Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 024 (The Revelation of the Righteousness of God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)

1. క్రీస్తు మరణము ద్వారా కలిగిన దేవుని నీతి (రోమీయులకు 3:21-26)


రోమీయులకు 3:25-26
25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని 26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. 

ఈ లోకములో ఉండు మనుషులు మాత్రమే యేసును సిలువవేయలేదు, అయితే ఈ పాపములోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడిని అందరి కొరకు చనిపోవుటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మనకు యిచ్చియున్నాడు. అయినప్పటికి పరలోక జ్ఞానము, ఈ పరిశుద్ధుడు పాపులందరి కొరకు చనిపోయెను. ఎందుకంటె యేసు రక్తము మన ప్రతి పాపమును కూడా కడిగివేయును. కనుక దేవుని కుమారుని రక్తము ద్వారా తప్ప పాపికి ఏ విధముగా కూడా విమోచనము లేదు.

మనము గమనించినట్లయితే ఈ లోకములో ఉండు ప్రహతి విధమైన శక్తి కలిగిన వస్తువులన్నిటికంటే యేసు యొక్క ఉగ్రత దినము బహు గొప్పదై ఉన్నది. మన ప్రతి పాపమును బట్టి దోషమును బట్టి మనకు శిక్ష వచ్చి, మరణము అయి ఉండాలి, అయితే మనకు రక్షణను ఇచ్చుటకు యేసు తన స్వరక్తమును మనకొరకు కార్చి ఉన్నాడు. ఈ కారణము చేతనే దేవుని కుమారుడు ఈ లోక పాపములకొరకు ఆ కలువరి సిలువలో తన రక్తమును కార్చుటకు ఉద్దేశించబడింది. ఎవరైతే అతనిదగ్గరకు విశ్వాసము కలిగి వస్తారో వారు విమోచించబడతారు. ఎందుకంటె కొన్ని వేలమంది క్రీస్తు చిందించిన రక్తము ద్వారా దేవుని శక్తిని అనుభవించి ఉన్నారు. కనుకనే ప్రియా సహోదరుడా మేము నిన్ను పిలుచుచున్నాము, నీ కొరకు త్యాగము చేసిన వాడి నుంచి నిన్ను నీవు దూరముగా ఉండకు. దానికి బదులుగా నీ ఇంటిని, నీ పనులను, నీ గతమూ, నీ భవిష్యత్తును, నీ సంఘమును మరియు నిన్ను నీవు సంపూర్ణముగా దేవుని ప్రియా గొర్రెపిల్ల మీద ఉంచు, అప్పుడు నీవు దేవుని సర్వసత్యములో నిత్యమూ నిలకడ కలిగి ఉండెదవు. కనుక క్రీస్తు రక్తములో తప్ప నీకు ఈ లోకములో ఎక్కడ కూడా సంపూర్ణ కాపుదల నీకు దొరకదు.

21 నుంచి 28 వ వచనము వరకు ఖంఠస్థముగా నేర్చుకో. వాటిని నీవు చదివినప్పుడు దాని అర్థములు నీ హృదయములో ఉండునుగాక. అప్పుడు నీవు ఈ వచనాలలో దేవుని విమోచనమే కాక దేవుని నీతి కూడా చెప్పబడి ఉన్నాడని జ్ఞాపకము చేసుకో, అదే ఈ వాక్యంలో 3 సార్లు చెప్పబడినది.

ధర్మశాస్త్ర ప్రకారము మన ప్రేమ గల దేవుడు పాపులను నాశనము చేయలేదు. అయితే కనికరము గల దేవుడు మన ప్రతి విధమైన నిర్లక్ష్యమును తన ప్రేమ ద్వారా ఓర్పుద్వారా అందరు అతని యొద్దకు రావాలని ఎదురుచూస్తున్నాడు: మరియు అతని మరణము ద్వారా మనకు సమాధానము కలిగి ఉన్నది. అతని పునరుత్తనమును బట్టి మనమందరము ఏవిధముగా అయితే విమోచించబడి ఉన్నామో అదేవిధముగా దూతలు కూడా ఆనందముతో ఉండెను.

దేవుడు అయన దగ్గరకు వచ్చువారిని క్షమిస్తాడని ఎవరైతే చెప్తారో, వారికి ఏమితెలియదు, మరియు ఈ లోక సంబంధమైన మనుషుల మాటలు నమ్ము వాడుగా ఉందును; ఎందుకంటె దేవుడు తన మాటలయందు మరియు తన పరిశుద్ధత యందు హద్దు కలిగి ఉన్నాడు, ఎందుకంటె ప్రతి పాపి కూడా చనిపోవాలని. ఎందుకంటె రక్తము చిందించక ఎవ్వరికీ కూడా పాప క్షపామన దొరకదు. ఒకవేళ క్రీస్తు త్యాగము చేయనట్లయితే దేవునికి నీతి మంతులనుంచి నింద అనునది వచ్చి ఉండెను.

క్రీస్తు సిలువలో రెండు కార్యములు జరిగి ఉన్నవి: దేవుడు తన నీతిని బయలుపరచాడు, మరియు మనలను అదే సమయములో సమాధాన పరచి ఉన్నాడు. ఎందుకంటె పరిశుద్ధుడు మనలను క్షమించ కుండా ఉండుటకు నీతి లేని వాడు కాదు, ఎందుకంటె యేసు నీతిని బట్టి అన్ని కార్యములను కూడా నెరవేర్చి ఉన్నాడు. క్రీస్తు పాపము చేయని వాడుగా మరియు తగ్గింపు కలిగిన వాడిగా ఉన్నాడు. తన శక్తి కలిగిన ప్రేమను బట్టి యేసు ఈ పాపపు లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. కనుక మనము అతనిని ఆరాధన చేసి తండ్రిని ఘనపరచాలి ఎందుకంటె మన కొరకు అతను తన అద్వీతీయ కుమారుడిని పంపి ఉన్నాడు. అయితే ఈ లోక అవసరతను బట్టి మరియు తీర్పును బట్టి అతని స్థానములో చనిపోలేదు.

(యోహాను 17) లో యాజక ప్రార్థనలో, యేసు దేవుడిని ఈ విధముగా పిలిచి ఉన్నాడు, " పరిశుద్ధ తండ్రి " అని. ఈ వచనములలో మనము దేవుని నీతిని మనము కనుగొనగలం. సృష్టికర్త ప్రేమతో మరియు సత్యముతో సంపూర్ణముతో నిండి ఉన్నాడు. అతనిలో నీతి లేనిది లేదు అయితే కనికరముతో నిండి ఉన్నాడు. క్రీస్తు యొక్క మరణములో దేవుని లక్షణములన్ని కూడా కలిసి ఉన్నవి. కనుకనే మనము పిలువబడుచున్న మాట " కృప ", ఇది మనకు దేవుని యొక్క సమాధానముచేత అతని నీతి ద్వారా మరియు ప్రేమ ద్వారా కలిగి ఉన్నది.

ప్రార్థన: ఓ పరిశుద్దుడైన త్రిత్వము కలిగిన దేవుడా నీ పరిశుద్ధాత్మను బట్టి మేము నీకు ఆరాధన చెల్లిస్తున్నాము, ఎందుకంటె మేము నిన్ను అర్థము చేస్తుకొనుటకు జ్ఞానమును దయచేసి ఉన్నావు, మరియు నీయొక్క పరిశుద్ధత సముద్రము కంటే లోతైనది. నీవు మా పాపములనుంచి విమోచించి, మరణము నుంచి విడిపించి శపించబడిన మ్రాను నుంచి మమ్ములను కాపాడి ఉన్నావు. అతని పరిశుద్ధ రక్తముద్వారా మా ప్రతి పాపమును కూడా కడిగి ఉన్నావు. కనుక మేము నీ కృప ద్వారా మరియు నీ నీతి ద్వారా పరిశుద్ధులమయ్యాము. మేము త్యాగము చేసిన యేసును ఘనపరచి అతనికి మేము సంపూర్ణముగా సమర్పించుకొన్నాము, కనుక మీ సమాధానమును బట్టి నీ విమోచనమును బట్టి నీకు కృతజ్ఞతలు.

ప్రశ్నలు:

  1. "దేవుని నీతిని ప్రకటించుట" అనే మాటకు గల అర్థము ఏమిటి?

 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను
పొందలేక పోవుచున్నారు. 
 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.

(రోమా 3:23-24)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)