Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 001 (Introduction)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక

రోమా పత్రిక పరిచయము


యేసు క్రీస్తు నుంచి సంఘమునకు ఈ దినాలలో ఇచ్చిన గోప్పవారమే పౌలు, ఎందుకంటె అతనినే యేసు ప్రేరేపించి రోమా పట్టణములో నివసించిని రోమీయులకు ఈ పత్రికను వ్రాయుటకు పౌలును ఒక ప్రతినిధిగా వాడుకున్నాడు.

దీని కారణము మరియు ఉద్దేశము

ఆసియ ఖండములో మూడవసారి అపొస్తలులు తమ బోధనలను అన్యులకు తమ మూడవసారి వారిని దర్శించినప్పుడు బోధించినది. ఈ ప్రయాణములో అతను కొన్ని జీవము కలిగిన సంఘములను ఆ పట్టణములలో కనుగొనెను, వాటిని విశ్వాసులు ప్రేమ్మతో స్థాపించి, పెద్దలను, యాజకులను మరియు బిషప్ లను సంఘ సభ్యుల కొరకు ఏర్పాటు చేశారు. అప్పుడు అతను తూర్పున ఉన్న మెడిటరేనియన్ అను ప్రదేశములో తన బోధను ముగించుకొనెను. కనుక అతను పడమట ఉన్న ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశములలో క్రీస్తు రాజ్యమును స్థాపించుటకు వెళ్లెను (రోమా 15:22-24)

ఈ ప్రణాళికలతో ఒక ఒప్పందం కలిగి, రోమా లో ఉన్న సంఘమునకు ఈ పత్రికను వారిని ఉత్సాహపరచి, ఈ పుస్తకమును వారు అనుదినము ధ్యానించులాగున ఈ సువార్తను అతని హస్తములకు ఇవ్వబడినదని చెప్పెను. దీని ద్వారా అతను వారు హృదయములను తాకునట్లు మరియు తన పడమటి ప్రయాణములో వారు కూడా పాల్గొనున్నట్లు మరియు సిరియా లో ఉన్న అంతియొక్ సంఘమునకు వాక్య పరిచర్యలో మరియు నమ్మకమైన ప్రార్థనలో అతనికి తోడుగా ఉండిరి. కనుక రోమీయులకు ఈ బోధనా చెప్పబడి ఆ సంఘము నిజమైన విశ్వాసముతో స్థాపించబడి ఈ లోకమునకు తన ప్రయాణములో తోడుగా ఉండిరి.

రోమా లో సంఘమును ఎవరు స్థాపించారు?

పౌలు, లేదా పేతురు, లేదా ఏ ఇతర అపొస్తలులు, లేదా గొప్పే పేరు గాంచిన రోమా సంఘపు పెద్దలు ఈ సంఘమును స్థాపించలేదు. అయితే పెంతేకొస్తు దినమందు పరిశుద్ధాత్మచేత నింపబడిన రోమా యాత్రికుడు పాస్చహత్తపః ప్రార్థనతో వ్రాసినట్లుగా చూసేడము. వారు నాలుకలు సర్వశక్తుడైన కార్యములచేత నింపబడి, మరియు సిలువవేయబడిన వాడిని వెంబడించెను. మరియు వారు వారి రక్షణను బట్టి యూదులతోను మరియు అన్యులతోను మాట్లాడి పాత నిబంధన గ్రంధము క్రీస్తు గురించి ప్రవచించిన వాటిని చదువుచుండిరి.

పౌలు తన ఆసియా మరియు గ్రీసు ప్రయాణములో ఉన్నప్పుడు రోమా విశ్వాసులను కలుసుకొని ౫౪ A D ముందు ( అపోస్త 18:2). పౌలు ఈ రోమా సంఘమునకు క్రీస్తు తనకు ఇచ్చిన ఆత్మీయ బహుమానములు ఇచ్చుటకు ఇష్టపడెను. అయితే జీవముకలిగిన ఈ లోకంపు సంఘములో అతను ఆ పట్టణములు ఉండాలను అనుకోనేలేదు. అయితే అతనితో పాటు ఉన్న ఆత్మీయ సహోదరులతో కూడా ఉండి దేవుని సువార్తను అక్కడ ఉన్న వేరే ప్రదేశములో ప్రచురించుటకు ఉద్దేశించెను.

బోధకులు ఎవరు? ఎప్పుడు? మరియు ఎక్కడ?

పౌలు ఈ పత్రిక 58 A D లో వ్రాసినాడు. అతను ఆ సమయములో గియోస్ అను కొరింథు స్థలములో ఉన్నప్పుడు వ్రాసినాడు. డమస్కలో జరుగుచున్న హింసలో పౌలు ఈ పత్రికను వ్రాసినాడు కనుక ఈ విధముగా ఎవ్వరు కూడా వ్రాయలేరు. మరియు ఈ పత్రికను అతను వ్రాస్తున్నప్పుడు యేసు యొక్క మహిమను చూసి మరియు అతని సిలువ మరణమును మరియు పునరుత్థానమును గ్రహించి వ్రాసెను. కనుక యేసు తన మరణమును జయించి తిరిగి పునరుత్తానుడై అతను ఒక సర్వశక్తికలిగిన దేవునిగా అందరికీ తెలియపరచెను. కనుక ఎవరైతే దేవుని కుమారుడిని హింసించినా కూడా అతనిని బట్టి క్షమించి అతని పట్ల కనికరము కలిగి తన కార్యములను అతని ద్వారా చేయుటకు తన కృపను దయచేసి ఉన్నాడు. కనుక భక్తుడైన పౌలు యొక్క ఆశ క్రీస్తులో గొప్పదిగా ఉండెను. కనుక అతను క్రీస్తు కృపను మరియు అతని నీతిని బట్టి విస్వసించెను. అయితే ధర్మశాస్త్ర ప్రకారము అతను నడువలేదు. అయితే దానికి బదులుగా క్రీస్తు సేవకుడిగా ఈ లోకములోనికి క్రీస్తు ప్రేమను పంచువాడుగా మరియు మోసము చేయువారిని దేవునితో బంధము కలిగి ఉండునట్లు చేసెను.

ఈ పత్రికలో చాల ప్రసిద్ధమైనవి ఏమిటి?

రోమా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి విషయములో వారికి ఉన్న మతపరమైన మార్పును తీసుకొని వచ్చుటకు పౌలు ఉద్దేశించెను. అయితే ఈ ఉద్దేశమునుబట్టి పౌలు ఈ పత్రికను ఒక మంచి భాషతో లేకా అందమైనదిగా, లేక చర్చించనట్లుగా వ్రాయలేదు. అయితే రోమా వారు మరియు యూదులు అడుగు ప్రశ్నలను బట్టి మరియు క్లుప్తమైన మాటలను బట్టి ఈ పత్రికను పౌలు వ్రాసి ఉన్నాడు. పౌలు ఈ పత్రికను తన సహోదరుడైన టర్టిస్ కు ఎవరైతే క్రీస్తు ఆత్మను ఇతరులకు చెప్పగలరా వారికే ఇది వ్రాసి ఉన్నాడు. మరియు అతను దీనిని విశ్వాసులకు అనగా పరిశుద్దతను గూర్చి ఉద్దేశించువారికి వ్రాసి ఉన్నాడు. అప్పుడు ఎవరైతే విశ్వాసముతో బలహీనులైనారో వారి దగ్గరకు వచ్చి వారి నిరీక్షణ క్రీస్తు అయి ఉన్నదో వారి దగ్గరకు వచ్చెను. కనుక వారు వారి హృదయములను క్రీస్తు కొరకు విరిగినట్లు నలిగినట్లు చేసుకొని దేవుని ప్రేమకు మరియు పరిశుద్ధాత్మకు లోబడి ఉండిరి. మరియు ఈ పత్రికను అపొస్తలుడు ఒక సామాన్యమైనవారికి వ్రాసి ఉన్నట్లుగా ఉండెను. మరియు అతను ఈ పత్రికను కొందరికి మాత్రమే వ్రాయలేదు అయితే సమాజములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై వ్రాసి ఉన్నాడు. ఈ పత్రిక ఈ నాటి క్రైస్తవులకు కూడా ఒక బోధనగానే ఉన్నది. కనుకనే మార్టిన్ లూథర్ చెప్పినట్లు, " ఈ పుస్తకము క్రొత్త నిబంధనకు ఒక ముఖ్య పత్రిక, కనుక ప్రతి క్రైస్తవుడు దీనిని ఫాతించాలి ఎందుకంటె ప్రతి విశ్వాసి ఎలాగ ఉండాలో దీని ద్వారా నేర్చుకోగలరు: ధర్మశాస్త్రము మరియు సువార్త, పాపము మరియు తీర్పు, కృప మరియు విశ్వాసము, నీతి మరియు సత్యము, క్రీస్తు మరియు దేవుడు, మంచి కార్యములు మరియు ప్రేమ, మరియు నిరీక్షణ మరియు సిలువ. మనము కూడా ఇతర మనుషులతో ఏవిధముగా ప్రవర్తించాలో గమనించాలి, ఒకవేళ వారు భక్తులై ఉండవచ్చు లేదా పాపులై ఉండవచ్చు, బలహీనులై ఉన్దవఃహు లేకా బలవంతులై ఉండవచ్చు, లేదా స్నేహపూర్వకంగా ఉండవచ్చు లేక ఆ విధముగా ఉండక పోవచ్చు, కనుక మనము ఇతరులను బట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కనుక నేను చప్పవలసినది ఏమనగా, ప్రతి క్రైస్తవుడో కూడా ఈ మాటలను బట్టి నేర్చుకోవాలి."

ప్రియా సహోదరుడా ఒకవేళ నీవు నీ విశ్వాస జీవితములో బలము కలిగి ఉండాలనుకుంటే ఈ రోమా పత్రికను చదువగలవు. ఇది ఒక దేవుని పాఠశాలగా, జ్ఞానమును, శక్తిని మరియు ఆత్మను కలిగి ఉన్నది. అప్పుడు క్రీస్తు నిన్ను అహంకారమునుంచి విడిపించి, నీవు క్రీస్తు నీతిని కలిగి అతనికి నమ్మకమైన సేవకునిగా ఉండునట్లు స్థాపించబడాలి.

ఈ రోమా పత్రిక యొక్క పరిశీలన

రోమీయులకు 1:1-17 -- రోమా సంఘమునకు గుర్తింపు. అపొస్తలుల దీవెన. మరియు ఈ పత్రిక ద్వారా దేవుని నీతిని నియమించడము.

భాగము - 1 - దేవుని నీతి ద్వారా మనము నొరదశముగా చేయబడుట

రోమీయులకు 1:18 - 3:23 -- మనమందరము పాపులం, అయితే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు మనలను ఖండించుట, మరియు మన గర్వమును తీసివేయుట
రోమీయులకు 3:24 - 4:25 దేవుడు ప్రతి మనిషిని క్రీస్తు ద్వారా నిర్దోషులుగా చేయుట, ఒకవేళ వారు విశ్వసించినట్లైతే
రోమీయులకు 5:1 - 8:39 - ఏ విశ్వాసి అయితే ఆత్మ కలిగి ధరశాస్త్ర ప్రకారము ఉండక ఉందురో వారిలో యేసు ఆత్మ నిలిచిఉంది వారికి నిరీక్షణకు ఇచ్చి వారి పాపములమీద బూర ఊదుట.

భాగము - 2 - చరిత్రలో దేవుని నీతి

రోమీయులకు 9:1 - 11:36 -- దేవుడు నిత్యమూ నీతికలిగి ఉన్నాడు ఒకవేళ పాత నిబంధన ప్రజలు తన కృప తిరస్కరించిననూ.

భాగము - 3 - ఆచరించుటలో దేవుని నీతి

రోమీయులకు 12:1 - 16:27 నిజమైన విశ్వాసము మన కార్యములను, ప్రవర్తనను, జీవితమును ప్రేమతో మార్చును.

ఈ పత్రిక చదువుటకు సులువైనది కాదు. ఇది నీ ప్రార్థనను, ఆలోచనలను కోరుకొని ఆశీర్వాదములచేత నీవు ఆనందించి, నిజమైన పచ్చాత్తాపము కలిగి, నీ మనసును మార్చుకొని, క్రీస్తులో నూతన జీవితమును చూసెదవు. రోమీయులకు ఈ పత్రిక ఆత్మీయమైన మేలులను తీసుకొని రాకున్నప్పటికీ వారు క్రీస్తు కృపచేత నింపబడి, వారి చుట్టూ ఉన్న దేశములలో క్రీస్తు సువార్తను ప్రచురించి క్రీస్తు ప్రేమను మరియు అతని యెడల నిరీక్షణకు ప్రార్థనను కలిగి ఉండి వెళ్ళాలి.

ప్రశ్నలు:

  1. రోమీయులకు వ్రాసిన ఈ పత్రికలో ముఖ్యమైన కారణాలు ఏమిటి?
  2. రోమా లో ఎవరు సంఘమును కనుగొన్నారు?
  3. ఈ పత్రికను ఎవరు ఎప్పుడు వ్రాసారు?
  4. పౌలు ఏ విధముగా ఈ పత్రికను వ్రాసాడు?
  5. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 09:58 AM | powered by PmWiki (pmwiki-2.3.3)