Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 105 (Jesus intercedes for the church's unity)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)

4. సంఘ ఐక్యతను గూర్చి క్రీస్తు మధ్యవర్తిత్వము చేయుట (యోహాను 17:20-26)


యోహాను 17:24
24 తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.

యేసు తన యాజక ప్రార్థనలో దేవుడిని ఒకసారి " తండ్రి" అని మరియు ఒకసారి " సత్యమైన దేవుడు". అని సంబోధించెను. ఈ నామము ద్వారా అతని నమ్మకమును మరియు ఆశను దేవునికి తెలియపరచెను. ఎందుకంటె అతను తన తండ్రితో ఉంది మన కొరకు ఆ స్థలమును విడిచి మనలను విమోచించుటకు తగ్గింపు కలిగి ఉండెను. అతను ఒక గొప్పవాడిగా చూడబడుటకు ఉద్దేశించలేదు. " నీవు నాకు ఇచ్చావు " అనూప్ మాట పదమూడు సార్లు చెప్పబడెను. అతని కార్యముల ద్వారా మరియు అతని బహుమానముల ద్వారా తనను వెంబడించువారికి తన అధికారమును ఇచ్చెను. అతను తన ఘనత కలిగిన తండ్రికి సమర్పించుకొనెను. తన సత్వేఏకముచేత తన తండ్రి ఉద్దేశములను మరియు ఆలోచనలను నెరవేర్చెను.

" నేను ఆశించాను" అని తన సంపూర్ణ సమర్పణద్వారా ప్రార్థనలో చెప్పెను. కనుక దేవుని కుమారుడు ఏ ఆశకలిగి ఉన్నాడు ? అనగా అతనిని వెంబడించు ప్రతి ఒక్కరు ఇహమందును మరియు పరమందును అతను ఉన్నచోటే ఉండాలని ఆశ . అందుకే పౌలు చెప్పినట్లు, నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడినాను, జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడని చెప్పెను (రోమా 6:1-11 : ఎఫెసీ 2:4-7).

మన ఐక్యత క్రీస్తు మహిమను అతని ప్రేమను మరియు అతని శ్రమలను వివరించుటకు వెళ్ళును. మనయెడల అతని ఆశ ఏమిటంటే మనము అతని మహిమతో ఉండి అతని దయకలిగిన సన్నిధిలో ఉండటమే. అపొస్తలులకు ఈ నిరీక్షణ తెలుసు. మనము అతనిని చూసినప్పుడు నిత్యమైన ఆనందముతో ఉండెదము. మనము అతని రూపములోనికి మార్చబడి మరియు అతని మహిమలోనికి మరియు అతని హృదయములోనికి మార్చబడెదము (రోమా 5:5; మరియు 8:29). అతను మహిమ కలవాడు కనుక మనకు తన మహిమను ఇచ్చినాడు. కనుకనే అపొస్తలులు అతని సన్నిధిని మహిమచేత నింపబడుట మరియు అది ఈ లోక పునాదులను కూడా కదిలించబడుతున్నదని తెలుసుకొనిరి.

యోహాను 17:25
25 నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.

ఈ లోకము ఇంకను తెలియకుండగా దేవుడు నీతి కలిగి న్యాయము కలిగి ఉండెను. అతను వెలుగై ఉన్నాడు కనుక అతనిలో ఏ చీకటి లేదు. కనుక ఎవరైతే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారో వారు ఒకవేళ రక్షింపబడకుండా ఉన్నట్లయితే అది క్రీస్తు తప్పు కాదని తెలుసుకుంటారు.

అయితే క్రీస్తు తండ్రిని నిత్యములోనే చూసేను ఎందుకంటె కుమారుడు తండ్రిని ముఖ ముఖిగా చూసేను కనుక. అతని గుణములు మరియు అతని పేర్లు కుమారునికి తెలుసు. కనుక లోతైన మర్మములు కూడా కుమారుని నుంచి దాచబడలేదు.

ఎవరైతే కుమారుడిని అంగీకరిస్తారా వారిని తన కుమారులుగా స్వీకరించుటకు అధికారమును దేవుడు ఇచ్చినాడు. యేసు తన తండ్రి స్వభావమును బయలుపరచెను. ఎవరైతే తెలుసుకుంటారో వారు క్రీస్తు దేవుడి నుంచి వచ్చాడని ఎరుగుదురు; అతను కేవలము ఒక ప్రవక్త లేకా అపొస్తలుడు మాత్రమే కాదు అయితే దేవుని కుమారుడు. ప్రతి దివత్వము కూడా సంపూర్ణముగా అతనిలో ఉన్నది. కనుక ఆత్మ మనలను క్రీస్తు దేవుని ద్వారా పంపబడి ఉన్నాడని తెలుసుకొనుటకు సహాయపడును. అయినప్పటికీ అతను మనిషికి మరియు దేవునికి ఒక లింక్ అయి ఉన్నాడు.

యోహాను 17:26
26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.

కొన్నిచోట్ల క్రీస్తు తన తండ్రి నామములో ప్రకటన చేసెను. ఇది మనము గ్రానించినట్లైతే సిలువలో క్రీస్తు తన తండ్రిని అనగా సిలువ మరణము ద్వారా క్రీస్తును మరియు అతని గాయములద్వారా తన తండ్రితో ఉన్న బంధమును చూపెను. ఎప్పుడైతే పరిశుద్దాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము, " తండ్రి , అబ్బా " అని పిలుస్తాము. పరలోక ప్రార్థన ఒక కిరీటముగా ఉన్నది ఎందుకంటె అందులో తండ్రిని మరియు అతని రాజ్యమును మహిమపరచెదము కనుక.

తండ్రి మరియు కుమారుని ప్రేమ మనలో ఉంచబడినది మనము చూపువారముగా ఉండాలి. అతను తన తండ్రికి మనలో సంపూర్ణ ప్రేమ కలిగి ఉన్నట్లు ప్రార్థించెను. కేవలము తండ్రి మాత్రమే మనలోకి వచ్చునది అయితే వ్యక్తిగతముగా క్రీస్తు కూడా మనలోకి వచ్చును. యోహాను ఏవిధముగా అతని సువార్తలలో చెప్పెనో అదేవిధముగా మనలో కూడా అతని దైవత్వము సంపూర్ణముగా వచ్చునట్లు ఉండాలి : దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక , ఎవరైతే దేవుని ప్రేమలో ఉంటారో వారు దేవునితో ఉంటారు.

ప్రశ్న:

  1. యేసు చేసిన యాజకుని ప్రార్థన యొక్క అర్థము ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:19 PM | powered by PmWiki (pmwiki-2.3.3)