Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 059 (The devil, murderer and liar)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

f) సాతాను, ఒక హంతకుడు, అబద్ధికుడు (యోహాను 8:37-47)


యోహాను 8:37-39
37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. 38 నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరి గించుచున్నారని వారితో చెప్పెను. 39 అందుకు వారు ఆయనతోమా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.

యూదులు తమను తాము అబ్రాహాము సంతానంగా చెప్పుకున్నారు, మరియు వారు విశ్వాసమునకు తండ్రి అయినా వాడు తమ పితరుడు అని భావించి అతను ఏవిధముగా దేవునికి తగ్గించుకొని జీవించాడో అదేవిధముగా మేము కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉన్నట్లయితే మాకు కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకొనిరి.

యేసు వారి ఆలోచనావిధానమును వ్యతిరేకించలేదు అయితే వారు అబ్రాహామునకు మరియు వారి పితరులకు కలిగిన ఆత్మ వీరికి లేదని యేసు బాధపడ్డాడు. ఇది ఆయనకు దేవుని స్వరమును వినుటకు అవకాశము కలిగించి దేవుని వాక్యమును నిలబెట్టుటకు మార్గము చేసినది. అయితే వారు యేసు మాటలను వినుటలో వారి హృదయములను తెరువలేదు, మరియు ఈ మాటలు వారి హృదయములోనికి ప్రవేశించుటలో విఫలము చెందియున్నవి. కనుక వారు అవిశ్వాసులుగానే మిగిలిపోయారు.

ఆ గుంపులో క్రీస్తు మాటలకు ఏవిధమైన ప్రతి ఫలములు కలుగలేదు అయితే కేవలము ద్వేషము మరియు తిరస్కారము మాత్రమే కలిగివున్నాయి. ఆ సమయములో అక్కడున్న అనేకులు యేసును చంపాలనే ఉద్దేశములో ఉన్నవారు కారు, అయితే యేసు వారి హృదయములు ద్వేషములతో కూడుకొని ఉన్నవని యెరిగి వారిని హత్యలు చేయుటకు ప్రయత్నములను మార్చేను. అందుకే వారు, " గట్టిగా సిలువ వేయండి " అని కేకలు వేసిరి " (మత్తయి 27:21-23 ;యోహాను 19:15).

అబ్రాహాము దేవుని స్వరము వినెను కనుక అతనికి లోబడి ఉండెను. అయితే క్రీస్తు కేవలము దేవుని స్వరము మాత్రమే వినలేదు, అయితే దేవుడిని చూసి అతని కార్యములను ఘనపరచెను. అతని బోధనాలన్నీ సంపూర్ణమై దేవునితో సహవాసము కలిగి ఉండెను. యేసు తన ఆత్మలో ఆత్మ మరియు తన ప్రేమలో ప్రేమ అయి ఉన్నాడు.

ఎప్పుడైతే యూదులు ఏకైక కుమారుని ద్వేషించారో అది వారు నిజముగా దేవునికి సంబంధించినవారు కాదనుటకు ఒక సాక్షిగా ఉన్నది. వారి యొక్కా ఆలోచన విధానము పరలోకమునకు వ్యతిరేకముగా ఉన్నది. అందుకే ఈ చర్చలలో యేసు వారిని తమ పితరులైన వారు తండ్రులను జ్ఞాపకము చేసుకొనుటలో సహాయము చేసియుటకు ప్రయత్నించెను. అయితే ఇది అబ్రాహాము కాదు.

యోహాను 8:40-41
40 దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు 41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా

యూదులు క్రీస్తు మాటలను అసహ్యించుకొనిరి , ఎందుకంటె అతను వారిని మీరు అబ్రాహాము సంతానమై ఉన్నప్పటికీ వారి ఆత్మను పొందలేదు అని చెప్పెను కనుక. అయితే వారి నిరీక్షణ కేవలము అబ్రాహామును ఉన్న విశ్వాసము ద్వారా మాకు కూడా దేవునితో బంధము కలిగి ఉన్నాము అని అనుకొనిరి. కనుక యేసు ఈ విధమైన తప్పులను వారి జీవితములో కనుగొనెను.

అబ్రాహాము తన ఇంటిని మరియు దేశమును వదిలినప్పుడు కేవలము దేవుని మీద సంపూర్ణ విశ్వాసము కలిగి తన కార్యములను దేవునికి ఇష్టముగా చేసెనని యేసు వారికి చెప్పెను. అతని విశ్వాసము దేవుని యెడల ఎప్పుడు కనపడెను అనగా , తనకున్న ఏకైక కుమారునికి దేవునికి బలిగా అర్పించుటలో తన విశ్వాసము కనబడెను, మరియు తన సహోదరుడైన లోటు విషయములో కూడా తన విశ్వాసమును అబ్రాహాము బయలుపరచెను. అయితే యూదులు మాత్రమూ ఈ విషయములో క్రీస్తుకు చాల వ్యతిరేకులుగా ఉండిరి. మరియు వారు క్రీస్తు అవతారమును మరియు దేవుని సన్నిధి క్రీస్తులో ఉన్నదని తెలుసుకోలేకపోయిరి. యేసు ఈ లోకమునకు దేవుని కుమారునిగా దూతలతో కావలి కలిగి ఉండుటకు రాలేదు అయితే ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి దేవుని వాక్యమును ఈ లోకములో బయలుపరచెను. అతను మనుషులకు దేవుడిని అంగీకరించుమని బలవంతము చేయలేదు అయితే దేవుని ప్రేమను , కృపను తెలియపరచుటకు మాత్రమే వచ్చెను. వారు ఈ విధమైన మంచి కార్యములను వ్యతిరేకించిరి కనుక వారు యేసును చంపుటకు ప్రయత్నించిరి. అయితే అబ్రాహాము విషయమును ఆలోచనచేస్తే అతను దేవునికి లోబడి, తగ్గింపుకలిగి, దేవుని రక్షణను బట్టి ఎంతో అతిశయము కలిగి ఉన్నాడు.

యోహాను 8:42-43
42 యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. 43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?

యేసు వారికి మీరు వెంబడించుచున్నది అబ్రాహామును కాదు అయితే అలంటి వానిగా మీరు భావించే మీ పితరులను వెంబడించుచున్నారని వారికి వివరించెను.

యేసు వారికి క్లుప్తముగా వారికి మరియు తనకు మధ్యన ఉన్న వ్యత్యాసమును చెప్పెను అని అనుకొనిరి. వారు మోయాబీయులు మరియు అమోరీయుల సంతానము కాదని చెప్పిరి, ఎందుకంటె వారు వ్యభిచార సంతానము కాబట్టి. (ఆది 19:36-38). మరియు నిర్గమకాండములో 4 :౨౨ లో వ్రాయబడినట్లు సమరయ సంతానమునకు చెందిన వారు కాదని చెప్పిరి, ఎందుకంటె సమారాయులు వంశము దేవుని వంశము అని చెప్పిరి కనుక. ద్వితీ 32:6 , యెషయా 63:16. ఎప్పుడైతే క్రీస్తు తన తండ్రి దేవుడే అని చెప్పినప్పుడు వారు కూడా క్రీస్తును వ్యాఖ్యను సారముగా తమ తండ్రి అని భావించిరి . ఇది వారు విశ్వాసమును మరియు వారు నడుచుకుంటున్న తీరుకు నిదర్శనంగా ఉన్నది. అయితే వారి సాక్ష్యము తప్పు అయినది.

వారి మోసపోయారని యేసు వారికీ క్లుప్తముగా చెప్పెను. అందుకే , " మీ తండ్రి ఒకవేళ దేవుడే అయితే మీరు నన్ను ప్రేమించెదరు, ఎందుకంటె దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ద్వేషించువాడు కాదు కనుక. మరియు తండ్రి తన కుమారునికి ప్రేమించి అతని ద్వారా సమస్తమును చేయును. " యేసు ఏ క్షణమందు కూడా తన తండ్రి లేక ఉండలేదు, అయితే అపొస్తలునిగా అన్నిటిలో తండ్రికి లోబడి ఉన్నాడు.

అప్పుడు యేసు వారిని , " మీరు నా మాటలు అర్థము చేసుకొనుటకు ఎందుకు విఫలమయ్యారు ? నేను తెలియని భాష మాట్లాడలేదు, అయితే నా ఆత్మను చాల సహజముగా ఇచ్చాను, కనుక అవి చిన్నవారు కూడా అర్థము చేసుకొనగలరు. " అప్పడు యేసు తన ప్రశ్నకు అతనే సమాధానమును చెప్పెను, " మీరు బానిసలు కనుక నా స్వరమును వినలేరు; ఎందుకంటె మీ ఆత్మీయ జీవితములు చెదిరిపోయినాయి కనుక. మీరు వినలేనటువంటి చెవిటివాళ్లను కలిపినారు .

ప్రియా సహోదర నీవు ఆత్మీయముగా ఏవిధముగా వింటున్నావు, నీ హృదయమందు దేవుని స్వరమును వింటున్నావా? నీ అంతరంగము మార్చబడునట్లు నీవు అతని స్వరమును వింటున్నావా ? లేక చేదు ఆత్మ నిన్ను ఆవరించింది కనుక నీవు వినుటకు గర్వము కలిగి చెవిటివానివలె ఉన్నావా ? నీవు దేవుని శక్తి ద్వారా కార్యము చేయబడినట్లు పనిచేసెదవా లేక చేదు ఆత్మ ద్వారా నింపబడి దాని ద్వారా నడిపించబడెదవా?

ప్రశ్న:

  1. యూదులు అబ్రాహాము సంతానము కాదని యేసు ఏవిధముగా రుజువు చూపెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:14 AM | powered by PmWiki (pmwiki-2.3.3)