Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 063 (The Jews interrogate the healed man)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
2. పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవానిని స్వస్థపరచుట (యోహాను 9:1-41)

b) స్వస్థపరచబడిన మనిషితో యూదులు మాట్లాడుట (యోహాను 9:13-34)


యోహాను 9:13-15
13 అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి. 14 యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము 15 వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.

యూదుల జీవితము ఒక బండి ఐనటువంటిది; వారు స్వస్తత కంటే ఎక్కువగా సబ్బాతు దినమును గూర్చియే ఎక్కువగా దృష్టిపెట్టినవారైరి. ఆ సమయములో స్వస్థత కలిగిన మనిషిని వారు పరిసయ్యులదగ్గరకు తీసికొనివచ్చి స్వస్థత దేవుని ద్వారా జరిగినదా లేక సాతాను ద్వారా జరిగినదా అని పరీక్షించిరి.

కనుక యేసును గురించిన చర్చ ఆ సమయములో అక్కడ జరిగినది. అయితే అప్పుడు ఆ యవ్వనస్తుడు వాడికి ఆ స్వస్థత ఏవిధముగా జరిగినదో వారికి క్లుప్తముగా వివరించెను. వాడు వివరించే సమయములో క్రీస్తును వ్యతిరేకించువారి హృదయములు చాలా కఠినముగా ఉండెను.

యోహాను 9:16-17
16 కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. 17 కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.

ఈ సాక్ష్యమును విన్న తరువాత అక్కడున్న పెద్దలు వాదించుటకు ప్రయత్నించిరి. అందులో కాంతమంది యేసుకు దేవుని శక్తి లేదు ఎందుకంటె దేవుని ఆజ్ఞను యేసు అతిక్రమించాడు కనుక. కనుక వారు క్రీస్తు పైన వారికి ఇష్టమొచ్చినట్లు తీర్పు తీర్చిరి.

అయితే వేరే వాళ్ళు ఆ గ్రుడ్డివాని స్వస్థతను మరియు వాని పాపమును మరియు యేసు ఏ విధముగా అతడిని క్షమించాడో చూసిరి. వారు ఈ స్వస్థత కశ్చితముగా ఒక అర్థమును తెచ్చినది ఎందుకంటె దేవుని కృప కలిగిన ప్రేమతో ఆ గ్రుడ్డివానికి దృష్టిని ఇచ్చేనని అనుకొనిరి. కనుకనే యేసు పాపముచేయనటువంటి వాడు ఎందుకంటె అతనే పాపములను క్షమించువాడు కనుక.

అయితే అక్కడున్న రెండు గుంపులు కూడా సమాధానమును చూడలేదు. ఈ దినములలో ఉన్న అనేకులు కూడా యేసును బట్టి అర్థము చేసుకొనలేక పోవుచున్నారు, అయితే ఇక్కడ కూడా ఈ రెండు గుంపుల వారు కూడా గ్రుడ్డివారుగా ఉన్నారు. అప్పుడు వారు ఆ గ్రుడ్డి వానిని యేసును గూర్చి ఇంకా అతను ఏమైనా చెప్పాడా అని అడిగి తెలుసుకొనిరి. అయితే ఈ విధమైన సమాచారం క్రీస్తు గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకొన్నవారికి అవసరంగా ఉంటుంది; నూతనముగా జన్మించినవారిని ప్రశ్న వేయడము మంచిదే, ఎందుకంటె దేవుని ఉగ్రత మరియు అతని పోషణ గురించి తెలుసుకోవడము ఎంతో ముఖ్యము కాబట్టి. కనుక మనము ఆత్మీయముగా జన్మించనియెడల మనము దేవుడిని చూడలేము.

అప్పుడు స్వస్థత పరచబడిన మనిషి ఆలోచించడము ప్రారంభించాడు, " అయితే క్రీస్తు ఎవరు ?" అతను క్రీస్తును చరిత్రలో ఉన్న మనుషులతో క్రీస్తును పోల్చడము చేసాడు. ఎందుకంటె ఆ చరిస్త్ర కాలములో ఎన్నో అద్భుతములు చేయబడ్డాయి, అయితే ఏ మనిషి కూడా పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవాడిని ఎవ్వరు కూడా చూపును ఇవ్వలేదు. అయితే ఆలోచన కలిగినవారు ఈ రక్షకుని లో మాత్రమే ఈ విధమైన అద్భుతకార్యములను చూడగలడు. అందుకే ఆ మనిషి యేసును ఒక ప్రవక్త అని పిలిచాడు, ఎందుకంటె దేవుడు భవిష్యత్తును మాత్రమే గాక వర్తమానకాలమును గురించిన దేవుని శక్తిని కూడా తెలియపరచి ఉన్నాడు కనుక. ఎందుకంటె అతను హృదయములను వెతికి దేవుని చిత్తమును తెలుసుకొనుము కనుక .

యోహాను 9:18-23
18 వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, 19 గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి. 20 అందుకు వాని తలిదండ్రులువీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. 21 ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22 వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. 23 కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.

అయితే యూదులు క్రీస్తు యేసు చేసిన అద్భుత కార్యములను పాత నిబంధన గ్రంధములో దేవుడు చేసిన కార్యములతో పోల్చుటకు ఇష్టపడలేదు. ఎందుకంటె యేసు దేవుని ద్వారా పంపబడినవాడని మరియు ప్రవక్త అని నమ్మలేదు, లేని యెడల వారి స్థితి దూషణకలిగి ఉండును.

అయితే ఆ గ్రుడ్డి వాడు ఇక ఎన్నడూ గ్రుడ్డితనమును ఉండలేదని తెలుసుకొని ఆశ్చర్యాయపడిరి. అయితే వారు క్రీస్తు ద్వారా చేయబడిన ఈ కార్యమును చూచుటకు అసాధ్యమని భావించిరి. ఎందుకేనట పుట్టుకతో గ్రుడ్డివాడిని చూపు ఇచ్చుట వారికి ఎంతో అసాధ్యమై ఉన్నది కనుక.

మరియు కొంతమంది తల్లితండ్రులు వారి పిల్లలకు ఉన్న సమస్యలను బట్టి యేసు దగ్గరకు తీసికొనివచ్చిరి. అయితే ఆ సమయములో పరిసయ్యులును బట్టి వారు చాల భయపడిరి ఎందుకంటె వారికి తమ పిల్లల గురించి బాగుగా తెలుసును కాబట్టి. కనుక వారు విడువబడ్డ వారి తరుణమును. కనుక కుమారుడు ఒంటరిగా విడువబడ్డాడు. ఆ సంఘములోనుంచి తప్పించుట అను నది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. ఒక కుష్ఠురోగి ఏవిధముగా ప్రత్యేకించబడునో అదేవిధముగా ఉంటుంది. మరియు ఇది వారి వివాహ సమయమునకు కూడా చాలా ఇబ్బందిని కలిగించునదిగా ఉండును. యూదులు క్రీస్తును ఏవిధముగా అయితే ద్వేషిస్తున్నారో అదేవిధముగా తనను వెంబడించువారిని కూడా నాశనము చేయాలనీ భావించిరి.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు దేవుని అధికారముకాలినవాడుగా ఉన్నందుకు నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. మా సమస్యలనుంచి మమ్ములను కాపాడి నీ యందు మేము ఉండునట్లు సహాయము చేయుము. నిన్ను మేము తిరస్కరించక మరియు ద్వేషించక ఉండునట్లు మా హృదయములను మార్పు కలిగి ఉండునట్లు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. పుట్టుకతో గ్రుడ్డివానిని స్వస్థత పరచినందుకు యూదులు ఎందుకు సంతోషించలేదు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:17 AM | powered by PmWiki (pmwiki-2.3.3)