Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 104 (Jesus intercedes for the church's unity)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)

4. సంఘ ఐక్యతను గూర్చి క్రీస్తు మధ్యవర్తిత్వము చేయుట (యోహాను 17:20-26)


యోహాను 17:20-21
20 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, 21 వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

క్రీస్తు తన శిష్యులను దేవుని ప్రేమలో మరియు అతని శక్తిలో ఉంచి, వారిని సిలువ మరణము వరకు చెడు నుంచి కాపాడమని అడిగెను . ఎప్పుడైతే క్రీస్తు తన ప్రార్థనకు సమాధానము కలిగినదని అనుకున్నప్పుడు , తన ముందు అనేకులు అపొస్తలుల వాక్యము కొరకు ఎదురుచూచుట చూసేను. సిలువ మరణము చేత సాతాను పైన కలిగిన విజయము వారిని అతని దగ్గరకు నడిపించెను. జీవము కలిగిన క్రీస్తు పైన వారి కున్న విశ్వాసము నిత్యజీవమును వివరించునట్లుగా కృప చూపెను. విశ్వాసము చేతనే వారు తండ్రితో మరియు కుమారునితో నిత్యా ఐక్యత కలిగి ఉండిరి.

అపొస్తలుల ద్వారా విశ్వసించిన వారిని బట్టి క్రీస్తు ప్రార్థన చేసెను. అయితే ఎప్పుడైతే అతను వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు కనపడక పోయిరి. అతని మాటలు అపొస్తలుల ప్రామాణికత్వమును చూపెను. మన యెడల అతని న్యాయపరమైన డిమాండ్ ఏది ? మన ఆరోగ్యము కొరకు ప్రార్థించినాడా? లేక మన భవిష్యత్తు గురించి ? లేదు ! అయితే మనము క్రైస్తవులందరితో ఐక్యత కలిగి ఉండులాగున మనకు సత్వేఏకమును ప్రేమను దయచేయుమని తన తండ్రి దగ్గర అడిగెను. కనుక మనము ఇతరులకంటే శ్రేష్ఠులమని ఆలోచన చేయకూడదు.

సంఘమంత కూడా ఐక్యత కలిగి ఉండాలని క్రీస్తు ఉద్దేశమై ఉన్నది మరియు ఇది ఆయన ప్రణాళికై ఉన్నది. అయితే ఈ ఐక్యత అనునది మనుషుల కార్యముల ద్వారా కలుగునది కాదు అయితే ఇది కేవలము ఆత్మేయముచేత ఐక్యత చేయబడుతుంది గ్రహించాలి. దేవుడు ఏవిధముగా అయితే ఒక్కడే అయి ఉన్నదో అదేవిధముగా సంఘములో ఉండు ప్రతి విశ్వాసి కూడా పరిశుద్దాత్మ కలిగి సంఘ సహవాసములో మరియు ఐక్యతలో ఒక్కరిగా ఉండాలి. అయితే క్రీస్తు , " వారు నాయందు ఒక్కటి లేదా మీలో ఒక్కరు " అని ప్రార్థించలేదు, అయితే " అందరు తండ్రి కుమారా పరిశుద్ధాత్మలో ఒక్కటిగా ఉండాలని" ప్రార్థించెను. అతను నిన్ను అతనితో పాటు ఉంచాలని కోరుకున్నాడు ఎందుకంటె ఈ లోకములో నరకము తప్ప మరి ఏమి కూడా లేదు కనుక .

మనము దేవునితో ఐక్యత కలిగి ఉండుట అంటే మనము ఆయనతో ఆత్మీయముగా ఉండుట కాదు, అయితే ఎవరైతే దేవునికి దూరముగా ఉన్నారో వారిని అతని దగ్గరకు తెచ్చుట అని అర్థము. ఎందుకంటె వారు వారి పాపములో చచ్చినవారని తెలుసుకొని వారు పాపమని బానిసత్వములో ఉన్నామని తెలుసుకుకొని వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు రక్షకుడి కొరకు ఎదురుచూస్తుంటారు. కనుక ఎవరైతే తండ్రి కుమారా పరిశుద్దాత్మ యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు లోబడి ఉన్నపుడు దేవుని శక్తిని పొందుకుంటారు; అప్పుడు వారు క్రీస్తు ప్రేమలో ఆనందముకలిగి ఉంది అతని నామమందు ఆరాధించువారుగా ఉంటారు. మనమందరము కూడా మనుష్య కుమారుడైన యేసుకు ఒక సాక్ష్యులుగా ఉన్నాము. ఒకవేళ క్రైస్తవులందరూ పరిశుద్దులుగా ఉన్నట్లయితే ఇక అవిశ్వాసులు ఈ లోకములో ఉండరు. వారి ప్రేమ మరియు సమాధానము అందరిని మార్పులోనికి నడిపించును. కనుక మనము క్రీస్తు చెప్పినట్టు ఐక్యత కలిగి ఉండాలి ! కనుక నీవు క్రైస్తవులందరితో ఐక్యతలేక రక్షించబడుతున్నవారికి అడ్డుగోడల ఉంది సంఘములో గ్రూపులను చేయుటలో సహకరిస్తావా ?

యోహాను 17:22-23
22 మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23 వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

క్రీస్తు మహిమ ఏమిటి ? అది కాంతి లేక ఘనత కలిగిన వెలుగా ? లేదు ! అతని ఘనత సత్వేఏకము, సహనము మరియు దీర్ఘశాంతము కలిగినది. ప్రతి ఆత్మీయ బహుమానము అతని కృపద్వారా వచ్చినది. అందుకే యోహాను చూసి చెప్పినట్టు, " మేము అతని మహిమ చూసాము". అతను తన పునరుత్థానమును గూర్చి మాత్రమే చెప్పలేదు అయితే అతని సిలువ మరణమును గూర్చి కూడా చెప్పెను. అప్పుడు తన మహిమను మనిషి రూపమందు కూడా తెలియపరచెను. కనుక కృప కలిగిన యేసు మనమీద ఉన్నాడు. కనుక ఆత్మీయ తండ్రి మరియు కుమారుడు మన మధ్యన ఉన్నాడు.

ఈ విధమైన ఉద్దేశములు మనతో పాటె ఉంచుకొనుటకు అతను ఇవ్వలేదు అయితే ఇతరులకు అదేవిధమైన పరిచర్య చేసి వారిని కూడా ఒకేవిధమైన విలువను ఇచ్చునట్లు తన ఉద్దేశమును బయలుపరచెను. ఇదే ఆత్మీయమైన ప్రవర్తనను క్రీస్తు పరిశుద్ధ త్రిత్వము ద్వారా ఇవ్వుమని తన తండ్రిని కోరెను. దేవుని ప్రేమ సంఘములో రుచిచూడబడెను. అతనే మనలను నిత్యా రూపములోనికి మార్చును.

ఖచ్చితముగా దేవుడు తన సంఘములో సంపూర్ణముగా ఉండును (ఎఫెసీ 1:23; కొలసి 2:9). లేక నీవు ఒకేవిధమైన రూపము వచ్చునట్లు దీనిని చదివినావ, " క్రీస్తులో సంపూర్ణ దైవత్వము ఉన్నది; మనము దానిలో సంపూర్ణముగా ఉన్నాము". అపొస్తలుల సాక్ష్యముద్వారా క్రీస్తు ప్రార్థన మరణము ముందు చేయబడినది అని రుజువు. మనము క్రీస్తును ఎందుకు ఆరాధిస్తామంటే మనము పాపములో ఉన్నప్పటికీ మనలను అతను వదలకు విడువక మన పట్ల కృప చూపి తన రక్తము చేత మన ప్రతి పాపమును కడిగి మనలో అతను ఉండి మన ద్వారా జీవించబడాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు.

మనము నిజమైన ప్రేమలో ఉండగలమని క్రీస్తు ముందుగానే నమ్మకము కలిగి ఉన్నాడు. కనుక మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. మనము ఐశ్వర్యములో లేక జ్ఞానములొ మరియు సమర్థతలో కాదు కానీ ప్రేమలో మరియు దయాలో ఐక్యత కలిగి ఉండాలని అతను కోరుకుంటున్నాడు. " మీ పరలోకమందున్న తండ్రి సత్యమై ఉండులాగున మీరును కూడా సత్యమై ఉండుడి" అని చెప్పినట్లు ఉండాలి. ఇది మన శత్రువుల యెడల మనము ప్రేమ కలిగి ఉండాలనుటకు ఒక ఉదాహరణగా ఉన్నది. అయితే అతని మధ్యవర్తిత్వములో ప్రతి ఒక్కరు సంఘములో ఐక్యత కలిగి ఉండాలని ఆశించెను. ఆత్మ మనలను ఒంటరివానిగా చేయదు అయితే పరిశుద్దులతో సహవాసము చేయినట్లు నడిపించును. కనుక త్రిత్వము ఏవిధముగా అయితే ఒక్కటై ఉండునో మనము కూడా ఈ లోకముల ఆ త్రిత్వమును చూపించాలంటే మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంధములో ఏవిధముగా అయితెహ్ ప్రహతి ఒక్కరు దేవుడిని కనపరాహారో అదేవిధముగా మనము కూడా సంఘములో పరిశుద్ధ త్రిత్వ రూపమును కలిగి ఉండాలి.

సంఘములో మనకు ఉన్న ఐక్యత ఈ లోకములో మనము దేవుని నుంచి వచ్చినవారమని కనపరచుటకు అవకాశము కలదు. వారు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని అర్థము చేసుకొనుటకు మార్గము కలదు. వారి విశ్వాసములను బలపరచుకొనుటకు ఈ ఐక్యత చాలును పెద్ద ఉపన్యాసములు ఆవరసము లేదు. ఎక్కువ సమయము వెచ్చించు వాక్యములకంటే దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి మంచి మాటలు పలుకుట గొప్పది. యెరూషలేములో పరిశుద్దాత్మ వారినందరిని ఐక్యతలోనికి నడిపించెను.

ప్రార్థన: ప్రభువా మమ్ములను నీ విశ్వాసములోనికి నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. నీ సాక్ష్యము ద్వారా మమ్ములను నీ సేవకులుగా చేసినావు. మమ్ములను నీ శరీరములో భాగముగా చేసినందుకు నిన్ను మేము ఆరాధిస్తాము. మమ్ములను నీ పరిశుద్ధ త్రిత్వంలోనికి నడిపించు. మా సంఘములలో మేము ఐక్యత కలిగి ఉండులాగున నీ శక్తిచేత మమ్ములను నింపుము.

ప్రశ్న:

  1. మన ప్రయోజనము కొరకు యేసు తన తండ్రితో దేని కొరకు అడిగెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:19 PM | powered by PmWiki (pmwiki-2.3.3)