Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 015 (He who Judges Others Condemns Himself)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

a) ఇతరులను తీర్పు తీర్చువాడు తనను తాను ఖండించుకొనును (రోమీయులకు 2:1-11)


రోమీయులకు 2:1-2
1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనేచేయుచున్నావుకావా? 2 అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 
 

పాపమునకు కిరీటము కపటము. మనుషులు దేవునితో ఉన్న సంబంధమును బట్టి చానా బలహీనంగా ఉన్నారని తెలిసి కూడా వారు భక్తులని, తెలివికలవారని, మరియు నీతిమంతులని నటిస్తారు. ఈ కపటము ద్వారా వారు తమ స్నేహితులను కూడా తీరుచేయుదురు, అనగా వారు వారికంటే నీతిమంతులని మరియు భక్తిపరులని వారి స్నేహితులు చెడ్డవారని అనుకుంటారు.

అయితే పౌలు నీ అహంకారమును పగులగొడుతున్నాడు. నీ దగ్గర ఉన్న అబద్దపు స్వభావమును తీసివేసి నీ నిజస్వరూపమును బయటకు తీయును. ఎవరు సత్యములో లేరో వారు నీకు తెలుసా? నీవు అతనికంటే మరియు ఎక్కు అసత్యము కలిగి ఉన్నావు. నీవు హత్యను చూసావా? నీవు నరహత్య చేయువానికంటే మరి ఎక్కువ అయినా వాడవు. నీగురించి నీ ఆలోచనలు మంచివి కావు. ఎందుకంటె దేవుని ఆత్మ నిన్ను ఖండిస్తున్నది. మొదటగా అతను అసత్య బోధకుడిని ఖండించును, ఎందుకంటె వారు పాపులకంటే మంచివారని ఎంచుకొంటారు కనుక, అయితే నీకు సత్యమును బట్టి తెలియదు. యేసు అల్లరిమూకలగురించి సిలువవేయబడలేదు, అయితే నీ లాంటి గర్విష్ఠులను బట్టి అహంకారులను బట్టి మరియు భక్తికలిగిన వారమని చెప్పు వారిని బట్టి సిలువ వేయబడినాడు.

దేవుడు నీ కార్యములను బట్టి మాత్రమే ఖండించలేదు అయితే నీ చెడు ఆలోచనలను బట్టి నీ ఇష్టములను బట్టి ఖండించుచున్నాడు. ఎందుకంటె నీ కళలు నీ చిన్నతనము నుంచి చెడ్డవిగా ఉన్నాయి. నీ అంతరంగమందు నీకు స్వలాభముగా ఉన్నావు. నీవు దేవుని ఆజ్ఞలను మరియు అతని వాక్యములను గైకొనలేదు మరియు అతనిని వెంబడించువారిని నీవు వదిలి ఉన్నావు. నీఆత్మ యందు నీవు వ్యభిచారము చేసి ఉన్నావు, మరియు సృష్టికర్త నుంచి వేరుపరచబడినావు. నీ చెడు ఆలోచనలు నీ హృదయములోనుంచి వచ్చినాయి. అయితే చివరి తీర్పు దినమందు నీ చెడు తలంపులను బట్టి నీ చెడు మాటలను బట్టి మరియు నీ చెడు కార్యములను బట్టి నీకు తీర్పు తీర్చబడును. నీవు పాపివి మరియు నీ హృదయమునాడు చెడుకలిగి ఉన్నావు. కనుక నిన్ను నీవు ఒప్పుకొని ఇతరులను ఖండించుట మాను. నీ పొరుగువారు ఒకవేళ చెడ్డవాడి ఉంటాడేమో అయినప్పటికీ వాని యెడల నీవు అదే స్వభావము కలిగి ఉండవద్దు, అయితే దేవుని ప్రేమ కలిగి ఉండు. కనుక దేవుని చిత్తములో నీ పాపములను తెలుసుకో.

నీవు ఈ కష్టమైనా మాటలను బట్టి అంగీకరించకపోవచ్చు, లేక వాటికి కారణాలు చెప్పవచ్చు, అయితే నీ హృదయమందు వాటిని తీసివేయక నీవు ప్రభువు ముందర ఒప్పుకొనలేవు. అయితే గమనించు వీటిని బట్టి నీవు నీ తీర్పు నుంచి తప్పించుకొనలేవు. నిత్యమైన అధికారము నిన్ను హింసించి నిన్ను శిక్షించును. కొంతమంది దీనిని పునరుత్థాన దినము అని పిలుస్తున్నారు. అయితే అవిశ్వాసులు మాత్రమే దేవుని ముందర నిలబడుటకు ఒప్ప్పుకొనక ఉన్నారు. ఆ సమయములో నీ ప్రతి తప్పు దోషము పాపము అందరి ముందు కనబడుచున్నది. కనుక నీ ప్రతి సమయములో దేవుడిని ఘనపరచుటకు ఈడ్చుకొనిపోవును;నీవు దేవుని బహుమానము కనుక అతను నీ గురించిన ప్రతి లెక్కను చేయును. కనుక దేవుని మహిమగల ప్రతి ఆశీర్వాదము నీ హృదయములో ఉందును.

ప్రార్థన: పరిశుద్ధమైన దేవా నీవు పరిశుద్ధుడవు, నేను అపవిత్రుడను మరియు నీ ముందర పాపము చేసినవాడను. నా ప్రతి పాపమును బట్టి నన్ను క్షమించి నీ వెలుగులోనికి నడిపించు. నా ప్రతి పాపమును ఒప్పుకొందును కనుక నీ ప్రేమతో మరియు నీ ఆత్మతో నన్ను నింపుము అప్పుడు నేను ఎవ్వరిని కూడా ఖండించక వ్యతిరేకించక ఉంది ప్రేమలో వృద్ధి పొందెదను. పాపులందరికంటే నేను ప్రధాన పాపిని. నీ ప్రేమ వాత్సల్యమును బట్టి నా మీద దయచూపు, అప్పుడు నేను నా హృదయమందు పచ్చాత్తాపము కలిగి ఉండేదని.

ప్రశ్నలు:

  1. మనిషి ఇతరులను తీర్పు చెప్పుటలో తనను తాను ఏవిధముగా ఖండించుకొనును?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:32 AM | powered by PmWiki (pmwiki-2.3.3)