Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 112 (Christ's word to his mother; The consummation)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
4. సిలువ మరియు క్రీస్తు మరణము (యోహాను 19:16-42)

c) క్రీస్తు తన తల్లికి చెప్పిన మాటలు (యోహాను 19:25-27)


యోహాను 19:24-27
24 వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైని కులు ఈలాగు చేసిరి. 25 ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, 27 తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

యేసు ఈ లోకమును క్షమించు అని చెప్పే మొదటి మాటను యోహాను తన పుస్తకములో వ్రాయలేదు. మరియు యూదులు అతనిని ఎగతాళి చేయుట కూడా వ్రాయలేదు, మరియు అతని కుడి వైపున ఉన్న దొంగను క్షమించుటను కూడా వ్రాయలేదు. ఎందుకంటె ఈ పుస్తకు వ్రాసే సమయములో ఈ మాటలు సంఘాలలో అప్పటికే అందరికి తెలిసే ఉన్నవి కనుక.

క్రీస్తు ఈ మాటలు పలుకుట కంటే ముందే యాజకుడు మరియు అక్కడున్న వారందరు కూడా ఆ స్థలమును విడిచి యెరూషలేమునకు పస్కా పండుగ కొరకు గొర్రెపిల్లను బలిగా అర్పించుటకు వెళ్లిరి. కనుక ఆ సమయము చాల కొద్దిగానే ఉన్నది. ఆ మతస్తులు కూడా ఆ పండుగను ఆచరించుటకు వెళ్లిరి. కనుక ఆ సమయములో అర్పించిన అనేక గొర్రెపిల్లల యొక్క రక్తము ఆ యెరూషలేము వీధుల గుండా వెళ్లెను. అయితే ఆ పట్టణము వెలుపల నిజమైన ఈ లోక పాపములను తీసివేయు నిజమైన దేవుని గొర్రెపిల్ల తన రక్తమును చిందించెను. అయితే ఆ రక్తమును వారు అర్థము చేసుకోలేకపోయిరి. అయితే ఆ ముగ్గురిని అక్కడున్న సైనికులు కావలి కాసిరి.

ఆ సమయములో అక్కడున్న కొందరు స్త్రీలు ఆ సులువచేతనకు మౌనముగా వచ్చిరి. అక్కడ జరిగిన ఆ సంఘటనలు వారికి బాధను తెప్పించెను. సర్వశక్తుడు వారి తలలపైనా సిలువవేయబడుట వారు జీర్ణించుకోలేకపోయిరి. అయితే వారి హృదయములో వేదనతో భారము కలిగి ఉండెను కనుక వారు ఓదార్పు మాటలు పలకలేకపోయిరి. అయితే వారిలో కొందరు ముందుగానే చెప్పబడిన ప్రవచనములను జ్ఞాపకము చేసుకొనిరి.

యేసు తన ప్రియమైన తల్లి ఏడుపును చూసి మరియు అతని ప్రియాయమైన యోహాను ఏడుపును చూసేను. అయితే అతఃను తన నొప్పిగురించి ఆలోచన చేయక వారు అతని స్వరము వినునట్లు , " అమ్మ ఇదిగో నీ కుమారుడు" అని చెప్పెను.

క్రీస్తు యొక్క ప్రేమ ఈ లోకములో ఉన్నవారందరికి ఉన్నది, కనుకనే అందరి పాపములకొరకు అతను ఎంతో హింసను అనుభవించాడు. కనుక సీమోను ప్రవచించినట్లు కన్యకా గర్భమందు జన్మించినవాడు అతని ప్రాణమును అర్పించునని చెప్పుట నెరవేర్చబడెను (లూకా 2:35).

అతను తన తల్లికి మరియు అతని ఇంటికి ధనమును కూర్చలేదు అయితే వారికి తగినంత ప్రేమను వారికి పంచెను, మరియు అతని శిష్యులకు కూడా ప్రేమను పంచెను. కనుకనే యోహాను క్రీస్తు తల్లిదగ్గరకు వచ్చెను (మత్తయి 27:56), అయినప్పటికీ అతను తన నామమును ఎక్కడ కూడ ప్రకటించలేదు అయితే క్రీస్తుకు మహిమ కలుగునట్లు ఉండెను. ఎప్పుడైతే యేసు తన తల్లిని తన సహోదరుడైన యోహానును అప్పగించెనో అప్పుడు తన మాత్రమే శిష్యులు ఆ సిలువచెంతకు చేరినారు. అప్పుడు అతను మరియను కౌగిలించుకొని తన ఇంటిలోనికి ఆహ్వానించెను.

తక్కిన స్త్రీలు కూడా ఆ కార్యమును బట్టీ సాక్ష్యము చెప్పిరి. వారిలో ఒకనికి ఉన్న అపవిత్రమనుంచి కాపాడినాడు. మరియు అందులో మాగ్డలీన్ మరియా యేసును ఎంతగానో ప్రేమించి అతనిని వెంబడించెను.


d) ముగింపు (యోహాను 19:28-30)


యోహాను 19:28-29
28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేనుదప్పిగొనుచున్నాననెను. 29 చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.

యోహానును గొప్పగా చెప్పే బహుమానము ఉన్నది. అతను క్రీస్తును సిలువ వేయబడినప్పుడు ఆ సమయములో అక్కడ అంత కూడా చీకటిచేత కమ్ముకొనుట మరియు దేవుడు మన పాపములను బట్టీ తన ఉగ్రతను ఇవ్వక క్రీస్తును ఇచ్చినట్టుగా కూడా వ్రాయలేదు. అయితే మనము వినినట్లై దాదాపుగా మూడు గంటలు యేసు ఆ సిలువ శ్రమను అనుభవించి మరణము చెందాడని తెలుసుకున్నాము. అయితే మరణము క్రీస్తును మ్రింగినట్లు యోహాను వ్రాయలేదు అయితే యేసు అందరి పాపములకొరకై మరణించుటకు ఇష్టపడెనని మాత్రమే వ్రాసినాడు. అతని ప్రాణము కూడా విమోచనమును ఇచ్చుటకు ఇష్టపడెను. యేసు మనుషులందరికి సంపూర్ణమైన రక్షణను దయచేయుటకు మరియు వారి పాపములను తీసివేసి దేవుని యొద్దకు వచ్చుటకు తన ప్రాణమును ఫణముగా పెట్టెను. కనుక అతని మరణము తరువాత కోయబడిన పంటను చూసేను.

అప్పుడు అతని పెదవులు ఎండిన తరువాత , " దప్పిగొనుచున్నాను" అనెను. ఈ లోకమును సృష్టించ వాడు మరియు నీటిపైనా నడిచినవాడు మరియు ఏ గాలిని కూడా చేసినవాడు ఇప్పుడు దప్పిగొనుచున్నాడు. ప్రేమ అను ఒక దైవత్వము అతని తండ్రి ప్రేమనుంచి వేరుపరచెను. ఇది ఒక రకముగా నరకమును సూచిస్తుంది, ఎలా గంగా నరకములో కూడా ప్రాణమునకు శరీరమునకు దాహము వేయును అయితే నీరు దొరకదు. తరువాత యేసు ఒక ధనవంతుని గూర్చి మరియు దరిద్రుడైన లాజరును గూర్చి వ్రాసెను. ధనవంతుడు దప్పిగగొనునప్పుడు లాజరు వచ్చి తన వేలితో తన నాలుకను నీటితో తాను మని చెప్పెను. అయితే ఆ మనిషి ఈ లోకములో ఉన్నప్పుడు తనకు ఉన్న సమయమునంతటిని వ్యర్థముగా మార్చుకొని రక్షణలోనికి రాకుండా చనిపోయెను కనుక ఇప్పుడు ఆ నరకములో ఆ శిక్షను అనుభవించుచున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అతనికి కొన్ని వేల సంవత్సరముల క్రితమే సువార్త చెప్పబడినది జ్ఞాపకము చేసెను కీర్తన 22:13-18 . మరియు కీర్తన 69:21 లో సిర్కా తాగుతాను కూడా జ్ఞాపకము చేసెను. అయితే ఆ సైనికులు క్రీస్తుకు ఈ పానీయమును నీటిలో కలిపి ఇచ్చారో మనకు తెలియదు, అయితే అది మంచి నీరు కాదని మనకు తెలుసు.

యోహాను 19:30
30 యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

ఎప్పుడైతే యేసు ఆ చిరాకు పుచ్చుకొనిన తరువాత " సమాప్తమాయెను" అని చెప్పెను! ఇది జరుగు ఒకరోజు ముందు యేసు తన తండ్రి మహిమపరచబడులాగున తనను సిలువమరణమునకు నడిపించుమని అడిగెను. కనుక ఆ కుమారుడు తన ప్రార్థనకు తగిన సమాధానము దొరుకునని అంగీకరించెను, తన తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసెను (యోహాను 17:1,4).

యేసు ఆ సిలువలో ఎంతో పరిశుద్ధముగా ఉంది తన పెదవులలో కూడా ఏవిధమైన ద్వేషమును కానీ మరియు అతనిని సిలువవేసిన వారి పాతాళ ఏవిధమైన పాగా కానీ ఉండక ఎంతో ప్రేమ కలిగి ఉండెను. యేసు తన తండ్రి ఇచ్చిన కార్యమును అనగా పాప విమోచనమును ఏవిధముగా చేసాడో దానిని బట్టీ అతను ఎంతగానే తృప్తి పొందెను. నిత్యుడగు కుమారుడు చేసి ఈ ఘానా కార్యమును ఈ లోకములో యెవ్వరుకూడా చేయలేరు మరియు అతను అందరికి కొరకు నిత్యా త్యాగమును చేసెను. (హెబ్రీ 9:14)

యేసు ఆ సిలువ చేత చేయబడిన చివరి కార్యము ద్వారా ఈ లోకమునకు సంపూర్ణ ఓమోచన కలిగినది కనుక ఇక ఏ కార్యము చేయవలసి రాలేదు. మన జీవితములో ఉన్న పరిశుద్ధత అనునది మన కార్యముల చేత లేదా మన సామర్థ్యము చేత వచ్చినది కాదు అయితే ఇది దేవుడు ఇచ్చిన వరము. దేవుని కుమారుడు ఇవన్నీ కూడా ఒక్కసారి చేసెను. అతని మరణము చేత క్రొత్త వారికి కూడా నిత్యా రక్షణ వచ్చినది అది కేవలము దేవుని గొర్రెపిల్ల ఆ సిలువలో మరణించాడు కు మాత్రమే. కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులు. కనుకనే యేసు ఆ సిలువలో, " సమాప్తమాయెను" అని చెప్పెను.

చివరిగా యేసు తన తలను వంచి మహిమకలుగుటకు చేసెను. అప్పుడు తనను ప్రేమించుచున్న తన తండ్రికి తన ఆత్మను అప్పగించెను. ఈ ప్రేమ ఈ దినమున క్రీస్తును తండ్రి కుడి పార్శ్యమున కూర్చుండుటకు అవకాశము కలిగినది.

ప్రార్థన: ఈ లోక పాపములకొరకు రక్తమును అర్పించిన ఓ గొర్రెపిల్ల నీకు మహిమ, ఘనత, స్తుతి, స్త్రోత్రము అన్నియు కలుగును గాక. నీ వైపు తిరిగి నిను మహిమపరచుటకు నా తలను పైకి లేపి నన్ను నీ పరిశుద్ధాత్మచేత నింపుము.

ప్రశ్న:

  1. క్రీస్తు పలికిన మూడు మాటలు ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:33 PM | powered by PmWiki (pmwiki-2.3.3)