Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 066 (We must Learn Brotherly Love)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

3. మనము సహోదర ప్రేమను కలిగి ఉంది అందులో తర్ఫీదు పొందాలి (రోమీయులకు 12:9-16)


రోమీయులకు 12:9-16
9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. 10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. 11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. 12 నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. 
13 పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. 14 మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. 15 సంతోషించు వారితో సంతోషించుడి; 16 ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 

గ్రీకులో ప్రేమను గూర్చి రకరకాలుగా ఉండును. "ఫిలియా" అను పదమునకు అర్థము సహజమైన మనిషి భావన అని అర్థము. "ఎరోస్" అను పదమునకు అర్థము ఏమనగా మనిషి యొక్క శారీరక వాంఛ అని అర్థము\; అయితే "అగాపే" అను పదమునకు గల అర్థము శక్తికలిగిన ప్రేమ అని అర్థము.

ఇది బీదలకు మరియు శత్రువులకు ఒక పరిశుద్ధతకలిగిన ప్రేమకు అర్థము, మరియు ఇది ఒక క్లుప్తమైన తీర్పునకు ఒక నిర్ణయముగా ఉన్నది, మరియు ఇది ఒక నిజమైన ప్రకటనకు సంబంధించినదై ఉన్నది.

క్రీస్తు తన జీవితమును పాపులకు ఒక ప్రేమ కలిగిన విమోచనముగా యిచ్చియున్నాడు. పౌలు ఈ విషయమును బట్టి క్రీస్తును బెంబడించువారి ప్రేమను బట్టి మాట్లాడుతున్నాడు, అందుకే అతను వ్రాసినట్లు: " మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది " అని (రోమా 5:5).

నిజమైన ప్రేమ అబద్ధము చెప్పాడు, ఎందుకంటె అది సత్యమైనది. ఇది జ్ఞానముకలిగి మరియు కనికరము కలిగి సత్యము చెప్పును. బైబిల్ చెప్పినట్లు కపటము మంచిది కాదు. మనలో గర్వము కానీ కపటము కానీ ఉండకుండునట్లు మన పాపములను మనుష్యుల దగ్గరకూడా ఒప్పుకోవాలి. మరియు మన ప్రేమను యేసుతో కనపరచుకోవాలి, ఎందుకంటె అతనితో మాత్రమే మనము సమాధానపరచబడిఉన్నాము కనుక.

నిజమైన ప్రేమ చెడును ద్వేషించును మరియు మన మనసును తిట్టును, మరియు అది దేవుని వాక్యమును బరీషుడమైనదని చెప్పును. అయితే ప్రేమ అటువంటి వాటిని ఘనపరచక కేవలము పరిశుద్ధతకలిగిన వాటిని మాత్రమే ఒప్పుకొని, నీతి కలిగి న్యాయము కలిగి ఉండును.

నిజమైన ప్రేమ మన సహోదరుల మరియు సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండును, వారి యొక్క ప్రతి విషయములలో ఉంది వారిని ఎల్లప్పుడూ చూచుచుండును. కనుక మన ప్రతి పరిచర్య మరియు మాట శక్తికలిగి ఉండి, అప్పుడు ఇతరులు మనము నిజముగా ప్రేమ యెడల న్యాయము కలిగి ఉన్నామని అనుకొంటారు. ఈ విషయములో భార్య మరియు భర్త మధ్యన ఉన్న మంచి స్వభావము కూడా ఉన్నది.

ఎవరైనా సువార్త చేయాలని అనుకుంటే వారు ఆత్మీయముగా సేవ పరిచర్యలలో ఉండాలి, వ్యతిరేకమైన పారిశ్తిథులలో కూడా అతని పునాది క్రీస్తులో స్థిరముగా ఉండాలి.

ఎవరైతే ఓటమి కలిగి ఉంటారో వారు క్రీస్తు విజయశీలుడనే సత్యమును ఎన్నటికీ మరచిపోకూడదు; మరియు ఎవరైనా సమస్యలలో, శ్రమలలో ఉన్నట్లయితే వారు ఏ అపార్థము లేకుండా ఓపికకాలిగి ముందుకు కొనసాగాలి. మన ప్రభువు మన కన్నీటి ప్రార్థనకు తగిన జవాబు దయచేయును.

నీవు ఒకవేళ నీ సహోదరులు వారి విశ్వాసముతో ఇబ్బంది పడుచున్నట్లైత్ వారి యెడల నీవు కనికరము కలిగి ఉండాలి, మరియు వారి ఇబ్బందులలో నీవు కూడా పంచుకోవాలి. కనుక వారు ఒకవేళ క్రీస్తును ఘనపరచుటకు నీ యొద్దకు వచ్చినట్లైతే అప్పుడు నీవు వారి కొరకు తలుపు తెరచి వారి యొక్క ఆకలిని నీవు ఆత్మీయముగా తీర్చాలి. ఎవరైతే అతనిని ప్రేమించుచున్నారో వారి యెడల అతను ప్రేమ కలిగి ఉన్నాడు.

ఒకవేళ నిన్ను ఎవరైనా హింసించుచున్నట్లైతే వారికి శక్తికలిగిన ఆశీర్వాదమును ఇమ్ము. ఎవరైతే నిన్ను శపిస్తారో వారిని నీవు శపించకు, అయితే సౌలు ఎప్పుడైతే దమస్కులో ఉన్న సంఘమును పాడు చేయాలనీ వచ్చినప్పుడు ఎలాగైతే ఆ సంఘములో ఉన్న వారు అతని కొరకు ప్రార్థన చేశారో అదేవిధముగా నిన్ను శపించినవారి కొరకు ప్రార్థన చేయుము. కనుకనే ప్రభువు సౌలు వైపు తిరిగి అతని గర్వమును పూర్తిగా తీసివేసినాడు.

ఎప్పుడైతే సిలువ వేయబడిన వాని ఆశీర్వాదము వారి మీద వచ్చినప్పుడు, ఇతర విశ్వాసులు కూడా ఆనందించి వారి విశ్వాసముతో ఉత్సాహపరచబడి ఉండిరి, ఎందుకంటె వారు క్రీస్తు యొక్క విజయమును మరియు అతని ఫలితమును చూసారు కాబట్టి. అయితే ఎప్పుడైతే ఇతరులు ఏడ్పు కలిగి ఉంటారో అప్పుడు మనము కూడా వారితో కూడా ఉండి వారి ఇబ్బందులలో పాలుపంచుకొని ఉండాలి. కన్నీళ్లను బట్టి సిగ్గునొందువాడుగా ఉండవద్దు.

దేవుని కుటుంబమును బట్టి సంఘములో అందరు కూడా ఐక్యత కలిగి ఉండుటకు ప్రయత్నము చేయాలి. ధనమును బట్టి, ఘనతను బట్టి, అధికారమును బట్టి మొదటగా ఆలోచన కలిగి ఉండవద్దు, అయితే దరిద్రులతో మరియు అవసరథాలలో ఉండువారితో కలిసి ఉండు, ఎందుకంటె యేసు కూడా అలాంటివారితోనే ఎక్కువ సమయము వెచ్చించి ఉన్నాడు, మరియు దెయ్యములు పట్టినవారితో మరియు మరణము పొందినవారితో కూడా ఉన్నాడు కనుక.

నిన్ను నీవు ఇతరులకంటే ఎక్కువ చదువు కలిగినవాడు అని లేదా గొప్ప వాడని భావించవద్దు, అయితే సంఘములో ప్రభువు కొరకు పనిచేయునట్లు మరియు స్వస్థతలో, రక్షణలో మరియు అన్నిటిలో ఉండుము.

వాదించకుండా హెచ్చరికలు కలిగి ఉండు. ఆత్మకు బదులు ఏది లేదు కనుక సహన మందు ఓర్పుకలిగి ఉండు ఎందుకంటె ప్రభువు ఒక్కడే, అతని విమోచనము ఒక్కటే కనుక. నీవు ఒక మంచి రక్షణను బట్టి చేయబడ్డావని భావించకు. మనమందరము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మును కృపలో జీవించినవారము.

ప్రార్థన: ఓ పరలోకమందున్న తండ్రి, మా సంఘములో నీవు చేసిన అద్భుతమైన కార్యములను బట్టి నీకు కృతజ్ఞతలు. మాలో నీ పరిశుద్దాత్మ చేత నీ ప్రేమను, నీ సహనమును, నీ ఆనందమును, ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు, అప్పుడు మేము క్రీస్తు యేసు యొక్క కృపలో మా విశ్వాసముతో నిత్యమూ ఉండడము. మా బాధ్యతలను మేము మాట చేతనే కాక కార్యము చేతకూడా చేయునట్లు సహాయము చేయుము. మాతో నీవు ఉండి ప్రభువా మమ్ములను నీ మహిమగల నిరీక్షణలో ఉంచుకొనుము.

ప్రశ్నలు:

  1. నీ సహవాసములో ఏవిధమైన దేవుని ప్రేమ ఎంతో ప్రాముఖ్యముగా నీ జీవితములో ఎంచుకొనెదవు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:38 AM | powered by PmWiki (pmwiki-2.3.3)