Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 115 (Mary Magdalene at the graveside; Peter and John race to the tomb)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)
1. పస్కా పండుగలో జరిగిన కార్యములు (ఈస్టర్) (యోహాను 20:1-10)

a) సమాధి దగ్గర మాగ్డలీన్ మరియా (యోహాను 20:1-2)


యోహాను 20:1-2
1 ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. 2 గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.

శుక్రవారం జరిగిన సంఘటనలను యేసును వెంబడించిన ఆ స్త్రీ మరియు శిష్యులు పాడుచేసిరి. ఆ స్త్రీ దూరము నుంచి యేసును ఏవిధముగా సమాధి చేశారో అని గమనించెను. అయితే అటుతరువాత ఆ స్త్రీలు ఇద్దరు తిరిగి సబ్బాతు దినమును ఆచరించుటకు తిరిగి వెనక్కి వారు ఇంటికి వెళ్లిరి.

ఆ సబ్బాతు దినమందు మరియు పస్కాపండుగ కూడా అదే దినము వచ్చినందున సమాధి దగ్గరకు వెళ్ళుటకు వారికి ధైర్యము చాలలేదు. అయితే అదే సమయములో అక్కడున్న ప్రజలందరూ దేవుడు వారి పాపములకు ప్రాయశ్చిత్తమును వారు వధించిన జంతువుచేత వచ్చేనని సంతోషము కలిగి ఉండిరి, కనుక క్రైస్తవులు భయము చేత మరియు కన్నీళ్లచేత కలుసుకొనిరి. ఎందుకంటె వారి నిరీక్షణ క్రీస్తుతో పాటు సమాధి చేయబడెను కనుక.

సబ్బాతు దినమందు ఆ స్త్రీ క్రీస్తు శరీరమును అభిషేకించుటకు ఏ వస్తువు కూడా బయటకు వెళ్లి కొనలేదు. అయితే ఆదివారము దినము కొరకు ఎదురుచూసేను. యోహాను ఇక్కడ మగ్దలేనే మరియా ఆ సమాధి చెంతకు వచ్చుట గొప్పగా వ్రాసెను మరియు ఇక్కడ ఆమెతో పాటు వచ్చి వేరొక స్త్రీ గురించి మాత్రమూ చెప్పలేదు. యోహాను తల్లి సలోమి మరియు వేరే కొంతమంది ఆదివారము ఉదయమే ఆ సమాధి దగ్గరకు కన్నీళ్లతో వెళ్లిరి.

అయితే వారు ఏడుస్తూ పెందలకడనే ఆ సమాధి చెంతకు వచ్చినప్పుడు సమాధికి ఒక ముద్ర వేయబడుట వారు చూసిరి. అప్పుడు వారి నిరీక్షణకు భంగము కలిగెను. ఎందుకంటె పునరుత్థాన వెలుగు వారి మీద ఇంకా ఉదయించలేదు, మరియు వారి మనసులలో ఇంకా నిత్యా జీవము రాలేదు.

అయితే వారు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని ఏవిధముగా తొలగించాలని ఆలోచన కలిగి ఉండిరి.

ఆ దినము క్రీస్తు ఆ రాయిని తీయుట మొదటి అద్భుతముగా ఉన్నది కనుక , క్రీస్తు ఏవిధమైన రాయి అను బంధకములను మన హృదయములనుంచి తీసివేయగలదని మనము విశ్వసించగలము. కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుడిని కనుగొంటారు; విశ్వాసము గొప్ప భవిషత్తును చూచును.

యోహాను దూత ప్రత్యక్షమగుట మనకు చెప్పలేదు. అయితే మగ్దలేనే మరియా ఆమె స్నేహితులను వెంటబెట్టుకొని ఆ సమాధి దగ్గరకు వెళ్లెను. అప్పుడు అక్కడ యేసు శరీరము లేదని గమనించెను. అప్పుడు ఆమె అక్కడున్న శిష్యుల దగ్గరకు పరిగెత్తుకుని పోయెను. ఎందుకంటె ఈ అద్బుతమును ఆమె అక్కడున్న శిష్యులకు చెప్పినట్లైతే వారు వెళ్లి తక్కిన శిష్యులకు చెప్పెదరు అని అనుకొనెను. ఎప్పుడైతే ఆమె పేతురు దగ్గరకు వెళ్లేనా అప్పుడు ఈ విధముగా చెప్పెను, " యేసు శరీరమును ఎవరో మోసుకొని వెళ్లారు. ఎక్కడ ఉంచిరో తెలియదు. కనుక ఇది మరొక నేరము" అని చెప్పెను. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆత్మీయముగా వారు ఎంత గ్రుడ్డితనము కలిగి ఉన్నారో తెలుసుకొనవచ్చు, ఎందుకంటె వారు యేసు శరీరము ఎవరో తీసుకొనివెళ్ళారని అనుకొన్నారు. అయితే యేసు ప్రభువని తెలుసుకొనక మరియు అతను పునరుత్థానుడై లేచాడని వారు తెలుసుకొనలేక పోయిరి.


b) పేతురు మరియు యోహాను సమాధి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళుట (యోహాను 20:3-10)


యోహాను 20:3-5
3 కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. 4 వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగాసమాధియొద్దకువచ్చి 5 వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.

ఇది వారు జీవితములో యేసుతో మొదటి స్థానములో ఉండాలనేటువంటి పందెములో వారు ఉండిరి. పేతురు పెద్దవాడైనప్పటికీ యోహాను వెనకాలే ఉండెను అయితే అతడిని పట్టుకొనుటకు సాధ్యము కాలేదు. వారిద్దరూ కూడా అక్కడ ఉన్న కావలి వారిని మరచి పోయి ఆ పట్టణము ద్వారములను దాటిపోయిరి. ఎప్పుడైతే వారిద్దరూ సమాధి దగ్గరకు వచ్చిరో అప్పుడు యోహాను ఆ సమాధికొనికి వెళ్ళాక వెనకాలే ఉండెను. అయితే ఎప్పుడైతే అతను లోపలికి వంగి చూసినా అక్కడ కేవలము ఉదారంగులో ఉన్న తెల్లని వస్త్రములు పది ఉండుట చూసేను. అయితే ఆ వస్త్రములు క్రింద పది లేవు అయితే క్రీస్తుకు ఏవిధముగా ఆ సమాధిలో చుట్టిరో ఆలాగుననే అవి ఉండెను. ఇది మూడవ అద్భుతము యేసు తన పునరుత్థానము చేత చేయబడినది. కనుక యేసు ఆ వస్త్రములతో పురారుత్థానుడైలేవలేదు అయితే ఆ వస్త్రముల గుండా పునరుత్థానుడై లేచెను. కనుక దూత కూడా ఆ స్త్రీలు చూచుటకు అవకాశము ఇచ్చుఅంట్లు ఆ రాయి దొర్లి ఉండెను. కనుక వారు లోపలి వెళ్లిరి. కనుక యేసు ఆ రాయి గుండా బయటకు వెళ్లెను.

ప్రార్థన: ప్రభువా నీవు మృతిని జయించి తిరిగి లేచినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ప్రతి విధమైన సాతాను క్రియలను జయించి దేవుని దగ్గరకు ఒక ద్వారమును తెరచినావు. నీవు మమ్ములను విడువలేదు. మా బలహీనతలో నీవు ఉంది మమ్ములను బలపరచావు. నీవు మాకు నిరీక్షణకు ఇచ్చావు కనుక మేము నీకు సాగిలా పది నమస్కారము చేయుదము.

ప్రశ్న:

  1. యేసు పునరుత్థానమునకు గల మూడు రుజువులు ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:36 PM | powered by PmWiki (pmwiki-2.3.3)