Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 114 (Burial of Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
4. సిలువ మరియు క్రీస్తు మరణము (యోహాను 19:16-42)

f) క్రీస్తు సమాధి చేయబడుట (యోహాను 19:38-42)


యోహాను 19:38
38 అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను.

డెబ్భై మంది పెద్దలు యేసుకు వ్యతిరేకముగా చేయబడిన తీర్పును అంగీకరించలేదు. ఎందుకంటె జ్ఞానులు చెప్పినట్లు ఒకనికి మరణ శిక్ష విధించాలంటే కనీసము ఎక్కువ శాతము ఒప్పుకోవాలి అని. ఒకవేళ దాని ప్రకారముగా జరగని పక్షంలో ఒక మనిషి తన సొంత కక్ష చేత ఈ విధముగా చేస్తాడని చెప్పెను. కనుకనే పిలాతు దగ్గరకు యేసును మూడు సార్లు తీసుకొని వచ్చి అతనిని సిలువ వేయుటకు తీర్పు చెప్పిరి. కనుక ఆ సమయములో కనీసము ఇద్దరు యేసు సిలువ శ్రమను ఒప్పుకొనలేదు. ఒకరు యేసేపు, మరియు అరిమాత , రహస్య శిష్యుడు (మత్తయి 27:57 ; మార్కు 15:43). అతను తనకు కలిగిన అధికారమూ విడుచుటకు ఇష్టపడలేదు. యేసేపు కైపసు యొక్క తీర్పును గూర్చి చాల కోపోద్రేకుడాయెను . యేసేపు యేసుతో ఉన్నానని చెప్పెను అయితే అప్పటికే సమయము మించిపోయెను కనుక అతడి మాటలను వారు పరిగణనలోనికి తీసుకోలేదు. తరువాత యేసును సిలువ వేయమని అందరు చెప్పిరి.

యేసు చనిపోయిన తరువాత పిలాతు దగ్గరకు యేసేపు వెళ్లి, యేసు శరీరమును పూడ్చుటకు అవకాశము ఇచ్చెను కనుక అతను యేసును సిలువ మీద నుంచి దింపి సమాధి చేయుటకు తీసుకొని వెళ్లెను.

అయితే పిలాతు యూదుల మీద కక్ష సాధించి, ఎవరైతే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి వారందరు పనికిమాలిన వారందరి చుట్టూ ఉండిరి. అయితే దేవుడు తన కుమారుడిని వారి నుంచి కాపాడెను. అతను తన పనిని ఆ సిలువలో పూర్తి చేసెను. కనుక పరలోకమందున్న తండ్రి యేసును గౌరవ ప్రదముగా తన కుమారుడిని సమాధి చేయుటకు సహకరించెను.

యోహాను 19:39-42
39 మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. 40 అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. 41 ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. 42 ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.

అనుకోకుండా నీకొదేమను కూడా సిలువ చెంత నిలుచుండి. ఎందుకంటె అతను కూడా ఆ సంఘపు పెద్దలలో ఓటు వేసే రెండవ అధికారము కలవాడు. అంతకు ముందు ఆ సంఘపు పెద్దలు యేసు పైన చేసిన నిర్ణయాన్ని రద్దుచేయాలని ప్రయత్నమూ చేసెను, మరియు సత్యమైన తీర్పు చేయుమని కూడా చెప్పెను (7:51). ౩౨ కిలోల విలువైన మందులను మరియు గుడ్డలను కూడా యేసు కొరకు తెచ్చి యేసేపునకు ఇచ్చి క్రీస్తును క్రిందకు దించి అంటించుమని చెప్పెను, ఎందుకనే శుక్రవారం సాయంత్రము ఆరు గంటలకు శవమును పాతి పెట్టవలెను కాబట్టి. దాని తరువాత సబ్బాతు దినము మొదలవుతుంది.

యేసు తండ్రి ఈ ఇద్దరినీ మరణించిన యేసును ఈ విధముగా సన్మానించుమని చెప్పెను. యెషయా 53 :9 లో చెప్పబడిన వాగ్దానము నెరవేర్చబడినది, అతను ధనవంతునిగా సమాధిచేయబడతాడని చెప్పినట్టు జరిగెను. ఈ విధమైన సమాధులకు రాయి అనునది ఒక ప్రాముఖ్యమైనది. కనుక యేసేపుకు క్రీస్తును సమాధిచేయుటకు తన స్థలము ఇచ్చుదానికంటే మరి ఏ అవకాశము కూడా లేకపోయెను. కనుక పట్టణము అవతల ఈ విధముగా యేసును సమాధి చేసెను. అక్కడ పెట్టెలో కూడా యేసును ఉంచక కేవలము ఒక బండమీద ఉంచి గుడ్డలతో చుట్టి నీకొదేమను తెచ్చిన అత్తరును పూసి అక్కడ యేసును సమాధిచేసిరి.

నిజముగా యేసు మరణించెను; అతనికి 33 సంవత్సరాల యుక్త వయసు వచ్చినప్పుడు ఈ లోకమును విడిచిపోయెను. అతను మరణించుటకే జన్మించి యున్నాడు. కనుక ఈ లోకములో ఒకడు తన ప్రేమను ఇతరులకొరకు పంచి చనిపోయినట్లు ఏ ఒక్కరు కూడా యేసు వాలే చేయలేదు.

ప్రార్థన: యేసయ్య మాకు బదులుగా మరణించినందుకు నీకు కృతజ్ఞతలు. విశ్వాసులందరిచేత నీవు ప్రేమించబడినావు ఎందుకంటె వారినందరిని నీవు కాపాడి వారిని త్రిత్వములోనికి నడిపించినావు. నన్ను నీ సిలువను ఘనపరచునట్లు నేన్ను నీవు స్వీకరించు.

ప్రశ్న:

  1. యేసును సమాధి చేయుట మనకు ఏమి నేర్పిస్తుంది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:35 PM | powered by PmWiki (pmwiki-2.3.3)