Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 061 (The Secret of Deliverance and Salvation of the Children of Jacob)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)

d) చివరి దినాలలో యాకోబు పిల్లలకు కలుగు రహస్య రక్షణ (రోమీయులకు 11:25-32)


రోమీయులకు 11:25-32
25 సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. 26 వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; 27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింప బడుదురు. 28 సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. 29 ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. 30 మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి. 31 అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు 32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. 

ఎవరైతే పౌలు యొక్క పత్రికలను స్వీకరిస్తున్నారో వారిని అతను తన రక్త సంబంధీకులని అనుకొనెను, ఈ ప్రకటన ద్వారా దేవుడు తన తండ్రి మాత్రమే కాక వారి తండ్రి కూడా అయి ఉన్నాడనెను. "దేవుడు గొప్పవాడు" అనే పదమును బట్టి వారి ఆలోచనలను బట్టి, పరిశుదాణాను బట్టి, వారి సమాచారమును బట్టి పూర్వానిర్ధారణ నెరవేర్చబడలేదు, అయితే తెలిసిన దేవుడు, జీవము కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి మన పరలోకమందున్న పరిశుద్దుడైన తండ్రి ద్వారా మాత్రమే నెరవేర్చబడినది.

ఇది తెరవబడిన తరువాత పౌలు తనకు అర్థము కానీ రహస్యములను పరలోకమందున్న తండ్రి బయలుపరచెను. కనుకనే పౌలు, సేవకులను, సువార్తీకులను మరియు జ్ఞానులను తమ సొంత ఆలోచనలను యాకోబు వంశస్తులను బట్టి చెప్పక కేవలము దేవుని యొక్క వాక్యము వారి కొరకు ఏమి చెప్పునో క్లుప్తముగా అర్థము చేసికొని వివరించుమని చెప్పెను. కనుక ఎవరైతే తన స్వంత ఆలోచనగా చెప్పునో వాడు నష్టపోవును, ఎందుకంటె అతను గొప్ప వాడని జ్ఞానీ అని అనుకొనును కనుక త్వరగానే తప్పిపోవును; అయితే ఎవరైతే దేవుని వాక్యమును ప్రార్థనాపూర్వకముగా పట్టుకొని, పరిశుద్దాత్మ యొక్క మాటను విని, మరియు రహస్యమైన దేవుని ప్రేమ ద్వారా జ్ఞానములొ ఎదుగునో వాడు పరలోక తండ్రిని మహిమపరచును.

చివరి దినముల కొరకు పౌలు చెప్పిన అంశములకు అనేక భాగాలు ఉన్నవి:

ఇశ్రాయేలీయుల ఖఠినము అనునది ఒక మందమైన వస్త్రమువలె ఉన్నది, దాని క్రింద ఎవరైతే కూర్చుంటారో వారిని అది సూర్యుని కిరణములనుంచి కాపాడును, అయితే వారి కంటి చూపును దాచును, మరియు వారి విను చెవుల నుంచి కాపాడును. కనుక వారు వారి సామర్థ్యమును బట్టి చూడరు, చదివారు, మరియు వినరు (యిర్మీయా 16:9-10).

అందరు కాదు, అయితే యాకోబు పిల్లలు ఎక్కువమంది కఠినముగా ఉందురు. యేసు యొక్క శిష్యులు మరియు ఆరంభ సంఘ సభ్యులు బాప్తీస్మమిచ్చు యోహాను దగ్గర ఒప్పుకొనిరి. అతను వారిని రాబోవు రక్షణనిచ్చు క్రీస్తు కొరకు సిద్దము చేసెను, కనుక వారు అతని మహిమగల సంరక్షణలో ఉండిరి కనుక అతనిలో వారు జీవించిరి.

యెషయా పుస్తకము ప్రకారము, క్రీస్తు వచ్చు 700 సం,, క్రితము (6:5-13 ), (మత్తయి 13:11-15) లో క్రీస్తు క్లుప్తముగా వివరించెను, మరియు పౌలు బాధతో క్లుప్తపరచినట్లు (అపొస్తలుల 28:26-28). ఈ ఖఠినము ఎప్పుడైతే యూదులు వారి రాజును సిలువవేసినపుడు మరియు పరిశుద్దాత్మ సన్నిధిని వారు తిరస్కరించినప్పుడు కనపడెను. అప్పుడు రోమా వారు వారిని ప్రపంచము యొక్క భాగములకు వారిని అమ్మివేసిరి.

యూదుల ఖఠినము అలాగే ఎప్పటికీ ముందుకు సాగదు. ఇది ఎప్పుడైతే ఇతర ప్రజలు విశ్వాసులు వారి సంఖ్యను పూడ్చువరకు కొనసాగును. ఎప్పుడైతే క్రీస్తు పాపులను పచ్చాత్తాపములోనికి నడిపించుట ముగించునో, అప్పుడు ప్రభువు యూదులకు వారు పచ్చాత్తాపము కలిగి ఒప్పుకొనుటకు చివరి అవకాశమును అనగా తిరిగి జన్మించుటకు అవకాశమును ఇచ్చును.

అయితే పౌలు చెప్పినట్లు లేదా మాట్లాడినట్లు చివరి దినాలలో ఏ ఇశ్రాయేలీయులు వారి సంఘ చరిత్ర నుంచి రక్షించబడుదురు? (గమనిక: ఈ దిన పరిశోధన రాజకీయాలను ఏమీ చేయలేదు. ఎందుకంటె అది ఆత్మీయ పరిశోధనను చెరువును కనుక)

a) ఈ దినాలలో కాలు శాతము యూదులు ఇశ్రాయేలులో జీవించుచున్నారు, మరియు మిగతా మూడు కాలు శతపు యూదులు 52 దేశాలలో ఉన్నారు.
b) "ఇశ్రాయేలీయులందరు" అను మాట సంప్రదాయ యూదుల మతములను సూచిస్తున్నదా, లేక యుడు మతమును బట్టి ధారాళముగా ఉన్నవారు దీనిని బట్టి జాగ్రత్తకలిగి ఉన్నారా?
c) ఇశ్రాయేలులో క్రైస్తవులు మరియు ముస్లీములు కూడా నివాసము కలిగి ఉన్నారు, మరియు వారు ఆ దేశ పాస్పోర్ట్ కలిగి ఉన్నారు. అయితే "ఇశ్రాయేలీయులందరు" అను మాట వీరికి కూడా వర్తించేనా? లేదు వారు అందులో జమచేయబడలేదు.
d) "సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును " అని ప్రభువు ముందుగానే యెషయా దగ్గర చెప్పినట్లు కేవలము ఇశ్రాయేలులో ఉన్నవారు ఎవరైతే పరిశుద్ధ వస్త్రము ధరించినవారు మాత్రమే రక్షించబడతారు (యెషయా 6:11-13); ఆ పరిశుద్ధ వస్త్రములు కలవారు పరిశుద్ధ విత్తనమువలె ఉందురు, అలాగునే ఈ భూమి మీద జీవము సంఘము కూడా ఉండును. ఇది వారి యొక్క రక్షణను మరియు క్రీస్తు మీద ఉన్న నమ్మకమును చూపును.
e) ప్రభువు తన సేవకుడైన యోహానుతో తన ప్రకటన ద్వారా అతని దూతలు పన్నెండు వేలమందిని పన్నెండు ఇశ్రాయేలు గోత్రములుగా ముద్రవేయునని ప్రకటన చేసెను. కనుక అన్ని గోత్రముల వారు ముద్రవేయబడరు, అయితే సంపూర్ణముగా ఉత్తమమైనవారు మాత్రమే ముద్రవేయబడతారు, ఎందుకంటె వారి నుంచి మరియు మోషే ధర్మశాస్త్రము నుంచి ఇష్టపూర్వకంగానే దూరముగా జరిగి ఉన్నాడు కనుక. అయితే కేవలము ఒక లక్ష నలభై నాలుగు మంది మాత్రమే ముద్రవేయబడతారు, అయితే తక్కినవారు రక్షింపబడలేరు.
f) అపొస్తలుడైన పౌలు తన పత్రికను రోమా వారికి వ్రాస్తున్నాడు (2:28-29) అది యూదులందరు కూడా యూదులు కాదని, అయితే యూదుడు ఈ లోకమునుంచి వేరుపరచినవాడని, హృదయ సున్నతి ద్వారా సున్నతి చేయబడినవాడని, మరియు తిరిగి జన్మించినవాడని చెప్పెను. అయితే మనుషుల ఆలోచన ప్రకారము యూదా మహిళకు పుట్టిన వారందరు యూదులే, అయితే ఆత్మీయ సత్యముగా వారు యూదులు కాదు, అనగా వారు క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కడగబడువరకు నిజమైన యూదులు కాదు. దీనిని బట్టి క్రీస్తు యోహానును రెండు సార్లు చెప్పెను (ప్రకటన 2:9; 3:9) అది కొంతమంది యూదులు యూదులు కాదని.
g) "వారు ఎవరినైతే పొడిచారో వాడిని చూసెదరు" అని యూదులు చెప్పుట సువార్తలో మరియు యోహానును దేవుడు ప్రకటన ద్వారా చెప్పుట వినెదము. ఈ శేషమును క్రీస్తు వచ్చువరకు ఉండునని ప్రవచనము చెప్పును.
h) దావీదు ఇంటికి మరియు యెరూషలేము కాపురస్తుల మీద ప్రభువు కృప కలిగిన ఆత్మ మరియు విన్నపములు కుమ్మరించునని, ప్రవక్త అయినా జెకరియా చెప్పెను; అప్పుడు వారు ఎవరిని పొడిచారో వాడిని చూసెదరు (జెకరియా 12:10-14). ఈ ప్రవచనము యూదుల పచ్చత్తమను సూచించును, మరియు చివరిదినములలో వారి విరిగిన మనసును సూచించును (మత్తయి 23:37-39).

సంక్షేపము: యేసు కనుదృష్టిలో ఏ ఇశ్రాయేలీయులు ఉన్నారో అని మనము ఆతురత కలిగి ఉండవద్దు. పరిశుద్ధ గ్రంధము చెప్పునట్లు ఏ ఒక్కరి పేరు కూడా శరీరముగా సూచించబడలేదు, లేక ఏదో ఒక సంతతి అని, అయితే ఇది కేవలము ఆత్మీయ సత్యమై ఉన్నది. ఈ దినాలలో మనము కొన్ని వేలమంది నూతనముగా జన్మించబడినవారిని తూర్పు దేశాలలో, ఐరోపాలో మరియు అమెరికాలో చూడగలము. వారు ఎన్నుకొనబడిన ప్రజలు మైర్యు క్రీస్తు ఆత్మీయ శరీర భాగము కలవారు. ఈ సంఖ్య ఎంతవరకూ పెరుగుతుందో మనకు తెలియదు, అయితే వారు అంత్య క్రీస్తు ద్వారా రక్తమును చిందించబడి శ్రమపొందెదరని మనకు తెలుసు. ఏదేమైనా క్రీస్తు తనకు తానుగా క్రీస్తు కొరకై ప్రాణము విడిచినవారిని తన పరిశుద్ధ సింహాసనము దగ్గుకు తీసుకొనివచ్చును ( ప్రకటన 13:7-10; 14:1-5).

ఎవరైతే రోమా సంఘమునకు పౌలు wrasina పత్రికను లోతుగా గ్రహించునట్లైతే (11:26-27) వారికి యాకోబు సంతతికి రక్షణను బట్టి కొన్ని విషయాలు క్లుప్తముగా ప్రవచించబడ్డాయని గ్రహించవచ్చు:

a) అవిశ్వాసమును మరియు వారి బ్రష్టమును విమోచకుడు యాకోబు పిల్లలనుంచి విడిపించును.
b) యిర్మీయా గ్రంధములో బయలుపరచినట్లు,నూతన నిబంధన ప్రకారముగా అందరూ క్షమాపణను పొందుకొంటారు (31:31-34). ఇది యేసు తన శిష్యులతో చేసిన నూతన నిబంధనను సూచిస్తున్నది ( మత్తయి 26:26-28 ), మరియు ఈ వాగ్దానము నెరవేర్చబడినది.

ఈ నూతన నిబంధన సువార్తకు యూదా మతము శత్రువుగా మారెను అని పౌలు చెప్పెను. ఇది విడువబడిన వారికి గొప్ప లాభముగా ఉండెను, ఎందుకంటె క్రీస్తు ద్వారా వారు రక్షణను గుర్తించారు కనుక, మరియు విశ్వాసము ద్వారా కృపను కలిగి ఉన్నారు.

అదే సమయములో రోమా సంఘములో అన్యులలో ఉన్నటువంటి అపొస్తలులు యూదులకు చెప్పినదేమనగా, వారి పితరులను బట్టి వారు ఇంకా దేవుని ప్రియమైనవారని చెప్పిరి, మరియు వారు అందులో నమ్మకము కలిగి ఉండిరి. అయితే ఎవరైతే దేవుని ద్వారా ఎన్నుకొనబడి ఉంటారో వారు ఎన్నుకొనబడినట్లుగానే ఉండెదరు, ఒకవేళ వారు పాపము చేసినను లేదా వారి ఏర్పాటును వ్యతిరేకించిననూ. దేవుని యందు నమ్మకమును కలిగి ఉండిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ బహుమానములు కలిగి ఉందురు (రోమా 11:29). కనుక మనము మన ఏర్పాటును మరియు పరిశుద్ధతతను ఎన్నటికీ అనుమానించకూడదు, ఒక పిల్లవాడు తన తండ్రి మాటలను బట్టి ఏవిధముగా నమ్మకము కలిగి ఉంటాడో అదేవిధముగా మనము దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి.

రోమా 11:30-31, ఇక్కడ పౌలు తన రెండవ పత్రికలో యాకోబు పిల్లల యొక్క విడుదలను బట్టి. మరియు అతను ఈ మాటలు రోమా సంఘమునకు శత్రువుల మనసులలోకి వెళ్లలాలని అనుకొనెను.

a) నూతన విశ్వాసులందరు కూడా ఒకప్పుడు అవిశ్వాసులు మరియు దేవునికి లోబడని వారు మరియు పాపులే.
b) యేసు క్రీస్తులో నీకున్న విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపామూ మరియు కనికరమును పొంది ఉన్నారు.
c) గ్రహించు రక్షణను బట్టి యూదుల అవిధేయతను బట్టి సమస్తము సాధ్యమాయెను, మరియు దేవుని కుమారుని పట్ల ఉన్న వ్యతిరేకత ద్వారా.
d) కనుక కనికరము నీకు ఇవ్వబడినదంటే అది యూదులు దేవుని పట్ల కలిగిన అవిధేయతను బట్టి మాత్రమే, అది నీవు నీ విశ్వాసము ద్వారా పొందియున్నావు.
e) వారు కూడా లెక్కింపలేని కనికరములు కలిగి ఉందురు.

కాబట్టి, రోమా వారిని బట్టి ఎవరైతే పౌలు వ్రాసిన ఈ రెండవ పత్రికను అర్థం చేసుకొంటారో వారి వీటి లోతైన మర్మములను తెలుసుకొని, వాటిని ప్రార్థనగా మరియు విన్నపములుగా మార్చుకొనినట్లైతే అప్పుడు నశించిపోతున్నవారు రక్షింపబడతారు.

పౌలు కూడా ఈ వాక్యములను దేవునికి అర్ధాన చేయుటకు తన జీవితములో ఉపయోగముగా మార్చుకొనెను. అతను పరిశుద్ధుడిని మహిమపరచాడు, ఎందుకంటె యూదులు అవిధేయతకలిగి మరియు వ్యతిరేకం కలిగి ఉన్నందున వారికి తిరిగి కనికరము వచ్చునట్లు ఉద్దేశించెను, అది కూడా ఒకవేళ వారు విశ్వాసముతో వారి కొరకు సిద్దము చేసిన విమోచనను అంగీకరించినట్లైతే (రోమా 11:32).

చివరి దినాలలో దేవుడు అందరినీ రక్షించుననే సమాధానము కలిగినట్లు పౌలు ప్రకటించలేదు, లేక ఆయనను దూషించువారు రక్షించబడి మరియు నరకము ఖాళీగా ఉండాలని చెప్పలేదు. సాతానును కూడా దేవుడు రక్షించాలని అనుకోను వారు మాత్రమే ఈ విధముగా ఆలోచన చేస్తారు, కనుక వారు పరదైసులోనికి వెళ్ళుటకు సాతానును కూడా ఆరాధన చేస్తారు. అయితే ఇది మాయ మరియు మోసము, దేవుడు ప్రేమ మరియు సత్యమై ఉన్నాడు, మరియు అతని నీతి ప్రతి ఒక్కరికీ ఉండును.

యూదులందరు వారి విశ్వాసములద్వారా రక్షించబడాలని పౌలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, అయితే యేసు తన ప్రశ్నలను బట్టి స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. ఎవరైతే బీదలను ప్రేమించాక ఉంటారో వారిని బట్టి తీర్పు తినమందు ఈ విధముగా చెప్పును: "అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని3 వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి" (మత్తయి 25:41). యోహాను కూడా ఈ భయంకరమైన సత్యమును బట్టి చెప్పును (ప్రకటన 14:9-14; 20:10.15; 21:8).

ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి నీ వాగ్దానములను బట్టి మరియు అవి నెరవేరునట్లు మేము ఆనందము కలిగి ఉండెదము. యాకోబు వంశస్థుల పరిశుద్ధ శేషమును బట్టి మరియు వారు నీ విమోచనమును అంగీకరించుటను బట్టి మరియు నీ బహుమానమును స్వీకరించుటను బట్టి నీకు కృతజ్ఞతలు. నీ శక్తి కలిగిన పరిశుద్దాత్మ మార్గములో నడుచునట్లు మాకు సహాయము చేయుము, మరియు నీ శక్తిచేత నీ ఆజ్ఞలను గైకొని మరియు మా విమోచకుని గురించి ఎదురుచూచునట్లు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. దేవుని వాగ్దానమును ఓడిపోక నిత్యమూ ఎలా నిలుచును?
  2. ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఎవరు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:30 AM | powered by PmWiki (pmwiki-2.3.3)