Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 127 (Miraculous catch of fishes; Peter confirmed in the service of the flock)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 – 21:25)
5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను21:1-25)

a) అద్భుతముగా చేపలు పట్టుట (యోహాను21:1-14)


యోహాను 21:7-8
7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడుఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను. 8 దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.

ఆ మనిషి ఇన్ని చేపలు తన వలలో పడడం చాల ఆశ్చర్యానికి గురి అయినాడు. అప్పుడు అతను ఆ సముద్రపు ఒడ్డున ఉన్నవాడు యేసు తప్ప మరి ఏ వ్యక్తి కాదు అని అనుకొనెను. అందుకు యోహాను అక్కడున్నది యేవారు కాదు అయితే అతను " యేసు ప్రభువు" అని నిర్ధారించెను .

అప్పుడు పేతురు యేసు రెండవసారి తన ప్రసంగములో చేపలు పట్టుట గురించి చెప్పడము జ్ఞాపకము చేసుకొనెను. అప్పుడు పేతురు తన బట్టలు ఉన్న చోటికి వచ్చి వాటిని వేసుకొనెను, ఎందుకంటె దిగంబరునిగా యేసు దగ్గరకు వెళ్ళుటకు ఇష్టపడలేదు కనుక. తరువాత నీళ్ళలోకి దూకి యేసు ఉన్నచోటివరకు ఈదుకుంటూ వెళ్లెను. కనుక ఆ సమయములో తన ఓడను మరియు తాజాగా పట్టుకొనిన చేపలన్నిటినీ వదిలి యేసు దగ్గరకు వెళ్లెను. అతను వాటన్నిటినీ మరచిపోయెను ఎందుకంటె అతని హృదయము కేవలము యేసు కొరకు ఎదురుచూసేను కనుక.

పేతురు వాలే యోహాను ప్రేమ కూడా క్రీస్తు పైన ఒక్కటిగా ఉన్నప్పటికీ అతను ఆ ఓడలోని ఉండిపోయెను. కనుక ఆ యవ్వనస్తుడు మరియు అతనితో పాటు ఉన్న వారందరు కూడా ఆ పడవను దాదాపుగా 100 మీటర్ల దూరమున్న వడ్డునకు తోసిరి. తుదకు వారు పట్టిన ఆ చేపలతో ఒడ్డుకు చేరిరి.

యోహాను 21:9-11
9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. 10 యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా 11 సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;

ఎప్పుడైతే శిష్యులు ఆ సముద్రపు ఒడ్డున చేరినప్పుడు చేపల మీద ఉన్న బొగ్గు కాలడము చూసిరి. కనుక ఆ అగ్నిమరియు రొట్టె ఎక్కడి నుంచి వచ్చినాయి ? వారిని అతను దాదాపు వంద మీటర్ల దూరము నుంచి తినుటకు పిలిచెను. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చిన తరువాత వేయించిన చేపలను తినుమని చెప్పెను. ఆ సమయములో అతను ఒక నాయకునిగా మరియు ప్రభువుగా ఉండును. కనుక అతను వారికి ఆ ఆహారమును సిద్ధముచేయుటలో భాగమును ఇచ్చెను. మరియు అతను మనలను అతని కార్యములలో భాగస్తులముగా ఉండాలని కోరెను. కనుక అతను మనలను అతని కార్యములో పాల్గొని మరియు వాటిని ఫలించుమని చెప్పెను. ఒకవేళ శిష్యులు అతని మాటలు వినకుండా ఉన్నట్లయితే వారికి ఏమి కూడా రాదు. అయితే ఇక్కడ అతను వారికి వచ్చి ఆహారమును తినుమని చెప్పెను. ఆశ్చర్యముగా ఈ లోక ఆహారము అవసరము లేనప్పటికీ యేసు వారిని ఆహారములో భాగముకలిగి చెప్పి వారి పట్ల అతను తన ప్రేమను తెలియపరచెను .

153 చేపలు పూర్వపు దినాలలో ఉన్న ఆచారములు సాదృశ్యములుగా ఉండెను, మరియు అన్ని రకరకాల చేపలు అదేసమయములో కలిగి ఉండెను. ఇది యేసు ఒక మాదిరి " కేవలము ఒక రకమైన చేప కొరకు పెట్టవద్దు, అయితే ఈ లోకములో ఉన్న రక రకాల మనుషులకొరకు పట్టుకో" అని చెప్పినట్టు ఉన్నది. ఎందుకంటె ప్రతి ఒక్కరు దేవుని రాజ్యములో చేరుటకు అతనికి ఇష్టమాయెను. వల ఏవిధముగా అయితే అన్ని చేపలు పడినప్పటికీ కూడా తెగిపోలేదో అదేవిధముగా క్రీస్తు సంఘముకూడా ముక్కలుగా అయిపోకూడదు , మరియు పరిశుద్ధునితో ఐక్యత కలిగి ఉండాలి, ఒకవేళ సంఘములో ఉన్న కొంత మంది ప్రేమించుటలో తక్కువైనప్పటికీ కూడా వారితో ఐక్యత కలిగి ఉండాలి. కనుక నిజమైన క్రీస్తు సంఘము అతనికి చెందినది కనుక అది ఎప్పుడూ జీవనాధారము కలిగి ఉండాలి.

యోహాను 21:12-14
12 చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. 13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను. 14 యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

యేసు తన శిష్యులందరిని తన ప్రేమ అను అగ్ని చుట్టూ ఉంచుకొన్నాడు. మరియు ఎవ్వరు కూడా ఈ మనిషిని బట్టి మాటలాడుటకు సాహసించకపోయిరి ఎందుకంటె ఇతను క్రీస్తు అని తెలుసుకొనిరి కాబట్టి. వారు అతనిని గట్టిగా హత్తుకోవాలని చూసిరి అయితే అలా చేయుటకు భయపడిరి. యేసు వారి మధ్యన ఉన్న మౌనమును తీసివేసి వారికి ఆహారమును వడ్డించుట ప్రారంభించెను. అప్పుడు వారిని క్షమించి వారిని ఆశీర్వదించెను. కనుక శిష్యులందరు కూడా యేసు యొక్క క్షమాపణలో ఉండిరి కనుక వారు నశించిపోవుటకు అవకాశము లేకపోయెను. వారు విశ్వసించుటకు మరియు నిరీక్షణ కలిగి ఉండుటకు నిదానం కలిగి ఉండిరి. యేసు వారిని వ్యతిరేకించక వారికి తన అద్భుతమైన బలముచేత తృప్తిపరచెను. కనుక దేవుడు నీ నుంచి కూడా మంచి కార్యములను మరియు మంచి హృదయమును కోరుకొంటున్నాడు. కనుక యేసు ఈ విధమైన మాదిరిని పునరుత్థానము తరువాత చేసెను.


b) పేతురు తన పరిచర్యను ఖచిత్తము చేయుట (యోహాను 21:15-19)


యోహాను 21:15
15 వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.

యేసు తన మొదటి ప్రత్యక్షతలోనే శిష్యుల పాపములను మరియు పేతురు తిరస్కరించుటను కూడా క్షమించెను. అయితే పేతురు యొక్క తిరస్కారామునకు ఒక ప్రత్యేకమైన బోధనా అవసరమై ఉండెను. అతని దయకలిగిన మాటలు ప్రభువు ప్రత్యక్షతను చూపెను, ఎందుకంటె అతనే హృదయములను పరీక్షించును కనుక. అతను తిరస్కారమును గురించి మరియు వ్యక్తి పరీక్షను బట్టి ఏ మాట చెప్పలేదు. కనుకనే అతను పేతురును అతని పాత పేరుతో అనగా యోనా కుమారుడైన సీమోను అని పిలిచెను.

కనుక ఈ దినాలలో కూడా యేసు నిన్ను ," నీవు నన్ను ప్రేమిస్తున్నావా ? నా మాటలను మరియు నా వాగ్దానములను బట్టి విశ్వసిస్తున్నావా ? నేను వెళ్ళుట మరియు దగ్గరకు వచ్చుట చూస్తున్నావా ? నీ సమయమును , నీ బలమును నా కొరకు ఇవ్వగలరా? నీ ఆలోచనలు నా మీద మరియు నీవు నాలో ఒకడివిగా ఉన్నావా ? నీ జీవితముతో నన్ను ఘనపరచుచున్నావా ? "

అందుకే యేసు పేతురుతో, " వీటన్నిటికనే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? " అని అడిగెను, అయితే పేతురు, " లేదు ప్రభువా, నేను వాటికంటే శ్రేష్ఠమైనవాడిని కాను; ఎందుకంటె నేను నిన్ను ఒప్పుకొనలేదు." అని చెప్పలేదు. అయితే పేతురు ఇంకనూ అదేవిధములా ఉంది అవును అని సమాధానము ఇచ్చెను, పరిశుద్దాత్మ ప్రేమను బట్టి విశ్వాసమును బట్టి ఈ విధముగా చెప్పెను.

పేతురు తన బలహీనతను బట్టి చివాట్లు పెట్టెను, అయితే తనను వెంబడించువారిని బట్టి అతను దేవుని ప్రేమ కలిగి ఉండెను. కనుక యేసు వారి విశ్వాసమును బట్టి తిరిగి తన కార్యము చేయుమని వారికి చెప్పెను. దేవుని గొర్రెపిల్ల వేరే గొర్రెలను తన రక్తము చేత కొని ఉండెను. కనుక నీవు అలంటి గొర్రెలను బట్టి జాగ్రత్త కలిగి, వాటిని సహనంతో మేపి వాటి కొరకు కనిపెట్టుకొని ఉండెదవా ? లేక వారు చేయలేనంతగా నీవు వారి నుంచి కోరుకుంటున్నావా ? లేక వాటిని ఒంటరినిగా ఉండునట్లు వాటిని వదిలివేసినవా ? అందుకు యేసు మొదటగా వారిలా ఎవరు యెవ్వాన విశ్వాసముతో ఉన్నారో తెలుసుకొనుమని చెప్పెను.

యోహాను 21:16
16 మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱలను కాయుమని చెప్పెను.

యేసు పేతురుతో నిదానముగా ఈ విధముగా చెప్పెను, " నేను నిన్ను ప్రేమించు చున్నానని చెప్పినప్పుడు, నీ హృదయపూర్వకముగా చెప్పలేదా? నీ ప్రేమలో మానవత్వము లేదా? నీ ప్రేమలో ఏవిధమైన తృప్తి మరియు నిజమైన మంచితనము లేదా?

అప్పుడు పేతురు తన హృదయముతో లోబడి ఈ విధముగా సమాధానము చెప్పెను, " ప్రభువా నీకు అన్ని తెలుసు, ప్రతి విధమైన సామర్థ్యము నీకు తెలుసు. నీనుంచి నా ప్రేమ దాచబడలేదు. నేను నిజముగా నిన్ను ప్రేమించి నీ కొరకే జీవించెదను. నేను విఫలమయ్యాను మరియు విఫలమగుదును. అయితే నీ ప్రేమమా నన్ను బలపరచి స్థిరపరచెను."

యేసు పేతురు మాటను తిరస్కరించక ఈవిధముగా చెప్పెను, " నీవు నన్ను ప్రేమించునట్లు సంఘములో ఉన్న వారిని కూడా ప్రేమించు, ఎందుకంటె వారి పరిచర్య అంత సులువు కాదు . ఎందుకంటె అందులో చాల అంది వారి విశ్వాసముల్ వెనక్కి పోయి వారి సొంత మార్గములలో తిరుగుతున్నారు . నీవు నా గొర్రెలను నీ భుజముల మీద మోసుకోవాలనుకున్నావా ? నీవు వారిని బట్టి బాధ్యత కలిగి ఉన్నావు."

యోహాను 21:17
17 మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

పేతురు యేసును బట్టి మూడు సార్లు తెలియదు అని చెప్పెను కనుకనే యేసు కూడా పేతురును మూడు సార్లు తన హృదయమనే తలుపును తట్టెను, ఎందుకంటె అతని ప్రేమలో నిజము ఎంత ఉన్నదో అని తెలుసుకొనుటకు. మరియు పేతురును అవసరమైన పరిశుద్ధతమున కూడా తనకు ఇచ్చుటకు సిద్ధముగా ఉండెను.అయితే ఇది అతనికి పెతెకోస్తు దినమునాడే పరిశుద్దాత్మ వచ్చినది. కనుక అతను విచారిస్తూ ఉండెను, " నీవు అందరికంటే ఎక్కువగా ఈ లోక రక్షణను బట్టి ఆశకలిగి ఉన్నావా ? " మూడవ సారి, పేతురు సిగ్గుతో మరియు బాధతో తన ప్రభువుకు తన హృదయము తెలిసెనని సమాధానమిచ్చెను.

కనుక పేతురు యేసును మూడు సార్లు తిరస్కరిస్తానని తెలుసు కాబట్టి యేసుకు అతని గూర్చి అంత కూడా తెలుసునని అనుకొనెను. అందుకే పేతురు అతనిని నిజమైన దేవుడు అని పిలిచెను, ఎందుకంటె మనిషి అంతరంగములో ఏముండునో ఎవరికి తెలుసు. అదే సేవకుల కార్యము అని పేతురును తన గొర్రెలను బట్టి చెప్పెను.

నీవు దేవుని గొర్రెలను కాచుచున్న సేవకుడివా ? తోడేలు మరియు అపవిత్రాత్మలు వచ్చుట చూసావా? మనమందరము పాపులం కనుక దేవుని కాపుదలలో ఉండుటకు అర్హులము కాదని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటె గొర్రెలకంటే ఎక్కువగా కాపరులకు క్షమాపణ అనునది ప్రతి దినమూ కలగాలి. ఎందుకంటె అప్పుడప్పుడు తమ బాధ్యతలను వారు మరచిపోతుంటారు కాబట్టి.

ప్రార్థన: యేసు నీవు గొప్ప కాపరివి . నేను అర్హుడను కాకపోయినప్పటికీ నన్ను కాపరిణిగా పిలిచితివి. కనుక నేను నిన్ను వెంబడించుచున్నాను. నీవు నీ ప్రియమైన గొర్రెలను నాకు అప్పగించి ఉన్నావు. కనుక నేను వాటిని తిరిగి నీకు అప్పగిస్తున్నాను కనుక వాటికి నీ కృపను ప్రేమను మరియు నిత్యజీవమును దయచేయుము. అప్పుడు వాటిని ఎవ్వరూ కూడా నీనుంచి వేరుపరచరు. కనుక వాటిని పరిశుద్ధపరచి , ఓర్పుకలిగి , సాత్వికము కలిగి , విశ్వాసము కలిగి మరియు నీ ప్రేమ కలిగి ఉండునట్లు స్థిరపరచు. నీవు నన్ను వదలక నిత్యమువరకు ప్రేమించుము.

ప్రశ్న:

  1. పేతురు మరియు యేసు మధ్యన జరిగిన చర్చ నుంచి నీవు ఏమి తెలుసుకున్నావు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:45 PM | powered by PmWiki (pmwiki-2.3.3)