Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 062 (The Apostle’s Worship)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)

e) అపొస్తలుల ఆరాధన (రోమీయులకు 11:33-36)


రోమీయులకు 11:33-36
33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. 34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? 35 ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? 36 ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

యూదుల యొక్క ఆత్మీయ పారిశ్తిథిని బట్టి పౌలు భయపడినాడు, అయితే యెరూషలేములో ఉన్న విశ్వాసులను బట్టి కూడా అదేసమయములో సంతోషము కలిగి ఉన్నాడు. అదేవిధముగా ఇతర ప్రాంతాలలో కూడా విశ్వాసుల సంఖ్యా క్రమముగా పెరుగుతున్నప్పుడు కూడా సంతోషపడెను, మరియు దేవుని ప్రేమను బట్టి అతని ఆత్రుత మరియు సంతోషము కూడా మౌనముగా ఉండెను. తన కనికరమును ఒప్పుకొని, అయితే శిక్షను ఖండించాడు. సర్వశక్తుని ప్రేమను పౌలు గుర్తుచేసుకున్నాడు, అతను అపార్థము చేసుకున్నవాణ్ణి నమ్మి చివరకు వాటిని వివరించెను: "మన అర్థముల కంటే అతని సన్నిధి గొప్పది. మనము అతనిని నమ్మి, మన ఆలోచనలను మరియు ప్రవచనాలను అతని యొద్ద పెట్టడము" (యెషయా 40:13; 45:15; 55:8-9; రోమా 11:33).

తన ప్రభువును నమ్మకముగా ఆరాధిస్తున్నవాడు, ఘనపరచువాడు మరియు కృతజ్ఞత పొందినవారు ఆశీర్వాదము పొందినవాడు, ఎందుకంటె పరిశుద్ధుని ప్రేమను అతను గుర్తుకు చేసుకొనును కనుక. పరిశుద్ధతలోని లోతులను అతని ఆత్మీయ సత్యము అతనిని నడిపించును, మరియు అతనికి వచ్చిన ఆత్మీయ బహుమానములలో కూడా ధనికము వచ్చును. పౌలు తన రెండవ పత్రికలో తన అంశమును బట్టి చేరుకున్నాడు. యాకోబు సంతంతి హృదయమందు కలిగిన ఖఠినమును ఒప్ప్పుకొని, మరియు దాని వెనుక గల కారణము వారి అవిశ్వాసమే అని గుర్తుచేసుకొనెను; అయితే పౌలు ఈ సత్యమును ఖండించలేదు.

అదే సమయములో యూదుల విశ్వాసులను అతను ఉత్తేజపరచెను, మరియు వారికి, దేవుడు తిరిగి వారిని అంగీకరించును తన కృపను బట్టి అని చెప్పెను. ప్రభువు యూదులను క్రొత్త విశ్వాసులను బట్టి వారి ప్రేమను బట్టి, తగ్గింపును బట్టి, పరిశుద్దతను బట్టి మరియు అనటోలియా ను వారు ఏవిధముగా సేవచేస్తున్నారో అని వారిని నమ్మకముగ నడిపించెను.

అయితే చారిత్రకంగా పౌలు దేనినైతే నిరీక్షణ కలిగి ఉండెనో దానిని బలపరచెను. ఎందుకంటె పౌలు యూదుల ద్వారా బలియైన మొదటి వాడు. అతను రోమా లో వారి అబద్ధములు బట్టి తల నరికి చంపువాడుగా ఉండెను.

పౌలు వీటిని బట్టి వారి ఖఠినమును మరియు సువార్తను బట్టి వారి వ్యతిరేకతను గమనించి, యూదుల ఆత్మీయ సత్యమును తిరిగి చెప్పెను, ప్రవక్త అయినా యెషయా చెప్పినట్లు " మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక, వారు దాని విందురు" (అపొస్తలుల 28:26-29).

రోమా లో ఉండు బందిఖానాలకు యూదుల సభ తీర్పు వారికి వ్యతిరేకముగా ఉండునని వారికి జ్ఞాపకము చేసెను (అపొస్తలుల). వారి మూర్ఖత్వమును బట్టి అతను రోమా లో ఉండు కైసేరియ దగ్గరకు వ్యక్తిగతముగా వెళ్లెను (అపొస్తలుల). అతని కావలి రోమా వారికి కష్టముగా లేకపోయినా, వినువారిని బట్టి పౌలు సువార్తను ప్రకటించుటకు అవకాశము ఇచ్చిరి.

రోమా లో ఉండు కొంత మంది మాత్రమే నమ్మిరి, అయితే వారిలో ఉన్న అనేక పెద్దలు మరియు ఇతరులు అతని బోధనలను అంగీకరించలేదు, అయితే క్రైస్తవులను యూదులుగా భావించిరి (అపొస్తలుల 28:22). అతని తన నరికివేయబడిన తర్వాతా కూడా వారికి న్యాయాధిపతులే మీద మంచి అభిప్రాయము ఉండెను.

అన్యుల అపొస్తలులు యూదులకు బదులుగా చివర వరకు వచ్చి, అయితే అపొస్తలుడైనపౌలు ఏవిధమైన అద్దము లేకుండా విశాలపరచెను. ఈ దినాలలో కూడా అన్యులలో మరియు యూదులలో అనేకమంది క్రీస్తును విస్వసించెదరు. పౌలుకు ఇది ఒక రుజువుగా ఉండెను, ఎందుకంటె ఈ లోకములో ఉండు వారు క్రీస్తు యందు నమ్మకము కలిగి ఉండేదరని చెప్పేను కనుక.

ప్రార్థన: ఓ పరలోకమందున్న ప్రభువా మేము పౌలుతో సహా ఆరాధించెదము. నీ ప్రేమను బట్టి మరియు నీ కోపమును బట్టి నిన్ను ఘనపరచెదము, నీ తీర్పును బట్టి నీ కనికరమును బట్టి మహిమపరచెదము, నీ జ్ఞానముకలిగిన మార్గములను బట్టి మేము ఆనందించెదము. మేము నీ ప్రియమైన పిల్లలుగా ఉండుటకు మమ్ములను నడిపించినందుకు నిన్ను ఘనపరచెదము.

ప్రశ్నలు:

  1. సంపూర్ణ కృప మరియు దేవుని యొక్క జ్ఞానము అనగా ఏమి?
  2. దేవుడు హృదయమందు కఠినముగా ఉన్నవారిని బట్టి ఎలా తన నీతిని ఉంచును, మరియు చివరలో వారి శేషమును అంగీకరించి, మరియు వారిని కూడా యాకోబు పిల్లలని ఎలా భావించును?

క్విజ్ - 3

ప్రియా చదువరి,
రోమా వారికి ఈ పత్రిక ద్వారా వ్రాయబడిన ఈ ఆజ్ఞలను నీవు చదివి ఉండగా, నీవు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములు ఇచ్చుటకు సమర్థుడవు. ఒకవేళ నీవు 90% ప్రశ్నలకు సమాధానములు వ్రాసినట్లయిత, నీవు బలపరచుటకు ఈ లాంటి వేరొక పత్రికలను పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము. నీ పూర్తి పేరు మరియు చిరునామాను వ్రాయుట దయచేసి మరచి పోవద్దు.

  1. పౌలు ఏ కారణము చేత లోతుగా బాధపడినాడు?
  2. తన ప్రజల కొరకు పౌలు దేనినిమిత్తము వారి రక్షణను బట్టి త్యాగము చేయాలను కొన్నాడు?
  3. పాత నిబంధన ప్రజలకు పౌలు ఎన్ని అవకాశములను బట్టి చెప్పెను? వాటిలో నీకు ఏది ప్రాముఖ్యముగా ఉన్నది?
  4. దేవుని యొక్క కృప ఎన్నుకొనబడినటువంటి అనేకులను ఎందుకు రక్షించలేదు, ఎవరు తీర్పు నుంచి ఇతరుల మీదికి పడతారు?
  5. ఇస్సాకు యొక్క విత్తనములు ఎన్నుకొనుట మరియు యాకోబు కుమారుల ఎన్నుకొనుట అను వాటికి అర్థము ఏమిటి?
  6. దేవుని యొక్క రహస్య ఏర్పాటు ఏమిటి?
  7. ఎందుకు మనుషులు దేవుని దేవుని ద్వారా ఎన్నుకొనబడరు? మన ఏర్పాటును బట్టి తగిన కారణాలు ఏమిటి?
  8. ఫరో హృదయమును ఎందుకు దేవుడు ఖఠినపరచెను? ఏవిధముగా ఒకరిని కఠినముగా చేయును?
  9. దేవుని ఉగ్రత పాత్రలు ఎవరు, మరియు వారి లోబడని స్వభావమునకు గల కారణము ఏమిటి?
  10. దేవుని కనికరము గల పాత్రల యొక్క ఉద్దేశము ఏమిటి, మరియు వారి ప్రారంభము ఏమిటి?
  11. వేలమంది విశ్వాసులు మరియు రకరకాల ప్రజలు దేవుని నీతిని పండుకొని అందులో ఉంటారు?
  12. ఇతర మతస్థులు దేవుని నీతిని పొందుటకు ఎందుకు వారి మాత ఆచారములు పాటిస్తారు?
  13. క్రీస్తు ధర్మాత్మశాస్త్రమునకు ముగింపు అని పౌలు చెప్పిన మాటకు అర్థము ఏమిటి?
  14. యూదులు వారి కొరకు వచ్చు మెస్సయ్య కొరకు ఎందుకు ఎదురుచూస్తున్నారు?
  15. సాక్ష్యమునకు మరియు విశ్వాసమునకు ఉన్నబంధము ఏమిటి?
  16. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు సాక్ష్యము మరియు విశ్వాసము ఏవిధముగా ఒకే కార్యమును చేయగలవు?
  17. ఈ దినాలలో మనుషులు ఇష్టపూర్వకంగా విని, అర్థము చేసుకొని, సువార్తను ఎలా అంగీకరిస్తున్నారు?
  18. దేశమంతటిలో దేవుడు ఎందుకు కొందరిని మాత్రమే ఎన్నుకొన్నారు?
  19. ఎలీషా ఏడు వేలమంది ఇశ్రాయేలీయులను దాచినాడని దేవుడు చెప్పిన మాటకు గల అర్థము ఏమిటి, ఎవరైతే మోకరిల్లారో వారు బాలుకు లోబడలేదా?
  20. పాలు చెప్పినట్లు యూదుల విశ్వాసులందరు పరిశుద్ధ శేషము కలిగి ఉన్నారని చెప్పే మాటకు గల అర్థము ఏమిటి?
  21. అవిశ్వాసులైన వారికి యూదుల ఖఠినము అను మాటకు గల అర్థము ఏమిటి?
  22. నిజమైన విశ్వాసమును బట్టి క్రైస్తవులను ఏవిధముగా ప్రాధేయపడవచ్చు?
  23. క్రీస్తు ఆత్మీయ శరీరములో అంటుకట్టుకొనుట అనగా ఏమిటి?
  24. ఒకవేళ అంటు చెడిపోతే ఎవరు ప్రమాదంలో ఉంటారు?
  25. దేవుని వాగ్దానమును ఓడిపోక నిత్యమూ ఎలా నిలుచును?
  26. ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఎవరు?
  27. సంపూర్ణ కృప మరియు దేవుని యొక్క జ్ఞానము అనగా ఏమి?
  28. దేవుడు హృదయమందు కఠినముగా ఉన్నవారిని బట్టి ఎలా తన నీతిని ఉంచును, మరియు చివరలో వారి శేషమును అంగీకరించి, మరియు వారిని కూడా యాకోబు పిల్లలని ఎలా భావించును?

రోమీయులకు వ్రాసిన ఈ పత్రికలన్నిటినీ కూడా నీవు చదువడము ముగించినట్లైతే, ఈ ప్రశ్నలకు సమాధానములు పంపుము, అప్పుడు మేము నీకు ఒక ధ్రువ పత్రమును పంపెదము. అది నీకు క్రీస్తులు కలుగు జీవితమునకు ఒక ఉత్తేజముగా ఉండును.

అప్పుడు మేము మీకు సర్టిఫికెట్ ను బహుమానంగా ఇచ్చెదము అప్పుడు నీవు ఈ పత్రికను అర్థము చేసుకొన్నట్లని యెరుగుదుము

నీవు పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికను బట్టి నీవు పరీక్ష వ్రాయుటకు మేము నిన్ను ఉత్తేజపరచుచున్నాము. అప్పుడు నీదు నిత్యమైన ఐశ్వర్యమును దేవుని ద్వారా పొందుకొనగలవు. మేము నీ సమాధానములు కొరకు ఎదురు చూసి నీకొరకు ప్రార్థన చేస్తున్నాము.

మా చిరునామా:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:31 AM | powered by PmWiki (pmwiki-2.3.3)