Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 103 (Jesus intercedes for his apostles)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)

3. యేసు తన అపొస్తలుల గురించి మధ్యవరహిత్వము చేయుట (యోహాను 17:6-19)


యోహాను 17:14
14 వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.

యేసు తన ప్రార్థనలో తన శిష్యులకు తండ్రి వాక్యములను వారికి వివరించెనని చెప్పెను, వారికి తండ్రి నామమును మరియు దాని అర్థమును బయలుపరచెను. ఈ ప్రవచనము ద్వారా అతను తన పరిశుద్ధ త్రిత్వమును చెప్పెను. ఈ ఆశ్చర్యమైన కార్యము శిష్యులను తాకెను; కనుక వారిని మర్చి, వారు క్రీస్తు శరీరములో భాగమై ఉన్నట్లు వారికి శక్తిని ఇచ్చెను.

ఈ విలువల ద్వారా ఈ లోకము వారిని ద్వేషించెను, ఎందుకంటె వారు యేసును ద్వేషించారు కాబట్టి. క్రీస్తు దేవుని ద్వారా వచ్చినట్లు అతని జీవితము కూడా దేవునితో నిత్యముగా ఉండెను, కనుక ఎవరైతే నూతనముగా జన్మిస్తారో వారు తిరిగి నిత్యజీవములో జీవించెదరు.

యోహాను 17:15
15 నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను.

క్రీస్తు తన శిష్యులను పరలోకమునకు తీసుకొనిపోలేదు , మరియు వారిని ఒంటరిగా విడువలేదు, వారికి కస్టాలు శ్రమలు వచ్చినప్పటికీ విడువలేదు. తన తండ్రికి తన శిష్యులను సాతాను నుంచి మరియు మోసము చేయు ఆత్మ నుంచి కాపాడమని విన్నవించెను. మన ప్రభువు మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ప్రతి విశ్వాసి కూడా అతని కౌగిలిలో ఉండి ఎల్లప్పుడూ అతని సంరక్షణలో ఉందురు. క్రీస్తు తన రక్తము చేత మనలను కాపాడును మరియు అతని త్యాగముద్వారా దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండును. కనుక మన్నలు ఎవ్వరు కూడా నాశనము చేయలేరు. పరిశుద్దాత్మ ద్వారా మనము నీతిమంతులముగా మరియు పాపములేని వారముగా ఉన్నాము. ఒకవేళ మనము లోబడక ఉన్నట్లయితే అప్పుడు మనము శోధనలోనికి వెళ్లుదుము, అప్పుడు పాపము అనునది మనలను ఈ లోకములోని ముంచి మనలను సిగ్గుపరచును. అప్పుడు మనము ఏడుస్తూ ," తండ్రి మాములు శోధనలోనికి నడిపింపక , చెడునుంచి కాపాడు" అని ప్రార్థన చేస్తాము. ఎవరైతే తన సొంత శక్తిచేత మరియు జ్ఞానముచేత సాతాను దగ్గర పోరాడినట్లైతే తనకు తాను మోసపుచ్చుకొన్నట్లు. వారు క్రీస్తు రక్తము ద్వారా ఎదుర్కోవాలి ఎందుకంటె అతను మాత్రమే రక్షకుడు కనుక.

యోహాను 17:16-17
16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.

శిష్యులు ఇనకనూ ఈ లోక ప్రకారముగా ఉన్నప్పుడే క్రీస్తు తన ప్రార్థనలో తన సాక్ష్యమును గూర్చి పదే పదే చెప్పెను. వారు దేవుని కృపలో చెడ్డవారిగానే ఉండిరి. అయితే క్రీస్తు రక్తము వారిని సాతాను బంధములనుంచి విడిపించెను. వారు ఈ లోకములో ఒక విదేశీయులుగా ఉండి పరలోక పౌరులై ఉండిరి.

ఈ సహజమైన స్థితిలో శరీరమందు మరియు ప్రాణమందు వారికి ఒక పోరాటం జరిగెను. ఒకవేళ మనము ఇతరులకంటే ఎక్కువగా మన శరీరములను మన కార్యములను ప్రేమించినట్లైతే పరిశుద్ధాత్ముడు నొచ్చుకొనును. మన ఘనతలాన్ని కూడా మనకు గాయములను చేయును. ప్రతి అబద్ధము కూడా కాల్చివేయబడుతుంది. నీ ఇంట్లో ఉన్నవస్తువుల్ దొంగిలించుటకు పరిశుద్ధాత్ముడు అవకాశము కలిగించడు. ఒకవేళ నీవు ఎవరినైనా నీ మాటచేత లేక నీ ప్రవర్తన చేత నొప్పించినట్లైతే పరిశుద్ధాత్ముడు నిన్ను వారి దగ్గరకు నడిపించి క్షమాపణ కోరినట్లు చేయును. నీ జీవితములో ఉండు ప్రతి దుర్మార్గమును మరియు మోసమును పరిశుద్ధాత్ముడు తొలగించి, నిన్ను న్యాయముగా ఉంచును.

మనలను పరిశుద్ధపరచుమని క్రీస్తు తన తండ్రిని వేడుకొనెను, ఎందుకంటె పరిశుద్ధత లేదని వాడు ఇతరులను పరిశుద్దములోనికి నడిపించాడు కనుక. ఇది అతని సత్యములోనికి నడిపించెను. దీని ద్వారా మనము దేవుని ప్రేమ మరియు అతని కుమారుని యొక్క కృపను మరియు శక్తి కలిగిన పరిశుద్ధాత్మను పొందుకొనుటకు సహకరించును. కనుక దేవుని సన్నిధి మనజీవితములో చాల అవసరము. దేవుడే తన ఉద్దేశమును మన జీవితాలలో నెరవేర్చును, " నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్దులుగా ఉండుడి ". ఎందుకనగా క్రీస్తు రక్తము మనలను కడిగివేయును, అది ఒకసారి చేయబడినది. కనుక నీ విశ్వాసమే ఈ సహజమైన త్రిత్వములోనికి నిన్ను నడిపించును.

మనము అతని వాక్యంలో ఉండులాగున ఈ కార్యమును దేవుడే చేసి ఉన్నాడు. సువార్త మనము కడగబడుటకు ఒక మార్గమై ఉన్నది, మరియు మన లోబడి స్వభావము కూడా ఒక మార్గమై ఉన్నది. క్రీస్తు వాక్యము మనలను విశ్వాసములోనికి నడిపించును. కనుక నీ హృదయమును తండ్రి వాక్యము కొరకు తెరువుము, ఎందుకంటె దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఎవరైతే అతనిలో నిలిచెదరో వారు ప్రేమ అయి ఉండును, కనుక దేవుడు అతనిలో ఉండును .

యోహాను 17:18
18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.

క్రీస్తు తన శిష్యుల కొరకు వారిని పరిశుద్ధపరచుమని ప్రార్థించిన తరువాత వారిని ఈ చేదు లోకమునకు పంపెను. అతను మనలను రక్షించింది మనలను పరిశుద్ధపరచుటకు;కనుక ఈ లోకములో ఉన్న అనేకులు కూడా పరిశుద్ధపరచబడులాగున మనలను ఈ లోకములోనికి పంపి ఉన్నాడు. సంఘము అనునది ఒక విందును చేయుటకు లేదా భక్తులతో ఇష్టము వచ్చినట్లు చేయుటకు చేయబడినది కాదు, అయితే ఇది సహవాసముకలిగి ఉండుటకు మరియు సాతాను నుంచి వేరుపరచబడిన వారితో ఐక్యత కలిగి ఉండుటకు మరియు క్రీస్తును ఆరాధించుటకు చేయబడినది. సంఘము అనునది తండ్రి రాజ్యమును ప్రకటించి మరియు అతని సువార్త ఈ భూమి మీద చెప్పబడుటకు చేయబడి ఉన్నది. కనుక నీవు క్రీస్తు ప్రార్థనద్వారా సువార్త చేయాలనీ తెలుసుకొన్నావా ?

తండ్రి తన కుమారుడిని నశించినవారికొరకు ఎలా అయితే పంపి ఉన్నదో అదేవిధముగా క్రీస్తు నిన్ను కూడా ఈ లోకములో నశించిపోతున్నవారికొరకై పంపి ఉన్నాడు. అతని ఉద్దేశము ఒకటై ఉన్నది అది యేదనగా దేవుని సత్యము ఈ భూమి మీద నింపబడాలి అని. కనుక యేసు నిన్ను దీని విషయమై పిలిచాడు కనుక నీవు సోమరి వాడవై ఉండక చలనము కలవాడవై ఉండుము, అప్పుడు నీవు పరిశుద్దాత్మ శక్తిని పొందుకుంటావు.

యోహాను 17:19
19 వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

ఒకవేళ శిష్యులకు దేవుని శక్తి సంరక్షణ పరిశుద్ధత లేకుంటే వారు ఈ లోకములోనికి వెళ్లి సువార్త ప్రకటించలేరని యేసుకు తెలుసు. అందుకోసమే క్రీస్తు బలయ్యాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడయినా కూడా తిరిగి వారికొరకు తనకు తాను పరిశుద్దుడయ్యాడు. క్రీస్తు రక్తము ద్వారా అతని మరణము ద్వారా యేసు తన పరిశుద్ధత చేత వారిని అడిగెను. అతని మరణము ద్వారా శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. అప్పుడు వారు జీవజాలములను ఇచ్చు పాత్రలైరి;అప్పుడు క్రీస్తు మృతిని , పునరుత్థానమును సాక్షయముగా చెప్పిరి.

అప్పుడు వారి పెదవులు మరియు మోసపరచు వారి నోరు కడగబడెను. అప్పుడు వారు తమ పాపములను ఒప్పుకొనుటకు తగిన ధైర్యమును పొంది వాటి యందు నిలకడ కలిగి ఉండిరి, ఎందుకంటె అదే వారిని సర్వ రక్షణలోనికి నడిపించును కనుక. కనుక అబద్ధము , దోషము, గర్వము ఇవన్నియు క్రీస్తు రక్తములో సంపూర్ణముగా కడగబడాలి.

ప్రార్థన: మా హృదయములో ఉన్న ద్వేషమును, అబద్ధములు మరియు గర్వమును క్షమించు. మేము చెడ్డవారము మీరు పరిశుద్ధులు. మమ్ములను సాతాను నుంచి కాపాడు. మీ వాక్యము మమ్ములను పరిశుద్ధులునుగా చేయునట్లు మాకు నీ సువార్తను ప్రకటించుము, అప్పుడు మేము ఏమైతే ప్రకటించామో అదేవిధముగా జీవించెదము.

ప్రశ్న:

  1. మనలను చేదు నుంచి కాపాడమని క్రీస్తు తన తండ్రిని ఏవిధముగా అడిగెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:18 PM | powered by PmWiki (pmwiki-2.3.3)