Previous Lesson -- Next Lesson
1. పరిశుద్ధపరచబడిన నీ జీవితము దేవునికి సమర్పణ చెందినదిగా ఉండుట (రోమీయులకు 12:1-2)
రోమీయులకు 12:1
1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
పాత నిబంధన ప్రజలు తమ కృతజ్ఞతను దేవుని మందిరములో రకరకాల విధములుగా చెప్పిరి. వారు తమను తాము ఒక జన్తతువుల వాలే వారి పాపములను బట్టి ప్రాయచ్చిత్తమునకు చెప్పుకొనిరి, మరియు కార్యముల ద్వారా వారి పాపములను దేవుని ఎదుట ఒప్పుకొనిరి. యెరూషలేము యొక్క మందిరము నాశనమైన తరువాత పౌలు క్రీస్తు యొక్క విశ్వాసులకు అనగా రోమా లో ఉండు పాత నిబంధన ప్రజలకు, దేవునికి ధనమును త్యాగము చేయవద్దని చెప్పెను. అయితే దానికి బదులుగా వారు తమ దేహములను ప్రభువైన యేసు క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకోవాలి చెప్పెను. దాని అర్థము ఏమనగా వారు తమకు తాము సంబంధించినవారు కాదని అయితే కేవలము దేవునికే సంబంధించినవారని చెప్పెను.
ఈ పాఠము ప్రతి క్రైస్తవునికీ కూడా ఒక ప్రశ్నగా చెప్పబడెను: "నీవు ఇంకా నీకే సంబంధించివాడివా, లేక దేవునికి నిన్ను నీవు సమర్పించుకొని క్రీస్తు యేసు రక్షణను బట్టి తెలుసుకున్నావా?"
దీని అర్థము క్రైస్తవులు తమకు తాము మరణములోనికి వెళ్ళుట కాదు, అయితే వారు నిర్లక్ష్యము కలిగి ఉండక, వారికి ఉన్న ధనము, ఆత్మ, షరీరము మరియు సమస్తము ద్వారా దేవునిని సేవించాలి. మన శారీరక ఇబ్బందులనుంచి కూడా ఆత్మీయ వ్యతిరేకతను కూడా ఇది తెలియజేస్తున్నది, ఎందుకంటె శరీరము ఆత్మీయ జీవితమునకు వ్యతిరేకముగా ఉండును, మరియు ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా ఉండును (గలఁతి 5:17). పౌలు తనకు తాను ఈ వచనమునకు ఒక వివరణగా చెప్పెను: "నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడినాను; జీవించువాడను నేను కాదు, కానీ క్రీస్తేసు నాలో జీవించుచున్నాడు" (గలఁతి 2:19-20)
పౌలు తనకు తాను క్రీస్తుతో పాటు చనిపోయానని సంపూర్ణముగా మరియు నిత్యముగా క్రీస్తుకు సమర్పించుకున్నాడు, మరియు పరిశుద్దాత్ముని ద్వారా క్రీస్తు యొక్క జీవమును కలిగి ఉన్నాడు. కనుక అదేవిధముగా ఇక్కడ పౌలు నిన్ను కూడా దేవునికి మరియు అతని కుమారునికి అతని నీతి నీ యందు జరుగులాగున సమర్పించుకొనుమని చెప్తున్నాడు. నీవు పరిశుద్ధమైన దేవునికి సమర్పించుకొనబడాలని క్రీస్తు నిన్ను తన రక్తము ద్వారా కడగబడి ఉన్నాడు. క్రీస్తు యొక్క రక్తము మరియు అతని ఆత్మ నీలో నివసించుట అను ఈ రెండు బహుమానములు కూడా నీకు నిత్యజీవముగా ఇయ్యబడి ఉన్నవి. కనుక నీవు నీ పరలోకమందున్న తండ్రి యొద్దకు తిరిగి అతని కనికరమును పొందుకో, అప్పుడు అతను తన పరిశుద్ధమైన శక్తి చేత నిన్ను అనుదినము నింపును.
అపొస్తలుడైన పౌలు మీ సంపూర్ణ సమర్పణను బట్టి "మీ పరిచర్యలను బట్టి" (రోమా). ఎందుకంటె మీ ఆనందకరమైన దేవుని పరిచర్య మీకు అవసరము, మరియు మీ ప్రార్థనలకు మరియు విన్నపములకు ఒక గొప్ప శక్తి ఉన్నది, అయితే నిన్ను నీవు సంపూర్ణముగా దేవునికి నిత్యమూ సమర్పించుకోవాలి చివరగా నిన్ను అడుగుతున్నాడు. ఇది సువార్తకు సంబంధమైన సమర్పణ మరియు ఇది కేవలము ఒక్కసారి మాత్రమే జరుగును. కనుక ఈ నూతన నిబంధన నీ జీవితములోనికి వచ్చి నీకు నిత్యా జీవమును ఇచ్చును.
ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, క్రీస్తు యొక్క త్యాగమును బట్టి నీవు కనికరము గల తండ్రివి అయినందుకు నిన్ను ఆరాధిస్తున్నాము. మేము స్వలాభము కలిగి మరియు పిసినారిగా ఉండాలంట్లు మాకు సహాయము చేయుము, మరియు మా సమయమును, సమర్థతను, మరియు మమ్ములను మేము నీ కుమారునికి సమర్పించుకొని పాపమును మరియు అపరిశుద్దతను తిరస్కరించునట్లు సహాయము చేయుము. నీ ప్రేమను మాలో ఉంచుము అప్పుడు మేము నీ సంపూర్ణమైన కనికరములో ఉండెదము.
ప్రశ్నలు:
- నిన్ను నీవు క్రీస్తుకు అనగా రక్షకునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఉన్నావా, లేక నీవు ఇంకా నీ కొరకే జీవించుచున్నావా?