Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 024 (The cross)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
2. యేసు నీకొదేముతో మాట్లాడుట (యోహాను 2:23 - 3:21)

c) సిలువ తిరిగి జన్మించుటకు (యోహాను 3:14-16)


యోహాను 3:14-16
14 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, 15 ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

క్రీస్తు నీకొదేమనుకు బోధిస్తూ ఒకడు తిరిగి జన్మించాలంటే,సంపూర్ణముగా పశ్చాత్తాపము పడలేక పోతే జన్మించలేదు అని చెప్తున్నాడు,ఎందుకంటె మనసు,విశ్వాసము మనుషులకొరకు త్యాగము చేసిన క్రీస్తు యెడల కలిగి ఉండాలని. వీటిని నీకొదేమనుకు క్రీస్తు ఇశ్రాయేలు యొక్క చరిత్ర ద్వారా వివరించాడు.

సినాయ్ అరణ్యములో ప్రయాణమై వెళ్తున్నప్పుడు అక్కడున్న అనేకులు దేవుడిమీద సనాగుకొని, దేవుని తోడుకు వ్యతిరేకముగా ఉండిరి (సంఖ్య 21:4-9). అప్పుడు దేవుడు వారి మీదకు మహా సర్పములను పంపినప్పుడు , అవి వారిని కరచియున్నప్పుడు వారిలో అనేకులు చనిపోయిరి.

ఆ సమయములు కొంతమంది తమ పాపములను తెలుసుకొని, మోషేకు దేవునితో మాట్లాడి ఆయన ఉగ్రతనుండి తప్పించుమని ప్రాధేయపడిరి. అప్పుడు దేవుడు మోషేను సర్పమును పోలిన ఒక ఇత్తడి రూపమును దేవుని తీర్పునకు ప్రతిగా చేయమని చెప్పెను. ఇది దేవుని యొక్క ఉగ్రతకు సూచన అని మోషే వారి పైకి దీనిని లేపెను. అప్పుడు ఎవరైతే దాని వైపు చూసియున్నారో అప్పుడు వారి శిక్షకు తెరపడింది నమ్మి, దేవుని కృపయందు నమ్మకముంచిరి.

ప్రతి సారీ హవ్వ శోదించినప్పుడు సర్పము ఓకే చిహ్నముగా ఉండెను. అయితే ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో అప్పుడు మనుషుల పాపములను మోసెను. పాపము లేని వాడు మనకొరకు పాపి ఆయెను. క్రీస్తు అరణ్యములో ఒక ఇత్తడి సర్పమువలె ఉన్నాడు, కనుక క్రీస్తు మన పాపములను మోయుచున్నప్పుడు కూడా పాపములేనివాడు.

దేవుని కుమారుడు ఈ భూమిమీద ఒక మనుష్య కుమారునిగా,ప్రతి గాయమును మరియు నొప్పిని భరించువాడుగా తీసివేయువాడుగా మరియు ధర్మశాస్త్ర శాపమును తీసివేయువాడుగా వచ్చియున్నాడు. ఒక మనిషిగా మన పాపములకొరకు చనిపోవుటకు వీలుకలిగినది,సర్పము ఏ విధముగా అయితే దేవుని ఉగ్రతను తప్పించునట్లుగా కనబడినాతో అదేవిధముగా క్రీస్తు సిలువ మరణము కూడా దేవుని ఉగ్రతను తప్పించునట్లు ఒక చిహ్నముగా ఉన్నది.. కనుక మనము సంతోషముగా ఉండునట్లుగా ఆయన కుమారుడు మీద మన పాపములను ఉంచగలము.

అరణ్యములో ఉన్నవారిలో ఎవరైతే ఎత్తబడిన సర్పమును చూస్తున్నారో వారు దేవుని ఉగ్రతనుండి విడిపించబడిన వారు అని తెలుసుకొనిరి. ఈ విధమైన కృప ప్రతి విశ్వాసికి దేవుని ద్వారా కలిగియున్నది. ఎవరైతే సిలువ వైపు చూస్తున్నారో వారు నిత్యా జీవమును పొందిన వారు. పౌలు వ్రాసినట్లు, " నేను క్రీస్తుతో సిలువవేయబడ్డాను, జీవించు వాడను నేను కాదు కానీ, క్రీస్తే నాలో జీవించుచున్నాడు". అతని మారాము నా కొరకే కాబట్టి అతని జీవితము కూడా నాకే. ఎవరైతే క్రీస్తు మరణమును నమ్ముతారో వారు అతనితో నిత్యమూ జీవించెదరు. ఇది మనకు ఆయనతో ఉన్న సహవాసమునకు చిహ్నముగా కనపడుతున్నది.

మనలను మనము నిషేదించుకొని రక్షింపబడుటకు క్రీస్తు వైపు తిరుగుడు. ఎందుకంటే మనము జన్మించుటకు క్రొత్త బతుకును సృష్టించియున్నాడు. క్రీస్తు సిలువ ద్వారా తప్ప మనకు ఏ విధమైన మార్గము రక్షింపబడుటకు లేదు. అందుకే సాతాను మనలను పగలు రాత్రీ శోధించుటకు ప్రయత్నమూ చేస్తున్నాడు. అందుకే కుమారుడు మరియు ఆయన సిలువ త్యాగము రక్షణకు మార్గముగా ఉన్నది.

దేవుడు ప్రమై యున్నాడు; తన జాలి ఒక సముద్రములాంటిది. మన స్థితిని బట్టి మనలను వేరుపరచక మనలను ప్రేమిచువాడుగా ఉన్నాడు. పాపులను తిరస్కరించక వారియెడల జాలికలిగి ఉన్నాడు. మన రక్షణ నీటిని బట్టి తన కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రతి త్యాగమును ఆయన జరిగించియున్నాడు. కనుక అతని కుమారుని ద్వారా తప్ప మనకు ఇక ఎవరి ద్వారా రక్షణ లేదు.

సహోదరుడా, నీవు నీ స్నేహితుల కొరకు ఎంతో డబ్బును ఖర్చు చేస్తున్నావా ? అతనికి బదులుగా బండిలోనికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నావా ?లేక అతనికి బదులుగా మరణించగలవా ?ఒక వేళా నీవు అతనిని ప్రేమించి ఉన్నవేమో ఎందుకంటె ఆటను నీ శత్రువై ఉన్నప్పుడు. క్రీస్తు త్యాగము అనునది అనేకులు రక్షింపబడుటకు అని అర్థము చేసుకోవాలి.

క్రీస్తు ఈ లోక రక్షణను సిలువ మీద సంపూర్ణముగా చేసియున్నాడు. కనుక మనందరికీ క్రీస్తు త్యాగము అవసరము. బీద, ధనిక, గర్వము, తగ్గింపు, అన్ని పద్ధతులు కలిగిన ఎవ్వరైనా నీతిమంతులు కాదు. అయితే క్రీస్తు వారందరికొరకు తండ్రితో పరిష్కరించియున్నాడు.

ఈ సత్యమును కేవలము క్రీస్తు సిలువ త్యాగమును అర్థము చేసుకున్నవారికి మాత్రమే తెలిసియున్నది అయితే ఇతరులకు తెలియరాలేదు. క్రీస్తుతో నీ సంబంధము రక్షణను నిర్ణయిస్తుంది, విశ్వాసము లేకుంటే దేవుని ఉగ్రతలో ఉంటావు. అప్పుడు నీ కార్యములు దేవునికి వ్యతిరేకముగా ఉందును. ఈ మాటలు నీకొదేమను వినినప్పుడు అతను ఆశ్చర్యపడి ఉన్నాడు.

ఎవరైతే క్రీస్తు సిలువ ద్వారా దయచేసి రక్షణను మేరీ కుమారుడు తమ సిగ్గును తొలగించాడని నమ్మికముంచుదురో వారికి దేవునికి మధ్య మంచి సంబంధము ఉండును. నిన్ను క్షమించినందుకు యేసుకు నీవు కృతజ్ఞతగా ఉన్నావా ? నీ జీవితమును అతని కొరకు నిర్ణయించుకున్నావా ?

ఎవరైతే క్రీస్తునందు నమ్మకముంచెదరో వారు జీవించగలరు;ఎవరైతే క్రీస్తులో నిలిచియుందురో వారు మరణించారు. ఎవరైతే క్రీస్తును పొందియుంటారో వారు నిత్యజీవితమును పొందినవారు. విశ్వాసము అనునది మనలో పరిశుద్ధాత్ముడు నివసించ్చుచున్నాడనుటకు సాదృశ్యము. నీవు 14,16 వచనములను అర్థము చేసికొనునట్లైతే నీవు వాటి ద్వారా జీవించగలవు.

ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి నీ ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. నీవు నీ ఏకైక కుమారుని మా కొరకు మరణించుటకు పంపియున్నావు. అతను మా పాపములను మోసి మాకు రావలసిన శిక్షను మరియు నీ ఉగ్రతనుండి కాపాడియున్నాడు. మేము నీ సిలువను చూసి నిన్ను నమ్మి నీకు కృతజ్ఞతా కలిగి ఉండగలం. ఈ మాటలను మేము వేరే వారితో కూడా పంచుకొని వారు కూడా నీవు దయ చేసే నిత్యజీవమును పొందుకొనునట్లు మమ్ములను నడిపించుము.

ప్రశ్న:

  1. క్రీస్తు అరణ్యములో సర్పమువలె ఎలా కనబడినాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:31 AM | powered by PmWiki (pmwiki-2.3.3)