Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 025 (Rejecting Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
2. యేసు నీకొదేముతో మాట్లాడుట (యోహాను 2:23 - 3:21)

d) క్రీస్తు తీర్పును వ్యతిరేకించుట (యోహాను 3:17-21)


యోహాను 3:17-21
17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. 18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20 దుష్కార్యము చేయు4 ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

యోహాను మెస్సయ్య ఈ లోక జనములను తీర్పు తీరుస్తాడని మరియు ఈ లోకములో ఉండు రోగములుకలిగిన చెట్లను నరికివేస్తాడని ప్రకటించెను. అయితే క్రీస్తు నీకొదేమనుకు, ఆటను అగ్నిచేత కాల్చబడదు కానీ రక్షింప బాదుతాడని చెప్పియున్నాడు. ఎందుకంటె మన రక్షకుడు దాయకలిగిన వాడు కాబట్టి. ఎప్పుడైతే ఈ రహస్యమును యోహాను తెలుసుకున్నాడా అపుడు క్రీస్తును దేవుని గొర్రెపిల్ల అని, మరియు ఈ లోక పాపములను తీసివేసి దేవుని గొర్రెపిల్లనై ఉన్నాడని చెప్పాడు.

దేవుడు తన ప్రేమ ద్వారా క్రీస్తును కేవలము యూదులకొరకు మాత్రమే ఈ లోకమునకు పంపలేదు అయితే ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరికొరకు పంపియున్నాడు. "లోకము" అను మాట మూడు సార్లు 17వ వచనంలో మనము చూడగలము. ఇది అన్యులను కుక్కలతో సమానముగా పోల్చుతున్న యూదులకు ఒక దెబ్బ గా ఉన్నది. అయితే దేవుడు అబ్రాహాము సంతానమును ఏవిధముగా అయితే ప్రేమిచాడో అదేవిధముగా ఈ లోకమును కూడా ప్రేమించెను. అందరికీ తీర్పు అవసరము అయితే క్రీస్తు రక్షించుటకు వచ్చియున్నాడు. అందుకే ఇత్తడి సర్పము ఎత్తబడుట తన సిలువను ఎత్తబడుటకు సాదృశ్యముగా చూప్పించెను,అయితే దేవుని ప్రేమ అన్నిటినీ కప్పును.

"ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు తీర్పునుంచి తప్పించుకుందురు" అను ఈ మాటలను క్రీస్తు వాడినాడు. అందుకే తీర్పు దినమును బట్టి వారికున్న ప్రతి విధమైన భయము తొలగిపోయెను. కనుక క్రీసు పెయిన్ మనకున్న విశ్వాసము మనలను మరణమునుంచి తప్పించును. నీవు ఒకవేళ క్రీస్తు నందు విశ్వసించినట్లైతే నీవు అతని తీర్పునుంచి విముక్తి పొందినవాడే.

ఎవరైతే క్రీస్తు రక్షణను తిరస్కరిస్తారో వారు బుద్ధిలేనివారు,గ్రుడ్డివారు మరియు జ్ఞానములేనివారై వారు దేవుని కృప నుంచి వేరుపరచినవారుగా ఉండెదరు. ఎవరైతే క్రీస్తు శక్తిని స్వాగతించకు ఉంటారో వారు పరిశుద్దాత్మ వీచులను తేలికగా తీసుకుంటారు. ఎవరైతే దేవుడిని తిట్టి ఆయనను వ్యతిరేకిస్తారో వారు తీర్పును స్వాగతించువారుగా ఉంటారు.

కొందరు రక్షణను ఎందుకు తిరస్కరిస్తారో క్రీస్తు ఈ విధముగా చెప్పాడు: ఎందుకంటె వారు వారి పాపములను దేవుని నీతికంటె ఎక్కువగా ప్రేమించి క్రీస్తు వెలుగులోనికి రాలేరు. కనుక మనుష్యుల కార్యములు చెడ్డవి. కనుక ఈ విధమైన కార్యాలు నీకొదేమను హృదయములో ఉండెను కనుక అతని హృదయము మర్చబడి తన గర్వమును తీసి వేసి క్రీస్తు దగ్గరకు వచ్చుటకు సమయము కలిగెను.

ఎవరైతే క్రీస్తును విశ్వసించకపోతే వారు చెడును మరియు పాపమును ప్రేమించేవారని యేసు చెప్పెను. ఎందుకంటె చాలా మంది వారి పాపములను వారి నవ్వులో దాచుకొనియున్నారు. వారు క్రీస్తును ద్వేషించువారుగా ఉన్నారు. మరి నీవు నీ పాపములను క్రీస్తుతో ఒప్పుకొన్నావా?ఒకవేళ నీవు నీ పాపములను ఒప్పుకొనకపోతే నీవు తిరిగి జన్మించలేవు. నీ హృదయమును దేవుని వెలుగుకొరకు తెరువుము అప్పుడు నీవు కడగబడతావు;ఎందుకంటె దేవుని గొర్రెపిల్ల పైన మన విశ్వాసము మనలను శుద్ధులనుగా చేయును. కనుక నీవు అతని ముందర తగ్గించుకొని నీ విశ్వాసమును కాపాడుకొనునట్లైతహే నీవు నిత్యమూ జీవించెదవు.

ఎవరైతే క్రీస్తు యేసు సత్యములోనికి ప్రవేశిస్తారో వారు పూర్తిగా మార్చబడతారు అయితే ఈ మార్పు శరీరముగా కాక ఆత్మీయముగా ఉండవలెను. అబద్ధికులు సత్యవంతులుగా మరియు బోధకులు నీతిమంతులుగా మార్చబడుదురు. అయితే ఎవరైతే తిరిగి నూతన జన్మకలిగిఉంటారో వారు వారి పాపములను ఒప్పుకొని యున్నారు కనుక నమ్మకముగల దేవుడు వారి దోషములను కడిగివేసియున్నాడు.

మనము మంచి పనులను వ్యతిరేకించాము కానీ అవి దేవుని నుండి వచ్చినవి, మన నుంచి వచ్చినవి కావు. ఇది కేవలము దేవుని కృప. దీని అర్థము మనము మన సొంత ఆలోచనలనుంచి బయటికి వచ్చి క్రీస్తు రక్తము ద్వారా తెరువబడిన నీటికి మనము ఆధారపడినవారముగా ఉన్నాము. ఎవరైతే తిరిగి క్రీస్తులో జన్మిస్తారో వారు ఆయనను ఘనపరచెదరు. వారి జీవితములు దేవుని కృపకు కృతజ్ఞత కలిగిఉంటారు. నూతన జీవితము మరియు నూతన జన్మ క్రీస్తును ఆరాధిస్తుంది.

ప్రార్థన: ప్రభువైన యేసు ఈ లోక తీర్పును నీవు మోసినందుకు నీకు కృతఙ్ఞతలు. నీయందు మేము విశ్వాసముతో బంధము కలిగి ఉండగా మాకు ఆ తీర్పును తప్పించినందును బట్టి మా శిరస్సును మీ ముందర వంచుచున్నాము. నీవు దేవుని ఉగ్రతనుండి మమ్ములను తప్పించినందుకు నీకు కృతఙ్ఞతలు. మేము మా పాపములను నీ ముందర ఒప్పుకొనుచున్నాము కనుక మా పాపములను బహుగా కడుగుము.

ప్రశ్న:

  1. క్రీస్తు విశ్వాసులు ఎందుకు తీర్పులోనికి వెళ్ళరు?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:32 AM | powered by PmWiki (pmwiki-2.3.3)