Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 087 (The Holy Trinity descends on believers)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)

2. ఆదరణ కర్తగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదికి వచ్చుట (యోహాను14:12-25)


యోహాను 14:15
15. నన్ను ప్రేమించినట్లైతే , నా ఆజ్ఞలను పాటించుము .

సువార్తీకారణ కల్వరి కృతజ్ఞతను నెరవేర్చును. ఎవరైతే సువార్తీకారణ చేయక ఉంటాడో వాడు క్రీస్తు స్వత్నద్ర్యమును పొందుకొనడు. ఒకవేళ నీవు ఆ ప్రార్థనలను కనుగొనినట్లైతే ఆవు ఫలవంతము కానివి, నీవు క్రీస్తు ప్రేమలో ఉన్నావా లేక నీ పాపములు ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్నాయా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. కనుక వాటిని బట్టి నీవు క్రీస్తు దగ్గర ఒప్పుకొనినట్లైతే నీకు వచ్చు ఆశీర్వాదములను పోగొట్టుకొనవు. ప్రభువు మనకు ఎన్నో రకాలయిన ఆజ్ఞలను ఇచ్చాడు: నీ శత్రువులను ప్రేమించుము, నీవు శోధనలోనికి పడకుండా యెడతెగక ప్రార్థన చేయుము. నీ పరలోకపు తండ్రి ఏవిధముగా అయితే సత్యము కలిగి ఉన్నదో ఆలాగుననే నీవు కూడా ఉండు; భారము మోయుచున్న వారలారా నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చెదను. ఈ విధమైన వాక్యములు వ్రాయబడి ఉన్నాయి : నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుడి. అతని ఆజ్ఞలు భారముచేత కూడుకున్నవి కావు, అయితే అవి విశ్వాసమునకు మరియు ప్రేమకు వంతెనగా ఉన్నవి.

ఎవరైతే క్రీస్తును అనుభవము కలిగి ఉంటారో వారు క్రీస్తు కొరకు సేవచేయువారుగా ఉంటారు.

యోహాను 14:16-17
16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. 17 లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

ఎవరైతే క్రీస్తు ఆజ్ఞలను తన స్వంతముగా వాడుకున్నట్లైతే వాడు తన జీవితములో పడిపోవును. అందును బట్టి క్రీస్తు తన ఆధారణకర్తను పంపుటకు దేవునితో బతిమాలుతున్నాడు. ఆయనకు రకాల కార్యములు ఉన్నవి. మన పాపములను చూపుటకు ఆత్మీయ శక్తి అతనికి ఉన్నది. అప్పుడు క్రీస్తు మనకంటే ముందుగానే సిలువ వేయబడెనని చెప్పి, అతని ద్వారా మన పాపములు క్షమించబడునని తెలిపెను. మనలను తన కృప ద్వారా దేవుని ముందర నీతిమంతులుగా చేసెను. ఈ ఆశీర్వాదమైన ఆత్మా మనకు రెండవ జన్మము ఇచ్చెను. అప్పుడు మనము దేవుడిని తండ్రి అని పిలుచుటకు మన నోళ్లను తెరచును. అప్పుడు మనము నిజముగా దేవుని కుమారులని అనబడుదుము. చివరిగా అతను మన అడ్వకేట్ అయ్యాడు. అతను మన ప్రక్కన నిలబడి సాతానునుంచి మనలను కాపాడుటకు తన రక్షణను దయచేయును. క్రీస్తు పంపిన ఆధారణద్వారా తప్ప మనకు ఎవరి ద్వారా కూడా తృప్తి కలగదు.

ప్రకృతి ద్వారా యెవ్వడు కూడా ఆత్మను పొందలేదు. ఎవరైతే క్రీస్తు రక్తమును నమ్మెదరో వారి మీదికి ఈ ఆత్మ వచ్చును. ఎవరైతే యేసును ప్రేమించాక లేదా అంగీకరించక ఉంటారో వారిలో ఆత్మా ఉండదు. అయితే ఎవరైతే యేసును ప్రేమించి అతని రక్షణను అనుభవిస్తున్నారో వారు ఆనందమును కలిగి ఉంటారు. కనుక పరిశుద్ధాత్మతో మనము మన బలహీనతలలో దేవుని శక్తిని కలిగి ఉంటాము. కనుక యేసు నీకు ఈ ఆధారణకర్త నిన్ను విడిచి వెళ్లాడని మరియు నిన్ను తీర్పులోనికి తీసుకొని రాక నీకు నిత్యజీవమును ఇచ్చునని యేసు నిన్ను నమ్మించును.

యోహాను 14:18-20
18 మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 19 అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. 20 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

ఎప్పుడైతే ద్రోహి బయటకు వెళ్లిన తరువాత, యేసు తన శిష్యులతో , మిమ్ములను తొందరలో విడిచి వెళ్తాను అని చెప్పెను, అప్పుడు మీరు నన్ను వెంబడించలేరు. అయితే తిరిగి వారిదగ్గరకు మనిషి రూపములో వస్తానని చెప్పెను. ఎందుకంటె అతను వారికున్న భయమును బట్టి తెలిసినవాడాయెను, మరియి అతని మాటలలో రెండు అర్థములు కలవు: మొదటిది, రానై ఉన్న పరిశుద్ధాత్ముడు, ఎందుకంటె క్రీస్తు ఆత్మ అయి ఉన్నాడు కనుక. రెండవది, అంత్యదినమందు అతను మహిమతో వచ్చుట. ఈ రెండు కారణములకు, అతను వారిని వదిలి తండ్రి దగ్గరకు వెళ్లవలెను. కనుక ఇది జరగకుండా పరిశుద్ధాత్ముడు మన మధ్యకు రాలేడు.

ఆత్మ అనునది నీ హృదయమును మరియు నీ కన్నులను తెరచునది. మనము ఇతరుల మాదిరి యేసు సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నదని అనుకొనలేదు, అయితే అతను జీవము కలిగి, తండ్రితో ఉన్నాడని విశ్వసిస్తున్నాము, అతని జీవితము మన రక్షణకు ఒక పునాదిగా ఉన్నది. ఎందుకంటె అతను మరణమును జయించినవాడు, అతను మనకు జీవము ఇచ్చువాడు కనుక మనము కూడా విశ్వాసముచేత మరియు నీతిచేత మరణమును జయించువారుగా ఉండాలి. మన మతము జీవము మరియు నిరీక్షణ .

మనలను ఓదార్చే అంత దేవుని నుంచి వచ్చినది, మరియు కుమారుడు తండ్రి యందు , తండ్రి కుమారుని యందు ఉన్నదనుటను సమర్థించునది. ఆత్మీయ జ్ఞానము అనునది ఒక లెక్కల పాఠ్య పుష్ఠాకము మాదిరి కాదు, అయితే విశ్వాసులలో దైవత్వమును ఇచ్చునది, అప్పుడు మనము యేసు ఏవిధముగా అయితే దేవునితో ఐక్యత కలిగి ఉన్నదో మనము కూడా ఆలాగుననే ఐక్యత కలిగి ఉన్నట్లు. కనుక ఈ రహస్యములు మన మానవుల జ్ఞానముకంటె గొప్పవి.

దేవుడు నీలో ప్రత్యేకముగా ఉండాలని చెప్పలేదు, " అయితే నేను నీలో కలిసి ఉంటాను." క్రైస్తవుడు తనకు తాను సొంతముగా ఆత్మీయ దేవాలయము కాదు; అయితే అతను భవనంలో ఒక రాయి మాదిరి. కనుక విశ్వాసులందరు ఈ విధమైన ఆత్మీయతను పొందుకొంటారు. ఈ వాగ్దానము ఈ విధముగా ఇవ్వబడినది, " నీవు నాలో ఉండులాగున నేను నీలో ఉందును". పరిశుద్దులతో సహవాసము కలిగి ఉండుట అంటే యేసు మీ ద్వారా కనపరచుకొనుటయే. కనుక దీనిని దేవుడు ఈ విధముగా ముగిస్తాడని గమనించావా " నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుడి"? నేను మాత్రమే ఒంటరిగా దేవునితో కలసి ఉన్నది, అయితే మనమందరము దేవుని సంపూర్ణత చేత నింపబడాలి.

ప్రార్థన: పరిశుద్ధమైన దేవుని గొర్రెపిల్ల మేము నీ ముందరు తలను దించి; నీ మృతి చేత మాకు నిత్యజీవము వచ్చినది. మా అల్ప విశ్వాసమును బట్టి క్షమించు, అప్పుడు నీకు మరియు మాకు మధ్య ఏవిధమైన అడ్డు రాకుండునట్లు కాపాడు. మా శ్రమలన్నిటిలో నిన్ను చూసి జాగ్రత్తకలిగి ఉండునట్లు సహాయము చేయుము. మాకు ఆదరణ కర్తను పంపినందుకు నీకు కృతజ్ఞతలు, అది మమ్ములను సత్యమైన మార్గములో నిత్యమూ మమ్ములను నడిపించును.

ప్రశ్న:

  1. పరిశుద్దాత్మునికి సంబంధించిన ఏయే లక్షణములను క్రీస్తు అవలంబించెను.

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:58 AM | powered by PmWiki (pmwiki-2.3.3)