Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 088 (The Holy Trinity descends on believers)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)

2. ఆదరణ కర్తగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదికి వచ్చుట (యోహాను14:12-25)


యోహాను 14:21
21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.

కృప చేత క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదములు తన సంఘమునకు ఎల్లప్పుడూ వచ్చును. ఒకవేళ విశ్వాసులందరు సంపూణముగా నిండి ఉన్నప్పటికీ సముద్రములాంటి కృప నిలుచును. తన శత్రువుల ముందర యేసు మెస్సయ్య అని మరియు దేవుని కుమారుడని చెప్పవలసి వచ్చెను. ఏదేమైనా చివరి ఘడియల్లో యేసు శిష్యులతో అతని ఐక్యతను బయలుపరచెను . కనుక మన హృదయములు తెరువబడినట్లైతే అప్పుడు క్రీస్తు దైవత్వము చేత నింపబడెదము.

తన శిష్యులు ప్రేమ మంచితనమును మాత్రమే కలిగించెను అని యేసు చెప్పెను, అయితే ఈ ప్రేమ తగ్గింపు స్వభావము మీద ఆధారపడినదని గ్రహించాలి. సహజమైన మనిషి ఈ విధమైన క్రీస్తు ప్రేమను కనుగొనడు. అయితే అతను పరలోక ద్వారములను తెరచి మన సహోదరులను ప్రేమించుటకు కావలసిన పరిచర్య స్వభావమును పంపును; అతని ప్రణాళికలను తెలుసుకొనునట్లు తన జ్ఞానమును ఇచ్చును. అతని ఆజ్ఞలు కస్టమైనవి కావు. అతని ఆత్మ మనలను బలపరచి మనము అతని ఆజ్ఞలను ప్రేమ కలిగి పొందునట్లు చేయును. కనుక అతనిని ప్రేమించి ఆత్మలో నడవాలి.

నీవు యేసును ప్రేమిస్తున్నావా ? ఆనందముతో తొందరగా సమాధానము చెప్పవద్దు "అవును" అని. లేదా " లేదు " అని. ఒకవేళ నీవు నూతనముగా జన్మించినట్లైతే అప్పుడు పరిశుద్ధాత్ముడు, " అవును నేను ప్రేమిస్తున్నాను, నీ ఘనతను బట్టి, నీ సత్వేఏకమును బట్టి, నీ త్యాగమును బట్టి, మరియు నీ ఓర్పును బట్టి; నిన్ను ప్రేమించుటకు నాకు ఆ ధాన్యతను ఇచ్చావు. " ఈ విధమైన పరిశుద్దాత్మ చర్చ్ వ్యర్థము కాదు, అయితే ఇది ప్రేమను వెల్లడి చేయుటకు కార్యము చేయును. దేవుడు తనకు ఇష్టులైన వారికి తన ప్రేమను మరియు కృపను ఇచ్చును.

యేసును ప్రేమించు వారిని దేవుడు ప్రేమించును. తండ్రి తన శక్తిని జాలిని మనుషులను రక్షించుటకు తన కుమారునితో నింపెను. ఎవరైతే యేసును పొందుకుంటారో వారు దేవుడిని పొందుకున్నట్లు, ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు కూడా వ్యతిరేకించబడుతారు. దేవుడు నిన్ను పిలుస్తున్నదని గ్రహించావా, " నా ప్రియమైనవాడా", ఎందుకంటె క్రీస్తు ఆత్మే నిన్ను మర్చి నీవు ప్రేమకలిగినవాడుగా ఉంచెను. నీకు నీవే మంచి వాడవు కావు అయితే దేవుడే నీలో మంచితనమును ఉంచాడు. క్రీస్తు నీ కొరకు ఒక రాయబారిగా ఉంది నీవు నిత్యజీవము కలిగి ఉండునట్లు నిన్ను నిలబెట్టాడు. అతనిని గురించి నీకు ఆత్మీయముగా కనపరచెను. కనుక నీవు దేవుని జ్ఞానములొ ఎదిగి, దానిలో నిలకడ కలిగి ఉండు, ఎందుకంటె జ్ఞానము అంటే లోబడుట అని అర్థము .

యోహాను 14:22-25
22 ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.

యేసుకు యూదా అను వేరొక శిష్యుడు కూడా కలదు, అయితే ఇతను ఇస్కరియోతు కాదు. అతను ఆ ద్రోహి వెళ్ళినప్పుడు క్రీస్తును గ్రానించాడు. అందుకే అతను ఏదో సంగతి జరుగుతున్నదని గ్రహించాడు.

యేసు అతనికి నేరుగా సమాధానమును ఇవ్వలేదు, అయితే సంఘమును గూర్చి మరియు ఈ లోకమును గూర్చి అతని మరణమును గూర్చి చెప్పాడు. యేసు వారికి దేవుని జ్ఞానమును ఏవిధముగా కలిగి ఉండాలో అని నడిపించెను. కనుక ఈ విధమైన సత్యము మనము పొందుకొనినప్పుడు మనము ఎంత బహిరంగముగా ఉంది పరిశుద్దాత్మ శక్తిని పండుకొని దేవుని ఆజ్ఞలను ప్రేమతో అనుభవించువారుగా ఉంటాము. మరియు క్రీస్తు, " మేము విశ్వాసి దగ్గరకు వచ్చి అక్కడ సహవాసము కలిగి ఉంటాము"అని. అతను సంఘమును గూర్చి మాట్లాడుట వినలేదు, అయితే కేవలము విశ్వాసుల గురించి. పరిశుద్ధమైన త్రిత్వము విశ్వాసులను దర్శించి వారిలో ఉందును. ఈ మాటలు మనిషి హృదయాలలో ఉండును. రక్షణలోనికి ప్రవేశించుట అనునది దేవుడు సంపూర్ణముగా మనుషులను కాపాడును అని . కనుక ఎవరైతే క్రీస్తును అనుభవిస్తారో వారు ఈ రహస్యమును తెలుసుకుంటారు.

ప్రార్థన: త్రిత్వమైన తండ్రి కుమారా పరిశుద్దాత్మ మేము నిన్ను ఆరాధించి మహిమపరచెదము. నేను పాపినననూ నన్ను దర్శించావు. నా పాపములను క్షమించు. నాకు ఇచ్చిన నీ ప్రేమ శక్తిని బట్టి కృతఙ్ఞతలు. మరియి నీ ఆత్మీయ ప్రేమను బట్టి కూడా. నన్ను నీ నామములో ఉంచుము.

ప్రశ్న:

  1. క్రీస్తు మీద మన ప్రేమ మరియు పరిశుద్దాత్మ మనలో ఏవిధముగా ఎదుగుతుంది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:59 AM | powered by PmWiki (pmwiki-2.3.3)