Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 020 (Jesus' first miracle)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

4. కాన వివాహములో క్రీస్తు చేసిన మొదటి అద్భుతము (యోహాను 2:1-12)


యోహాను 2:1-12
1 మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2 యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. 3 ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4 యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. 5 ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6 యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. 7 యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8 అప్పుడాయన వారితోమీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. 9 ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారునిపిలిచి 10 ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

యేసు తన శిష్యులను యొర్దాను నది దగ్గర శరణాగతి కొరకు చేర్చియున్నాడు, ఎందుకంటె గాలీలయాలో జరుగు వివాహములో పాలుపంచుకొనుటకు పిలిచియున్నాడు. ఈ యొక్క ప్రయాణము 100 కిలోమీటర్ల దూరాన్ని చూపి ఒక మార్పునకు చిహ్నముగా రెండు గ్రంధములకు ఉన్నది. అయితే విశ్వాసులు ఇక ధర్మ శాస్త్ర సంబంధముగా ఉండక క్రీస్తు ఎక్క నీతి అను సమాధానమునకు పాత్రుడైనటువంటి క్రీస్తుకు సంబంధించువారుగా ఉండిరి. యేసు ఒక సన్యాసి కాదు యోహాను మాదిరి అయితే ఈ కారణంగా తన శిష్యులను సమాధానమునకు విడిచి, అద్భుతములను అనుభవించుటకు అవకాశమును కలిగించెను. క్రీస్తు ద్రాక్షారసమును తీసివేయలేదు, ఎందుకంటె మనిషిని పాడు చేస్తున్నది అది కాదు అయితే మనిషు హృదయమును పాడు చేస్తున్న చేదు ఆలోచనలను వారి నుంచ్చి తీసివేసెను. మన చేదు హృదయములను ఒక క్రొత్త జన్మము అవసరము.

నతనియేలు కనాలో ఉండినప్పుడు క్రీస్తు తన శిష్యులను కూడా వెంటబెట్టుకొని వచ్చియున్నాడు. (21:2) యేసు తల్లి అయినా మరియా పెండ్లికొడుకుకి పరిచయముగలదిగా ఉండినది. అయితే అప్పుడు యేసేపు మరణించినవాడాయెను. కనుక క్రీస్తు ఇంటికి మొదటి కుమారుడు కాబట్టి పెళ్ళీపైన ఒక బాధ్యత కలిగిన వాడాయెను.

కనుకనే తన తల్లి తన బంధువులకు సహాయకురాలిగా ఉండెను. యొర్దాను నది నుంచి వచ్చినతరువాత నుంచి ఆటను ఒక సామాన్య మనిషిగా లేదు కాబట్టి పరిశుద్ధాత్మచేత మార్పు పొందినవాడుగా ఈ లోక బాధ్యతలను దేవుని సేవకు వెంబడించు వాడుగా ఉండెను.

కనుక మరియా తన కుమారుని మీద ఆధారపడియున్నది. తన ప్రేమ కుమారునిపైన మొదటి అద్బుతమును చేయుటకు అవకాశము కలిగెను.కనుక క్రీస్తు మీద విశ్వాసము దేవునిపై ప్రేమను చూపిస్తున్నది. అందుకే యేసు ఏమి చెపితే అదే చేయమని అక్కడున్నవారికి ఆజ్ఞాపించినది. ఎందుకంటె ఖశ్చితముగా క్రీస్తు వారందరిని మంచి మార్గములో నడిపిస్తాడని నమ్మకముకలిగి ఉండెను. " ఆటను ఎమూ చెబుతాడో అది చేయుడి" అనే ఒక మాటను ప్రతి సంఘమునకు తెలియచేసెను. కనుక క్రీస్తు పై తగ్గింపు స్వభావము అద్భుతములను చూచుటకు అవకాశము కలిగెను.

దాదాపుగా 600 లీటర్లు విలువచేసే కుండలు ఖాళీగా కనబడెను. ఇది వచ్చిన వారు వారి అవసరములను బట్టి నీటిని వాడుకొనినట్టు అర్థమవుతున్నది. కనుక క్రీస్తు ఉన్నప్పుడు ఒక విధమైన పరిశుభ్రం అవసరమై ఉన్నది. దేవుని గొర్రెపిల్ల చేయవలసిన కార్యములను చేయు వరకు ఎవరును వివాహమునకు హాజరుకాలేరు.

ఏదిఏమైనా క్రీస్తు పరిశుభ్రత అనునది ఆయన అప్పటికప్పుడు నిర్ణయము కాదు. అయితే వివాహ మహోత్సవము జరగాలి. అయితే క్రీస్తు నీటిని ద్రాక్షా రసముగా మార్చెను. ఎలాగూ ఇది మార్చబడినదో మనకు తెలియదు, అయితే క్రీస్తు తన రక్తముచేత చిందించబడుట అందరికీ తృప్తిగా ఉన్నాడని మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్ముడు త్రాగువారికి ఇది సంబంధము లేదు. అయితే క్రీస్తు యొక్క క్షమాపణ మనిషి యొక్క పాపములకు దొరికినది.

యోహాను 2:11-12
11 గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలనఆయనశిష్యులుఆయనయందువిశ్వాసముంచిరి. 12 అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.

క్రీస్తు సృష్టిని బట్టి అతని గురించి శిష్యులు తెలుసుకున్నారు. వారు తన మహిమను చూచి దేవుడు క్రీస్తును పంపియున్నాడను నమ్మియున్నారు. ఇది వారిని క్రీస్తును నమ్మకమును కల్పించుచున్నది కనుక మనము ఆయనకు లోబడి తనను అర్థముచేసుకొనుటకు అవకాశము ఉన్నది. కనుక నీవు క్రీస్తు కార్యములను చదివినట్లయితే అతని గొప్ప ఉన్నతమును తెలుసుకోవచ్చు.

క్రీస్తు తన కుటుంబమును వదిలి దేవుని కార్యములను చేయుటకు పూనుకొనెను. అయితే తన తల్లితో మరియు సహోదరులతో ఉన్న బంధమును అలాగే కొనసాగించెను. అందుకే ఆయన వారితో ఎన్నో ప్రయాణములను చేసియున్నాడు. అతని సహోదరులు కపెర్నహూమునకు అతనితో పాటు వచ్చిరి. అయితే కానా లో క్రీస్తు చేసిన అద్బుతమును బట్టి నమ్మలేదు కానీ అతని మంచిని బట్టి శిష్యులు క్రీస్తును నమ్మిరి.

ప్రార్థన: ప్రియమైన యేసయ్య మీరు మమ్ములను వివాహమునకు పిలిచినందుకు మీకు కృతఙ్ఞతలు. మీ ఆనందకరమైన సహవాసములో ఉండుటకు ఎంతో సంతోషిస్తున్నాము. మా పాపములను క్షమించి మీ పరిశుద్ధతతో నింపుము. నిన్ను నీవు ఇతరుల కొరకు ఏ విధముగా తయాగము చేసియున్నావు దాని వాలే మేము కూడా త్యాగముకలిగిన వారముగా మమ్ములను మార్చుము.

ప్రశ్న:

  1. యేసు తన శిష్యులను వివాహమునకు ఎందుకు తీసుకొని వెళ్లెను ?

క్విజ్ - 1

ప్రియా చదువరి, పైన ఇవ్వబడిన 20 24 ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్లయితే మీకు ఈ పత్రికలూ పంపగలము.

  1. నాలుగవ సువార్తను ఎవరు వ్రాసారు ?
  2. మొదటి మూడు సువార్తలకు మరియు యోహాను సువార్తకు మధ్య గల సంబంధము ఏమి ?
  3. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము ఏమి ?
  4. ఈ సువార్త ఎవరి కొరకు వ్రాయబడియున్నది ?
  5. ఈ అంశమును ఏ విధముగా విభజించవచ్చు ?
  6. యోహాను 1 వచనంలో వ్రాయబడిన మాటకు అర్థము ఏమిటి ?
  7. క్రీస్తు గురించి యోహాను బయలుపరచిన ఆరు గుణములేమిటి ?
  8. ఆత్మీయముగా వాక్యానుసారముగా చీకటికి వెలుగుకు గల వ్యత్యాసము ఏమిటి ?
  9. బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క ముఖ్య గురి ఏమిటి ?
  10. క్రీస్తు వెలుగుకు మరియు ఈ లోక చీకటికి గల మధ్య వ్యత్యాసము ఏమిటి ?
  11. క్రీస్తును అంగీకరించిన వారికి ఏమి అవుతుంది ?
  12. క్రీస్తు అవతారము అనగా ఏమి ?
  13. క్రీస్తు సంపూర్ణత అనగా ఏమి ?
  14. క్రీస్తు ఈ లోకమునకు ఏ ఆలోచనను తెచ్చాడు ?
  15. యూదుల సభ నుంచి పెద్దల ప్రశ్నలు ఏమిటి ?
  16. యోహాను ప్రజలను క్రీస్తు మార్గమును సిద్దము చేయుమని ఏవిధముగా చెప్పెను ?
  17. సంహేద్రిన్ నుంచి యోహాను సాక్ష్యము ఏమిటి ?
  18. "దేవుని గొర్రెపిల్ల" అను మాటకు అర్థము ఏమిటి ?
  19. యేసు పరిశుద్దాత్ముడుడిని ఎందుకు ఇచ్చాడు ?
  20. ఇద్దరు శిష్యులు క్రీస్తును ఎందుకు వెంబడించిరి ?
  21. మొదటి శిష్యుడు క్రీస్తును ఏ విధముగా వివరించాడు ?
  22. మొదటి శిష్యుడు క్రీస్తు పేరును ఇతరులకు ఏ విధముగా ప్రకటించియున్నాడు ?
  23. "దేవుని కుమారుడు" మరియు " మనుష్య కుమారుడు" అనే రెండు మాటలకు అర్థము ఏమిటి ?
  24. క్రీస్తు తన శిష్యులను వివాహమునకు ఎందుకు తీసుకువెళ్లాడు ?

మీ చిరునామాను మాకు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:28 AM | powered by PmWiki (pmwiki-2.3.3)