Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 025 (We are Justified by Faith in Christ)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)

2. క్రీస్తులో విశ్వాసము ద్వారా విమోచించబడ్డాము (రోమీయులకు 3:27-31)


రోమీయులకు 3:27-28
27 కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమునుబట్టియే. 28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. 

ఈ లోక విమోచనము మరియు దేవునితో మన సమాధానము ఆ సిలువలోనే సంపూర్ణముగా చేయబడినది. ఏదైమైనా మనిషి విశ్వాసము ద్వారానే విమోచించబడినాడు. ఈ "విశ్వాసము" అను మాటను మనము 21 నుంచి 31 వ వచనంలో చదువగలము, అపొస్తలులు కూడా విశ్వాసము ద్వారానే విమోచినబడినారని చెప్పిరి.

ఈ విధమైన కార్యములు మనుషుల విశ్వాసములను స్థిరపరచుటకు దేవుడు వారి పాపములను బట్టి శిక్షను విధించక వారిని క్షమించి ఉన్నాడు. ఈ యొక్క విమోచనము అనునది దేవుడు మనుషులకు తన కార్యముల ద్వారా మరియు తన ధర్మశాస్త్రములు ద్వారా తన ఉద్దేశమును తెలియచేసి ఉన్నాడు. కనుక నీవు నీ ఉపవాసములలో కూడా నీవు పాపిగానే ఉంటావు. నీవు దేవునికి కృతజ్ఞతలు చెప్పువరకు మరియు నమ్మకము కలిగి ఉందువరకు నీవు ఎంత భక్తి కలిగి ఉన్న కూడా నీవు అతనికి కృతజ్ఞతకలిగి ఉండాలి. కనుక నీవు ఈ సమాధానము పొందుటలో నీ భాగము ఏమి కూడా లేదు. ఇది నీకు దేవుని యొక్క బహుమానంగా వచ్చినది. అతను నిన్ను సంపూర్ణముగా తన నీతి ద్వారా సమాధానము చేసి ఉన్నాడు, ఎందుకంటె క్రీస్తు రక్తము ద్వారా నిన్ను కడిగి ఉన్నాడు కనుక ఇది అద్భుతమైన దేవుని కృప!

కృపను బట్టి నీ సంపూర్ణ అంగీకారము, నీ కృతజ్ఞత మరియు అతనితో నీకున్న ఐక్యత ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారానే వచ్చి ఉన్నవి. క్రీస్తు యొక్క సిలువ త్యాగము మనకు దేవుని యొక్క బహుమానమై ఉన్నది. కనుక సృష్టికర్త అయినా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను కడిగి నీకొరకు తనను తాను అప్పగించుకొని నీ పాపములనుంచి నిన్ను విమోచించి ఉన్నాడు. కనుక ప్రార్థన యందును మరియు విశ్వాసము యందును అతనిలో శక్తి కలిగి ఉండుము అప్పుడు తన శక్తి కలిగిన నీతిచేత నిన్ను బలపరచును. అతని ప్రేమకు నిన్ను నీవు సమర్పించుకో.

విశ్వాసము పాపిని విమోచించును. అది మనిషి సమర్థయమును మరియు వ్యక్తిగత నీతికి ముగింపు పలుకును, ఎందుకంటె క్రీస్తులో మనము అజ్ఞానులమని తెలిసికొని ఉన్నాము. కనికరము కలిగిన దేవుని ద్వారా తప్ప మనకు ఇక ఏవిధముగా కూడా రక్షణ దొరకదు. నీవు నీ సమర్థయమును బట్టి, నీ నీతిని బట్టి, నీ కార్యములను బట్టి, నీ చదువులను బట్టి, నీ ఉన్నతను బట్టి రక్షింపబడలేదు, అయితే ఇది కేవలము నీ విశ్వాసముచేతనే రక్షించబడి ఉన్నావు. కనుక నిన్ను నీవు దేవుని కుమారునికి సమర్పించుకొనుము, అతని నూతన నిబంధనలోనికి ప్రవేశించుము, ఎందుకంటె అతను లేకుండా నీ జీవితములో పాపములో మరణము కలిగి ఉంటావు. అయితే అతని సమాధానమును బట్టి అతని నీతిని బట్టి నిన్ను విమోచించి ఉన్నాడు. నీవు దేవుడిని క్రీస్తు చిందించిన రక్తము ద్వారా తప్ప మరియి ఏవిధముగా అతనిని చేరుకోలేవు. దేవుడు తన నీతిని నీకు యిచ్చియున్నాడు కనుక అతని మీద విశ్వాసము కలిగి ఉండుము. ఎందుకంటె విశ్వాసమే నిన్ను దేవుని సమస్త అధికారములలో నిన్ను భాగస్వామిగా చేయును.

రోమీయులకు 3:29-31
29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. 30 దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.

పౌలు ఈ పత్రికను రోమా లో ఉన్నటువంటి సంఘమునకు వ్రాసియున్నాడు. ఎప్పుడైతే పౌలు విమోచనమును గూర్చి వారికి క్లుప్తముగా చెప్పి యున్నాడో వారు చాల జాగ్రత్త కలిగి వినిన తరువాత వారిలో కొంతమంది ఆ ఆత్మను బట్టి వ్యతిరేకించిరి:

గ్రీకులు ఈ విధముగా చెప్పిరి: "ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారముగా క్రీస్తు మరణము అతని నీతిని బట్టి క్షమించిఅట్లైతే, అప్పుడు సిలువ వారికి మాత్రమే సంబంధించినది, అప్పుడు మనము కూడా అందులో భాగస్తులమే."

పౌలు వారికి ఈ విధముగా సమాధానము ఇచ్చెను: "అయితే దేవుడు వారందరి పాపములను క్షమించెను. యూదులకు ఒక దేవుడు కూడా లేడు, మరియు ఇతరులకు వేరే దేవుడు కూడా లేడు, అయితే దేవుడు ఒక్కడే, కనుక సిలువ మరణము ద్వారా దేవుడు సున్నతి పొందినవారికి మరియు సున్నతి పొందని వారికి కూడా విశ్వాసము ద్వారా విమోచించాడు."

అప్పుడు యూదులలో కొంతమంది: "అది అసాధ్యము! అయితే వేరే దేశస్తులు సున్నతి లేకుండా ధర్మశాస్త్ర ప్రకారము విమోచించబడినారు, అది దేవునికి దూషణకారముగా ఉన్నది. పౌలు నీవు దేవుని ప్రకటనను పైనది క్రిందికి, క్రిందది పైనకి చేస్తున్నావని చెప్పిరి."

పౌలు వారికి ఈ విధముగా సమాధానము ఇచ్చెను: "నేను ధర్మశాస్త్ర ప్రకటనను మార్చుచున్నానా. మనము ఆ ధర్మశాస్త్రమును మన మంచి కార్యముల ద్వారా ఒప్పుకొని, మరియు మనము దేవుని త్యాగమునకు ధర్మశాస్త్రము ఒక పరిచయముగా ఉన్నది. కనుక సిలువ అనునది మనకు ధర్మశాస్త్రమునకు సంబంధించిన వాటినన్నిటినీ బయలుపరచును.

ఇక్కడ మనము ఈ రెండు గుంపుల నుంచి పౌలుకు కలుగు శ్రమలను మరియు కష్టములను తెలుసుకొనవచ్చు, ఎందుకంటె విశ్వాసులందరు దేవుని గొప్ప నీతిని బట్టి జ్ఞాపకములో ఉన్నవారు కాదు, ఎందుకంటె విశ్వాసము ద్వారా అందరు కూడా విమోచించబడినారు అను మాటను బట్టి వారు భయము కలిగి ఉండిరి. అయితే వారిలో కొందరు స్వతంత్రమైన విశ్వాసము ద్వారా వచ్చినవారు అయితే ఇది ధర్మశాస్త్రములో వ్రాయబడలేదు. మన విశ్వాసము అనునది యేసుకు సమర్పించుకొనబడినది, మరియు మనలను నిత్యమూ ప్రేమించినవాని యందు మన నమ్మకము స్థిరముగా ఉన్నది.

ప్రార్థన: నా తండ్రి మాములు మా యొక్క స్వనీతి నుంచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు మమ్ములను క్రీస్తు శక్తి చేత విమోచించి ఉన్నావు. మాకు మేము ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు మేము పాపులుగా కనబడుచున్నాము, అయితే మేము ఎప్పుడైతే సిలువ వేయబడిన నీ కుమారుడిని చూసినప్పుడు, మాకు ఇవ్వబడినటువంటి నీతిని మేము చూస్తున్నాము. కనుక మా తప్పు చేత చేయబడిన ఆరాధననుంచి మమ్ములను కాపాడియు మనుషుల కార్యముల ద్వారా విమోచనమును పొందుకుంటాము అను అసత్యములనుంచి మమ్ములను కాపాడి, నీ కుమారుని ద్వారా మేము పరిశుద్ధపరచబడునట్లు సహాయము చేయుము. మాకు ఇచ్చినటువంటి సంపూర్ణ విమోచనమును బట్టి నీకు కృతజ్ఞతలు, మరియు నీకు మేము సంపూర్ణముగా సమర్పించుకొనులాగున ఆ విధమైన నడిపింపును మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్నలు:

  1. మనము కార్యములచేత కాక విశ్వాసముచేతనే ఎందుకు విమోచించబడినాము?

కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
(రోమీయులకు 3:28)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)