Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 073 (How those who are Strong in Faith ought to Behave)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

10. అనుకోకుండా వచ్చు సమస్యలను బట్టి విశ్వాసముతో బలముగా ఉన్నవారు ఏవిధముగా ప్రవర్తించాలి (రోమీయులకు 15:1-5)


రోమీయులకు 15:1-5
1 కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరిం చుటకు బద్ధులమై యున్నాము. 2 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. 3 క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను. 4 ఏల యనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. 5 మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, 

ఎంతో దూరమునకు తీసుకొని వెళ్లినటువంటి ఆహారమును బట్టి మరియు పానీయమును బట్టి పౌలుకు తెలుసు.ఎందుకంటె ధర్మశాస్త్రమును బట్టి ఎవరు ఎంతో బలముగా ఉన్నారో అతనికి తెలుసు. అయితే అతనికి ఉన్న స్వాతంత్ర్యమును బట్టి మరియు ఎవరైతే బలము కలిగి ఉన్నారో వారు తిరిగి నూతన నిబంధన చేత బలహీనులుగా మార్చబడతారని తెలుసు, ఎందుకంటె వారు క్రీస్తు యందు విశ్వాసముంచువరకు. మనము మనకు తోచినట్లు ఉండకూడదు, అయితే నూతనముగా రక్షింపబడినవారికి అనుకూలముగా ఉండాలి, ఎందుకంటే వారికి అన్ని విషయాలు తెలియవు కాబట్టి. కనుక ఇతరుల విశ్వాసములను బలపరచుట కొరకు మనము కార్యము చేయుట అనునది ఎంతో ప్రాముఖ్యమైనది, కనుక మనకు తోచినట్లు ఉండక ఇతరులకు అవసరకరముగా ఉండుట మంచిది.

ఈ విధమైన సిద్ధాంతములు ఆత్మీయమైన స్వభావమును ప్రతి సంఘములో కూడా పాడుచేయును. మనము మన కలల ప్రకారముగా మన జీవితమును గూర్చి ప్రణాళిక చేయము, కార్యములు చేయము,మరియు మన అవకాశములు కూడా మన కలల ప్రకారముగా ఉండవు, అయితే మనము యేసును సేవించి ఎవరైతే విశ్వాసమందు బలహీనంగా ఉంటారో వారి యొక్క అహమును బట్టి ఆలోచన కలిగి, యేసును మరియు సంఘమును అనుసరించగలము. యేసు తన కొరకు జీవించలేడు, అయితే తన మహిమ కొరకు జీవించి మనిషిగా మారాడు. ఈ లోకమును రక్షించుటకు,అతను శ్రమలను, ఇబ్బందులను మరియు అన్నివిధములైన వాటిని ఓర్చుకున్నాడు, చివరకు ప్రతి రకమైన దోషిని కూడా కాపాడుటకు అతను మరణించాడు.

యేసు బైబిల్ ప్రకారముగా జీవించాడు; తగ్గింపు కలిగి, దీర్ఘశాంతము కలిగి అన్నివిషయాలలో ఓర్పుకలిగి జీవించాడు. తన పరిచర్యలో అతను పాత నిబంధన పుస్తకాల శక్తిని పొందుకొని ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు సంఘములో మరియు క్రీస్తును వ్యతిరేకించినవారు దగ్గర పరిచర్య చేయాలనుకుంటే అతను దేవుని వాక్యంలో నాటబడి ఉండాలి, లేనియెడల అతను ఆనందమునకు సంబంధించిన శక్తిని కోల్పోతాడు.

పౌలు తన పత్రికలలో దేవుడు ఓర్పుగల దేవుడని చెప్తున్నాడు (రోమా). సృష్టికర్తకు కూడా ఖఠినము కలిగిన వారిపట్ల ఎంతో సహనము ఓర్పు కావాలి. తన కుమారుడైన యేసులో మాత్రమే అతనికి ఓర్పు కలుగుతుంది, ఎందుకంటె అతనిలో మాత్రమే తాను ఉండగలదు కాబట్టి. కనుకనే పౌలు రోమా సంఘములో ఉన్నవారికి, ఐక్యత అనునది విశ్వాసులద్వారా మాత్రమే రాదు అయితే అది కేవలము క్రీస్తు యేసు ద్వారా మాత్రమే వచ్చునని చెప్పెను, ఎందుకంటె ఆలోచనలు క్రీస్తుతో ఐక్యత ద్వారా మాత్రమే వచ్చును. క్రీస్తు ద్వారా నేరుగా వచ్చు ఐక్యత తప్ప మరి ఎక్కడి నుంచి కూడా మనకు ఐక్యత అనునది రాదు. కనుక మన రక్షకుడు, గొప్పవాడు, ఈ లోక తండ్రి మరియు సర్వసృష్టికర్త అయినా దేవునికే మహిమ కలుగును గాక.

మనలను తన మరణముతో మరియు శ్రమలతో క్రీస్తే పరిశుద్దాత్మునితో శాంతిపజేసాడు. మనలను తన మరణముతో మరియు పునరుత్తనముతో కొని పరలోకములో మనలను తీసుకొనివెళ్తున్నాడు, మరియు మనలను ఆత్మీయ జన్మముచేత స్వీకరించి, మనము కనికరము గల తండ్రిని మహిమపరచునట్లు చేసియున్నాడు. తండ్రి మరియు కుమారుడు ఏవిధముగా అయితే ఒక్కటై ఉన్నారో అదేవిధముగా సంఘములో ఉన్న ప్రతి సంభ్యుడు కూడా ఐక్యత కలిగి యేసుకు సమర్పించుకొని ఉండాలి.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, ప్రభువైన యేసు తండ్రిత్వమును మాకు బయలుచేసినందుకు నిన్ను మేము ఘనపరచుచున్నాము, మరియు మమ్ములను నీ ప్రేమ కలిగిన పరిశుద్ధ ఐక్యతలో ఉంచుము.ఈ ప్రేమ మా సంఘములో కూడా ఉన్నట్లుగా నడిపించు.

ప్రశ్నలు:

  1. రోమా 15:5-6 గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:41 AM | powered by PmWiki (pmwiki-2.3.3)