Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 067 (Love your Enemies and Opponents)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

4. నీ శత్రువులను మరియు నీ వ్యతిరేకస్తులను ప్రేమించుము (రోమీయులకు 12:17-21)


రోమీయులకు 12:17-21
17 కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. 19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడిపగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. 20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. 21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

యేసు "కన్నుకు కన్ను, పంటికి పన్ను" అను ఆజ్ఞను తీసివేసాడు. దానికి అతను ముగింపు పలికాడు (నిర్గమ 21:24; లేవి 24:19-20; మత్తయి 5:38-42), మరియు మనకు ప్రేమించి, సహాయముచేసి, ఆశీర్వదించు ఆజ్ఞను ఇచ్చాడు. ఇవన్నీ చేయునట్లు మనకు పాత నిబంధన నిబంధనలన్నిటినీ అతను జయించాడు, మరియు ఈ పనికిరాని లోకములో మనము పరలోకములోనికి ప్రవేశించునట్లు మనలను నడిపించాడు.

యేసు యొక్క ధర్మసహస్త్రములో అందరు కూడా నడుచునట్లు అపొస్తలుడైన పౌలు మనలను ముందుకు కొనసాగిస్తున్నాడు, మరియు వాటిని మనము సంఘములలో బోధించాలి. కనుక ఎవరైనా నిన్ను మోసపరచినట్లైతే లేదా నీ గురించి చెడుగా మాట్లాడినట్లైతే , నీవు న్యాయము కలిగిన వాడివని యెంచక వారి సమస్యను బట్టి నీవు నీ ప్రభువుతో పంచుకో. సత్యమునకు సాక్ష్యము చెప్పి, త్వరపడి ఉండవద్దు. సమాధానము కలిగి ఉండుటకు కష్టపడి. నీ అధికారమును నీ సమయమును త్యాగము చేయుము. నీ యందు మరియు నీ శత్రువులయందు దేవుడు సమాధానమును ఉంచునట్లు సహాయము చేయుము. ప్రభవు ప్రతి కఠినమైన హృదయమును మెత్తని మాంసముగా మర్చి నీయెడల గౌరవమును కలిగి ఉన్నట్లు మార్చును.

కక్ష అనునది క్రైస్తత్వములో పూర్తిగా నిషేదించబడినది, ఎందుకంటె దేవుడు మాత్రమే నీతికలిగిన వాడు, అతని పరిశుద్ధతలో అన్ని పరిష్టితులను కూడా అర్థము చేసుకొనుటకు సమర్థుడు, మరియు జ్ఞానము కలిగి నీతి కలిగి తీర్పు తీర్చును ( ద్వితీ 32:35)

మనకు తగిన జ్ఞానము ఉన్నది కనుక మనము ఇతరులను ఎన్నడూ తీర్పు తీర్చకూడదు. అందుకే అతను క్లుప్తముగా చెప్పెను: "తీర్పు తీర్చకు, నీవుకూడా తీర్పు తీర్చబడతావు. నీవు ఇతరులను ఏవిధముగా అయితే తీర్పు తీర్చుతావో అదేవిధముగా నీకు కూడా తీర్పు తీర్చబడును, ఏవిధముగా అయితే నీవు వారిని కొత్తచేత కొలిచెదవో అదేవిధముగా నీకు కూడా జరుగును. నీ కాంతిలో ఉన్న నలుసును బట్టి ఆలోచనకలిగి ఉండక నీ సహోదరుని కాంతిలో నలుసును ఎందుకు చూస్తున్నావు? ' నీ కంటి నుంచి నలుసును తీసివేస్తాను ' అని నీ సహోదరునితో నీవు ఎలాగూ చెప్పగలవు, ఎందుకంటె అదేసమయములో నీ కాంతిలో కూడా అదే నలుసు ఉన్నది కనుక? కనుక కపటము కలియినా వాడ నీ కంటిలోని నలుసును మొదటగా తీసివేసుకో, అప్పుడు నీవు ఇతరుల కాంతిలో ఉన్న నలుసును చూస్తావు కనుక అప్పుడు వాటిని తీసివేస్తావు" (మత్తయి 7:1-5).

ఈ విధమైన వాటి నుండి మన ప్రభువు మనలను క్రిందకు తీసుకొచ్చి మన అహమును మరియు మన స్వలాభం స్వభావమును తీసి ఎవ్వరు కూడా నీతికలిగి లేరని చూపును. మనమందరము నీతిగా ఉన్నవారము కాము, మరియు తప్పిదములు చేయువారము, మరియు ఇతరులను తీర్పు తీర్చుటలో త్వరపడి ఉండి, మన తప్పులను తెలుసుకొనుటలో నిదానముగా ఉంటాము. పౌలు మనకు మన శత్రువులను ఏవిధముగా ప్రేమించాలో క్రీస్తు చెప్పినట్లు చేయుమని ఆజ్ఞాపించాడు: నీ శత్రువు ఒకవేళ ఆకలి గోని కొనుటకు సొమ్ములేకుంటే, అతను ఆకలితో ఉండునట్లు చేయకుము అతని కొరకు నీవు ఆహారమును సిద్దము చేయుము. అతను ఒకవేళ నీళ్లు లేక దప్పికగలిగి ఉండి, నీ ఇంటిలో అనేకమైన నీళ్ల సీసాలు ఉన్నట్లైతే అతను దప్పిక కలిగి ఉండకుండా అతనికి నీ దగ్గర ఉన్న నీళ్ల సీసాలను ఇమ్ము. జ్ఞానము కలిగిన సొలొమోను రాజు చెప్పినట్లు నీవు నీ శత్రువుల అవసరతలో సహాయము చేసావని చెప్పినట్లు : "నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును" (సామెతలు 25:21-22). ఈ జ్ఞానము క్రొత్త భావము కాదు. ఇది మూడు వేళా సంవత్సరాల క్రితమే వచ్చెను. అయితే ఇక్కడ సమస్య జ్ఞానములొ కాదు అయితే గర్వములో, మరియు కఠినమైన హృదయములో ఎందుకంటె ఇది క్షమాపణను అడగడు, మరియు తమ పాపములను బట్టి కూడా క్రీస్తుతో క్షమాపణ అడగదు.

"నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి" అని పౌలు తన మాటలలో చెప్పినట్లు (రోమా). ఈ వచనము ద్వారా అపొస్తలుడు నీకు ఈ విధముగా చెప్తున్నాడు: " చేదు నీలో లోతుగా ఉండనిమ్మకు. నీలో చెడును ఉండనివ్వకు, అయితే ఆ చెడును నీవు క్రీస్తు మంచి కార్యములతో మరియు జ్ఞానముతో జయించుము. " ఇవి సువార్త యొక్క రహస్యమైనవి. యేసు ఈ లోక పాపములను తీసివేసిఉన్నాడు, మరియు దీనిని ప్రేమతో జయించాడు, మరియు అతని మరణము ద్వారా విజయము పొందియున్నాడు. క్రీస్తు జయశీలుడు. కనుక నీవు నీ చెడు నుంచి నీవు జయము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, మరియు ఇతరుల చెడులను నీ హృదయము ఓర్చుకొనునట్లు ఆత్మీయ శక్తిని పొందుకొనునట్లు చేయును, మరియు వీటినన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా మరియు ప్రేమ కలిగిన సహనము ద్వారా జయించును.

ప్రార్థన: ఓ ప్రభువా నీవు దేవుని యొక్క ప్రమాయి ఉన్నందుకు నిన్ను మేము ఆరాధించెదము.నీ ప్రేమను నీవు బలవంతపెట్టలేదు, లేదా నీ అధికారమును చూపలేదు, అయితే నీ శత్రువులను నీవు క్షమించియున్నావు, " తండ్రి వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు " అని చెప్పెను. అప్పుడు మేము నీ ఆత్మచేత నింపబడి మా శత్రువులను క్షమించునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. మనము మన శత్రువులను ద్వేషించక మరియు కక్ష తీర్చక ఏవిధముగా క్షమించుచున్నాము?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:38 AM | powered by PmWiki (pmwiki-2.3.3)