Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 016 (He who Judges Others Condemns Himself)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

a) ఇతరులను తీర్పు తీర్చువాడు తనను తాను ఖండించుకొనును (రోమీయులకు 2:1-11)


రోమీయులకు 2:3-5
3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అను కొందువా? 4 లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? 5 నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. 

వ్యభిచారము మరియు గర్వము, ద్వేషము అనునది అంతటికంటే హేయమైన చర్య అయితే దానికంటే ఎక్కువైనది కపటము అని నీకు తెలుసా? ఎందుకంటె కపటము కలవాడు నీతిమంతుడని చెప్పును, మరియు యాధారతవంతుడని మరియు భక్తిపరుడని చెప్పును అయితెహ్ అతనిలో ఎక్కువగా అపరిశుద్ధత అబద్ధము మరియు మోసము అనునది ఉండును. కనుక అతను దేవుని దృష్టిలో వ్యభిచారము చేసినవాడు. అయితే పరిశుద్ద్దుడైన వాడు కపటము అను నీమీద ఉన్న గుడ్డను తీసివేసి నీవు ఎంత నీతి కలిగిన వాడో అని నీకు చెప్పును. నీకు తెలిసినదానికంటే నీ పవిత్రతే గొప్పది. కనుక అబద్దములో ఉండవద్దు. ఒక విమానంలో ఉన్న ప్రయాణికులు వారికి చెప్పబడిన అనౌన్స్మెంట్ ద్వారా ఏవిధముగా అయితే నడుచుకుంటారో అదేవిధముగా నీ జీవితములో నిత్యజీవితమును పొందుకోవాలంటే నీవు కూడా దేవుని ఆజ్ఞలను విని నడుచుకోవాలి. ఎందుకు అనేకులు మరణమును బట్టి భయపడెదరు, మరియు వ్యవసాయదారుడిని చూసి భయపడెదరు? ఎందుకంటె ఈ సమయములోనే ప్రజలు దేని విషయములో తప్పిపోయారో తెలుసుకొంటారు, కనుక వారు తీర్పు తీర్చు వాని ముందర నిలబడతారు.

కనుక ఆ తీర్పు దినమందు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు, అనగా, తెల్లవారు, నల్లవారు, ఎత్తువారు, పొట్టివారు, ధనికులు, దరిద్రులు, పురుషులు, స్త్రీలు అందరు కూడా దేవుని ముందర అతనిని ఎదుర్కొనుటకు వచ్చెదరు. అప్పుడు ఆ ప్రజలు చేసిన కార్యములను బట్టి మాటలను బట్టి పరిశుద్ధ పుస్తకములు తెరువబడుట చూచెదరు. కనుక ఈ దినాలలో జీవించుచున్నవారికి ఆ రోజు ఏవిధముగా ఉంటుందో అని చెప్పనవసరం లేదు, ఎందుకంటె ఇప్పుడున్న ప్రతి టెక్నాలజీలో మనము సమస్తమును ఒక ఊహాగా తెలుసుకొనుచున్నాము. కనుక అక్కడ సమయము ఉండవచ్చు నిత్యజీవమునకు అయితే తీర్పు తీర్చుటకు దేవునికి తగిన సమయము ఉన్నది. కనుక నీ హృదయమును గమనించు వానికి తెరవవలసిన అవసరము లేదు, మరియు నీ తల్లితండ్రులను నీ ప్రజలను నీ ఉపాధ్యాయులను నిందించడము అవసరము లేదు. నీవు దోషముచేసినవాడవు కనుక దేవుడు నిన్ను ఖండించును. కనుక తీర్పు తీర్చు గొప్ప దేవుని ముందు నిలుచుండుటకు సిద్ధముగా ఉండు.

నీవు చెరపబడ్డావని దేవుని ప్రకటన ద్వారా తెలుసుకో. యేడ్చుటకు బాధపడుటకు ప్రారంభించాను అయితే నీ పాపములు దేవుని ముందు ఒప్పుకొనుటకు సిద్దపడు, నిన్ను నీవే ఖండించి ఏమిచేసావా దానిని బట్టి చింతించు. రహస్యమందు చేసిన ప్రతి పాపమును కూడా పరిశుద్దుడైన దేవుని ముందర ఒప్పుకో అప్పుడు నీవు అందరి ఎదుట పరిశుద్ధుడవుగా ఉండెదవు. కనుక ఈ విధమైన పగిలిన హృదయమే రక్షణకు మార్గము. ఒక ఒంటె సూది వెజ్జేములోనుండి దూరుట సులువు కానీ ఒక ఖటినస్తుడు దేవుని రాజ్యములో చేరుట కష్టము.

ఏదేమైనా దేవుడు కనికరము కలవాడు. అతను తన సృష్టిని నాశనము చేయదు అయితే ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని పచ్చాత్తాపము చేత ఉంటారో వారిని ప్రేమించి వారి పాపములను క్షమించును. ఎందుకంటె అందరు చెడిపోయారని దేవునికి తెలుసు, అయితే అతను ఓర్పుకలిగి అందరి యెడల దాయకలిగి ఉన్నాడు; అతను దాయకలిగి ఉన్నాడు కనుక పాపులు ఒక్కసారి చనిపోవుటకు ఇష్టపడడు. అతని న్యాయమైన తీర్పు అందరికి ఒక గుణపాఠముగా ఉంది, అదేవిధముగా అతని మంచి తనము కూడా మనకు పచ్చాత్తాపము కొరకు ఒక అవకాశము ఇచ్చి ఉన్నది. దేవునికి ఈ లోకమును మరియు మనుషులందరినీ శపించు అధికారము కలదు అయితే అతను మనము ఎప్పటికైనా మారు మనస్సు కలిగి ఉంది మంచి జీవితము కలిగి ఉంటామని తాను ఓర్పు కలిగి ఉన్నాడు. నీలో నూతన హృదయము కలిగి ఉండునట్లు నీవు నిజముగా దేవునికి నీ పాపమును బట్టి పచ్చాత్తాపం పడుతున్నావా, మరియు నీ హృదయము నూతన పరచబడునట్లుగా ఉన్నావా? నీవు దేవుని నీతి నీ ద్వారా జరిగించబడాలని నీ ప్రతి విధమైన పాపమును బట్టి దేవునితో మొరపెట్టుకుంటున్నావా? లేక దేవుని నీతి నుంచి నీవు బయటికి వచ్చి ఉన్నావా? ఎందుకంటె తీర్పు దినమందు ప్రతి విధమైన పాపము దోషము మరియు ప్రవర్ధన అను ప్రతి ఒక్కటి విమర్శలోనికి వచ్చును, కనుక కేవలము మంచి స్వభావము కలిగి పాపములేని వారు మాత్రమే దేవునికి ఇష్టులుగా ఉంటారు.

కనుక దేవుని దయాలోనికి నీవు ఉన్నట్లతే అప్పుడు నీవు రక్షింపబడుతావు. అతని నిరీక్షణలోనికి పూర్తీగా ఉండు అప్పుడు అతని కనికరములో ఉంటావు. నీ మనసు మార్చుకొని దేవుని ప్రేమను అర్థము చేసుకో అప్పుడు నీవు దేవుడు ఎవరో అని తెలుసుకుంటావు. అతను ఒక దాయకలిగిన దేవుడు మరియు అందరి యెడల కనికరము కలిగి ఉంటాడు. కనుక దేవుడు నిన్ను చూస్తాడు వింటాడు నీ గురించి అన్ని తెలుసుకుంటాడు. మరియు నీ పితరులు మరియు వారి పితరులు కూడా అతనికి తెలుసు మరియి నీ ప్రవర్తన కూడా అతనికి తేటగా తెలుసు. మరియు నీ ప్రతి విధమైన స్వభావము కూడా అతనికి తెలుసు. అతను నీతి మంతుడు కనుక నీపట్ల ఆటను కనికరము కలిగి ఉందును. మీవి సంపూర్ణముగా అతనికి సమర్పించుకున్నట్లైతే నిన్ను క్షమించుటకు అతను సిద్ధముగా ఉన్నాడు.

నీకు పరిశుద్ధత మరియు దేవుని దయ తెలిసి ఉన్నప్పటికీ నీవు ఒకవేళ పశ్శాత్తాపము పదకోపేతే నీకు శ్రమ! అప్పుడు నీ హృదయము కఠినముగా ఉంది నీ మనసు గ్రుడ్డిగా ఉండును. ఒక మోసకరమైన ఖఠినస్తుడు అతని ఆత్మయందు చెడిపోతే తిరిగి దేవుని వైపు తిరగడు. ముందుకు అతను దేవుని మాట వినడు లేదా అతని మాటను అర్థము చేసుకోడు. అతను మంచిగా దేవుని వాక్యము చదువడు. కనుక "ఈ దినము " అనేది ఉన్నవరకు నీవు దేవుని వాక్యము విని పశ్శాత్తాపము కలిగి ఉండాలి. మరియు నీకు ఏ ఇతర అవకాశములు రాక్కామునుపు రక్షణను స్వీకరించు.

ఆ భయంకరమైన సమయమునందు దేవుని యొక్క ఉగ్రత ఎవరైతే అతని దయను బట్టి నిర్లక్ష్యము కలిగి ఉన్నారో మరియు వారి హృదయమందు ఖఠినము కలిగి ఉన్నారో వారిమీద అతని కోపము ఉండును. కనుక ఆ దినమందు వారికి ఒక నిరీక్షణ అనునది లేడుందా పోవును ఎందుకంటె వారు, కేవలము పాపము, దోషము, ద్వేషము. అవమానము, పాగా, కక్ష, అన్యాయము మొదలగునవి వారితో పాటు తీసికొనివచ్చిరి కనుక. కనుక ఆలాంటి వారు ఆ దినమందు కఠినమైన తీర్పు పొందుదురు.

ప్రార్థన: ప్రభువా నేను ఖచ్చితమైన మనసు కలిగి నీ ముందర నా పాపమును ఒప్పుకొనునట్లు నాకు నీ నడిపింపును దయచేయుము. నన్ను తిరిగి నీ చెంతకు తీసుకొనిరమ్ము. నేను నిన్ను నిర్లక్షయము చేయకుండునట్లు నీ పరిశుద్ధతతో మరియు నీ ప్రేమతో నింపబడుటకు సహాయమును దయచేయుము. ప్రభువా నేను నీ ఉగ్రతలో నశించినవాడిని అయినప్పటికీ నీ దయతో నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు. నాలో ఉన్న ప్రతి విధమైన చేదు స్వభావమును తీసివేయుము అప్పుడు నేను నీ దయాలో ఉండెదను. నా ప్రతి విధమైన మోసకరమైన స్వభావము నుంచి తప్పించుము. నీవే నా న్యాయాధిపతివి మరియు నా రక్షకుడవు. నేను నిన్ను నమ్ముకొందును.

ప్రశ్నలు:

  1. దేవుని తీర్పును బట్టి పౌలు మనకు బయలుచేసిన రహస్యములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:33 AM | powered by PmWiki (pmwiki-2.3.3)