక్తి ఉన్నాడని అనుకొనిరో, అతని యొద్దకు పరిగెత్తి వెళ్లిరి, ఎందుకంటె అతని నుంచి శక్తిని పొందుకొనుటకు. అయితే చింతించే విషయము ఏమిటంటే అనేక మంది నాయకులు వారిని బెంబడించువారికి దేవుని శక్తిని ఇవ్వలేదు. బదులుగా వారు తమ సొంత శక్తిని వారిమీదికి రుద్దిరి. బంగారము మరియు వెండిని ఇచ్చెదమని వారిని వెంబడించువారికి వాగ్దానము చేసిరి అయితే దానిని వారు నెరవేర్చలేదు.

యూదులలో సత్యము లేదా దేవుని శక్తి కార్యము చేయూతను బట్టి వారి ప్రవర్తనను బట్టి పేతురు ఆశ్చర్యపోయాడు. అయితే మొదటగా వారు వ్యక్తిని ఘనపరచుటను బట్టి వారికి నేర్పేను. ఎందుకంటె వారు దేవుని వరముల మీద తప్ప మనిషి మీద ఆధారపడి జీవించకూడదు. అందుకే ప్రభువు చెప్పినట్లు: "మనుషులను నమ్ముకొనువాడు శాపగ్రస్తుడు" అని. కనుక పేతురు వారికి మనిషి కేశక్తి కానీ లేదా మతసంబంధమైన పద్ధతులు కానీ పాపమును తీసివేయలేవు అని చెప్పెను.

అపొస్తలుడు వారితో కేవలము ఒక పరిశుద్ధమైన మనిషి మాత్రమే ఈ చెదిరిన లోకమునకు శక్తిని మరియు నిరీక్షణకు ఇవ్వగలడని చెప్పెను. ఆ మనిషే నజరేయుడైన యేసు. పేతురు అతనిని క్రీస్తు అని పిలువలేదు అయితే "దేవుని సేవకుడు" అని చెప్పెను. అదేసమయములో దీని అర్థము తండ్రికి క్రీస్తు సమర్పించుటను కూడా చూపెను, ఎందుకంటె అతను ఆ విధముగా సమర్పించుకొని ఉన్నాడు కనుక మనము క్రీస్తులో ఎప్పుడు విజయమును చూడగలుగుతున్నాము. దేవుని కుమారుడు తనకు తాను ఒక శక్తిగా చెప్పుకొనక, మనిషి వాలే తనను తాను తగ్గించుకొని మరణము వరకు తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకొనెను. కనుకనే దేవుడు కూడా అతనిని అందరికంటే ఎక్కువగా హెచ్చించి అతని నామమును గొప్పచేసెను (ఫిలిప్ 2:7-9). కనుక దేవుడు తన సేవకుడైన యేసు లో మహిమపరచబడి, మరియు పరిశుద్ధాత్మలో కార్యము చేసెనని చెప్పుటకు అధికారము కలిగెను.

పేతురు వేరే ఇతర దేవుళ్ళ నామములో మాట్లాడలేదు, అయితే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని నామములో మాట్లాడేను. తనను తాను పిత్రుస్వాములకు చూపెను, వారిని అతనే ఎన్నుకొన్నారు కనుక. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును మృతినుంచి తిరిగి లేపాడు. ఈ విధమైన విషయము అపొస్తలుల ప్రసంఘములలో కూడా ఉపయోగకరంగా ఉండెను. సిలువవేయబడిన యేసు సమాధిలో ఉండక, నిత్యమూ లేచిన వానిగా ఉన్నాడు. దీనికి అపొస్తలులు చూసి అతని స్వరమును విన్నారు కనుక వారే దీనికి సాక్షులు. అతని పునరుత్తనమును బట్టి మరియు అతని మహిమకలిగిన శరీరమును బట్టి వారు సాక్షులై ఉండిరి.

దేవుని కృపను బట్టి మరియు అతని విజయమును బట్టి పరిశుద్దటందుడు తృప్తిచెందలేదు. ఎందుకంటె దేవుని ఆత్మ పరిశుద్ధమై ఉన్నది కనుక అతను ఎప్పుడు మనిషి అంతరంగమందు పాపమును బట్టి ఎప్పుడు దాడి చేస్తున్నది. రోమా ప్రభుత్వము యేసులో ఏవిధమైన దోషము చూడకున్నప్పటికీ యూదులు పైశుద్ధుడిని అంగీకరించలేదు, అయితే అతనిని ఖండించి అతనిని తిరస్కరించారు. అయితే అన్యుజనుల అధిపతి అతనిని పట్టుబట్టి సిలువవేశారని చెప్పను. వారు అంటొనియా కు దూరముగా మాట్లాడలేదని యూదులలో పరిపాలించువారు చెప్పిరి. మరియు భవనములు కూడా అతనిని వ్యతిరేకముగా కట్టబడెను. కనుక మనుషులను పట్టు జాలరునిగా పిలువబడిన పేతురు ప్రసంగించుట కొనసాగించెను.హంతకుల మొహాలనుంచి అబద్దపు దేవుళ్లను అతను తీసివేసెను. వారు దేవుని గొర్రెపిల్లను తిరస్కరించి హంతకుడైన బరబ్బను ఎన్నుకొనువారినిగా అతను వారికి ఒక ముద్రవేసెను. దీని ద్వారా వారు సాతానుడిని ఎన్నుకొన్నట్లుగా కనపడెను.

పరిశుద్ధాత్ముడు, పరిశుద్దాత్ముని ద్వారా జన్మించబడిన యేసును పిలువుమని చెప్పెను, "పైశుద్దుడు", అతను ఈ లోక పాపములను మోసుకొనువాడు. ఈయనే దేవుని స్వరూపము, మరియు పాపములేని వాడు మరియు మరణం లేనివాడు. అయినప్పటికీ అసాధ్యమైనది క్రీస్తు మరణముద్వారా జరిగినది: జీవమునకు రాజైన వాడు మరణించాడు. కనుక దీనిని వివరించుటకు పేతురు"క్రీస్తు", లేక "దేవుని కుమారుడు", అని వాడలేదు, అయితే "యేసు" నామముగా పిలిచెను.

పేతురు తన మాటలను హంతకులకు చెప్పుట కొనసాగిస్తూ ఈ విధముగా చెప్పెను: "నజరేయుడైన యేసును దేవుడు ప్రేమించెను, అయితే మీరు దేవుని ఆత్మను తిరస్కరించి అతని అద్వితీయ కుమారుడైన పరిశుద్ధుడిని చంపిరి. మీరు హంతకులు, మరియు దేవుని శత్రువులు. మీరు ఆశీర్వాదములను పొందుటకు దేవాలయములోనికి ప్రార్థించుటకు వచ్చిరి, అయితే దేవుడు మీ ప్రార్తనకు సమాధానాలు ఇవ్వలేదు, ఎందుకంటె మీరు దేవుని నీతికలిగిన సేవకుడైన యేసును చంపిరి కనుక.

దానికి కొనసాగింపుగా, విద్యలేని వాడు దేవుని హస్తము దేశములను మోషేకు కానీ, ఏలీయాకు కనానీ లేదా బాప్తీస్మమిచ్చు యోహానును కానీ ఇవ్వక యూదుల ద్వారా తిరస్కరించబడి చివరకు సిలువ వేయబడిన క్రీస్తుకు ఇచ్చెను. క్రీస్తు పునరుత్తనము అనునది దేవుని యొక్క చిత్తమునకు ఒక ఉదాహరణగా మరియు అతని పరిశుద్దతను చూపునాదిగా ఉండెను. కనుక ప్రభువైన యేసు జీవించువాడు కనుక మన మధ్యన నివాసము చేస్తున్నాడు. పేతురు చెప్పినట్లు అందరి వలె యేసు సమాధిలో ఉండలేదు అయితే సమాధిని గెలిచి మృతిని జయించాడు. కనుక ఇప్పుడు అతను తండ్రి అయిన దేవుని మహిమలో నివాసము కలిగి ఉన్నాడు.

పేతురు యూదులకు వివరించుటకు ఒక స్వస్థత కలిగిన మనిషిని వారి ఎదుట నిలువబెట్టడు, అతనిని వారు ఎప్పటినుంచో చూసారు. కనుక అతని శక్తి కలిగిన ఎముకలు మరియు కండరములు పేతురు చెప్పునట్లు పునరుత్తానుడైన యేసుకు ఇది ఒక ఉదాహరణగా ఉన్నది.

స్వస్థత అనునది కేవలము కృప ద్వారానే వచ్చునని, పేతురు వారికి చెప్పెను. మరియు మనిషి యొక్క విశ్వాసము క్రీస్తు మీద ఉన్నట్లయితే దాని ద్వారా కూడా కృప అనునది వచ్చును. యేసు మీద విశ్వాసము అనునది అతని సన్నిధికి ఒక సూచనగా మరియు అతని రక్షణకు సూచనగా ఉన్నది. యేసు అను నామములో గొప్ప శక్తి ఉన్నది. కనుక ఈ లోకములో మనకు ఎక్కడ కూడ శక్తి లేదు అయితే కేవలము క్రీస్తు యేసు నామములో మాత్రమే ఉన్నది. కనుక పరిశుద్ధాత్ముడు ఈ నామములో మాత్రమే స్వస్థపరచి, రక్షించి, మరియు పరిశుద్ధపరచును. కనుక సాతానుడు వెయ్యిసార్లు ఈ నామమును చెడగొట్టాలను చూసినా కూడా ఏమి చేయలేడు. కనుక ప్రియసహోదరుడా నీవు ఇప్పుడు సత్యమును వింటున్నావని గ్రహించుకో. నజరేయుడైన యేసు నామములో దేవుని సంపూర్ణత ఉన్నది. కనుక ఎవరైతే అతనికి సమర్పించుకుంటారో వారు అతని శక్తిని అనుభవించేందరు. దేవుని యొక్క నిత్యమైన ష్కతి మన బలహీనతలలో బలముగా ఉండును.

నిజమైన విశ్వాసము అనునది రహస్యమందు ధైర్యము కలిగి ఉండును, మరియు ఇది యేసు నామములో సంపూర్ణ నమ్మకము కలిగి ఉండును.రక్షకుడిని చూస్తూ అతని విశ్వాసము వృద్ధి పొందును. కనుక యేసు నీ భాగాలుగాలేని విశ్వాసము కొరకు ఎదురుచూస్తున్నాడు, మరియు నీవు సిలువవేయబడిన వాని యందు నిలకడకలిగి ఉండుట, మరియు నీవు అతని శక్తి కలిగిన పునరుత్తానమందు ఉన్నట్లుగా ఎదురుచూస్తున్నది. కనుక నీ ప్రాణము, ఆత్మ మరియు జీవితము పరిశుద్ధపరచబడాలంటే అతని యెద్దకు రావాలి. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను.

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీ నామమును మాకు బయలు చేసినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు నీవే నిజమైన దేవుడని చూపినందుకు కూడా నీకు కృతజ్ఞతలు. నీలోనే సర్వశక్తుని కార్యములు జరుగును. నీ నుంచి మమ్ములను దూరము చేయక నా సన్నిధిలోనికి మమ్ములను ఉంచుకొని, నీ ప్రేమతో మరియు శక్తితో మమ్ములను నింపుము, అప్పుడు ఈ లోకమంతటను నీ పేరు వ్యాప్తిన్చును

ప్రశ్న:

  1. "నజరేయుడైన యేసునందు విశ్వాసము" అను మాటకు అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:49 PM | powered by PmWiki (pmwiki-2.3.3)