Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 023 (Need for a new birth)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
2. యేసు నీకొదేముతో మాట్లాడుట (యోహాను 2:23 - 3:21)

b) నూతన జన్మ యొక్క అవసరత (యోహాను 3:1-13)


యోహాను 3:6-8
6 శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. 7 మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8 గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

యేసు నీకొదేమనునకు మనుషులకు ఏ విధమైన మార్పు అవసరమో చూపించెను. ఆ మార్పు అనునది శరీరమునకు మరియు ఆత్మకు ఓకే గొప్ప తేడా గా ఉన్నది. "శరీరము" అనునది క్రొత్త నిబంధనలో మనిషి యొక్క మాయను బట్టి అర్థము చెపుతుంది , అనగా మనిషి ఈ నాశనమైన లోకములో పది ఉన్నాడని . ఈ మాట కేవలము శరీరమును మాత్రమే తెలియపరచక మనిషి యొక్క ఆత్మీయతను మరియు మనస్సును బట్టి కూడా తెలియపరుస్తున్నది. అందుకే క్రీస్తు వీటిని బట్టి ," హృదయము నుంచే చెడ్డది వస్తున్నదని". చెప్పియున్నాడు. కనుకనే ఏ మనిషి కూడా దేవుని రాజ్యమునకు ప్రవేశించడు,ఎందుకంటె అతని జన్మమునుంచి చెడ్డది వెంట ఉన్నది కాబట్టి.

"ఆత్మ" అనునది పరిశుద్దాత్మునిని తెలియపరుస్తున్నది, ఎందుకంటె దేవుని సత్యము, పరిశుద్ధత, శక్తి మరియు శక్తిని సూచిస్తుంది కాబట్టి. దేవుండు చెడ్డవారిని కానీ శరీరములో ఉన్నవారిని వేరుపరచును. ఇది రెండవ జన్మమును చూపిస్తుంది. ఎందుకంటే ఆత్మ మన ప్రతి శరీర ఆశలను నాశనము చేసి మనము దేవుని పిలుపునకు అనుగుణంగా ఉండులాగున నడిపిస్తున్నది కనుక. నీవు తిరిగి జన్మించి,శరీరేచ్ఛలనుంచి విమోచించబడ్డావా ?

మూడవ సందర్భములో యేసు నీకొదేమనుతో మాట్లాడుతూ , " నీవు మరియు మీరందరు అనగా,అబ్రాహాము సంతానమంతయు తిరిగి జన్మించాలి". "ఖచ్చితము' అనే ఈ మాట క్రీస్తు మాట్లాడినట్టుగా చూస్తున్నాము, కనుక ఎవరు కూడా తిరిగి జన్మించకపోతే దేవుడిని తెలుసుకోలేరు అదేవిధముగా ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేరు.

గాలి వీచుతున్నప్పుడు దాని శబ్దమును నీవు విన్నావా? నూతనముగా జన్మించావారు ఈ వీచుచున్న గాలి మాదిరి ఉంటారు. గాలి ఒక దిక్కున వచ్చు మరొక దిక్కున వెళుతుంది. అదేవిధముగా దేవుని పిల్లలు పైనుంచి జన్మించి తిరిగి తండ్రి యొద్దకు వెళ్తారు.

తిరిగి జన్మించు వారి శబ్దము పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడినట్టుగా ఉంటుంది. మనము సహజముగా మన మనసుతో మాట్లాడాము. అయితే పరిశుద్ధాత్ముడు మనకు వచ్చి, అది దేవుని శక్తిగా ఉందును. కనుక నీ హృదయములో ఆయన ఉన్నాడా?

యోహాను 3:9-13
9 అందుకు నీకొ దేముఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 10 యేసు ఇట్లనెనునీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? 11 మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధ మైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? 13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకము నకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

క్రీస్తు నీకొదేమనుతో మాట్లాడినప్పుడు ఆటను పరిశుద్దాత్ముని శక్తితో నింపబడి, క్రీస్తు మాట్లాడు ప్రతి మాటకు సమాధానము చెప్తున్నాడు.అయితే అతని మనసు అర్థము చేసుకొనుటలో మరియు దాని లోతైన మర్మములను తెలుసుకొనుటలో ఓడిపోయింది. అందుకే, " జన్మించుటకు ఎంత సమయము తీసుకుంటుందో నాకు తెలియదు" అన్నాడు. దీని అర్థమే ఆటను అర్థము చేసుకొనుటలో ఓడిపోయాడు అని అర్థము. అందుకు క్రీస్తు, " అవును నీవు గౌరవించబడిన బోధకుడు, నీవు నా దగ్గరకు వచ్చియున్నావు, ఇతరులు ప్రశించువారిగా, ఉన్నతులుగా ఉన్నప్పుడు. అయితే నీకు నిజముగా పరిశుద్ధుని ఉద్దేశము తెలియదు. నీ కానుకలు, నీ కార్యములు, నీ ఆరాధనంతా కూడా వ్యర్థముగా ఉన్నది. నీకు దేవుని రాజ్యమునకు సంబంధించిన కనీస అర్హతలుకూడా తెలియదు".

మూడవ సార్ యేసు మాట్లాడుతున్నాడు, " నిజముగా, నీతో చెపుతున్నాను". ప్రతి సందర్భమును బట్టి క్రీస్తు క్లుప్తముగా తన ప్రకటనను తెలియపరచియున్నాడు,ఎందుకంటె మనము ఆయన మాటలను అర్థము చేసుకొనుటలో చాలా నిదానముగా ఉన్నాము.

ఏ విధముగా నీకొదేమను ఒక క్రొత్త వేదికను నేర్చుకున్నాడు? అప్పుడు క్రీస్తు, "నేను" అనే ఏకవచనమును అనగా "మేము" అనే మహువచనమును వాడలేదు; ఇది పరిశుద్దాత్మ యొక్క స్వరమునకు జతచేయబడియున్నది. క్రీస్తు దేవునితో ఉన్నవాడు మరియు ఆటను అవతారమే ఉన్నవాడు. క్రీస్తు మనకు పరిశుద్ధాత్మతో సహవాసము కలుగునట్లు మనకు వివరిస్తూ తనను అంగీకరించువారిని చేసి ఆయన యందు నమ్మకము చేయునట్లు నడిపించును.

మనుషులందరికంటే అతనికి ఏమి బాగా తెలుసు ? తనకు దేవుడు తెలిసి కనుక తనను తండ్రి అని పిలిచియున్నాడు. క్రీస్తు తండ్రి యొద్ద నుంచి వచ్చి తన దగ్గరకు తిరిగి వెళ్ళినాడు, అదేవిధముగా పరలోకమునుంచి వచ్చి తిరిగి పరలోకమునకు వెళ్ళినాడు. మనుషులకు మరియు దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసము దేవుడు పరిశుద్దాత్మ ద్వారా క్రీస్తులో వచ్చినప్పుడు తొలగిపోయినది. అదేవిధముగా నిత్యమూ మనకు దూరముగా లేక అది ఒక సమాధానముగా ఉన్నది. అయితే మనిషి ఈ సాక్ష్యంగా క్రీస్తు సత్యమును అర్థము చేసుకోలేదు. ఆత్మద్వారా మరియు తండ్రి ద్వారా జన్మించిన వారు ఒక్కటై ఉన్నారు అనే విషయాన్నీ తెలుసుకోలేదు. ఎందుకంటె వారు పాపమును ఒప్పుకొనుటకు ఇష్టపడలేదు మరియు నమ్ముటకు ఒప్పుకొనలేదు. మరియు తిరిగి జన్మిచుటలో ఉన్న ప్రయోజనమును తెలుసుకొనలేదు, అయితే తమకు తామే మంచి జ్ఞానములుగలవారని తెలుసుకొనిరి. అయితే వారు జ్ఞానము పరిశుద్దాత్మ త్రిత్వమును అర్థము చేసుకొనుటకు గల సామర్థ్యము లేదని గ్రహించలేకపోయిరి.

ప్రార్థన: తండ్రి, కుమారుడా, పరిశుద్ధుడా, నిన్ను మేము స్తుతిస్తున్నడము.మీ సత్యము ద్వారా మమ్ములను నీ పిల్లలుగా చేసియున్నావు. నీ సత్యము మా దేశమందు ప్రవహించును గాక. అప్పుడు అనేకమంది మంది నిన్ను తెలుసుకొని నీ యందు నూతన జన్మమును పొంది నీ ప్రియా బిడ్డలుగా ఉండునట్లు చేయుము.

ప్రశ్న:

  1. విశ్వాసులకు నూతన జన్మ యొక్క సూచన ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:30 AM | powered by PmWiki (pmwiki-2.3.3)