Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 060 (Warning the Believers of the Gentiles of being Proud)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)

c) యాకోబు సంతతిని బట్టి అన్య విశ్వాసుల గర్వమును బట్టి హెచ్చరించుట (రోమీయులకు 11:16-24)


రోమీయులకు 11:16-24
16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. 17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన 18 నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు. 19 అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. 20 మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము; 21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. 22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్య మును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు. 23 వారును తమ అవిశ్వాస ములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు. 24 ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

ఆబరహాము విశ్వాసముచేతనే సమాధాన పరచబడ్డాడని పౌలు చెప్పెను, కనుక ఒకవేళ అబ్రాహాము యొక్క సంతతి కూడా వారి తండ్రి ఏవిధముగా అయితే విశ్వాసము కలిగి దేవునితో సమాధానపరచబడి ఉన్నదో వారు కూడా అదేవిధముగా విశ్వసించినట్లైతే వారు కూడా దేవునితో సమాధానపరచబడతారు, ఎందుకంటె ఒక చెట్టు యొక్క వేరులు మంచిగా ఉన్నట్లయితే అప్పుడు దాని కొమ్మలు కూడా మంచిగా ఉండును; ఒకవేళ మొదటి ముక్కలు మంచిగా ఉన్నట్లయితే ఇతర ముక్కలు కూడా మంచిగానే ఉండును. మొదటిలో క్రైస్తవులు దేవుని రాజ్యములో పరదేశులుగా ఉండిరి. వారు అరణ్యములో ఉన్న ఒలీవ చెట్టు యొక్క కొమ్మలవలె ఉండిరి, అబ్రాహాము మరియు అతని వంశమువారుగా ఉండిరి, ఎప్పుడైతే వారు దేవునితో సహవాసముకలిగి ఉందిరా అప్పుడు వారు శక్తి కలిగిన ఫలములను ఫలించిరి. ఒకవేళ క్రీస్తు చెట్టులోని కొన్ని కొమ్మలను నరికివేసినట్లైతే మిగిలిన కొమ్మలు మేము వాటికంటే విలువ కలిగిన వారమని గర్వము కలిగి ఉండకూడదు.

కనుక యూదులు నరికివేయబడిన కొమ్మలవలె ఉన్నారు, ఎందుకంటె వారు క్రీస్తును తిరస్కరించి అతని రక్షణను ద్వేషించారు, అయితే అదేవిధముగా చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు దేవుని కుమారుడిని అంగీకరించిన క్రైస్తవులను పోలి ఉన్నారు. కనుక ఈ క్రైస్తవులు అబ్రాహాము యొక్క సంతతి గర్వముతో కూడు కొని ఉన్నారని చెప్పుదురు. అయితే ఎవరైతే తనను తాను గర్వాపరచుకొని తన గురించి గొప్పలు చెప్పువారు త్వరగానే పడిపోవుదురు. కనుకనే పౌలు అన్యులలో ఉన్న విశ్వాసులను వీటి విషయాలను బట్టి వారిని హెచ్చరించెను.

పరిశుద్దుడైన దేవుడు నరికివేయబడిన కొమ్మలను బట్టి జాలి కలిగి లేదని పౌలు వివరించెను, ఎందుకంటె అవి ఫలములను ఇవ్వలేదు కనుక, వారితో అతను అప్పుడప్పుడు వాగ్దానములతో మాట్లాడినప్పటికీ అవి ఫలించలేదు. మరియు సహజముగా రోగము కలిగిన కొమ్మలను కూడా అతను నరికివేయును, మరియు ఫలించువాటి మీద దాని శక్తి కలిగిన ప్రాభవమును చూపక కాపాడెను. దేవుని యొక్క క్రూరత్వమును బట్టి మరియు మంచిని బట్టి ఒకే సమయములో పౌలు మాట్లాడేను. దేవుని యొక్క క్రూరత్వము నరికివేయబడిన కొమ్మలు ఒకవేళ తిరిగి జీవము కలిగి ఉండకపోతే వాటి మీద తన క్రూరత్వమును చూపును. క్రీస్తు యేసులో ఉన్నవారి ద్వారా దేవుని యొక్క మంచి తనము బయలు పడెను, ఎందుకేనట అతను ఆత్మీయ ఒలీవ చెట్టు, కనుక వారు ఒకవేళ అతనిలో నిలిచిఉన్నట్లైతే ఫలించుదురు, అయితే ఒకవేళ వారు హృదయమందు పరిశుద్ధాత్మను బట్టి ఖఠినమైఅట్లైతే అప్పుడు వారు కూడా అతని ద్వారా నరికివేయబడతారు.

"ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును." అని యేసు వారికి వివరించెను (యోహాను 15:5-6)

అయినప్పటికీ యూదుడు, ఎవరైతే ఆ ఒలీవ చెట్టునుంచి తీసివేయబడింది వారు, యేసును మరియు అతని దైవత్వమును విశ్వసించినవాడు, మరియు అతని ప్రాయచ్చిత్తమును ఒప్పుకొని, ప్రభువు యొక్క చేతితో తిరిగి అంటువేయబడును. దేవుడు నమ్మరానివి కూడా చేయును. అతను తీసివేయబడింది కొన్ని కొమ్మలకు తిరిగి జీవమును దయచేయును కనుక యూదులు తమ రక్షకుడైన యేసును తిరిగి విశ్వసించవచ్చు.

ఇప్పటికి, మనము పాపులమైనప్పటికీ దేవుడు మనలను ద్వేషించడము లేదు, అయితే మనలను క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచి, పరిశుద్ధాత్మచేత మనకు తిరిగి జీవమును యిచ్చియున్నాడు. ఈ విధముగా అతను అబ్రాహాము యొక్క పిల్లలందరినీ, మరియు ఇస్మాయేలు గోత్రములవారినిఎం యాకోబు పిల్లలను, ఒకవేళ వారు వెతికినట్లైతే వారిని కూడా రక్షించాలని అనుకొన్నాడు. కనుక క్రీస్తు వారు అనేక ఫలములు కలిగి ఉండునట్లు అంటుకట్టుటకు పిలిచి ఉన్నాడు.

ప్రార్థన: ఓ పరలోకమందున్న తండ్రి, మమ్ములను పరిశుద్ధపరచి, సమాధానపరచి, నీ కృపచేత తిరిగి మమ్ములను నీ ఆత్మీయ శరీరములో అంటుకట్టినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు మాకు దయచేసి ఈ ఉచిత అవకాశమును బట్టి మేము సంతోషిస్తున్నాము! మేము మా కొరకు జీవించక మరియు గర్వము కలిగి ఉండక ఇతరులను నీ మంచి జీవములోనికి నడిపించునట్లు మమ్ములను నడిపించుము.

ప్రశ్నలు:

  1. క్రీస్తు ఆత్మీయ శరీరములో అంటుకట్టుకొనుట అనగా ఏమిటి?
  2. ఒకవేళ అంటు చెడిపోతే ఎవరు ప్రమాదంలో ఉంటారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)