Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 074 (Christ Overcame all the Differences)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

11. యూదుల విశ్వాసములను మరియు అన్యుల విశ్వాసములను క్రీస్తు జయించుట (రోమీయులకు 15:6-13)


రోమీయులకు 15:6-13
6 క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 7 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి. 8 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి3 గలవారికి పరిచారకుడాయెను. 9 అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. 10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు 11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. 12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. 13 కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

ఎవరైతే రోమా పత్రిక 9 నుంచి 15 వరకు చదువగలరో వారు క్లుప్తముగా క్రైస్తవ యూదులను మరియు అన్యులకు సంబంధించిన వ్యత్యాసమును కనుగొంటారు. ఈ యొక్క వ్యత్యాసము సున్నతిలో మరియు ఆహారమును బట్టి మోషే ధర్మశాస్త్రములో కనుగొంటారు, మరియు యూదుల గురించి మరియు క్రైస్తవుల గురించి. పౌలు యొక్క మంచి కార్యములను రోమా సంఘములో ఉండు విశ్వాసులకు తన పత్రికలో వ్రాసి ఉన్నాడు, ఆలాగుననే యూదుల గురించి మరియు అన్యులగురించి, కనుక వారి మధ్యన ఒక వంతెనను అతను కట్టిఉన్నాడు. కనుకనే అతను తన పత్రిక చివరలో ఈ విధముగా వ్రాసి ఉన్నాడు: "యేసు నిన్ను ఏవిధముగా రక్షించి అంగీకరించి ఉన్నాడో, అదేవిధముగా నీవు కూడా ఇతరులను బట్టి అదేవిధమైన అభిప్రాయము కలిగి ఉండు. మరియు ఎవరైతే రక్షణను గురించిన రహస్యములను కనుకొని ఉంటారో వారు తండ్రిని, కుమారుడిని మరియు పరిశుద్దాత్ముడ్ని ఇతరులతో కలిసి మహిమపరచగలరు, అది ఏవిధమైన వ్యత్యాసము లేకుండా, ఈర్ష్య లేకుండా మరియు ద్వేషం లేకుండా."

క్రీస్తు ప్రేమ అన్నిటికంటే గొప్పది మరియు బలమైనది, కనుక ప్రతి వసివాసికి కూడా ఇలాంటి ప్రేమ అవసరమై ఉన్నది. ఈ విషయాన్ని బట్టి పౌలు యూదుల విశ్వాసులకు తెలియపరచాడు, మరియు వారు ఎదురుచూస్తున్న మెస్సయ్య వారికి ఒక సేవకునిగా మరియు దేవుని యొక్క సత్యమైన నీతిని బయలుపరచి, అతని వాగ్దానములను మాటలచేత మరియు కార్యములచేత నెరవేర్చునని చెప్పెను. కనుక క్రీస్తు చాల వాగ్దానాలను బయలుపరచి తండ్రి అయినా దేవుని విశ్వాసమును కూడా నెరవేర్చి ఉన్నాడు.

అన్యులలో ఉన్న అపరిశుద్దులకు పౌలు చెప్పినది ఏమనగా మీరు కూడా దేవుడిని మహిమపరచాలని, ఎందుకంటె అతనికి వారి పట్ల కనికరము ఉన్నది, మరియు వారిని కూడా అతను సమాధానపరచాడు, మరియు వారిని దత్తత తీసుకొని వారిని కూడా విమోచించాడు. ఎవరైతే యూదులు కారో వారు తండ్రిని మరియు కుమారుడిని ఘనపరచుట వారి ఉత్తమమైనది. ఇది కూడా పాత నిబంధనను నెరవేర్చుటగా ఉన్నది, ఎందుకంటె క్రీస్తు అన్యులకు కూడా వెలుగై ఉన్నాడు, మరియు అన్యులలో ఉన్న క్రైస్తవులు కూడా దేవునిని ఆనందించుటలో భాగస్తులై ఉన్నారు, ఎందుకంటె క్రీస్తు చెప్పినట్లు తన ఆనందమును వారిలో నెరవేర్చబడాలని (యోహాను 15:11; 17:13). ఏదేమైనా అన్యులలో ఉండు విశ్వాసులు యూదులు విశ్వాసులను మరచిపోకూడదు, అయితే వారందరు కూడా ఒకే స్వరము కలిగి తండ్రిని మరియు కుమారుడిని కలిసి ఘనపరచాలి (ద్వితీ 32:43)

పాత నిబంధనలో ఈ వాగ్దానములు పరిమితము చేయబడలేదు, అయితే అవన్నీ కూడా అన్ని దేశాలకు సంబంధించి వారందరు కూడా తండ్రిని ప్రభువైన యేసులో మహిమపరచాలి (కీర్తన 117:1). ఈ విలువైన వాగ్దానములో మనము ఆత్మీయ అధికారము కలిగిన రక్షణను మనుషులకు కనుగొనవచ్చు. ఎవరైతే క్రీస్తుయందు విశ్వాసము కలిగి ఉంటారో వారు అతని ఘనమైన కనికరములో భాగస్తులుగా ఉంటారు.

యెషయా ప్రవచించినట్లు: "ఎస్సాయ ద్వారా ప్రజలకు ఒక ధ్వజము కలిగినది; కనుక దేశములు అతని మీద అనుకొనును మరియు అతని యందు నిరీక్షణ కలిగి ఉందును". ఈ ప్రవచనము క్రీస్తులో నెరవేర్చబడినది, ఎందుకంటె అతను తండ్రి కుడి పార్శ్యమున కూర్చున్నాడు కనుక ఆకాశమందును భూమియందును సమస్త అధికారములు అతనికి ఇవ్వబడినవి. యేసు కూడా తన శిష్యులకు సమస్త దేశములకు వెళ్లి సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేసి వారు ఆత్మచేత నింపబడునట్లు నడిపించుమని ఆజ్ఞాపించెను, అప్పుడు దేవుని రాజ్యము వారిలో ఎదుగునట్లు.

అన్యుల ప్రార్థన యొక్క ఉద్దేశములు ఏవనగా విశ్వాసుల ఐక్యతను వారు చాటి చెప్పుట. అపొస్తలులు వారి శరీరములచేత పరలోక ఆనందమును కలిగి ఉంది, మరియు సమాధాన కర్త అయినా యేసు యొక్క విశ్వాసము వారిలో స్థిరపరచి త్రిత్వము యొక్క ఐక్యతలో వారు పరిశుద్దాత్మ శక్తి కలిగి ఉండాలని చెప్పిరి.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, మేము యేసు ద్వానా నిన్ను అడుగుచున్నాము, యూదుల విశ్వాసులు అన్యుల విశ్వాసులను విడువక ఉండునట్లు సహాయము చేయుము; అయితే వారందరు కూడా క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా సమాధాన పరచబడినారని అర్థము చేసుకొనుటకు సహాయము చేయుము. వారందరు కూడా క్రీస్తులో స్థిరము కలిగి మరియు పరిశుద్దాత్మ శక్తిలో ఐక్యత కలిగి ఉండునట్లు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. రోమా సంఘములో ఉన్న వ్యత్యాసములను పౌలు ఏవిధముగా జయించాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:42 AM | powered by PmWiki (pmwiki-2.3.3)