Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 072 (Do not Enrage your Neighbor for Unimportant Reasons)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

9. ప్రాముఖ్యము లేని వాటి విషయమై నీ పొరుగువానికి కోపము పుట్టించకు (రోమీయులకు 14:13-23)


రోమీయులకు 14:13-23
13 కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చ యించు కొనుడి. 14 సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే. 15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము. 16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. 17 దేవుని రాజ్యము భోజన మును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. 18 ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు. 19 కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. 20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము. 21 మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది. 22 నీకున్న విశ్వా సము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. 23 అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.

పౌలు తన పరిచర్యలో అనేక సంఘముల యొక్క మూర్ఖమైన మరియు నిషేధించబడిన వాటినే బట్టి తెలుసుకొని ఉన్నాడు. అతను యేసు చెప్పిన మాటలను ఎత్తి చూపాడు (మార్క్7:15-23; లూకా 6:4), వాటికి అవే ఏవి కూడా చెడుగా ఉండవు అయితే మనిషి నుంచి వచ్చునవి మాత్రమే చెడ్డవై ఉన్నవి. విశ్వాసులకు ఏమి తింటే మంచిదో అవే తింటాము శ్రేష్ఠము. మరియు వారి ఆరోగ్యమునకు హాని కలిగించు వాటిని తింటాము మంచిది కాదు.

క్రైస్తవులు ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండాలి. ఇతరులకు పాపము కలిగించునది ఏదైనా ఉన్నట్లయితే వాటి విషయమును బట్టి దూరముగా ఉండాలి. ఏ విశ్వాసి అయితే తినుటలో మరియు త్రాగుటలో నియమము లేక ఉండునో అలాంటి వారి హృదయాలలో అనుమానము అనునది వచ్చును, మరియు మొదటగా వారే విడువబడతారని అనుకొంటారు. కనుక ఎవరైతే తప్పును ఒక కారణముచేత చేస్తారో వారి ఇతర విశ్వాసములను మరియు వారికి క్రీస్తు మీద ఉన్న ప్రేమను బట్టి కంగారుపెడతారు. ఎవరైతే విశ్వాసమందు స్థిరముగా ఉంటారో వారి నుంచి విశ్వాసము అనునది అవసరమై ఉందును, కనుక అతను బలహీనుని ముందు తన బలమును ప్రదర్శించకూడదు, అయితే నూతనముగా రక్షింపబడుచున్న వారికి అతను ఒక అడ్డుగోడవలె ఉండకూడదు.

పౌలు చెప్పినట్లు దేవుని రాజ్యము తినుటలో మరియు త్రాగుటలో లేదు అని, అయితే అది పరిశుద్దాత్ముని ఫలములను బట్టి ఉందును, దాని నుంచే అతను నీతి, సమాధానము, ఆనందము అని పేర్ల ద్వారా ప్రతి సంఘములో పిలుచును. పౌలు చెప్పినట్లు సంఘములో ఉన్న విశ్వాసులు తినుటలో త్రాగుటలో ధ్యానము కలిగి ఉండక, సంఘముయొక్క అభివృద్ధి కొరకైనా కార్యములను చేయాలని కోరుకుంటున్నాడు. తినుట, త్రాగుట, వస్త్రము ధరించుట అనునది ఆత్మీయమైన వాటికంటే గొప్పవి కావు, లేదా డబ్బును ఏవిధముగా ఖర్చు చేయాలి అని; అయితే క్రీస్తు ఆత్మ ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి ఉంది ఈ లోక సంబంధమైన వాటి అవసరత యందు మనసు కలిగి ఉండకూడదు. క్రీస్తు యొక్క జ్ఞానము కలిగిన వారీగా మరియు ప్రేమచేత నింపబడినవారిగా ఉండుమని పౌలు చెప్పి ఉన్నాడు, మరియు ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయి ఉన్నదో వారిని బట్టి మనిషి ప్రాముఖ్యము కలిగి ఉండాలి.

దేవుని యొక్క సంఘములో సమాధానము అనునది ఎంతో ప్రాముఖ్యమైనది, మరియు ధర్మశాస్త్రమునకు అవసరమైనవి కూడా. ఒకవేళ సంఘములో ఉన్న వారు తినక, త్రాగక ఉండి, ఎందుకంటె అతని ఉద్దేశములు అతని మనసును ఘనపరచుటకు ప్రేమ కలిగి ఒప్పుకున్నట్లైతే, ఎందుకంటె ఇతరులకు మన యొక్క ప్రవర్తన అడ్డుగా ఉండకూడదు.

ఏదేమైనా, సంఘములో ఉన్న క్రొత్త వివాసి తినుటలో మరియు త్రాగుటలో వికారంగా అతని మనసుకు ఉన్నట్లయితే అప్పుడు అతను తనతో పాటు ఉన్న ఇతర సఙ్గహస్తులతో పాటు తప్పు చేయువాడుగా ఉండును, ఎందుకంటె విశ్వాసమందు ఉన్నటువంటి నిరీక్షణ వెలుపటి సమాధానముకంటె ప్రాముఖ్యమైనది. విశ్వాసము అనునది ప్రేమను తెలుసుకొని అది సంఘములో ఉంది ఐక్యతను కాపాడును; అయితే ఎవరైతే వారి సొంత ఆలోచనలచేత ఆత్మీయ ఐక్యతను పాడు చేయాలని చూస్తే అప్పుడు అతను నాశనము చేయబడతాడు.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు జాలరులను, గుత్తదారులను మరియు ధర్మశాస్త్రమందు జ్ఞానము కలిగిన వారిని నీ శిష్యులుగా ఎంచుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. వారినందరినీ నీవు ఒక గుంపుగా చేసి వారికి ఏ ఇతర ఆజ్ఞలను ఇవ్వక కేవలము ప్రేమించుట, క్షమించుట, మరియు సమాధానముగా ఉండుటను మాత్రమే నేర్పించి ఉన్నావు. మేము ఇతరులను కేవలము ఏడు సార్లు మాత్రమే క్షమించునట్లుగా కాక డెబ్భై సార్లు క్షమించునట్లుగా మార్చుము, మరియు వారు కూడా మమ్ములను క్షమించాలని మేము మరవకుండునట్లు చేయుము అది కూడా డెబ్భై ఏడుసార్లు రోజుకు.

ప్రశ్నలు:

  1. "దేవుని రాజ్యము భోజన మును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది" ఈ వాక్యమునకు గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:41 AM | powered by PmWiki (pmwiki-2.3.3)