Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 111 (Crucifixion and the grave clothes; Dividing the garments and casting the lots)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
4. సిలువ మరియు క్రీస్తు మరణము (యోహాను 19:16-42)

a) సిలువ మరణము మరియు సమాధి గుడ్డలు (యోహాను 19:16-22)


యోహాను 19:16-18
16 అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. 17 వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు. 18 అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

పిలాతు యేసును వారికి మూడవ వ్యక్తిగా అప్పగించినప్పుడు యేసుతో పార్టు మిగతా ఇద్దరు దొంగలు సిలువ వేయబడినారు. కనుక ఆ సైనికులు ఆ ముగ్గురిని వారి వారి సిలువను వారే మోయాలను ఆజ్ఞాపించిరి. అయితే క్రీస్తు సిలువను తిరస్కరించలేదు మైర్యు ఆ చెక్కతో చేయబడినదానిని కూడా వదలలేదు. వారు ఆ గొల్లాత అను స్థలమునకు వచ్చు వరకు ఆ వీధులగుండా వారి సిలువను మోసుకుంటూ వచ్చిరి. ఎప్పుడైతే ఆ గొల్లాత అన బడిన స్థలమునకు వచ్చిరో అక్కడ వారు వారిని సిలువ వేసిరి.

యోహాను ఈ సిలువను గూర్చి ఎక్కువగా వివరించలేదు. అయితే అక్కడ ప్రజలు ప్రేమను వ్యతిరేకించిరి మరియు వారికి విశ్రాంతిని ఇస్తానని చెప్పిన వాడిని తిరస్కరించిరి. వారు వారి కొరకు పుట్టిన వాడిని మరియు వారి పాపముల కొరకు తన రక్తమును చిందించుచునా వాడిని తిరస్కరించిరి. కనుక క్రీస్తు తన అధికారమును చూపక తన సత్వేఏకమును వారి యెడల తన మరణము ద్వారా మరియు చిందించిన తన రక్తము ద్వారా చూపెను.

అక్కడ ఇద్దరు దొంగల మధ్యలో క్రీస్తు ఎందుకు సిలువ వేయబడాలి, ఆ ఇద్దరు కూడా శపించబడినవారు కనుక వారికి ఇది న్యాయమే.

అయితే ప్రేమ కలిగిన యేసు ఈ సమయములో కూడా తన దాయకలిగిన స్వభావమును సిలువ వేయబడిన ఇద్దరు దొంగల మధ్యలో కూడా కనపరచెను. ఈ కార్యము కొరకే మనుష్య కుమారుడు ప్రజల కొరకు పుట్టియున్నాడని తెలుసుకోగలం. కనుకనే యివారు కూడా యేసు తన స్థితి నుంచి దిగజారి నాడు అని చెప్పలేము. నీవు ఏవిధముగా పడినా లేక పాపము చేసినా కృప కలిగిన దేవుని నిన్ను నీ పాపములని క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేయును.

యోహాను 19:19-20
19 మరియు పిలాతుయూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. 20 యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.

క్రీస్తు తనకు తాను ఒక రాజుననై చెప్పినందుకు ఆ సైనికులు ఆ దొంగల మధ్యలో క్రీస్తును కూడా సిలువ వేసిరి. అయితే పిలాతు పట్టు వదలక యూదుల పెద్దల తప్పులను యేసు పట్ల కనిపెట్టుచు వచ్చెను. కనుక ఆ సిలువ మీద పిలాతు యూదుల తప్పును బట్టీ వ్రాసెను.

దేవుడు ఈ మాటలను ఆ యూదులను న్యాయ తీర్పు తీర్చుటకు వాటిని ఉపయోగించెను, ఎందుకంటె యేసు నిజముగా వారి రాజాయెను కనుక. యేసు దగ్గరకు ఎవరైతే ప్రేమకలిగి, సత్వేఏకము కలిగి, తగ్గింపు కలిగి వస్తారో వారికి అతను ఒక రాజుగా ఉన్నాడు. అతను ఈ భూమి మీద పరలోకమును స్థాపించి ఉన్నాడు. అయితే యుడు ఈ యేసును తిరస్కరించి ఈ భూమి మీద నరకమును స్థాపించుటకు ఇష్టపడిరి. కనుక యేసు ఈ లోకమునకు ఒక రాజుగా ఉన్నాడు కనుక నీవు ఈ రాజును అంగీకరిస్తావా లేక అతని ప్రేమను తిరస్కరిస్తావా ?

యోహాను 19:21-22
21 నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా 22 పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

పిలాతు యొక్క ఉద్దేశములను ప్రధాన యాజకుడు అర్థము చేసుకొనెను. వారు వారి నిజమైన రాజును వ్యతిరేకించి అతని బలహీనతను మాత్రమే పిలాతుకు చెప్పిరి. కనుక వారు ఆ సిలువను కూడా ద్వేషించిరి.

పిలాతు వ్రాసిన ఆ మాటలను అతను మూడు భాషలలో వ్రాసెను కనుక అందరు అర్థము చేసుకోనున్నట్లుగా , అక్కడికి వచ్చువారు మరియు రోమా వారు కూడా చదివి వాస్తవమును అర్థము చేసుకొనుటకు పిలాతు ఈ విధముగా చేసెను. 70 వ దశకమునకు ముందే యూదులు రోమా అధికారమునకు వ్యతిరేకముగా ఉండిరి. కనుకనే కొన్నివేలమంది యెరూషలేములో సిలువవేయబడిరి.


b) క్రీస్తు వస్త్రములకొరకు చీట్లు వేయుట (యోహాను 19:23-24)


యోహాను 19:23-24
23 సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక 24 వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైని కులు ఈలాగు చేసిరి.

ఎవరైతే క్రీస్తును సిలువ వేసారో ఆ నలుగురు సైనికులకు క్రీస్తు వస్త్రములను చీట్లు వేయుటకు అధికారము వచ్చెను. శతాధిపతి కూడ ఆ కార్యములో పాలుపంచుకొనుటకు ఏవిధముగా కూడా దూరము కాలేదు. కనుక క్రీస్తుకు ఉన్న చివరి స్వాస్థ్యమైన ఆ బట్టలను కూడా వారు తీసుకొనిరి. ఎందుకంటె సిలువవేయబడిన వారు చివరికి దిగంబరులుగానే ఉండాలి.

అయితే క్రీస్తు సత్వేఏకము అక్కడ కూడా చేయబడెను. అది ఆ ప్రధాన యాజకుని ముందరకూడా చేయబడెను. ఎందుకంటె క్రీస్తు మాత్రమే ప్రధాన యాజకుడై మనందరికీ అతను ఒక మధ్యవర్తిగా ఉండెను. కనుకనే క్రీస్తు అందరి కొరకు నిందను మోసి హింసించబడెను.

కీర్తన 22 వ అధ్యాయములోనే క్రీస్తు యొక్క సిలువ మరణమును గూర్చి కొన్ని వేల సంవత్సరముల ముందే చెప్పబడెను. " వారు నా వస్త్రములను తీసుకొనెదరు", కనుక ఈ మాట నెరవేర్చబడెను. అయితే ఆత్మ ముందుకు వారు అతని వస్త్రములను చీట్లు వేసుకొనెదరని చెప్పెను. అయితే ఆత్మ క్రీస్తు సిలువ వేయబడుట దేవుని చిత్తము అని కూడా చెప్పెను. యేసు చెప్పినట్టు: దేవుని చిత్తము లేనిదే ఏ ఒక్కరు కూడా పదారు అనెను. కనుక ఎవరైతే క్రీస్తు సిలువను వ్యతిరేకిస్తారో వారు దేవుని ఆత్మ చెప్పబడిన దానిని కూడా వ్యతిరేకించునట్లుగా ఉందును. కనుక సైనికులకు ఇవన్నీ తెలియవు కనుక యేసు పాదముల క్రింద వారికి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించిరి. కనుకనే వారు ఈ లోక పాపములను బట్టీ తన రక్తమును యేసు చిందించుచున్నాడని తెలియక అతని వస్త్రములను బట్టీ యెగతాళి చేసిరి.

సహోదర నీవు కూడా అతని మరణములో అతనితో సిలువ వేయబడినవా? లేక నీవు ధనము వెనక మరియు ఐశ్వర్యము వెనక పరిగెడుతున్నావా ? నీవు సిలువవేయబడిన వాడిని ప్రేమించుచున్నావా ? నీవు అతని మరణము ద్వారా నీతిని పరిశుద్దతను మరియు అతని ప్రేమను పొందుకున్నావా ? లేక నీవు అన్ని నాకు తెలుసునంది సిలువవేయబడిన వాడిని గూర్చి ఆలోచనచేయక ఉన్నావా ? పరిశుద్ధాత్ముడు మనలను దేవుని కుమారునితో విశ్వాసముతో ఐక్యతను ఇచ్చును. కనుక మనము శివ వేయబడి సమాధిచేయబడి తిరిగి సమాధిని గెలిచినా దేవుడిని మహిమ పరచాలి.

ప్రార్థన: ప్రభువా మా కొరకు సిలువను మోసినందుకు నీకు కృతజ్ఞతలు. మీ ఓర్పును బట్టీ ప్రేమను బట్టీ మిమ్ములను స్తుతిస్తున్నాము. ఈ లోక పాపములను మరియు నా పాపములను క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు. ఆ సిలువలోనే నా పాపములను తీసివేసినావు కనుక నీవు నా విమోచకుడవు.

ప్రశ్న:

  1. యేసు సిలువ మీద వ్రాసిన మాటలకు అర్థము ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:32 PM | powered by PmWiki (pmwiki-2.3.3)